Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
ఇన్ని రకాలుగా పొగిడితే అబ్బాయిలు పడకుండా ఉంటారా?!
మెచ్చుకోలు సహజసిద్ధంగా ఉండాలి. లోపలి నుంచి దాన్ని ఫీల్ అవ్వాలి. నమ్మకమైన ప్రశంస వెన్నులో ఒకలాంటి సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుంది. వివిధ సందర్భాల్లో మగవాడిని ఎలా మెచ్చుకోవచ్చు
మగువల మాదిరిగానే మగవాళ్లు తమపై అభినందనలు, పొగడ్తలను కురిపించడాన్ని ఇష్టపడతారు. అమ్మాయి మెచ్చుకోవడం ఆలస్యం.. అబ్బాయి మేని మొహంలో నవ్వులు విరుస్తాయి. కళ్లు సిగ్గుతో చిన్నబోతాయి. అది చూసిన అమ్మాయిలు సిగ్గుల మొగ్గవుతారు. మగవాళ్లు తమలోని సాఫ్ట్‌కార్నర్‌ను ఎప్పుడూ చూపించరు. ఐతే ఆడవాళ్లు తల్చుకుంటే ఏమైనా చేయగలరు. తమ మగవాడిని ఎలా అభినందించాలో, పొగడాలో తెలియనివారు ఈ చిన్న చిట్కాలను పాటించి భాగస్వామి మెప్పు పొందండి.
మెచ్చుకోలు సహజసిద్ధంగా ఉండాలి. లోపలి నుంచి దాన్ని ఫీల్ అవ్వాలి. నమ్మకమైన ప్రశంస వెన్నులో ఒకలాంటి సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుంది. వివిధ సందర్భాల్లో మగవాడిని ఎలా మెచ్చుకోవచ్చో తెలుసుకుందాం...

1. అతడి శరీర సౌష్టవం గురించి...
శరీర సౌష్టవం గురించి పొగిడించుకోవడం మగవాళ్లకు బాగా ఇష్టం. మీకు కుదిరినప్పుడల్లా అతడి అంగాంగ సౌష్టవాన్ని మెచ్చుకోండి. అతడి కండరాలు, యాబ్స్.. చివరగా ఎత్తైన ఛాతీ ఆకారానికి తగిన కితాబివ్వండి.

2. బూట్లను..
షూస్ ను గమనించి దాని గురించి మెచ్చుకుంటే అబ్బాయిలు బాగా ఇష్టపడతారు. చాలా మందికి తాము మంచి షూస్ వేసుకొని అందరూ గమనించాలని కోరుకుంటారు.

3. హెయిర్ స్టైల్
మగవాళ్లు కొత్త, ట్రెండీ హెయిర్‌స్టైళ్లను ఫాలో అవ్వాలనుకుంటారు. చిన్నగా, ట్రిమ్ చేసుకున్నా, లాంగ్ హెయిర్ పెంచినా తమదైన శైలిలో ఉంటారు. అమ్మాయిలు మీ కోసమే అబ్బాయిలు నీట్‌గా రెడీ అయ్యేది! మరి కాస్త వారిని ఓ లుక్కేయండి!

4. మిమ్మల్ని చూసుకునే విధానం
రిలేషన్‌షిప్ లో కొనసాగుతున్నవారైతే అబ్బాయి అమ్మాయిని బాగా చూసుకుంటే ఆ విషయం మీరు గమనిస్తున్నారన్నది అతడికి అర్థమవ్వాలి.

5. ఎమోషనల్‌గా స్థిరంగా ఉన్నందుకు
మగవాళ్లు పైకి కనిపించే కఠినంగా ఉండరు. లోపల చాలా మృదుస్వభావులు. దాన్ని ప్రపంచానికి చూపించాలనుకోరు. వారి ఎమోషనల్ ఫీలింగ్స్‌ను పొగిడేటప్పుడు నిజాయతీగా వ్యవహరించండి.

6. ఆకర్షణీయమైన లుక్స్
మగవాళ్లకి తాము ఎలా కనిపిస్తున్నామనేదానికి పొగడ్తలను ఆశిస్తారు. చూసేందుకు చక్కగా ఉన్నారు అని చెబితే చాలు చిన్న నవ్వి, సిగ్గుపడిపోతారు.

7. అంతరంగ గుణాలు
అంతరంగిక గుణాలను మెచ్చుకోవడం మరో విధానం. దీని వల్ల మీరు అతడి గుణాల వల్ల కూడా ప్రేమిస్తున్నానే సంగతి అర్థమవుతుంది.

8. సెన్సాఫ్ హ్యూమర్
ప్రతి నలుగురు మగాళ్లలో ఒకరికి మంచి సెన్సాఫ్ హ్యుమర్ ఉంటుంట. మీ ప్రియుడు అలాంటివాడైతే నిజంగా మీరు చాలా అదృష్టవంతులు!

9. ఫ్యాషన్ స్టైల్
అప్పుడప్పుడు అతడు స్టైలిష్‌గా ఉన్నాడంటూ మెచ్చుకోండి. అతడు వేసుకున్న దుస్తులు సాదాసీదాగా ఉన్నా అతడు సంతోషించేందుకు కాస్త పొగిడినా ఫర్వాలేదు.

10. తెలివితేటలకు
అవును చాలా మంది మగవాళ్లు తెలివైన వాళ్లు. తెలివితేటలు అధిక పాళ్లలో ఉంటే అతడ్ని పొగిడేందుకు ఏమాత్రం సంశయించకండి.

11. ప్రేమ శక్తి
ప్రేమ అనేది ఇద్దరి మధ్య పంచుకునే బలమైన భావోద్వేగం. అందుకే అతడి మీద చాలా చాలా ప్రేమ కురిపించండి. ఇది అన్నింటికంటే ఉత్తమ మార్గం.

12. మంచి అలవాట్లు
పొగతాగనివాడు, మద్యం సేవించనివాడు దొరికితే అదృష్టమే. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అతడికి ఇంకా ఏమైనా మంచి అలవాట్లు ఉంటే దాని గురించి ప్రస్తావించి మెచ్చుకోవడం మానివేయొద్దు.



Click it and Unblock the Notifications
