మోస్ట్ రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్ గా మారేందుకు 7 సులువైన మార్గాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

తమ భాగస్వామిలో రొమాంటిక్ సెన్స్ లేదని, తనలోని భావనలని తమతో పంచుకోడనే కంప్లైంట్ ఎక్కువ మంది అమ్మాయిల వద్ద నుంచి వినిపిస్తుంది. తన ప్రియురాలిని ఇంప్రెస్ చేయాలని ఆమె మనసును గెలవాలని ప్రియుడు ఎంతగా ప్రయత్నించినా విజయం సాధించలేడనే చెప్పుకోవాలి. చివరకు, రొమాంటిక్ సెన్స్ లేని వాడనే ట్యాగ్ ను మోయవలసిన స్థితికి చేరుకోవాల్సి వస్తుంది. తనపై తన ప్రియురాలు ఏర్పరచుకున్న రొమాంటిక్ ఎక్స్పెక్టేషన్స్ ను తెలుసుకోలేకపోవడమే అతనికి 'అన్ రొమాంటిక్' అనే ట్యాగ్ రావడానికి కారణం.

ప్రియురాలు తన ప్రియుడి దగ్గరినుంచి రొమాంటిక్ నేచర్ ని ఎక్కువగా ఆశించడానికి కారణాలుగా సినిమాలతో పాటు అందులో చూపించే రొమాంటిక్ కేరెక్టర్స్ ని పేర్కొనవచ్చు. అవును, తన ప్రియుడు షారుక్ లా అలాగే ర్యాన్ గోస్లింగ్ లా రొమాంటిక్ గా ఉండాలని ప్రియురాలు కోరుకుంటుంది. తన కోసం రకరకాల పువ్వుల్ని పంపించాలని తన చేయి పట్టుకుని రొమాంటిక్ వాక్ చేయాలని ప్రియురాలు కోరుకుంటుంది. అంతే కాదు, ఆమె తన ప్రియుడి వద్ద నుంచి ఇలాంటి చిన్న చిన్న రొమాన్స్ ని కోరుకుంటుంది. తన హృదయాన్ని ఇలా రొమాంటిక్ గా దోచుకోవాలని ఆశిస్తుంది.

మీరు కూడా మీ ప్రియురాలి మనసు దోచే విషయాల గురించి తెలుసుకుని 'మోస్ట్ రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్' అనే ట్యాగ్ ని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? ప్రియురాలి మనసు తెలుసుకుని ఆమెకు నచ్చేవిధంగా నడచుకోవడం రాకెట్ సైన్స్ కానే కాదు. అయితే, ఇందుకు మీ క్రియేటివిటీ అవసరమవుతుంది. కొన్ని ఫిల్మ్ సీన్స్ ని ఉపయోగించుకుని కూడా ఆమెని సంతోషపెట్టవచ్చు. మీరు రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్ గా మారాలంటే కొన్ని బేసిక్ థింగ్స్ ను గుర్తుంచుకోవాలి. వీటినే, ప్రతి ప్రియురాలు తన ప్రియుని వద్ద నుంచి ఆశిస్తుంది. సరైన సమయంలో సరైన విధంగా చేసినట్లయితే మీరు రొమాంటిక్ బాయ్ ఫ్రెండ్ అనే ట్యాగ్ కు అర్హులైనట్టే....

పూలను కానుకగా ఇవ్వండి:

పూలను కానుకగా ఇవ్వండి:

ఈ ప్రపంచంలో పువ్వులను ఇష్టపడని అమ్మాయిలు లేరంటే అతిశయోక్తి కాదు. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి పూల బొకేని పంపించండి. పూవుల ద్వారా మీ ప్రేమను మీ ప్రియురాలిపై అమితంగా కురిపించి ఆమెను సంతోషపెట్టండి. అమ్మాయిలను అమితంగా ఆకర్షించే రొమాంటిక్ అంశం పూవులనే విషయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ మరచిపోకండి. మీకు వీలైనప్పుడల్లా పూవులను ఆమెకు కానుకగా పంపిస్తూ ఆమె ప్రేమకు పాత్రులవ్వండి.

నడుమును హత్తుకోండి

నడుమును హత్తుకోండి

ప్రియురాలి చేతిని పట్టుకోవడం చాలా కామన్. ఇది రొమాంటిక్ కానే కాదు. కాబట్టి, ఆమె రొమాంటిక్ అంచనాలను అందుకోవడానికి కొన్నిసార్లు ఆమె నడుమును హత్తుకోండి. ఇది, మీ మధ్య రొమాంటిక్ బంధాన్ని మరింత బలపరుస్తుంది.

స్పెషల్ గా ట్రీట్ చేయండి

స్పెషల్ గా ట్రీట్ చేయండి

ఫిజికల్ లవ్ అనేది మీ మధ్యనున్న ప్రేమాప్యాయతలకు బలాన్ని చేకూర్చే పునాది వంటిది. అందువల్ల, మీరు అమితంగా ప్రేమించే మీ భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించండి. ఆమే మీ ప్రపంచమన్న విషయాన్ని ఆమెకు తెలియచేసి ఆమెను ఆనందపరచండి.

శిరోజాలను సవరించండి

శిరోజాలను సవరించండి

ఆమెతో గిల్లికజ్జాలు ఆడండి. ఆమె శిరోజాలను సవరించండి. రొమాంటిక్ గా మీ భాగస్వామిని ఇంప్రెస్ చేసేందుకు ఇదొక అద్భుతమైన చిట్కా. ఇంకా చెప్పాలంటే, శృంగారానికి ముందు ఆమె జుట్టును సవరించారంటే మీరు ఆమెకు మీ ప్రేమను ప్రత్యేకంగా తెలుపుతున్నట్లు అర్థం. ఆమె శిరోజాలను సవరిస్తూ ఆమెను ఆనందపెట్టండి.

కిస్ చేయండి

కిస్ చేయండి

కిస్ చేయడం ద్వారా ఆమె ఆగ్రహాన్ని చల్లార్చవచ్చన్న రహస్యం మీకు తెలుసా? అవును, ఇది నిజం. మీ ప్రియురాలి ఆగ్రహాన్ని ఒక కిస్ ద్వారా చల్లార్చండి. అయితే, ప్రతి రోజూ అదే పనిగా కిస్ చేస్తూ అది రొటీన్ గా మారిస్తే వారు మళ్ళీ మీకు 'అన్ రొమాంటిక్' అనే ట్యాగ్ ను ఇచ్చే ప్రమాదం కలదు. సమయం, సందర్భం చూసుకుని వ్యవహరిస్తూ 'మోస్ట్ రొమాంటిక్' అనే ట్యాగ్ ను సొంతం చేసుకోండి. ఆమె బుగ్గలపై, పెదవులపై కిస్ చేయడం రొటీన్. ఆమె నుదుటిపై, చేతులపై కిస్ చేస్తూ ఆమెను సర్ప్రైజ్ చేయండి.

హగ్ చేసుకోండి:

హగ్ చేసుకోండి:

మీరు ఆమెను హగ్ చేసుకోగానే ఈ ప్రపంచమంతా ఆమె చేతులలో ఇమిడిపోయినట్లు ఆమె భావిస్తుంది. ఆమె సంతోషంగా ఉన్నప్పుడూ, ఏదైనా దిగులుతో ఉన్నప్పుడూ ఆమెను హగ్ చేసుకోండి. హగ్ చేయడం ద్వారా మీరు ఆమె వెంటే ఎల్లప్పుడూ తోడుగా ఉంటారన్న ధీమా ఆమెకు కలుగుతుంది. తద్వారా, మీ బంధం మరింతగా బలపడుతుంది.

అభినందనలు తెలుపండి:

అభినందనలు తెలుపండి:

ఒక అమ్మాయి రెడీ అవడానికి ఎంతో సమయం పడుతుంది. అయితే, ఆమె తయారయేది ఆమె మనసు దోచిన వ్యక్తిని సంతోషపరచడానికేనన్న విషయం మరచిపోకూడదు. ఆమె కట్టూ బొట్టూ మిమ్మల్ని ఆకర్షించేందుకేనన్న విషయం గుర్తించి ఆమె అందాన్ని పొగడండి. ఆమె అందంగా ఉందని చెప్పడం ద్వారా ప్రపంచమంత ఆనందాన్ని ఆమె కళ్ళలోని మెరుపులో గుర్తించవచ్చు.

చూశారుగా, ఇవన్నీ మీ భాగస్వామిని మీరు ఇంప్రెస్ చేసేందుకు అవసరమయ్యే అద్భుతమైన చిట్కాలు. వీటిని పాటించి మీ భాగస్వామిని ఇంప్రెస్ చేసి 'మోస్ట్ రొమాంటిక్' అనే ట్యాగ్ ను సొంతం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.

English summary

Most Romantic Boyfriend | Become Romantic Boyfriend | Impress Her

If you want to be the most romantic boyfriend that a girl can have, then you need to use your mind. Being romantic is not rocket science. All you need is some creativity and enact filmy scenes to make her happy. Here are some of the best things that you can do to become the romantic boyfriend. These are basically the things that women want from their man. If done perfectly and at the right time, you can become the perfect boyfriend material.!
Story first published: Sunday, December 24, 2017, 9:04 [IST]