మగవాళ్ళు స్లిమ్ గా ఉండే గర్ల్స్ నే ఎక్కువగా ఇష్టపడతారు ఎందుకు?

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

పరిణామ పరంగా ఫిట్నెస్ సరిగ్గా ఉంటే మనుగడ మరియు పునరుత్పత్తి సామర్థ్యం బాగుంటుంది. 18-20 సంవత్సరాల వయస్సు వారిలో BMI 17 నుంచి 21 లోపు ఉంటే గరిష్ట సంతానోత్పత్తి మరియు భవిష్యత్ లో వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

చాలామంది పురుషులు నాజూగ్గా మరియు చురుకుగా ఉన్న మహిళలను ఇష్టపడతారని మీకు తెలుసా? ఆలా ఎందుకు ఇష్టపడతారో తెలుసా? ఒక కొత్త 'పరిణామ ఫిట్నెస్' ప్రకారం పురుషులు భాగస్వాములుగా భౌతికంగా ఆకర్షణీయముగా మరియు స్లిమ్ గా ఉన్న మహిళల కోసం వెతుకుతూ ఉంటారు.

బ్రిటన్లో అబెర్డీన్ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ నమూనా పరిణామాత్మక సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటుంది. పురుషుల శరీర ద్రవ్యరాశి సూచీ (BMI) 24 నుంచి 24.8 మధ్య ఉంటే ఆకర్షణీయమైన మరియు ఆరోగ్యకరమైన శరీరంగా గుర్తించాలని అంచనా వేశారు.

వారు బ్రిటన్ మరియు తొమ్మిది ఇతర దేశాల నుండి 1,300 కన్నా ఎక్కువ మంది పురుషులు మరియు స్త్రీలను పరిశీలించి అంచనా వేశారు. మరి వారి పరిశీలనలో గుర్తించిన సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..

 గణిత శాస్త్ర 'ఫిట్నెస్' నమూనా అంచనా ప్రకారం

గణిత శాస్త్ర 'ఫిట్నెస్' నమూనా అంచనా ప్రకారం

ఈ పరిశీలనలో పాల్గొన్నవారికి శరీర కొవ్వు వివిధ స్థాయిలలో ఉన్న మహిళల యొక్క 21ఇమేజ్ లను చూపిస్తే వాటిని ఆకర్షణీయంగా మార్చాలని కోరారు.

మొత్తం జనాభాలో పురుషులు మరియు స్త్రీల ఇమేజ్ లలో స్త్రీల ఇమేజ్ శారీరక ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. శరీర ద్రవ్యరాశి ఇండెక్స్ 19 ఉన్న మహిళల చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

శరీరంలో కొవ్వు పెరిగే కొద్దీ ఆకర్షణ తగ్గుతుంది. అయితే గణిత శాస్త్ర 'ఫిట్నెస్' నమూనా అంచనా ప్రకారం 24 నుండి 24.8 మధ్య BMI ఉంటే చాలా ఆకర్షనీయంగా ఉంటారు.

వయస్సు విషయానికి వచ్చినప్పుడు

వయస్సు విషయానికి వచ్చినప్పుడు

వయస్సు విషయానికి వచ్చినప్పుడు BMI 17 నుంచి 20 మధ్యలో ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ డెవలప్మెంటల్ బయాలజీ ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ జాన్ స్పక్మాన్ సన్నగా మరియు ఆకర్షణీయమైన మహిళలు యువతతో సమానం అని చెప్పారు.

పరిణామ నిబంధనలలో ఫిట్నెస్ అనేది

పరిణామ నిబంధనలలో ఫిట్నెస్ అనేది

18 నుంచి 21 సంవత్సరాల వయస్సు గలవారిలో BMI 17 నుంచి 20 మధ్యలో ఉంటే గరిష్ట సంతానోత్పత్తి మరియు భవిష్యత్ లో వ్యాధులు వచ్చే ప్రమాదాలు తక్కువగా ఉంటాయి.

ఇది యూరోపియన్, ఆఫ్రికన్ మరియు ఆసియా టెస్ట్ గ్రూపులలో స్థిరంగా ఉంటుంది.

పరిణామ నిబంధనలలో ఫిట్నెస్ అనేది మనుగడ మరియు పునరుత్పత్తి సామర్థ్యం అనే రెండు విషయాలను కలిగి ఉంటుంది:

పరిణామాత్మక ఫిట్నెస్..

పరిణామాత్మక ఫిట్నెస్..

మన భౌతిక ఆకర్షణను ఎలా రేట్ చేస్తారనే విషయానికి వస్తే శరీరం యొక్క వివిధ అంశాలు (శరీర కొవ్వు వంటివి) మరియు పరిణామాత్మక ఫిట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది.

సంతానోత్పత్తి

సంతానోత్పత్తి

"ఉదాహరణకి, మధుమేహం మరియు గుండె జబ్బులు మరియు తక్కువ సంతానోత్పత్తి వంటి దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా శరీర కొవ్వు ఎక్కువగా ఉన్న స్త్రీలు తక్కువ ఆకర్షణీయంగా ఉండవచ్చు" అని స్పీక్మాన్ పేర్కొన్నాడు.

ఆకర్షణీయమైన

ఆకర్షణీయమైన

గతంలో ధృడమైన ప్రజలు మనుగడ సాగించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు కొవ్వు మరింత ఆకర్షణీయంగా కన్పించేది. "ఇది ఎక్కడో మధ్యలో ఉన్న గరిష్ట ఆకర్షణీయమైన కొవ్వు వాంఛనీయ స్థాయిని సూచిస్తుంది," అని స్పీక్మన్ చెప్పారు.

 అబెర్డీన్ విశ్వవిద్యాలయం

అబెర్డీన్ విశ్వవిద్యాలయం

చాలా మంది ప్రజలు స్లిమ్ గా ఉన్న శరీరమే అత్యంత ఆకర్షణీయముగా ఉంటుందని ఒక భావనకు వచ్చేసారు. ఇప్పుడు ముఖ్యమైన పురోగతి ఈ పరిణామ అవగాహన ద్వారా వచ్చిందని అబెర్డీన్ విశ్వవిద్యాలయం నుండి లాబ్క్ వాన్హోల్ట్ చెప్పారు.

ఈ అధ్యయనం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా

ఈ అధ్యయనం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా

ఈ అధ్యయనం నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆఫ్ చైనా మరియు ప్రపంచంలోని 10 సంస్థల పరిశోధకులు పాల్గొన్న అధ్యయనం జర్నల్ పీర్జ్లో ప్రచురించబడింది.

English summary

Why men like slim women as life partners

Why men like slim women as life partners, Read to know more about.
Subscribe Newsletter