అలీషా, అమన్ ల అందమైన ప్రేమకథ

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

హిందీ మరియు స్థానిక భాషల చిత్రాలకి మనం థాంక్స్ చెప్పుకోవాలి, ఈరోజుల్లో ప్రజలు అసాధారణ ప్రదేశాలు, పరిస్థితులలోనే ప్రేమ దొరుకుతుందని భావిస్తున్నారు.

కొందరైతే ఇద్దరి ఆలోచనలు, వృత్తులు పూర్తిగా వేరు అయితేనే వారి మధ్య ప్రేమ పుట్టవచ్చని నమ్ముతున్నారు. కానీ ఇవేవీ తప్పనిసరిగా నిజం కావు.

ఎప్పటికీ మారని ఒక నిజం ఏమిటంటే తరచుగా ఒకే ఇష్టాలు,అయిష్టాలు ఉన్న వారు ఒకే రకమైన కెరీర్ లు ఎంచుకుంటారు. ఇలాంటివారు కలిసినా మాట్లాడుకోటానికి చాలా విషయాలు ఉంటాయి. ఏ జంటకైనా, మాట్లాడుకోటానికి ఎక్కువ విషయాలు ఉన్నప్పుడు, వారి సంభాషణ అంత మెరుగ్గా ఉండి, బంధం కూడా ధృఢంగా ఉంటుంది.

ఇలాంటి బంధం ఎక్కువకాలం ఉండి 'కలకాలం సంతోషంగా ఉన్నారు' అనే ముగింపుకి అందంగా దారితీస్తుంది. అలీషా మరియు అమన్ అనే అసాధారణ జంట మరియు వారి బంధం విజయం సాధించటానికి ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చిందో చదివి తెలుసుకోండి.

1. గమ్యం లేని ప్రయాణికురాలు

1. గమ్యం లేని ప్రయాణికురాలు

అలిషా చిన్నప్పటినుండి ఎదురుతిరిగే స్వభావం కల అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ చేద్దామనుకుంటే, ఆమె ఫోటోగ్రాఫర్ అవ్వాలని పోరాడింది. అలా మొత్తానికి ఆమెను ఏది చేయవద్దంటారో అదే చేసేదిగా ఎదిగింది. ఈ స్వభావం వల్లనే ప్రముఖ విద్యాసంస్థ నుంచి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోర్సులో చేరింది మరియు అందులోనే వృత్తిని ఆరంభించింది.

2. వన్యజీవన ప్రేమికుడు

2. వన్యజీవన ప్రేమికుడు

చిన్నప్పటి నుండి, అమన్ కి మొక్కలు, జంతువులంటే చాలా ఆసక్తి. సాయంకాలాలు స్నేహితులు క్రికెట్ ఆడటంలో గడిపితే, అమన్ హాయిగా ఒక మూల వీధి కుక్కతో ఆడుకునేవాడు. ఏళ్లు గడిచాక, అమన్ ఆసక్తి ఆ కుక్కల నుండి ఇతర జంతువులు, పక్షుల వరకూ పాకింది. ఈ ఆసక్తే అతన్ని ఆర్నిథాలజీ చదివేలా చేసింది. తర్వాత చిన్నవయస్సులోనే అతను ప్రసిద్ధ బర్డ్ వాచర్ గా మారాడు.

3. కలవటం

3. కలవటం

అలీషా, అమన్ ఢిల్లీలోని ఒక విలాసవంతమైన హోటల్ లో చాలా ఫార్మల్ మీటింగ్ లో ఒకసారి కలిసారు. వారు పనిచేస్తున్న సంస్థలు ఏదో ఒక ప్రాజెక్టుకి భాగస్వాములయ్యి వీరిద్దరికీ ఒకే ప్రాజెక్టులో పని ఇవ్వబడింది. ఆ తర్వాత రెండు రోజుల్లో, ప్రతి చలికాలం అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన ఒరిస్సాలోని చిల్కా సరస్సుకి అనేక వలస పక్షులు వస్తాయి కాబట్టి, వారు అక్కడకి చేరుకోవాల్సి వచ్చింది. ఆ మీటింగ్ వలనే వారిద్దరి బంధానికి ఒక మెరుపులాంటి పునాది ఏర్పడిపోయింది.

4. ప్రణయం

4. ప్రణయం

మొదటి పరిచయంలో మిగిలిపోయినది, ఆ ప్రాజెక్టు నడిచిన కాలం రెండు నెలల్లో పూర్తయింది. ఇద్దరికీ ఇంకెవరూ స్నేహితులు లేకపోవటంతో, అలీషా, అమన్ ఒకరితోఒకరు ఎక్కువ సమయం గడపటం మొదలుపెట్టారు. వారి స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారి, ఆ జంట ఒకరికొకరితో ప్రశాంతత పొందటం ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు రెండు నెలల కాలం వారిద్దరికి చాలా మంచి సమయంగా గడిచింది.

5. వాస్తవ పరిస్థితులు

5. వాస్తవ పరిస్థితులు

అన్ని మంచి విషయాలకి కూడా ఎలా ముగింపు ఉంటుందో, వారి ప్రాజెక్టు కూడా చివరకి వచ్చేసింది. దాంతో అమన్ మళ్ళీ ముంబై తిరిగివెళ్ళాలి మరియు అలీషా కోల్ కతాలో తన ఆఫీసులో రిపోర్ట్ చేయాలి. ఇక ఇద్దరికీ అర్థమైంది, ఇంత అసాధారణ వృత్తులతో, పైగా అంత దూరం బంధాన్ని నిలబెట్టుకోవటం సులభం కాదు అని. వారి బంధం నిజంగా చాలా ఎత్తుపల్లాలకి గురైంది. ఇలా ఒక రెండేళ్ళు గడిచాయి. ఇక అలీషా అప్పటివరకు జరిగింది చాలని, ముంబైకి తను ఊరు మారాలని నిర్ణయించుకుంది.

6. మళ్ళీ కలయిక

6. మళ్ళీ కలయిక

తెలియని ఊరులో ఉద్యోగం వెతుక్కోటం చిన్నపిల్లల ఆట ఏం కాదు. అది కూడా ఎంతో ఖరీదైన నగరం ముంబైలో, ఈ వాక్యం నిజంగా నిజమైంది. కానీ ముంబైకి వెళ్ళగానే, అలీషాకి అమన్ నుంచి చాలా ప్రేమ, సపోర్ట్ దొరికాయి. అతని సపోర్ట్ వలనే నెలలోపలే అలీషాకి మంచి ఉద్యోగం దొరికింది. ఇద్దరి కెరీర్ లు సెట్ అయ్యాక, ప్రేమ కూడా గాఢంగా ఉండటంతో, ఈ జంట తమ బంధాన్ని తర్వాత స్థాయికి తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యారు.

7. పెళ్ళి మరియు ఇక అప్పటినుండి కొత్త ప్రయాణం

7. పెళ్ళి మరియు ఇక అప్పటినుండి కొత్త ప్రయాణం

అలీషా ఉద్యోగంలో చేరిన రెండునెలల్లోనే, ఈ జంట మల్లాడ్ లోని ఒక ఆలయంలో పెళ్ళిచేసుకున్నారు. చాలా సింపుల్ గా, కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, దగ్గరి స్నేహితులు మాత్రమే ఆహ్వానించబడ్డారు. పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి వనజీవన ప్రయాణాలు మరింత ఎక్కువగా, ఆనందంగా చేస్తూ, హాయిగా జీవిస్తున్నారు. ఈ అసాధారణ జంట జీవితకాలం కలిసివుండాలని మనం కూడా కోరుకుందాం.

English summary

Love Story: Call Of The Wild Couple

Some people even go to the extent of believing that love can be found only in people whose ideologies and professions are completely different from each other. However none of this is true.
Story first published: Saturday, February 17, 2018, 17:30 [IST]