ప్రేమ గురించి అబ్బుర‌ప‌రిచే 8 విష‌యాలు

By: sujeeth kumar
Subscribe to Boldsky

ప్రేమ‌... త‌ర‌త‌రాలుగా చెక్కుచెద‌ర‌ని భావోద్వేగ‌పు బంధంగా నిలుస్తూ వ‌స్తోంది. ప్రేమే మ‌నుషుల‌ను ద‌గ్గ‌ర‌కు చేరుస్తుంది, వారి మ‌ధ్య అనుబంధాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తుంది. ఈ ప్రేమే లేక‌పోతే ఎలాంటి ర‌క్త‌సంబంధ‌మైనా నిల‌వ‌దు.

అంద‌రి న‌మ్మ‌కం ప్ర‌కారం ప్రేమ అనేదాన్ని కొల‌వ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాదు. త‌ల్లికి త‌న బిడ్డ‌ల‌ప‌ట్ల ఎంత ప్రేమ ఉంటుంద‌నేది ఎలా చెప్ప‌గ‌లం? బిడ్డ‌ను అన్ని ర‌కాల ఆప‌దల నుంచి కాపాడ‌ల‌న్న‌ది త‌ల్లి అంత‌రాల్లోనే ఉండిపోతుంది. ఇలా ప్రేమ గురించి మ‌తి పోగొట్టే ఎన్నో అంశాలుంటాయి.

facts about love that will blow your mind

ప్రేమ అనేది త‌ల్లి, బిడ్డ‌ల మ‌ధ్య అనుబంధ‌మేనా... ర‌క్త‌సంబంధీకుల్లోనే ప్రేమ ఆప్యాయ‌త‌లు వెల్లివిరుస్తాయా! నిజం చెప్పాలంటే ఎన్నో సంద‌ర్భాల్లో అనుకోని వ్య‌క్తుల మ‌ధ్య కూడా ప్రేమ పుట్టొచ్చు.

ఈ ప్రేమే ఒక జంట‌ను ద‌గ్గ‌ర‌చేర్చి వారిని ఏకం చేస్తుంది. ఈ ప్రేమే వైవాహిక బంధాన్ని కొన్నేళ్ల పాటు మ‌న్న‌గ‌లిగేలా చేస్తుంది. ఆ త‌ర్వాతే కుటుంబ‌మూ అన్నీ మొద‌ల‌వుతాయి.

భూమి పైన జీవించే ఈ కొంత కాలం ప్రేమ‌ను పొంద‌డం, ఇవ్వ‌డం అదృష్టంగానే భావించాలి. ప్రేమ గురించి తమ‌కు అంతా తెలుస‌నుకుంటారు చాలా మంది. అయితే దీనికి సంబంధించిన 8 వాస్త‌వాల‌ను ఇప్పుడు చూద్దాం..

1. దీర్ఘ‌కాలంలో ప్రేమే..

1. దీర్ఘ‌కాలంలో ప్రేమే..

ఎలాగైతే ఆక‌లి, దాహం అనేదాన్ని మ‌నం నియంత్రించ‌లేమో అదే విధంగా ప్రేమ‌ను కోరుకోవ‌డం, ఇవ్వ‌డం అనేదాన్ని నియంత్రించ‌లేం. చాలా మంది మ‌గ‌వాళ్ల‌కు దీర్ఘ‌కాలంలో శృంగార‌ప‌ర వాంఛ‌లు తీర్చుకోవాల‌నే దాని క‌న్నా ప్రేమించ‌బ‌డ‌డం చాలా ఇష్టంగా అనిపిస్తుంటుంది.

2. దాచిపెట్ట‌డం చాలా క‌ష్టం

2. దాచిపెట్ట‌డం చాలా క‌ష్టం

ఏదైనా అనుబంధాన్ని ఇత‌రుల కంట‌ప‌డ‌కుండా దాచిపెట్ట‌డం చాలా క‌ష్టం. భార‌తీయ స‌మాజంలో ప్రేమ బంధాన్ని దాచిపెట్టడం మ‌రింత క‌ష్టం అని చెప్పొచ్చు. ఇలా ప్ర‌పంచానికి మ‌న బంధం దాచిపెట్ట‌డం మూలాన మ‌న భాగ‌స్వామితో ఎక్కువ రొమాంటిక్ ఫీలింగ్స్ క‌లుగుతుంటాయి.

3. ప్రేమ‌లో కృత‌జ్ఞ‌త‌

3. ప్రేమ‌లో కృత‌జ్ఞ‌త‌

చిన్న‌ప్ప‌టి నుంచి మ‌నం నేర్చుకున్న‌ది ఏమిటంటే ఎవ‌రైనా మన‌కు మంచి చేస్తే వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌తాభావంతో ఉండాలి. మ‌న ప‌ట్ల ప్రేమ చూపించే వారితోనూ ఇలాగే ప్ర‌వ‌ర్తించాలి. మ‌న‌పైన ప్రేమ చూపించే వారి ప‌ట్ల కృత‌జ్ఞ‌త ఉంటే ఆనందం ద్విగుణీకృత‌మ‌వుతుంది.

4. సొంత‌మ‌నే భావ‌న

4. సొంత‌మ‌నే భావ‌న

ప్రేమ‌లో ప‌డిన వ్య‌క్తి భావోద్వేగ‌ప‌రంగానే, హార్మోన్‌ల‌ప‌రంగాను మార్పులు వ‌స్తాయి. సెర‌టోనిన్ స్థాయిల్లో త‌గ్గుద‌ల గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇది ఓసీడీకి దారితీయోచ్చు. ప్రేమ‌లో ఉన్న‌వారు త‌మ భాగ‌స్వామి త‌మ‌కే సొంత‌మనే భావ‌న‌కు వ‌చ్చేస్తారు.

5. మ‌గ‌వారే ఎక్కువ బాధ‌ప‌డ‌తారు

5. మ‌గ‌వారే ఎక్కువ బాధ‌ప‌డ‌తారు

బ‌ల‌మైన మ‌గాడు అనేది పైకి క‌నిపించినా.. ప్రేమ‌లో ఉన్న మ‌గవాడు మాత్రం ఆడ‌వారితో పోలిస్తే బాగా బ‌ల‌హీనంగా ఉంటార‌ట‌. అందుకే జంట‌లు విడిపోయిన‌ప్పుడు ఎక్కువ‌గా మ‌గ‌వారే బాధ‌ప‌డుతుంటారు. 20ల‌లో ఉన్న‌వారైతే మ‌రీనూ!

6. తొలిచూపులోనే..

6. తొలిచూపులోనే..

అప‌రిచిత వ్య‌క్తుల‌ను కొంత సేపు త‌దేకంగా ఆక‌ర్ష‌ణీయంగా చూస్తుంటే మ‌న‌లోప‌ల కొన్ని హార్మోన్లు విడుద‌ల‌వుతాయంట‌. దీన్నే తొలి చూపులో ప్రేమ అంటారేమో. ఇది శాస్త్రీయంగానూ నిరూపిత‌మైంది. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అనే భావ‌న క‌ల్పితం కాదు.

7. తీసి ప‌డేసిన‌వారికి ఎక్కువ ప్రేమ‌

7. తీసి ప‌డేసిన‌వారికి ఎక్కువ ప్రేమ‌

ఎవ‌రినైనా తీసిప‌డేస్తే వాళ్లు ఫ్ర‌స్టేష‌న్‌కు గురయ్యే అవ‌కాశం ఉంది. ఇలా తీసిప‌డేసిన‌వారిని ఎవ‌రైనా కొంచెం ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తే చాలు ఇట్టే ప్రేమ‌లో ప‌డిపోతారు.

8. శారీర‌క బాధ పోగొడుతుంది

8. శారీర‌క బాధ పోగొడుతుంది

మ‌న‌కిష్టమైన వారి చేతుల‌ను పొదివి ప‌ట్టుకొంటే ఒత్తిడి దూర‌మ‌వుతుంది. విన‌డానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఇది ఏర‌కంగానూ సాధ్యంకాకపోతే మ‌నం ప్రేమించేవారి ఫొటో చూసినా స‌రే చాలా మ‌టుకు ఒత్తిడి, బాధ మాయ‌మ‌వ్వ‌గ‌ల‌దు. ఎన్నో ర‌కాల శారీర‌క బాధ‌ల‌నే కాదు మాన‌సిక ఆందోళ‌న‌ల‌ను త‌గ్గించ‌గ‌ల‌ద‌ని డాక్ట‌ర్లు అంటారు.

English summary

Facts about love that will blow your mind

Love is something that is found in the most unexpected of places. It is this love that binds couples together and makes them tie the nuptial bond. Over the years, it is love that makes them stay in holy matrimony and start a family together. To add on to this, there are certain facts about love that will blow your
Story first published: Friday, January 19, 2018, 18:00 [IST]
Subscribe Newsletter