చరణ్ నన్ను టచ్ కూడా చెయ్యలేదు.. రామ్ నన్ను బాగా వాడుకున్నాడు - My Story #89

Written By:
Subscribe to Boldsky

నా ఇంటర్ అయిపోయాక నేను నీట్ రాశాను. అప్పుడు నాకు సరైన ర్యాంక్ రాలేదు. దాంతో నేను చాలా అప్ సెట్ అయ్యాను. నాకు ఎంబీబీఎస్ చేయాలని చాలా కోరిక ఉండేది కానీ సరైన ర్యాంక్ రాకపోవడంతో నా ఆశ నిరాశే అయ్యింది. నేను ఇంటర్ లో బాగానే చదివేదాన్ని. ఇంటర్ సబ్జెక్ట్ లకు ఎక్కువ కాన్సస్ట్రేషన్ పెట్టి నీట్ ర్యాంక్ సాధించలేకపోయా.

నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్

నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్

తర్వాత నేను నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయినయ్యాను. అక్కడికి వెళ్లాక నేను కొన్ని రోజులు ఆ వాతావరణానికి అడ్డెస్ట్ కాలేకపోయాను. నేను మా ఇంటిని విడిచిపెట్టి బయట ఉండడం అదే ఫస్ట్ టైమ్.

ఇంటర్ లో ఒక బాయ్ ఫ్రెండ్

ఇంటర్ లో ఒక బాయ్ ఫ్రెండ్

రోజూ ఇళ్లు గుర్తొచ్చేది. నాకు ఇంటర్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు చరణ్. చరణ్ చాలా మంచివాడు. నేనంటే తనకు బాగా ఇష్టం. ఇంటర్ లో మేమిద్దరం బాగా చదివేవాళ్లం. ఎప్పుడూ క్లాస్ లో మేమిద్దరమే టాఫర్లంగా ఉండేవాళ్లం.

చరణ్ నన్ను టచ్ చెయ్యలేదు

చరణ్ నన్ను టచ్ చెయ్యలేదు

ఇంటర్ లో నేను తను కలిసి ఎంజాయ్ చేసింది ఏమీ లేదు. కనీసం చరణ్ నన్ను టచ్ కూడా చెయ్యలేదు. మేమిద్దరం ఒకరికొకరం ప్రపోజ్ కూడా చేసుకోలేదు. కానీ కాలేజీ మొత్తం మా ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని అనుకునేది.

ప్రాక్టికల్స్ అప్పుడు

ప్రాక్టికల్స్ అప్పుడు

నేను ఇంటర్ బైపీసీ చదివాను. బాట్నీలో ఏదైనా డౌట్ వస్తే తను చెప్పేవాడు. జువాలజీలో చరణ్ కు ఏ డౌట్ వచ్చినా నేను క్లారిఫై చేసేదాన్ని. అలా ఇద్దరి మధ్య పరిచయం బాగా బలపడింది. ప్రాక్టికల్స్ అప్పుడు ఆ పరిచయం మరింత పెరిగింది.

ఇద్దరి మనస్సులకు తెలుసు

ఇద్దరి మనస్సులకు తెలుసు

ఇద్దరం ప్రపోజ్ చేసుకోలేదు కానీ.. మా ఇద్దరి మనస్సులకు తెలుసు మేమిద్దరం ప్రేమలో ఉన్నామని. ఇద్దరం చాలా సిన్సియర్ గానే ఒకరి తెలియకుండా ఒకరం ప్రేమించుకున్నాం. అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడనే విషయం అతని ఫ్రెండ్స్ చాలా సార్లు నాకు చెప్పారు. నాకు కూడా ఆ విషయం తెలుసు.

చరణ్ దూరం అయ్యాడు

చరణ్ దూరం అయ్యాడు

నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో జాయిన్ అయ్యాక చరణ్ నాకు పూర్తిగా దూరం అయ్యాడు. అసలు చరణ్ ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడనే విషయం కూడా తెలియకుండా పోయింది. అతనికి నీట్ లో మంచి ర్యాంక్ వచ్చింది.

ఎంబీబీఎస్ లో జాయిన్

ఎంబీబీఎస్ లో జాయిన్

కచ్చితంగా ఎంబీబీఎస్ లో జాయిన్ అయి ఉంటాడని నా నమ్మకం. మా ఫ్రెండ్స్ కు ఎవరికీ కూడా చరణ్ టచ్ లో లేడు. అతను ఫోన్ కూడా ఉపయోగించడు. అతని నంబర్ కనుక్కోవడం కూడా కష్టం అయిపోయింది.

కాస్త బాధ వేసింది

కాస్త బాధ వేసింది

చరణ్ దూరం కావడం నాకు కాస్త బాధగా అనిపించేది. అలాంటి ఫ్రెండ్ దొరకడని బాధపడేదాన్ని. అయితే నీట్ కోచింగ్ సెంటర్ లో ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. నీట్ కోచింగ్ బ్యాచ్ అంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది.

వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్

వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్

అందులో ఒక అతను రోజూ చాలా పోస్ట్ లు చేసేవాడు. చాలా ఇన్ ట్రెస్టింగ్స్ విషయాలను అతను వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసేవాడు. దాంతో అతను ఎవరో తెలుసుకోవాలని నాకు అనిపించింది. అతని పేరు రామ్. అతనిది అనంతపురం.

రామ్ పరిచయం అయ్యాడు

రామ్ పరిచయం అయ్యాడు

అతను గ్రూప్ లో పంపే మెసేజ్ లకు నేను లైక్ కొట్టేదాన్ని. అయితే ఒక్కరోజు కూడా రామ్ నుంచి నాకు రిప్లై రాలేదు. ఒక రోజు అతన్ని వేరే ఫ్రెండ్ పరిచయం చేసింది. ఇతని పేరు రామ్. లాస్ట్ టైమ్ నీట్ లో మంచి ర్యాంక్ వచ్చింది.

రామ్ తో క్యాంటిన్ కు వెళ్లా

రామ్ తో క్యాంటిన్ కు వెళ్లా

అయినా రామ్ నీట్ లో టాప్ ర్యాంక్ సాధించడం కోసం మళ్లీ కోచింగ్ లో జాయినయ్యాడని నా ఫ్రెండ్ చెప్పింది. తర్వాత నేను, రామ్ క్యాంటిన్ కు వెళ్లాం. నీట్ గురించే మాట్లాడుకున్నాం. రామ్ మా కన్నా సీనియర్. నీట్ కు ముందు మెడికల్ కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ రాసేవారు. అతను ఎంసెట్ కు కూడా రాశాడంట.

ఎంబీబీఎస్ చెయ్యాలని ఉంది

ఎంబీబీఎస్ చెయ్యాలని ఉంది

తర్వాత రామ్ నా గురించి అడిగితే చెప్పాను. " మా ఇంటర్ బ్యాచ్ నుంచి నీట్ మొదలైంది. నాకు గతంలో నీట్ లో వచ్చిన ర్యాంక్ కు బీడీఎస్‌, ఆయుష్‌ కోర్సుల్లో సీటు వచ్చేది. కానీ నాకు ఎంబీబీఎస్ చెయ్యాలని ఉంది కాబట్టి నీట్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ లో జాయినయ్యాను" అని రామ్ కు వివరించాను.

చరణ్ మిస్ బిహేవియర్ చేయలేదు

చరణ్ మిస్ బిహేవియర్ చేయలేదు

తర్వాత నాకు రామ్ కు మధ్య పరిచయం పెరిగింది. ఇద్దరం సబ్జెక్ట్ లకు సంబంధించి రోజూ చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. రామ్ కు చరణ్ కు చాలా డిఫరెంట్ ఉంది. చరణ్ ఏ రోజు కూడా నాతో మిస్ బిహేవియర్ చేయలేదు.

రామ్ మొదటి రోజు నుంచి

రామ్ మొదటి రోజు నుంచి

రామ్ నేను పరిచయం అయిన మొదటి రోజు నుంచే నన్ను టచ్ చేయాలని తెగ ఆరటాపడేవాడు. అయితే అతని స్టడీ స్కిల్ చూసి నేను ఏమి అనలేకపోయేదాన్ని. మిగతా విషయాల్లో అతను చాలా మంచి వాడు. అతనికి చాలా విషయాలు తెలుసు.

నా కాలుపై కాలు పెట్టాడు.

నా కాలుపై కాలు పెట్టాడు.

కేవలం చదువు మాత్రమే కాదు. దేశంలో జరిగే ప్రతి అంశంపై అతనికి మంచి అవగాహన ఉంది. రామ్ నాలెడ్జ్ నాకు బాగా నచ్చింది. ఒక రోజు క్యాంటిన్ లో కూర్చొన్నాం. తను వచ్చి ముందు చైర్ లో కూర్చొన్నాడు. షూస్ విడిచి నా కాలుపై కాలు పెట్టాడు. నాకు కాస్త కోపం వచ్చింది. అయినా ఎందుకో ఏమి అనలేకపోయాను.

రామ్ ఎక్కడంటే అక్కడ చేతులు వేసేవాడు

రామ్ ఎక్కడంటే అక్కడ చేతులు వేసేవాడు

మొత్తానికి రామ్ నేను ఫ్లాట్ అయిపోయాను. తను ప్రపోజ్ చేశాడు. ఒకే అన్నాను. మా ప్రేమ హద్దులు మీరింది. రామ్ ఎప్పుడంటే అప్పుడు నన్ను కిస్ చేసేవాడు. నాపై ఎక్కడంటే అక్కడ చేతులు వేసేవాడు. చాలా మంది ఫ్రెండ్స్ కు ఈ విషయం తెలిసింది.

ఆ పనికి ఒప్పుకోను

ఆ పనికి ఒప్పుకోను

ఒక రోజు రామ్ ఆ పని గురించి కూడా నాతో మాట్లాడాడు. కిస్ ల వరకు ఒకే కానీ ఆ పనికి మాత్రం నేను ఒప్పుకోను అన్నాను. అయినా నాకు దానిపై అంతగా ఇంట్రెస్ట్ లేదు.

చరణ్ కు చెప్పారు

చరణ్ కు చెప్పారు

మా లవ్ గురించి చరణ్ కు కూడా తెలిసిపోయింది. మా ఇంటర్ బ్యాచ్ మేట్స్ కొందరు నాతో పాటే కోచింగ్ తీసుకునేవారు. వాళ్లు చరణ్ కు చెప్పారు. తర్వాత నాకు చాలా విషయాలు తెలిశాయి. చరణ్ కు నేనంటే ప్రాణమట. ఎప్పుడూ నా గురించే ఫ్రెండ్స్ తో మాట్లాడేవాడంట.

అందుకే దూరంగా ఉన్నాడంట

అందుకే దూరంగా ఉన్నాడంట

నాకు నీట్ లో సరైనా ర్యాంక్ రానందుకు చాలా బాధపడ్డాడంట. నాతో తను స్నేహంగా ఉంటే మళ్లీ ఈ సారి కూడా ఎక్కడ ర్యాంక్ రాదేమోనని బాధపడ్డాడంట. అందుకే నాకు దూరంగా ఉన్నాడంట. ఈ విషయాలు అన్నీ తెలిశాక నేను మౌనంగా ఏడ్చాను.

రామ్ యూజ్ చేసుకున్నాడు

రామ్ యూజ్ చేసుకున్నాడు

రామ్ నాతో రోజూ ఫుల్ ఎంజాయ్ చేసేవాడు. నన్ను అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నాడు. చివరకు ఒక చిన్న విషయంలో నాతో గొడవపడి నన్ను నానా మాటలు అన్నాడు. రామ్ నుంచి నేను దూరం అయ్యాను.

నా గురించి చాలా చెప్పాడు

నా గురించి చాలా చెప్పాడు

చరణ్ కూడా రామ్ గురించి నా గురించి తెలిసింది కాబట్టి అతను కూడా నాతో మాట్లడడని నాకు అర్థమైంది. రామ్ నా గురించి చాలా బ్యాడ్ గా నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాడు. నేను అతని వెంట పడ్డాడని అతనితో ఎన్నో సార్లు అందులో కూడా పాల్గొన్నానని ఇలా ఏవేవో చెప్పాడు.

నటించే వాళ్లనే నమ్ముతాం

నటించే వాళ్లనే నమ్ముతాం

మనల్ని నిజంగా ప్రేమించేవాళ్లని మనం అర్థం చేసుకోం. మనపై ప్రేమ చూపిస్తూ నటించి మనల్ని వాడుకునే వారిని నమ్ముతాం. నా పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు అన్నింటికీ దూరంగా ఉంటున్నా. నీట్ పై దృష్టి పెట్టాను.

English summary

he spoke about our conversation in our friends group in such a horrible manner

he spoke about our conversation in our friends group in such a horrible manner
Subscribe Newsletter