ప్రేమ కథ : విధి ఎలా ఇద్దరు వ్యక్తులను కలిపిందంటే:

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

వివాహాలు స్వర్గంలో జరుగుతాయని చాలామంది చెబుతుంటారు. అయితే భారతదేశంలో వివాహాలను ఎంతో అంగరంగ వైభవంగా మరియు తమ స్థోమతను తెలియజెప్పే విధంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక నిజం ఏమిటంటే, ఒక తండ్రి తన కూతురి కలల పెళ్లిని ఘనంగా చేయడానికి, తన జీవితాంతం డబ్బుని కూడబెడతాడు. ఇందులో ఎటువంటి అతిశయోక్తిలేదు.

ఇది తప్పా లేక ఒప్పా అనేది చెప్పడం కొద్దిగా కష్టమైనా అంశం. అంతేకాకుండా ఈ వివాదం కొద్దిగా వివాదాస్పదమైనది కూడా. అయితే భారతీయ వివాహాలకు చాలామంది వ్యక్తులు హాజరవుతుంటారు. పెళ్లి చేసేవారికి ఏ స్థాయి, స్థోమతలు ఉంటాయో, ఇంచుమించు వీరందరూ అదే స్థోమత కలిగినవారై ఉంటారు.

love story

ఇలా ఎప్పుడైతే ఒక పెళ్లి జరుగుతుందో, యుక్తవయస్సులో ఉన్న పెళ్లి కాని చాలా మంది ఈ పెళ్లిళ్లకు వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు పెళ్ళిలో ఎవరినైనా చూసి ప్రేమలో పడుతుంటారు. ఈ విధంగా పెళ్లి కాని వారు కూడా జంటలుగా మారడానికి మరియు పెళ్లి చేసుకోవడానికి పెళ్లిళ్లు ఉపయోగపడుతుంటాయి.

ప్రవళి మరియు మయాంక్ విషయంలో అచ్చం ఇలానే జరిగింది. వారి యొక్క తోబుట్టువుల వివాహం సందర్భంగా వీరిమధ్య ప్రేమ చిగురించింది. ఇలా ఒక పెళ్లి మరొక ప్రేమ పెళ్ళికి దారితీసింది, ఒక పెద్ద కుటుంబానికి ఎలా పునాది వేసింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

చూడముచ్చటైన యువకుడు :

చూడముచ్చటైన యువకుడు :

భారతదేశంలోనే అత్యత ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరింగ్ కాలేజీ లో మయాంక్ చదివాడు. మయాంక్ తన జీవితంలో రెండే రెండు విషయాల పై విపరీతంగా దృష్టిపెట్టాడు. మొదటిది వృత్తి (జీవన ప్రగతి), రెండవది శరీరం. జిమ్ చేయడానికి విపరీతంగా ఉత్సాహం చూపించేవాడు. తన కండల తిరిగిన శరీరాన్ని చూసి ఎంతో మంది అమ్మాయిలు ఆకర్షితులు అయ్యేవారు. కానీ, ఇతను మాత్రం అమ్మాయిలు అంటే పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. అందుచేతనే ఇతను ఎవరితో డేటింగ్ కి వెళ్ళలేదు.

ప్రవళి బహిర్ముఖ మనస్తత్వం కల అమ్మాయి :

ప్రవళి బహిర్ముఖ మనస్తత్వం కల అమ్మాయి :

మరో వైపు ప్రవళి తన మనస్సులో ఏది దాచుకోకుండా మాట్లాడే అమ్మాయి. ఈమెకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వారిలో ఎక్కువమంది అబ్బాయిలు ఉన్నారు. ఫ్యాషన్ కళాశాలలో ఉన్న కాలేజీ రోజుల నుండి కూడా ఆమెకు ఎప్పడూ ఎవరో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇక అసలు నిజం ఏమిటంటే, ఆమె ఒంటరిగా ఏ బాయ్ ఫ్రెండ్ లేకుండా ఉన్న సమయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడా చాలా కష్టమైనా విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమె చాలా ముద్దుగా ఉంటుంది.

గ్రహాలు ఎలా కుట్ర చేసి జీవితభాగస్వామిని కలిసేలా చేసాయంటే :

గ్రహాలు ఎలా కుట్ర చేసి జీవితభాగస్వామిని కలిసేలా చేసాయంటే :

ప్రవళి తన అక్క వివాహం కోసం ఎన్నో నెలల పాటు పెళ్లి కొడుకు కోసం ప్రయత్నించింది. ఇక చివరికి ఆ అసమయం రాణే వచ్చింది. తన బావ వీళ్ళు ఉండే ప్రదేశానికి రావడంతో, "బారత్" ని వైభవంగా నిర్వహించారు. ఆమెలో ఆ క్షణం ఉత్సాహం ఉప్పెంగిపోయింది. ఆ పెళ్లి కొడుకు వేడుకలో తన ప్రేమ జీవితం కూడా ఉంది అనే విషయం అప్పుడు ఆమెకు తెలియదు.

చివరికి ఎట్టకేలకు ఆమె గుర్తించింది :

చివరికి ఎట్టకేలకు ఆమె గుర్తించింది :

మొదట్లో, ఈమె కుటుంబం మొత్తం పెళ్లికొడుకుకి స్వాగతం పలకడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రవళి ఆ సమయంలో పెద్దగా ఏ పనిని చేయలేదు మరియు మయాంక్ ని కూడా చూడలేదు. ఇక ఆ రోజు సాయంత్రం ఆమె అక్క పవిత్రమైన అగ్ని చుట్టూ నడుస్తున్నప్పుడు ఆ క్షణాలను తన కెమెరా లో బంధించడానికి ప్రవళి విపరీతంగా కష్టపడుతోంది. అదే క్షణంలో మరో వ్యక్తి కూడా తన కెమెరా లో ఈ అపురూప దృశ్యాలను బందించాలనే ఆతురతలో మిగతా వారిని బలంగా పక్కకు నెట్టివేస్తున్నాడు. ఇలా అతడు చేయడం ప్రవళికి చాలా కర్కశంగా అనిపించింది. అంతే కాకుండా ఇతనిని గుర్తించిన వెంటనే విపరీతమైన అయిష్టాన్ని ప్రదర్శించింది.

ప్రేమ పక్షులు పాడటం మొదలు పెట్టాయి :

ప్రేమ పక్షులు పాడటం మొదలు పెట్టాయి :

ఆ క్షణం మయాంక్ కూడా ఆమెను చూసాడు. ఆమె యొక్క ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని చూసి ముగ్దుడయ్యాడు. ఆ రోజు వరకు పెళ్ళిలో విపరీతంగా అలంకరించుకొని వచ్చే అమ్మాయిలను చూసిన మయాంక్ మొదటిసారి ఉత్సాహంగా పెళ్లిలో పనులు చేస్తూ చిత్రాలు తీస్తున్న ఒక అందమైన అమ్మాయిని చూసాడు. ఆమె అంత అందంగా ఉంది అనే విషయం ఆమెకు కూడా తెలియదేమో. ఆమెను చూసిన మరుక్షణం ఆ అమ్మాయితో మాట్లాడాలి అని నిశ్చయించుకున్నాడు.

ధైర్యానంతా కూడకట్టుకొని :

ధైర్యానంతా కూడకట్టుకొని :

మయాంక్ లాంటి అబ్బాయిలకు, దైర్యనంతా కూడకట్టుకొని ప్రవళి లాంటి అమ్మాయిల వద్దకు వెళ్లడం అనేది చిన్నపిల్ల విషయం ఏమి కాదు. కానీ, ప్రేమ చిగురించినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అద్భుతమైన శక్తి మీలో కలుగుతుంది. మరుసటిరోజు ఉదయం ప్రవళి అక్క, అంటే వదినకు " బిడై " వేడుకను చేసే సమయంలో, అతడు ప్రవళి దగ్గరకు వెళ్ళాడు మరియు మాటలు కలపాలని ప్రయత్నించాడు.

ఆ సమయం పూర్తిగా అసందర్భం అయినది :

ఆ సమయం పూర్తిగా అసందర్భం అయినది :

ఆ రోజు అప్పుడు జరుగుతున్న విషయం ఏమిటంటే, తన అక్క ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని తెలిసి ప్రవళి విపరీతమైన దుఃఖంలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో ఆమె తో మాట్లాడటం అనేది చాలా చెత్త సమయం. కాబట్టి ఆ సమయంలో ఆమె స్పందించిన తీరుని ఎవ్వరైనా అర్ధం చేసుకోవాల్సిందే. కానీ, పాపం మయాంక్ ప్రవళి అస్సలు ప్రతిస్పందించకపోవడంతో బాగా కలత చెందాడు. అతడి ధైర్యం పూర్తిగా నీరుగారిపోయింది.

అవగాహన చేసుకోవడం మొదలైంది :

అవగాహన చేసుకోవడం మొదలైంది :

మొదటి కొన్నిరోజులు మయాంక్ తో చాలా కఠినంగా ప్రవర్తించింది ప్రవళి. మయాంక్ మనస్తత్వం సాధారణంగా తన వెంటపడే అబ్బాయిల మనస్తత్వం లాంటిది కాదని గుర్తించింది. అతడిని విభిన్నంగా నిలబెట్టిన అంశం ఏమిటంటే, అతడు ఆ రోజు తర్వాత ఎప్పుడు గాని ప్రవళి తో మాట్లాడటానికి ప్రయత్నించలేదు. ప్రవళి ఇప్పుడు తనని కోల్పోయినట్లు భావిస్తోంది. ఎదో ఒకరకంగా స్నేహ బంధాన్ని మొదలుపెట్టాలని భావించింది.

అలా మొదలైంది :

అలా మొదలైంది :

ఈమెది బహిర్ముఖ మనస్తత్వం కావడం తో, మయాంక్ ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి ఎంతో సమయం పట్టలేదు. తనకు సహకరించడానికి తన అక్క కూడా ఎంతో ఉత్సాహం చూపింది. ఆదివారం మధ్యాహ్నం ఆమె అతనికి మెసేజ్ పెట్టింది మరియు మాటలు మొదలు పెట్టింది.

ఆ వైపు నుండి :

ఆ వైపు నుండి :

మయాంక్ ఎప్పుడైతే ప్రవళి తో మాట్లాడాలని ప్రయత్నించాడో ఆ సమయంలో ప్రవళి సరిగ్గా ప్రతిస్పందించలేదు. దీంతో అతడి అహం బాగా దెబ్బతింది. మరొక విషయం ఏమిటంటే, మయాంక్ అప్పుడే మొదటిసారి ఒక అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు. ఆ రోజే అనుకున్నాడు ఆ అమ్మాయితో ఎప్పటికి మాట్లాడకూడదు అని. కానీ, ఒక ప్రముఖ నానుడి ఏమిటంటే, ప్రేమ ఎన్నో విషయాలను చేపిస్తుంది. ఎప్పుడైతే ప్రవళి నుండి సందేశం వచ్చిందో ఆ క్షణం అతడు విపరీతమైన ఉప్పొంగే ఆనందానికి లోనయ్యాడు.

ప్రేమ గాలిలో ఉన్నప్పుడు :

ప్రేమ గాలిలో ఉన్నప్పుడు :

మొదట సందేశాలతో మొదలైన ముచ్చట్లు, ఆ తర్వాత అర్ధరాత్రి ఫోన్ కాల్స్ వరకు చేరాయి మరియు ఈ జంట అప్పుడప్పుడు వారాంతాలలో కలుసుకునే వారు. వీరిద్దరూ ఎప్పుడైతే బయటకు వెళ్తారో, ఆ సమయంలో ఈ జంటని చూసిన వారందరూ చూడచక్కని జంట అని కొనియాడేవారు. ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటూ దాదాపు మూడు సంవత్సరాలు కాలం గడిపారు. ఈ జంటకి, ఒకరిలో ఒకరికి ఓదార్పు లభించింది.

కుటుంబానికి చెప్పే సమయం వచ్చేసింది :

కుటుంబానికి చెప్పే సమయం వచ్చేసింది :

అప్పటికే ఈ జంట సంబంధ బాంధవ్యంలో ఉండి మూడు సంవత్సరాలు అవుతోంది. ప్రవళి తల్లిదండ్రులు పెళ్ళి సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఇక సమయం మించిపోతోందని, ఇక రెండు కుటుంబాలకు తమ ప్రేమ విషయం చెప్పేయాలని ఈ జంట గుర్తించింది. మయాంక్ అత్యంత సంప్రదాయబద్ధమైన గుజరాతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ విషయాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని, ప్రేమ విషయం రెండు కుటుంబాలకు గనుక చెబితే అప్పుడు వారి నుండి వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనే విషయమై వీరిద్దరూ కొద్దిగా ఆందోళన చెందారు.

అనుకోని అస్సలు ఊహించని ప్రతిస్పందన :

అనుకోని అస్సలు ఊహించని ప్రతిస్పందన :

వీరి అంచనాలకు పూర్తి విరుద్ధంగా, మయాంక్ కుటుంబం ప్రవళిని తమ చిన్న కోడలిగా స్వీకరించడానికి ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రవళి తల్లితండ్రులు కూడా అలానే వ్యవహరించారు. అంతేకాకుండా కుటుంబసభ్యుల్లో అందరిలో కెల్లా విపరీతంగా ఆనందం వ్యక్తం చేసింది ఎవరంటే ఇంతకు ముందు పెళ్లి జంట. వారే ప్రవళి అక్క, మయాంక్ అన్న.

ఆ పెద్ద రోజు రానే వచ్చేసింది :

ఆ పెద్ద రోజు రానే వచ్చేసింది :

ప్రవళి మరియు మయాంక్ పెళ్లి రోజు రానే వచ్చేసింది. దేంతో రెండు కుటుంబాల నుండి కుటుంబసభ్యులు మరొక్కసారి ఈ పెళ్లివేడుకలో కలుసుకున్నారు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందేమో మరియు ఇంకెవరికైనా నిజమైన ప్రేమ దక్కుతుందేమో. ఇదే కదా ఎన్నో యుగాల నుండి జరుగుతున్న వ్యవహారం మరియు ఈ తంతు ఇలానే జరగాలని ఆశిద్దాం. ఆ జంటకు అందరు శుభాకాంక్షలు చెబుతూ, వారి జీవితంలో పెళ్లి తర్వాత ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరాలని, వారి జీవిత ప్రయాణం సాఫీగా సాగాలని దీవిద్దాం.

English summary

How Destiny Connects Two People

Love stories with a happy ending is always nice. One such story is when Mayank, a very decent guy, met Pravali, an extrovert. Mayank initially approached Pravali but she denied to speak to him. However, later they realised they have actually met their love of their lives and are soon getting married.
Story first published: Saturday, March 3, 2018, 10:50 [IST]