Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
నా సెక్స్ డైరీ: స్వీట్ మెమొరీస్!
పెళ్లయిన కొన్ని నెలలకు నా భర్త నాకో పుస్తకం బహుమతిగా ఇచ్చాడు. ఆ పుస్తకంలో తమ శృంగార అనుభవాలను డైరీలో రాసుకుంటే సెక్స్ జీవితం మెరుగవుతుందని రాసి ఉంది. అది చదివిన మా ఆయన మన శృంగార జీవితాన్నీ కథగా రాస్తే బాగుంటుందని నవ్వుతూ అన్నాడు. మా స్నేహితురాలు కూడా ఒకరు ఇలాగే డైరీ రాసేదిట. మొదట్లో వారి శృంగార జీవితం అంతంత మాత్రంగానే ఉండేదిట. డైరీ రాయడం మొదలు ఆమె తన మొగుడితో దాని గురించి చర్చించి ఇద్దరూ చర్చించుకునేవారట. ఆ తర్వాత వారి శృంగార జీవితం ఎల్లలు లేనట్టుగా సాగిపోయేది. నాకూ మా సెక్స్ లైఫ్ గురించి రాయాలని అనిపించింది. రాయకుండా ఉండేందుకు ఎలాంటి కారణమూ కనిపించలేదు.
మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా సెక్స్ డైరీ రాయడం చాలా సులభం. మొదట్లో ఎక్కడ, ఎప్పుడు, ఎలా శృంగారం చేసుకునేది చిన్న చిన్న వాక్యాల్లో రాయడం మొదలుపెట్టొచ్చు. ఆ తర్వాత ఒకరిపైన ఒకరు ప్రేమ ఎలా కురిపించుకోవచ్చు, అసంతృప్తి చోటుచేసుకున్న సందర్భాలు, శృంగార అనుభవాన్ని మరింత మెరుగుపర్చుకోవడం ఎలా అన్న విషయాలు డైరీలోకి చేర్చవచ్చు. రాయడం మొదలుపెట్టిన కొన్నాళ్లకు ఇదో పనిలా అనిపించేది కాదు. రాస్తూనే చాలా ఎంజాయ్ చేసేదాన్ని. బయటకు చెప్పుకోలేని ఎన్నో విషయాలు రాయగలిగే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉండేది.

డైరీలో కొన్ని పేజీలు రసభరితమైన వాక్యాలతో నింపేదాన్ని. వీటిని మంచి మంచి పుస్తకాలు లేదా ఆన్‌లైన్‌లో సేకరించి నచ్చినవి గుర్తుకువచ్చినప్పుడల్లా రాసుకునేదాన్ని. ఇవి కాకుండా నా భర్తతో ట్రై చేయాలనుకున్న కొన్ని భంగిమలను డైరీలో రాసుకునేదాన్ని. ఒక్కోసారి నా వైల్డ్ ఫాంటసీల జాబితాతో డైరీ తడసి ముద్దయ్యేది అంటే నమ్మండి.
సెక్స్ డైరీలో మంచి, చెడు, దరిద్రమైనవన్నీ ఉండేవి. ఏదైనా నచ్చకపోతే వెంటనే దాన్ని రాసుకునేదాన్ని. ఒక్కోసారి శృంగారంలో ఏదైనా పని లేదా భంగిమ నచ్చలేదని చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా మనకు ఇష్టమైన వారితో అది చెప్పడం మరింత కష్టం. అలాంటి ఇబ్బందులేమీ డైరీలో ఉండదు. మన భావాలన్నీ స్వేచ్ఛగా రాసేసుకోవచ్చు.

రాయడం కంటే రాసిన వాటిని చదువుతుంటే మరింత మజా వచ్చేది. ఒక్కోసారి నా భర్తతో చిలిపిగా ప్రవర్తించాలనుకున్నప్పుడు కొన్ని పేజీలను మార్కు చేసి వాటిని చదవమనేదాన్ని. అందులో నా ప్రగాఢమైన కోరికలు ఉండేవి. అవి మరీ శృంగార భరితంగా ఉండేవి. వాటిని మాటల్లో చెప్పలేను. అవి చదువుకొని నా భర్త వాటిని అమలు పరిచే ప్రయత్నం చేసేవాడు.

రిలేషన్‌షిప్ నిపుణుల ప్రకారం ఒక జంట మధ్య కమ్యూనికేషన్ బాగా ఉండాలంటారు. ఏదైనా సెక్స్ డైరీ రాసుకొని వాటిని భాగస్వామితో కలిసి చదువుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఒక్కోసారి సమస్యల గురించి మాట్లాడటం చాలా కష్టం. ముఖ్యంగా శృంగార జీవితం గురించి. ఇలాంటప్పుడు సెక్స్ డైరీ చక్కని మాధ్యమంలా పనిచేస్తుంది. మీరూ అవునని ఒప్పుకుంటారు కదూ!



Click it and Unblock the Notifications
