ఒక సెల్ఫీ ప్రేమ బంధాన్ని పెంచుతుందా?

Subscribe to Boldsky

జాతీయ సెల్ఫీ దినోత్సవ రోజున నేను సుజానే ఎల్లెన్ తో నా ప్రేమ కథను ఒకే సెల్ఫీతో ప్రారంభించాను. ఈరోజు నా జీవితంలోనే ఒక మరపురాని రోజుగా మిగిలిపోయింది. ఈరోజుకు గుర్తుగా నావద్ద నున్న సెల్ఫీ, చూసిన ప్రతిసారి జ్ఞాపకాలను నెమరువేస్తూ ఉంటుంది. ప్రేమ అనేది ఒక అనుభూతి. ఈ అనుభూతిని ఆస్వాదించడం కూడా ఒక కళే. చిరాకులు పరాకులు లేని ప్రేమ బంధం అనేది ఉండదు. కానీ, కొన్ని జ్ఞాపకాలు ఆ బంధాన్ని కాపాడుతూ ఉంటాయి. అందులో సెల్ఫీ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు.

ఒక చిన్న అనుభూతి మా ఇద్దరి మద్య పెంచిన సాన్నిహిత్యం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఒక సెల్ఫీ ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేయగలదని అనుకోని క్షణం లేదంటే నమ్మగలరా?

How A Single Selfie Formed A Relationship Of Love

నేను, నా సుజానే ఇద్దరమూ ఒక సెల్ఫీతో ప్రేమను ఆరంభించాము:

నేను నా స్నేహితుల సమూహంతో కలిసి నైట్ పబ్ లో కాలక్షేపం చేస్తూ ఉన్నాము. ఆల్కహాలిక్ శరీర తత్వానికి అనుగుణంగా ఉన్న సంగీత స్వరాలతో, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నాము. సెల్ఫీ అనేది ప్రతి ఆనంద క్షణాలను నెమరు వేసుకోగలిగే ఒక ఉన్నతమైన అంశం. ఈ సెల్ఫీ మానియాలోనే అనేక మంది యువత వివిధ రకాల గాడ్జెట్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు.

ఆ రాత్రి మిరుమిట్లు గొలిపే నక్షత్రాల కాంతి వెలుగులో స్నేహితులతో కలిసి పబ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మాతో పాటు మరికొందరు కూడా ఆ వినోదంలో చేతులు కలిపి చిందులేశారు. ఈ నూతన పరిచయాలే ఒక ప్రేమకు పునాది రాయిగా మారుతుందని ఊహించలేదు. నిజానికి ఇలాంటివి యువతలో సర్వసాధారణమైన అంశాలుగా ఉన్నాయి. కానీ, ప్రేమ ఒక పరిణితిని ఇవ్వగలదని ప్రేమలో పడ్డాక కానీ తెలీలేదు.

How A Single Selfie Formed A Relationship Of Love

ఈ స్నేహితుల సమూహంలో ఎల్లెన్ కూడా ఒకరు, ఆ టెర్రస్ మీద కనిపిస్తున్న నక్షత్రాలతో చిందులేసే మా సమూహంలో చేతికి అందుబాటులో ఉన్న నక్షత్రం ఎల్లెన్. కానీ నా ఆల్కహాలిక్ లక్షణాలు కొంతసేపు ఆమెను దూరంగా ఉంచాయి. వ్యసనాలు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న విషయం మీద కూడా చర్చలు జరుపుకున్నాం. నిజానికి ఆమె వ్యసనాలకు పూర్తి వ్యతిరేకం, నేను చూస్తే చైన్ స్మోకర్. ఈ వ్యక్తిగత భేదాలే ఆ చర్చకు సగం కారణం.

ఈ కొత్త వ్యక్తులు మా ఆల్కహాలిక్ స్నేహితులతో చేరడం, క్రమంగా ఎన్నో సెల్ఫీలకు ఆ టెర్రస్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారడం జరిగింది. తర్వాత ఎవరికి వారం, వారింటికి చేరుకున్నాము.

మరుసటిరోజు ఉదయం, ఒకపక్క సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. నేను గత రాత్రి జ్ఞాపకాలను ఆలోచిస్తూ ఉన్నాను. నా మనసు నిండా ఆమే ఉంది. వెంటనే ఆమెకోసం సామాజిక మాధ్యమాల మొత్తం కలియజూశాను, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ వెతికాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె జాడ దొరకలేదు. దురదృష్టాన్ని నీడగా కలిగి ఉన్నానేమో అన్న భావన నామనసు నిండా.

How A Single Selfie Formed A Relationship Of Love

ఆమెతో ఎలా పరిచయం పెంచుకోవాలి, ఎలా సన్నిహితంగా ఉండాలి అన్నఆలోచనతోనే ఆఫీసుకు చేరుకున్నాను. గతరాత్రి జరిపిన సంభాషణ కూడా అర్ధాంతరంగా ముగిసింది. ఆ చర్చకు అర్ధవంతమైన ఫలితాన్ని ఇవ్వాలని భావించాను. ఆమెను ఎలాగైనా కలవాలి, ఎలా అయినా మాట్లాడాలి అన్న ఆలోచనే మనసు నిండా. అలాగని నేను ప్రేమలో లేను, ఎదో తెలీని ఆకర్షణ అని మాత్రం అర్ధమైంది.

పని చేస్తున్నప్పుడు, నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ గురించి ఆలోచించాను, క్రమంగా మా పబ్ స్టోరీ గురించి సోదించాను. చివరికి ఆమెను కనుగొన్నాను. ఇన్స్టాగ్రామ్-స్టోరీస్ లో, పబ్స్ లొకేషన్లో ఆమె తనను తాను టాగ్ చేసి ఉండడాన్ని గమనించాను. మనసంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. అక్కడ ఆమె పేరు కనపడలేదు, యూసర్ నేం వేరే ఉంది. ప్రొఫైల్లో కూడా వేరే పేరు కనిపించింది.

ఏది ఏమైనా చివరకు మీ గమ్యాన్ని చేరుకున్నప్పుడు కూసింత విజయ గర్వం ఉంటుంది. వెంటనే ఆమెకు టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. ఆ కాన్వర్సేషణ్ మమ్ములను ఒక జంటగా మార్చడంలో సహాయం చేసింది. కొంతకాలం డేటింగ్లో కూడా ఉన్నాము. క్రమంగా ఆమె అభిరుచులకు తగ్గట్లు, ధూమపానం కూడా మానేశాను. పర్యవసానం మా ఇద్దరి మద్య ప్రేమ చిగురించింది, ఒకరిని వీడి ఒకరం ఉండలేని సంబంధానికి దారితీసింది.

మా మనసులోని భావాలను గ్రహించిన కొద్ది రోజులకే డేటింగ్ దశకు చేరుకున్నాము. మనకు ఎన్నో స్వేచ్ఛలు మరియు జ్ఞాపకాలు ఉంటాయి, గడిచిన కాలాలు, సాంప్రదాయాలు మారుతూనే ఉంటాయి. కానీ ప్రేమ మాత్రం భూమి అంతరించినా కూడా ఒకేలా ఉంటుంది. ఒక సెల్ఫీ నా జీవితాన్నే మార్చివేసింది. ఆమెతో నా మొదటి సెల్ఫీ, నన్ను ఆమెకు దగ్గర చేసింది, నా వ్యసనాలను దూరం చేసింది, ఒక ప్రేమ బంధాన్ని ఇచ్చింది, జీవితం మీద ఆశ రేకెత్తించింది. నాకిప్పటికీ గుర్తుంది ఆరోజు ఫ్లోరల్ కోర్సెట్ డెనిమ్ పెయిర్ జీన్స్ ధరించిన ఆమె ఆ సెల్ఫీలో అద్భుతంగా ఉంది.ఆ సెల్ఫీలను చూసిన ప్రతి క్షణం ఆరోజులు, ఆమెతో నా మొదటి పరిచయ క్షణాలు కళ్ళముందు మెదులుతాయి.

ఇక్కడ ఖచ్చితంగా నాకు టెక్నాలజీనే సహాయం చేసింది. సెల్ఫీస్ ఖచ్చితoగా దేవుడిచ్చిన వరంగానే నేను భావిస్తాను. మన మధుర జ్ఞాపకాలను ఫోటోలో బందీగా ఉంచి, మన జ్ఞాపకాలను నిరంతరం గుర్తు చేస్తూ బంధాలను పదిలంగా ఉంచగలిగే సెల్ఫీ ఎప్పటికీ ఒక అద్భుతమే. నా లవ్ స్టోరీ కూడా ఒక సెల్ఫీ వలనే జరిగింది అని గొప్పగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నా ఆల్బం, నా భాగస్వామి తోటి సెల్ఫీలతో నిండిపోయింది అంటే అతిశయోక్తి కాదు.

హ్యాపీ నేషనల్ సెల్ఫీ డే!

ప్రేమతో,

మీ జాకబ్ & సుజానే ఎల్లెన్

ఇది నాకు జాకబ్ తన ప్రేయసి సుజానేతో ఉన్న ప్రేమ బంధం గురించి స్వయంగా రాసిన లేఖ. ఇక్కడ మీ కథనాన్ని ప్రచురించాలని భావిస్తున్నారా? అయితే మీ సెల్ఫీ ప్రేమ కథను amixednerve@gmail.com అనే మెయిల్ కి పంపండి.

ఇటువంటి అనేక ఆసక్తికర, ప్రేమ, సంబంధం తదితర అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How A Single Selfie Formed A Relationship Of Love

    On National Selfie Day I still remember the way my love story with Suzzane started from a single selfie. I remember how we began and how we grew to be extremely fond of each other. The thing about love is, it doesn't approve unless the feelings connect.
    Story first published: Saturday, June 23, 2018, 11:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more