పెళ్లికాక ముందే తనతో తనివి తీరా గడిపా.. అందుకే పెళ్లి చేసుకున్నా - My Story #52

Written By:
Subscribe to Boldsky

నా పేరు నరసింహ. నాది పక్కా పల్లెటూరు. మా ఊర్లో ఎవరూ ఉన్నత చదువులు చదివిన వారు ఎక్కువగా లేరు. నేను హైదరాబాద్ లోని ఇఫ్లూ లో ఇంగ్లిష్ లో ఎంఫీల్ పూర్తి చేశాను. నెస్ట్ నేను నెట్ (నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్) క్వాలిఫై పీహెచ్ డీ చేయాలనేది నా కల. గతంలో కూడా నెట్ రాస్తూనే ఉన్నాను. కానీ జెఆర్ఎఫ్ కు క్వాలీఫై కావడం లేదు.

ఊరంటే చాలా ఇష్టం

ఊరంటే చాలా ఇష్టం

అయితే ఇటీవల నా కోర్సు పూర్తి కావడంతో మా ఊరు వెళ్లాను. ఊర్లో ఉంటే నాకు అస్సలు సమయం తెలియదు. ఆ వాతావరణం అలా ఉంటుంది. ఊరిలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లలో కొందరు గ్రామంలోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు పక్కనున్న పట్టణంలో చిన్నచిన్న వ్యాపారాలు, ప్రైవేట్ జాబ్ లు చేస్తూ ఉంటారు.

అమ్మాయితో పరిచయం

అమ్మాయితో పరిచయం

మా ఊర్లో నాకు ఒక అమ్మాయితో చాలా రోజులుగా పరిచయం ఉంది. ఆమె పేరు రజిత. వాళ్ల అన్నయ్య రాజు నాకు మంచి స్నేహితుడు. అతని ద్వారానే ఆమె నాకు పరిచయం అయ్యింది. నేను కాలేజీ చదివేటప్పుడు ఆమె స్కూల్ లో చదివేది. అందువల్ల నాకు అప్పట్లో అంత పరిచయం లేదు. కానీ రానురాను పండుగలప్పుడు ఆమెతో పరిచయం మరింత పెరిగింది.

ప్రేమికుల రోజున

ప్రేమికుల రోజున

ఆమె పోయిన సంవత్సరం ప్రేమికుల రోజున నాకు ప్రపోజ్ చేసింది. నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పింది. తర్వాత కొన్ని రోజులకు నేను ఊరికొచ్చాను. అప్పుడు డైరెక్ట్ గా మా ఇంటికొచ్చి అదే మాటను చెప్పింది. నాకు కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం.

వాళ్ల అన్నయ్య నా ఫ్రెండ్

వాళ్ల అన్నయ్య నా ఫ్రెండ్

అంతకుముందు మేమిద్దరం చూపులతోనే మాట్లాడుకునేవాళ్లం. ఏ రోజు కూడా మేమిద్దరం ఎక్కువగా మాట్లాడింది లేదు. ఆమె అన్న రాజు వెంట నేను వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆమె నన్నే చూస్తూ ఉండేది. అయితే నాకు ఉన్న భయం ఒక్కటే. వాళ్ల అన్నయ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆమెను ప్రేమిస్తే అతన్ని మోసం చేసినట్లు అవుతుంది. అందువల్ల నా ప్రేమను వ్యక్తపరచలేకపోయాను.

అలా అడిగేసరికి..

అలా అడిగేసరికి..

ఆమె నాకు అదే పనిగా ఐ లవ్ యూ అని చెప్పేది. కానీ నేను మాత్రం మౌనంగా వెళ్లేవాణ్ని. ఒక రోజు మా ఇంటికి వచ్చి ఏంటీ.. నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పు.. లేదంటే లేదు. అంతేకానీ ఎందుకంటే సైలెంట్ గా ఉంటావు అని ప్రశ్నించింది. ఆ రోజు నా మనస్సులో ఉన్న మాట చెప్పాను. మీ అన్నయ్య నేను చాలా మంచి స్నేహితులం. మన ప్రేమ వల్ల ఆ స్నేహం విడిపోకూడదని నేను కోరుకుంటున్నానని చెప్పాను.

కమిట్ అయ్యాను

కమిట్ అయ్యాను

ఆమె మాత్రం నా బాధను అర్థం చేసుకోలేకపోయింది. దీంతో నేను కూడా కమిట్ కావాల్సి వచ్చింది. ఎలాగైనా సరే మనం పెళ్లి చేసుకుందామంది. మా ప్రేమ చాలా రోజులుగా ఎవరికీ తెలియకుండా కొనసాగింది. మా ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఇంటికొచ్చేది. నాతో ఏవేవో కబుర్లు చెప్పేది. కాలం అలాగే ఆగిపోతే చాలు అన్నట్లు అనిపించేది నాకు.

అందాలన్నీ క్యాప్చర్ చేశాను

అందాలన్నీ క్యాప్చర్ చేశాను

తను ఎన్నాళ్ల నుంచో దాచి పెట్టిన సొగసులన్నింటినీ కూడా ఆమె సమర్పించేందుకు సిద్ధమైంది. వాటన్నింటినీ జుర్రుకోవాలని నా మనస్సు పరితపించినా అది సమయం కాదని నన్ను నేనే కంట్రోల్ చేసుకున్నా. తను మంచంపై పడుకుంది.. కనిపించి కనిపించని తన ఎద అందాలు నన్ను కంట్రోల్ తప్పేలా చేశాయి. కానీ ఆ తప్పు మాత్రం చెయ్యలేదు. కళ్లతో తన అందాలన్నీ క్యాప్చర్ చేశాను.

ప్రతి రోజూ పండుగే

ప్రతి రోజూ పండుగే

వాటన్నింటినీ అప్పుడప్పడు రివైండ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసేవాణ్ని. ఇలా ఊరిలో ఉన్నన్నీ రోజులు నాకు ప్రతి రోజూ పండుగే. మా ప్రేమ విషయం వాళ్లింట్లో తెలిసింది. రాజు నాతో మాట్లాడడం మానేశాడు. రజితకు సంబంధం నిశ్చయించారు. ఆమెను ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టకుండా చేశారు.

చనిపోతానంది

చనిపోతానంది

తను నాకు మెసేజ్ చేసింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే నేను చనిపోతానంది. నాకు ఆ రోజు రాత్రి మొత్తం నిద్రపట్టలేదు. తెల్లవారుజామున నేను మెసేజ్ పంపాను. నువ్వు రెడీగా ఉండు.. ఈ రోజు మీ ఇంటికొచ్చి లేపుకపోతాను అని చెప్పాను. ఆమె ఒకే అని మెసేజ్ పంపింది. తెల్లవారుజామునే వాళ్ల ఇంటికి వెళ్లాను.

ఊరంతా మా గురించే చర్చ

ఊరంతా మా గురించే చర్చ

అప్పటికే రజిత బ్యాగ్ తో రెడీ గా ఉంది. ఎవ్వరికీ తెలియకుండా హైదరాబాద్ కు వెళ్లాం. ఉదయం ఊరంతా మా గురించే చర్చ. మా అమ్మనాన్నను రజిత వాళ్ల తల్లిదండ్రులు కాస్త ఇబ్బంది పెట్టారు. చాలా తిట్టారు. నాకు ఏం చేయాలో తెలియక ఈ దారి ఎంచుకోవాల్సి వచ్చింది.

అందరినీ ఎదురించాం

అందరినీ ఎదురించాం

పెద్దలను ఎదురించి.. నా స్నేహాన్ని కూడా త్యాగం చేసి తనను పెళ్లి చేసుకున్నాను. కానీ ఆమె అందరికీ దూరం అయ్యింది. వాళ్ల అమ్మనాన్న అస్సలు మాట్లాడడం లేదు. ఆమె అన్న నా ఫ్రెండ్ రాజు కూడా మమ్మల్ని అసహ్యించుకుంటున్నాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్ లోనే ఉంటూ పీహెచ్ డీ చేస్తున్నాను. నా భార్య ఒక స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది.

ఎవరికో ఇచ్చి కట్టబెడుతుంటే

ఎవరికో ఇచ్చి కట్టబెడుతుంటే

మేము చేసింది తప్పు కాదని నేను అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకున్నాం. సంతోషంగా ఉన్నాం. కానీ ఆమెకు వాళ్ల సొంతంవాళ్లు దూరం కావడమే నాకున్న బాధ అంతా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎవరికో ఇచ్చి కట్టబెడుతుంటే నేను ఎలా తట్టుకుంటాను చెప్పండి.

సినిమా కాదు కదా

సినిమా కాదు కదా

ఇది ఏమన్నా సినిమానా మనం ప్రేమించిన అమ్మాయి పెళ్లికి అక్షింతలు వేసి రావడానికి. అందుకే ఆ పని చేశా. ఎన్ని కష్టాలొచ్చినా పర్వాలేదు ఆమెతో నేను వెళ్లడానికి రెడీ అయ్యాను. నేను చేసిందా తప్పా.. ఒప్పా బ్రదర్.

English summary

Array

i just decided to go with the flow and now i cant turn the clock back