For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైజాగ్ బీచ్ లో అంజలితో ఒక రాత్రి.. అదిరిపోయే స్టోరీ - My Story #91

ఆ రొమాంటిక్ రాత్రి సమయంలో రిషికొండ బీచ్ లో తనకు ఐ లవ్ యూ చెప్పాను. తర్వాత రెస్టారెంట్ కు వెళ్లాం. ఆ రోజు రాత్రి ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి నాతో ఉంటుంది. అప్పుడే ఐ లవ్ యూ చెప్పాను.

By Bharath
|

'వర్షాకాలంలో కలుసుకున్న మేము, శీతాకాలంలో ప్రేమించుకుని, వేసవికాలంతో విడిపోయాం' అని రీసెంట్ గా నితిన్ చెప్పిన డైలాగ్ నా లవ్ స్టోరీకి సరిగ్గా సరిపోతుంది. మీరిద్దరూ వెదర్ రిపోర్టర్సా భయ్యా అందులో నితిన్ ని ఎలా అవతలి వ్యక్తి అడుగుతాడో నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఏంట్రా.. ఇదేం లవ్ రా అంటుంటారు.

మగాడు అన్నాక లవ్ స్టోరీ ఉంటుంది

మగాడు అన్నాక లవ్ స్టోరీ ఉంటుంది

భయ్యా.. మనిషి అన్నాక.. అందులో ప్రత్యేకంగా మగాడు అన్నాక ప్రతి ఒక్కడికీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది కదా. అలాగే నాకూ ఒక లవ్ స్టోరీ ఉంది. నా ప్రేమకథ కాస్త డిఫరెంట్ భయ్యా.

ప్రేమకు కాలంతో సంబంధం లేదు

ప్రేమకు కాలంతో సంబంధం లేదు

‘ప్రేమకు కాలంతో సంబంధం లేదు. ప్రేమించుకునేవాళ్లకు వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం అంటూ తేడాలు అస్సలు ఉండవు. జీవితం తుదిశ్వాస వరకు ప్రేమికులిద్దరూ ఊహల్లో, తలపుల్లో, మాటల్లో తేలుతూ విహరిస్తుంటారు. ' ఇది నేను ఇంతకు ముందు నమ్మిన సిద్దాంతం.

ప్రేమ శాశ్వతం కాదు

ప్రేమ శాశ్వతం కాదు

కానీ నాకు మాత్రం ఏ కాలంలో ప్రేమలో పడింది.. ప్రేయసిని తొలిసారి కలిసిందీ.. ప్రేమలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది అన్ని గుర్తున్నాయి. ప్రేమ శాశ్వతం కాదు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కాలాలు మారేకొద్ది కొత్తకొత్త అమ్మాయిలు జీవితంలోకి వస్తూనే ఉంటారు.

కక్కుర్తి పడి ఒక్కరికే కమిట్ అయితే

కక్కుర్తి పడి ఒక్కరికే కమిట్ అయితే

మనం కక్కుర్తి పడి ఒక్కరికే కమిట్ అయిపోతే జీవితం సంకనాకి పోతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది వర్షాకాలం బయట వర్షం పడుతుంది. నేను క్లాస్ లో మ్యాథ్స్ టీచింగ్ చేస్తూ ఉన్నాను.. ఎక్స్ క్యూజ్ మి సర్... అనే మాట వినపడగానే వెనక్కి తిరిగి చూశా.

మైండ్ మ్యాథ్స్ ఫార్మూలాలను మరిచిపోయింది

మైండ్ మ్యాథ్స్ ఫార్మూలాలను మరిచిపోయింది

ఒక్కసారి తనని చూడగానే నా మైండ్ మ్యాథ్స్ ఫార్మూలాలను మొత్తం మరిచిపోయింది. మైమరిచిపోయే అందాన్ని చూసి కొద్దిసేపు మైకంలో నుంచి తేలుకోలేకపోయాను. మళ్లీ నేను మామూలు మనిషి అయ్యేందుకు రెండుమూడు నిమిషాల టైమ్ పట్టింది.

అమ్మాయా.. అప్సరసనా

అమ్మాయా.. అప్సరసనా

ద్యావుడా.. అమ్మాయా.. దివి నుంచి భువికి దిగి వచ్చిన అప్సరసనా అని అనుమానం వచ్చింది. మరీ ఇంత అందంగా ఎవరూ తట్టుకోలేరునుకున్నా. ఏంటీ లెక్కల మాస్టార్ గారూ కాలేజీకి చదువుకోవడానికి వచ్చిన అమ్మాయిపై మనస్సు పడడం తప్పు కాదా అని మీరు తప్పుగా అనుకుంటారేమో.

చీరకట్టులో కనువిందు చేసింది

చీరకట్టులో కనువిందు చేసింది

స్టూడెంట్స్ ను నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడను. కానీ ఆ వచ్చిన పిల్ల మాత్రం ఏదో సబ్జెక్ టీచర్ అని నాకు మొదట అనిపించింది. ఎందుకంటే ఆమె చీరకట్టులో నన్ను కనువిందు చేసింది కాబట్టి నేను కన్ఫర్మ్ అయ్యాను.

ఫస్టే మనం పళ్లు ఇక్కలించకూడదు

ఫస్టే మనం పళ్లు ఇక్కలించకూడదు

ఆమె పిలిచిన కొద్ది క్షణాలకు తేరుకుని జవాబు ఇచ్చాను. చాలా సీరియస్ గా ఫేస్ పెట్టి ఏం కావాలండి అని అడిగాను. సీరియస్ గా ఫేస్ ఎందుకు పెట్టానంటే ఫస్టే మనం పళ్లు ఇక్కలించి చూశాం అనుకో.. వీడు నాకు ఫ్లాట్ అయిపోయాడని మనల్ని తక్కువ అంచనా వేస్తారు.

గో టు స్ట్రయిట్

గో టు స్ట్రయిట్

ఏం లేదు సార్.. జూనియర్ బైపీసీ క్లాస్ ఎక్కడా అని అడిగింది. గో టు స్ట్రయిట్ అని చెప్పా.. థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయింది. క్లాస్ ఎప్పుడు అయిపోతుందా.. ఎప్పుడు వెళ్లి ఆమెను కలవాలా అన్నట్లు మనస్సులో ఉంది.

అప్పుడు వచ్చింది ఆ సుందరి

అప్పుడు వచ్చింది ఆ సుందరి

క్లాస్ అయిపోగానే స్టాఫ్ రూమ్ లోకి వెళ్లాను. ఎంతకు ఆమె రాలేదు. బయటకు వెళ్లి అటూ ఇటూ చూశాను. అప్పుడు వచ్చింది ఆ సుందరి. స్టాఫ్ రూమ్ లోకి వెళ్లితే అందరి కళ్లు ఆమెపైనే పడతాయని బయటే ఆమెను ఆపాను. ఆమె గురించి అడిగాను.

ఇంగ్లిష్ టీచరట

ఇంగ్లిష్ టీచరట

తను ఇంగ్లిష్ టీచరట. పేరు అంజలి. డెమో ఇవ్వడానికి వచ్చిందట. డెమో ఇచ్చాను వెళ్తున్నాను అని చెప్పింది. సార్ క్లాస్ బాగానే చెప్పాను. సెలెక్ట్ అవుతానో లేదో అని డౌట్ గా ఉందంది. మీరు కచ్చితంగా సెలెక్ట్ కావాలని మీకన్నా గట్టిగా కోరుకుంటున్నాను అన్నాను. ఎందుకు సార్ అంది. మీలాంటి టీచర్లు మా స్టూడెంట్స్ కు చాలా అవసరం అన్నాను.

ఇంగ్లిష్ లో చాలా వీక్ గా ఉన్నారు

ఇంగ్లిష్ లో చాలా వీక్ గా ఉన్నారు

మా స్టూడెంట్స్ ఇంగ్లిష్ లో చాలా వీక్ గా ఉన్నారు.. అందుకే మీరు సెలెక్ట్ కావాలి అని కోరుకుంటున్నాను అన్నాను. సరే.. నా నంబర్ తీసుకోండి.. మీకు అప్ డేట్స్ ఇస్తుంటాను అని చెప్పి నంబర్ ఇచ్చాను. తర్వాత ఆమె వెళ్లి పోయింది. ఆమె బాయ్ చెబుతుంటే చాలా భయం వేసింది. మళ్లీ కలుస్తుందో లేదోనని.

అబ్బాయిని సెలెక్ట్ చేశాం

అబ్బాయిని సెలెక్ట్ చేశాం

తర్వాత ప్రిన్సిపాల్ ను వెళ్లి కలిశాను. సార్.. ఈ రోజు ఇంగ్లిష్ డెమో ఇచ్చిన ఆమె సెలెక్ట్ అయ్యారా అని అడిగాను. స్టూడెంట్స్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.. అంత బాగా చెప్పలేదంటయ్యా.. నిన్న ఒక అబ్బాయి వచ్చాడు అతన్నే సెలెక్ట్ చేశాం అన్నాడు.

మంచి ఫ్రెండ్ ను కూడా దూరం చేసుకుంటావా

మంచి ఫ్రెండ్ ను కూడా దూరం చేసుకుంటావా

గుండె పగిలిపోయినట్లు అయ్యింది. సాయంత్రం అంజలి ఫోన్ చేసింది. ఏంటి సార్ మీ వాళ్ల నుంచి ఫోన్ రాలేదు. నేను సెలెక్ట్ అయ్యానా అంది. లేదు అంజలి అని చెప్పాను. ఒకే నో ప్రాబ్లం అంది. ఉంటాను సార్ అంది.. మా కాలేజీలో నీకు అవకాశం రాలేదని ఇంత మంచి ఫ్రెండ్ ను కూడా దూరం చేసుకుంటావా అన్నాను.

చలికాలం స్టార్ట్

చలికాలం స్టార్ట్

ఒకే సార్ మీతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటా అంది. ఇద్దరం రోజూ ఫోన్లు చేసుకునే వాళ్లం. మాట్లాడుకునేవాళ్లం. చాటింగ్ లు చేసేవాళ్లం. అలా వర్షాకాలం ముగిసింది. చలికాలం స్టార్ట్ అయ్యింది. ఒక రోజు ఇద్దరం బయట కలవాలని ప్లాన్ చేసుకున్నాం.

ఐ లవ్ యూ ఇలా చెబుతారా?

ఐ లవ్ యూ ఇలా చెబుతారా?

కేవలం ఆమెను పరిచయం చేసుకోవడానికే ఒక సీజన్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం అస్సలు లేట్ చెయ్యకూడదనుకున్నా. ఆమె ఆ రోజు వచ్చి రాగానే అంజలి ఐ లవ్ యూ అన్నాను. కాసేపు మౌనంగా ఉంది. మీరంటే నాకు కూడా ఇష్టమే కానీ మీరు ఐ లవ్ యూ ఇలా చెబుతారని నేను ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.

బంగారు పళ్లెంపై ముత్యాలతో రాసేవాణ్ని

బంగారు పళ్లెంపై ముత్యాలతో రాసేవాణ్ని

మరి ఎలా చెప్పాలో చెప్పు అంజలి అన్నాను. కనీసం నీకు ప్రేమలేఖ రాద్దామంటే పేదరికం అడ్డుస్తొంది. డబ్బు ఉండి ఉంటే బంగారు పళ్లెంపై ముత్యాలతో ప్రేమలేఖ రాసుకుని తీసుకొచ్చేవాణ్ని. లవ్ లెటర్ రాసేందుకు లక్ష రూపాయలు కూడా ఖర్చుపెట్టలేని పేదరికం నాది అన్నాను. అంజలి నవ్వింది.

దూరానా చంద్రుడు.. దగ్గరగా నువ్వు

దూరానా చంద్రుడు.. దగ్గరగా నువ్వు

ఒకేసార్.. నాకు అంతగా ఏమి అవసరం లేదు. సముద్రం ఒడ్డున.. వచ్చే ప్రతి అల మనల్ని తాకుతూ ఉంటే.. వెన్నెల రాత్రి సమయనా.. దూరానా చంద్రుడు.. దగ్గరగా నువ్వు ఉండి ఐలవ్ యూ చెబితే వినాలని ఉంది అంది. అంజలి ఇప్పటికిప్పుడు విజయవాడకు సముద్రం తీసుకురావాలంటే కష్టం అన్నాను.

బీచ్ లో ఒక టేబుల్ రెండు కుర్చీలు

బీచ్ లో ఒక టేబుల్ రెండు కుర్చీలు

సరే.. ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది ఇంట్లో వాళ్లకు రేపటి వరకు రాను అని చెప్పు అన్నాను. ఎందుకు అంది. తర్వాత ఫోన్ చేసి చెప్పింది. తర్వాత కారులో తనతో వైజాగ్ వెళ్లా. అక్కడికి వెళ్లే సరికి సాయంత్రం అయ్యింది. బీచ్ లో ఒక టేబుల్ రెండు కుర్చీలు సెట్ చేశాను. అలలు అలా వచ్చిపోతూ మమల్ని పలకరించాయి. జాబిలమ్మా మా వైపే చూస్తుంది.

పెళ్లి అయిన తర్వాత రోజూ స్వర్గమే కదా

పెళ్లి అయిన తర్వాత రోజూ స్వర్గమే కదా

ఆ రొమాంటిక్ రాత్రి సమయంలో రిషికొండ బీచ్ లో తనకు ఐ లవ్ యూ చెప్పాను. తర్వాత రెస్టారెంట్ కు వెళ్లాం. ఆ రోజు రాత్రి ఫస్ట్ టైమ్ ఒక అమ్మాయి నాతో ఉంటుంది. అప్పుడే ఐ లవ్ యూ చెప్పాను. ఏమోమో చెయ్యాలని మనస్సులో ఉంది. కానీ ఏమి చెయ్యలేకపోయా. నాతో పెళ్లి అయిన తర్వాత ప్రతి రోజూ రాత్రి అంజలితో స్వర్గం అంచుల దాకా వెళ్లి రావొచ్చు అనుకున్నా.

సార్ ఈ మేలో నా పెళ్లి

సార్ ఈ మేలో నా పెళ్లి

అంజలిని కనీసం టచ్ కూడా చెయ్యలేదు. తర్వాత విజయవాడకు వచ్చాం. చలికాలం మొత్తం చాటింగ్ లతో, పార్క్ లకు వెళ్లడాలతో , పానీ పూరీ తినడాలతో గడిపాం. మొత్తానికి వేసవి వచ్చింది. ఒక రోజు అంజలి నుంచి ఫోన్.. సార్ ఈ మేలో నా పెళ్లి. మీరు తప్పకుండా రావాలి అంది.

తప్పకుండా రండి సార్

తప్పకుండా రండి సార్

ఏంటి అంజలి జోక్ చేస్తున్నావా అన్నాను. లేదు సార్.. మా బావ మా అమ్మనాన్నలను బెదిరించాడు. నన్ను తనకు ఇవ్వకుంటే సూసైడ్ చేసుకుంటానని ఫోన్ చేసి సూసైడ్ అంటెప్ట్ కూడా చేశాడు.మా అమ్మకు తన అన్న కొడుకు అంటే చాలా ఇష్టం. అందుకే అతనితో నాకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేశారు. మేలో నా పెళ్లికి తప్పుకుండా రండి సార్ అంది.

వర్షాకాలం కోసం వెయిట్

వర్షాకాలం కోసం వెయిట్

మొన్న శివరాత్రితో శివశివా అంటూ చలి వెళ్లిపోయింది. నా ప్రియురాలు కూడా ఈ మేలో నా నుంచి పూర్తిగా దూరం కానుంది. "కక్కుర్తి పడి ఒక్కరికే కమిట్ కావొద్దు.. కాలాలు మారుతూనే ఉంటాయి.. కొత్త కొత్త అమ్మాయిలు మళ్లీ నీ జీవితంలోకి వస్తుంటారని నా మనస్సు చెబుతూ ఉంది." అందుకే మళ్లీ వర్షాకాలం కోసం వెయిట్ చేస్తున్నా.

English summary

my dreams of making her my life partner would be destroyed

It was the month of July and I was sitting in the staffroom checking the notebooks of students. I raised my head for some fresh air and saw a female colleague filling water in her red water bottle. For the next few days, I coincidentally had a free period whenever she returned from her class.
Story first published: Friday, February 16, 2018, 11:54 [IST]
Desktop Bottom Promotion