డిజిట‌లైజేష‌న్ పుణ్యమాని ఆధునిక సంబంధాలు ఇలా..

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

మీరు ఇష్ట‌ప‌డండి... ప‌డ‌క‌పోండి... డిజిట‌లైజేష‌న్‌ను మాత్రం విస్మ‌రించ‌లేం. మ‌న వ్య‌క్తిగ‌త జీవితంలోనూ దీని పాత్ర‌ను కాద‌న‌లేం. మ‌న ప్రియ‌మైన‌వారిపైనా డిజిట‌ల్ ప్ర‌భావం ఉంటుంది అన్న‌ది నిగూఢ స‌త్యం.

రాను రాను డిజిట‌ల్ ప్ర‌పంచంలోకి మారుతున్న వారి సంఖ్య పెరిగే కొద్దీ ఒక్కొక్క‌రు ఒక‌టికి మించి డిజిట‌ల్ ప‌రిక‌రాల‌తో క‌నిపిస్తున్నారు. మొబైల్స్, టాబ్లెట్స్‌, స్మార్ట్ వాచీలు, లాప్‌టాప్‌లు ఇలా ఎన్నో చేతుల్లో ఇమిడిపోతున్నాయి. ఒక్కో వ్య‌క్తికి కొంత క్లౌడ్ స్పేస్‌ను స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు అందిస్తున్నారు. వీటిలో కావ‌ల‌సినంత డేటా స్టోర్ చేసుకోవ‌చ్చు.

ఈ డేటా వ్య‌క్తిగ‌త‌మైన‌ది. డిజిట‌లైజేష‌న్ ప‌రంగా చాలా ముఖ్య‌మైన అంశాలు ఇందులో ఉండొచ్చు. సామాజిక మాధ్య‌మం బాగా విస్త‌రిస్తున్న ఈ త‌రుణంలో డేటా వినియోగం బాగా పెరిగింది.

ఈ కాలంలో సుదూర ప్రాంతాల్లో ఉన్న‌వారితోనూ ఇంటర్నెట్ పుణ్యమా అని సుల‌భంగా క‌లిపేసుకోవ‌చ్చు. సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల నిజ‌మైన బంధాలు కుంటుప‌డిపోతున్నాయి.

ఈ ప్ర‌భావం ఎంత వ‌ర‌కు ఉంటుందో ఇప్పుడు చూద్దాం...

1. ఎక్కువ మందిని సులువుగా చేర‌గ‌ల‌గ‌డం

1. ఎక్కువ మందిని సులువుగా చేర‌గ‌ల‌గ‌డం

చాలా మంది సాంకేతికంగా అవ‌గాహ‌న తెచ్చుకుంటున్నారు. దీంతో డిజిట‌ల్ ప్ర‌పంచంలో ఎవ‌రినైనా క‌నిపెట్ట‌డం సుల‌భ‌మైపోయింది. దీని వ‌ల్ల ఎక్కువ మందిని క‌లిసే అవ‌కాశం ల‌భిస్తుంది. అలాగే ఒకరి కంటే ఎక్కువ మందిపై ఆక‌ర్ష‌ణ ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఇది ఇలాగే కొన‌సాగితే వివాహాతేర సంబంధాలు పెరిగే ప్ర‌మాద‌మూ లేకపోలేదు. తిరిగి వివాహ బంధంపై ప్ర‌భావం చూపించ‌గ‌ల‌దు.

2. దూర ప్రాంతాల బంధాలు బ‌ల‌ప‌డేలా

2. దూర ప్రాంతాల బంధాలు బ‌ల‌ప‌డేలా

రెండు ద‌శాబ్దాల క్రితం వ‌ర‌కు ఒకరికొక‌రు దూరంగా ఉండ‌టం అంటే వ‌ర్ణించ‌లేనంత క‌ష్టంగా ఉండేది. త‌పాలా శాఖ నెమ్మ‌దిగా స‌మాచారం చేర‌వేసేది. ఈ కాలంలో మెసేజీల‌కు, కాల్స్‌కు, వీడియో కాల్స్ చేయి దూరంలో ఉండ‌టంలో దూరం పెద్ద ప్ర‌భావ‌మేమీ చూపించ‌డం లేదు. నిజానికి డిజిట‌లైజేష‌న్ ప‌రంగా ఇది బాగా ప‌నికొచ్చే అంశం.

3. ఇత‌రుల స‌మాచారం చూడాల‌నే త‌హ‌త‌హ‌

3. ఇత‌రుల స‌మాచారం చూడాల‌నే త‌హ‌త‌హ‌

ఒక వ్య‌క్తి గురించి వీలైనంత ఎక్కువ స‌మాచారం రాబ‌ట్టాలంటే వారి ఫోన్ చూస్తే స‌రిపోతుంది. అందుకే భాగ‌స్వామి ఫోన్‌ను చూసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు చాలా మంది. మీ భాగ‌స్వామికి మీ ఫోన్ చూసే అవ‌కాశం ఇవ్వ‌డం వ‌ల్ల మీరు పంచుకోకూడ‌దు అనుకున్న‌వంతా చూడ‌గ‌లుగుతారు. అలా అని ఫోన్ ఇవ్వ‌క‌పోతే మీ పైన అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇలా ఒక‌రి ఫోన్ చూడాల‌నుకొనే త‌హ‌త‌హ దీర్ఘ‌కాలంలో అంత మంచిది కాదు. అలాగ‌ని మీ ఫోన్‌ను మీ భాగ‌స్వామి చూడ‌కూడ‌దు అనుకోవ‌డ‌మూ బంధానికి తూట్లు పొడిచేలాగే ఉంటుంది.

4. డిజిట‌ల్ సాన్నిహిత్యం

4. డిజిట‌ల్ సాన్నిహిత్యం

డిజిట‌ల్ సాన్నిహిత్యాన్ని కొంత‌వ‌ర‌కు ప్రోత్స‌హించినా చాలా మంది డిజిటల్ ప‌రంగా స‌న్నిహితంగా ఉంటే నిజ జీవితంలోనూ బాగా ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌ని అపార్థం చేసుకునే అవ‌కాశం ఉంది. అందుకే దేని దారి దానిదే. సన్నిహితంగా ఉన్నామ‌ని డిజిట‌ల్ లోకానికి వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం అంత‌గా లేదేమో. ఆలోచించండి!

5. అంద‌రికీ తెలిసేలా ఆర్భాట‌మే

5. అంద‌రికీ తెలిసేలా ఆర్భాట‌మే

త‌మ డేటింగ్, హ‌నీమూన్‌కు సంబంధించిన చిత్రాల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసేవారి సంఖ్య పెరిగిపోతుంది. భాగ‌స్వామిపై ప్రేమ కురిపిస్తున్న‌ట్టు అంద‌రికీ తెలియ‌జేయేలా చేయాల‌నే కాంక్ష బ‌ల‌ప‌డుతోంది. కేవ‌లం పైకి మాత్ర‌మే ఇలా ఉంటున్నారు. వాస్త‌వానికి ఎంత బాగుంటున్నారో తెలీదు. మ‌ధురమైన జ్ఞాప‌కాల కంటే సెల్ఫీల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు జంట‌లు. డిజిట‌లైజేష‌న్ పుణ్యమా అని ఇలాంటి కృత్రిమ ప్రేమ‌ల హ‌వా న‌డుస్తోంది.

6. ఇత‌రుల‌తో పోల్చి చూస్తున్నారు

6. ఇత‌రుల‌తో పోల్చి చూస్తున్నారు

డిజిట‌లైజేష‌న్, సామాజిక మాధ్య‌మాల వేగవంత‌మైన వృద్ధి పుణ్య‌మా అని వ్య‌క్తిగ‌త జీవితాల‌న్నీ సులువుగా బ‌హిరంగమ‌వుతున్నాయి. ఇత‌రుల వ్య‌క్తిగ‌త స‌మాచారం తెలుసుకోవ‌డం పెద్ద క‌ష్టంగా లేక‌పోవ‌డం మూలాన భాగ‌స్వాములు త‌మ బంధాన్ని ఇత‌రుల‌తో పోల్చి చూసుకుంటున్నారు. ఇది అంత మంచి విధానం కాదు. దీన్ని సాధ్య‌మైనంత మేర‌కు వ‌దిలించుకోవాలి.

7. క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

7. క‌క్ష సాధింపు చ‌ర్య‌లు

సామాజిక మాధ్య‌మాల‌తో బాగా అల‌వాటు ప‌డిపోయిన ప్ర‌జ‌ల‌కు ఇత‌రుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లు తీసుకోవ‌డానికీ దీన్నే ఉప‌యోగిస్తున్నారు. ఇది ఒక‌రి వ్య‌క్తిగ‌త జీవితాన్ని తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ప్ర‌త్య‌క్షంగా భాగ‌స్వామ్య సంబంధాల్లో తీవ్ర మ‌న‌స్ప‌ర్థ‌ల‌కు దారితీస్తుంది. ఇలా సామాజిక మాధ్య‌మాల్లో ఇత‌రుల గురించి చెడుగా వక్రీక‌రించ‌డం చాలా పెద్ద పొర‌పాటు. బాధితులకు ఎన‌లేని విషాదాన్ని మిగులుస్తుంది.

8. ఎల్ల‌ప్పుడూ ట‌చ్‌లో...

8. ఎల్ల‌ప్పుడూ ట‌చ్‌లో...

త‌మ భాగ‌స్వామికి గంట‌కో సారి ఫోన్ చేసి ఇలా చేస్తున్నాము.. ఇక్క‌డున్నాం అని చెప్ప‌డం అల‌వాటు అయ్యింది. డేటా, కాల్‌ఛార్జీలు త‌క్కువ‌గా ఉండ‌టంతో ఇలా త‌ర‌చూ సంప్ర‌దించే అవ‌కాశం ల‌భిస్తుంది. దీని వ‌ల్ల త‌మ వ్య‌క్తిగ‌త ప‌నుల‌కు ఆటంకం కలుగుతుంద‌ని కొంద‌రు విసుగు చెందుతున్నా.. మ‌రి కొంత మంది ఇది బంధాల‌ను మ‌రింత ద‌గ్గ‌ర ప‌రుస్తుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా పిల్లల పోష‌ణ‌, ఇంట్లో పెద్ద‌వాళ్ల బాగోగులు చూసే స‌మ‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు వారి విష‌యాలు తెలుసుకోవ‌డానికి డిజిట‌లైజేష‌న్ ఉప‌యుక్తంగా ఉంద‌ని చెప్పారు.

English summary

The role of digital world in modern-day relationships.

With social media altering the foundation of how we relate to people, it is inevitable that all of this will affect the way in which modern-day relationships function. This article explores the role digitalization plays in such relationships.
Story first published: Tuesday, January 16, 2018, 16:30 [IST]