లవర్స్ కు ఇచ్చే గులాబీ, చాక్లెట్స్, కిస్, హగ్ అన్నింటికీ సెక్స్ తో సంబంధం ఉంది

Posted By:
Subscribe to Boldsky

ఫిబ్రవరి - 14 అంటే ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ పరిచయం లేని రోజుగా మారింది. అదే వాలెంటైన్స్ డే. ప్రపంచంలోని ప్రేమికులంతా ఫిబ్రవరి కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమికులను మనసును మత్తెక్కించే ఫిబ్రవరి వచ్చింది. ఇక ఈ నెల మొత్తాన్ని కూడా ప్రేమికులు ఎంజాయ్ చేయొచ్చు.

ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రతి రోజును లవర్స్ కు ఒక తీపి జ్ఞాపకంగా మార్చుకోవొచ్చు. అలాగే ఫిబ్రవరి 14 నుంచి కూడా కొన్ని ప్రత్యేక రోజులున్నాయి. మొదటగా ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉండే రోజుల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.

రోజ్ డే (గులాబీ దినోత్సవం) ఫిబ్రవరి 7

రోజ్ డే (గులాబీ దినోత్సవం) ఫిబ్రవరి 7

ఫిబ్రవరి 7న రోజ్ డే గులాబీ దినోత్సవం నిర్వహించుకుంటారు. ఇక ఈ రోజు నుంచే వాలెంటైన్ వీక్ స్టార్ట్ అవుతుంది. వాలెంటైన్ వీక్ లో మొదటి రోజు ఫిబ్రవరి 7న జరిగేది రోజ్ డే. ఈ రోజుతో వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. మీ లవర్ కు ఫిబ్రవరి 7న గులాబీ పువ్వు ఇవ్వండి. ఇక మీకు పెళ్లి అయి ఉంటే మీ భార్యకు గులాబీ పువ్వు ఇవ్వండి.

నైట్.. రోజ్ రొమాన్స్

నైట్.. రోజ్ రొమాన్స్

రోజ్ డే ను మీకు నచ్చినట్లుగా సెలబ్రేట్ చేసుకోవొచ్చు. ఆ రోజు నైట్ బెడ్ పై మొత్తం గులాబీ పూల రెమ్మలు పరిచి మీరు, మీ భార్య నైట్ అంతా దానిపై గడపండి. ఇలా కూడా మీరు రోజ్ డేను ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక రెడ్ రోజ్ ను అయితే మీ లవర్ కు ఇవ్వొచ్చు. ఎల్లో రోజ్ ను మీ ఫ్రెండ్స్ కు ఇవ్వొచ్చు.

ప్రపోజ్ డే - ఫిబ్రవరి 8

ప్రపోజ్ డే - ఫిబ్రవరి 8

ఫిబ్రవరి 8న న ప్రపోజ్ సెలబ్రేట్ చేసుకోండి. మీరు ప్రేమించే వ్యక్తులకు మీరు ప్రపోజ్ చేసే రోజు ఇది. ఈ రోజు మీరు ప్రేమించే వ్యక్తి ఎదుట మీ ప్రేమను వ్యక్తపరచండి. ఒక వేళ మీకు పెళ్లయితే మీ భార్యపై మీకు ఉన్న ప్రేమను మరోసారి గుర్తు చేయండి.

చాక్లెట్ డే - ఫిబ్రవరి 9

చాక్లెట్ డే - ఫిబ్రవరి 9

ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకోండి. ఆ రోజున మీరు అభిమానించే వ్యక్తికి లేదా మీరు ఆరాధించే వ్యక్తికి ప్రేమతో చాక్లెట్ ఇవ్వండి. వారి నోటిని తీపి చేయండి. అమ్మాయిలకు చాక్లెట్స్ అంటే భలే ఇష్టం.

చాక్లెట్స్ సెక్స్ కోరికలను పెంచుతాయి

చాక్లెట్స్ సెక్స్ కోరికలను పెంచుతాయి

అమ్మాయిలకు ఇష్టమైన చాక్లెట్స్ ఇచ్చి వారి మనస్సు దోచుకోండి. మీకు పెళ్లి అయి ఉంటే నైట్ పడుకునే ముందు మీ భార్య మనసారా చాక్లెట్ తినిపించండి. చాక్లెట్స్ సెక్స్ కోరికలను పెంచుతాయి. ఇక ఆ రోజు నైట్ మొత్తం మీరు అందులో బాగా ఎంజాయ్ చేయండి.

టెడ్డీ డే - ఫిబ్రవరి 10

టెడ్డీ డే - ఫిబ్రవరి 10

ఫిబ్రవరి 10న టెడ్డీ డే జరుపుకోండి. అమ్మాయిలకు టెడ్డీలంటే భలే ఇష్టం. ఈ రోజున టెడ్డీ టాయ్స్‌లాంటివి బహుమానంగా మీకు నచ్చిన అమ్మాయికి బహుమతిగా ఇవ్వండి.

ప్రామిస్ డే - ఫిబ్రవరి 11

ప్రామిస్ డే - ఫిబ్రవరి 11

ఫిబ్రవరి 11న ప్రామిస్ డే జరుపుకోండి. నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చేసుకుంటానని మీ ప్రేయసికి ప్రామిస్ చెయ్యండి. తుది శ్వాస వరకు నీతోనే ఉంటానని ఆమెకు భరోసా ఇవ్వండి.

హగ్ డే- ఫిబ్రవరి 12

హగ్ డే- ఫిబ్రవరి 12

ఫిబ్రవరి 12న హగ్ డే చేసుకోండి. అంటే గిలింతల రోజు. మీరు ప్రేమంచి మనసారా కౌగిలించుకోండి. గట్టిగా హత్తుకుని ఆమెపై మీ మదిలో ఉన్న ప్రేమను వ్యక్తం చేయండి. కౌగిలింతతో ఎదుటి వారికి మరింత దగ్గర కావొచ్చు. అందుకే మీ ప్రియురాలిని కౌగిలించుకుని తనపై మీకు ఉన్న ప్రేమను తెలపండి.

కిస్ డే - ఫిబ్రవరి 13

కిస్ డే - ఫిబ్రవరి 13

ఫిబ్రవరి 13న మీ ప్రేయసిని ముద్దుల్లో ముంచెత్తండి. ఆమెపై మీకు ఎంత ప్రేమ ఉందో కిస్ ద్వారా తెలియజేయండి. నుదిటిపై, చెయ్యిపై, పెదవిపై ఇలా ఆమె మనస్సు దోచడానికి ముద్దు పెట్టండి.

లిప్ టు లిప్ కిస్

లిప్ టు లిప్ కిస్

ఇంకా గాడమైన ప్రేమను వ్యక్తపరచాలంటే లిప్ టు లిప్ కిస్ పెట్టండి. ఇక పెళ్లి అయి ఉంటే మీకు నచ్చిన.. ఆమె మెచ్చిన ప్రతిపార్ట్ ని కిస్ చేయండి.

వాలెంటైన్స్ డే - ఫిబ్రవరి 14

వాలెంటైన్స్ డే - ఫిబ్రవరి 14

ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే . ప్రేమికుల రోజు. వారంపాటు మీ గర్ల్ ఫ్రెండ్ ను పలు విధాలుగా మీరు ఇంప్రెస్ చేసి ఉంటారు. ఇక ప్రేమికుల రోజున ఆమె జీవితాంతం మరిచిపోలేని విధంగా.. ఆమెపై ఉన్న ప్రేమను మొత్తం ఒలకబోస్తు ఐ లవ్ యూ చెప్పండి. తన మనస్సులో జీవితాంతం మీ స్థానం పదిలం చేసుకోండి.

ప్రపంచ మొత్తం రొమాన్స్ లో

ప్రపంచ మొత్తం రొమాన్స్ లో

ఇది ప్రేమికులందరికీ ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున ప్రపంచం మొత్తం ప్రేమికులంతా రొమాన్స్ లో మునిగితేలుతారు. కొందరు ఒకరి మనస్సులోని మాటను ఇంకొకరికి చెబుతూ ఉంటారు.

English summary

valentine weekday list 2018 ways to celebrate the special week

valentine weekday list 2018 ways to celebrate the special week