లవర్స్ కన్నా క్రషెస్ దేని వలన బెటర్?

Written By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మనందరికీ క్రషెస్ అంటే ఎవరో, ప్రేమికులకన్నా వీరే ఎప్పుడైనా బెటర్ అని కూడా తెలుసు. మీరు వారిని ఒక్కసారి చూస్తారు,ఊహల్లో తేలిపోతారు,వారి వెనక పడతారు, కేవలం చూడటం కోసం అన్ని మార్గాలు వెతుకుతుంటారు, వారు జీవితంలో కలిసి ఉండబోమని తెలిసి కూడా.

కానీ మంచిదే కదా? కనీసం వారి వల్ల బాధ కలగదు.

మీరు సింగిల్ అయినా, బంధంలో వున్నా, క్రష్ కి తన స్థానం తనకి ఉంటుంది, వారు మీకు ఏ సమయంలోనైనా తెలియని ఆనందం కలిగించగలరు.

మనకి క్రష్ ఎవరైనా ఉన్నప్పుడు ఈ కింది పాయింట్లన్నీ మనకి కూడా వర్తిస్తాయి.

బంధం గురించి భయం ఉండదుప్రేమికులకన్నా క్రష్ ఉండటం వల్ల పెద్ద ఉపయోగం ఇదే.

మీరు ప్రేమికులు కానంతవరకూ, బంధం గురించిన పట్టింపు మీకెందుకు ఉంటుంది. క్రష్ విషయంలో బంధం గురించి ఆలోచించకుండా ప్రేమ దశను హాయిగా గడపవచ్చు.

వెంట పడడం తీవ్రమవుతుంది

వెంట పడడం తీవ్రమవుతుంది

మీ క్రష్ వెనక పడి వారిని అన్నిచోట్లా అనుసరించడం ఆనందంగానే ఉంటుంది. అదే ప్రేమికుడి వెనకాల పడటం కొంతకాలం తర్వాత బోర్ కొడుతుంది. కానీ క్రష్ వెనకాల పడటం ఎప్పుడూ ఫన్ గా, ఆసక్తికరంగా ఉంటుంది. అలా సోషల్ మీడియాలో వెనక పడుతున్నప్పుడు, ఒక్కోసారి ఏ బంధువులకో,ఎవరికో అయినా తగులుకోవచ్చు చెప్పలేం.

తాజాగా ఉండే స్పార్క్

తాజాగా ఉండే స్పార్క్

ప్రేమికులతో కన్నా క్రషెస్ తో బంధంలో ఉండే స్పార్క్ ఎప్పుడూ తాజాగా ఉంటుంది. మీ క్రష్ తో ఉన్నప్పుడు ఎప్పుడూ మీకు బోర్ కొట్టదు. వారిని చూసినప్పుడల్లా మీలో అదే కంగారు,వారితో ఉన్నప్పుడంతా అదే ఆనందంతో కూడిన ఆత్రుత ఉంటుంది.

ఏ బంధాలు, ఆశించడాలు ఉండవు

ఏ బంధాలు, ఆశించడాలు ఉండవు

క్రష్ వలన మిమ్మల్ని మీరు బాధపెట్టుకునే స్థితి రాదు ఎందుకంటే ఈ ఒకరినుంచి ఒకరు ఆశించడం బిజినెస్ మీ బంధంలో ఉండదు. ఏ ఎటాచ్మెంట్’స్ లేనప్పుడు, ఏమీ ఆశించము కూడా,అలాగే ఏ బాధా కలగదు. వారితో ఏ అటాచ్ మెంట్, బాధపడతామేమో అన్న భయం లేకుండా ఆనందంగా ఉండవచ్చు.

ఫాంటసీ నైపుణ్యం బలంగా మారుతుంది

ఫాంటసీ నైపుణ్యం బలంగా మారుతుంది

వారి గురించి ఊహించుకోగలిగే ఏ అవకాశం వదలరు. క్యూట్ విషయాల నుండి నాటీ విషయాల వరకూ వారిని మీతో ఊహించుకుని ఆనందపడతారు. వారిని మీ కలల్లో మీకు నచ్చినట్టుగా ఆడించటం మీకు చాలా సంతోషాన్నిస్తుంది. అలా మీ ఊహాశక్తి బలంగా మారుతుంది. అదే లవర్ తో అయితే మీకు దక్కినదాన్నే ఒప్పుకోవాలి. కానీ క్రష్ విషయంలో మీరు ప్రయోగం చేసే, ఫాంటసీలలో క్రియేటివ్ గా ఉండే ఛాన్స్ దొరుకుతుంది.

డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు

డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు

లవర్ లేకపోతే ఖర్చులూ లేవు. క్రష్ వలన ఖరీదైన గిఫ్ట్ ల ఖర్చు, డేట్ ల ఖర్చు వంటివి తగ్గిపోతాయి. క్రష్ తో మీరెక్కువ ఖర్చుపెడుతున్నారనే బెంగ ఉండదు. మీరు ఎప్పుడూ ఒక దూరంలో ఉండి వారితో ఎంజాయ్ చేయవచ్చు.

ఫ్రెండ్ షిప్ పై దృష్టిపెడతారు

ఫ్రెండ్ షిప్ పై దృష్టిపెడతారు

లవర్స్ తో బంధం వలన చాలా మంది స్నేహాలను కోల్పోతారు.కానీ క్రషెస్ మీ స్నేహాలను బలపరుస్తారు. స్నేహితులే మీ క్రష్ వెనకపడటంలో, మాట్లాడటంలో,డేట్లను ఏర్పర్చుకోవటంలో,ఇంకా మీ క్రష్ తో మీరు సమయం గడిపే ఏ ఛాన్స్ ను వారు పట్టుకోకుండా వదలరు. అదే లవర్స్ విషయంలో, మీ స్నేహితులు వారితో డేట్ చేస్తున్నారు, వారికి తగిన సమయం ఇవ్వట్లేదని కోపం తెచ్చుకుంటారు.

లాంగ్ డిస్టెన్స్ క్రష్ కూడా పెద్ద బాధనిపించదు

లాంగ్ డిస్టెన్స్ క్రష్ కూడా పెద్ద బాధనిపించదు

ఒక బంధంలో ఉన్నప్పుడు దూరంగా ఉంటే చాలా బాధగా ఉంటుంది కానీ లాంగ్ డిస్టెన్స్ క్రష్ అస్సలు బాధనిపించదు. మీ ఇద్దరికీ మీరు కలిసి ఉండలేరని ఇదివరకే తెలుసు. అందుకని అది దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా పెద్ద సమస్యగా అన్పించదు. దూరంగా ఉన్నా కూడా కొద్దిసేపు మాట్లాడుకుంటారు. కొత్త ఫోటోని చూసి మురిసిపోతారు లేదా ఊహించుకుంటారు.

వారేం చేస్తున్నారో తెలుసుకోవటం సులభం

వారేం చేస్తున్నారో తెలుసుకోవటం సులభం

ప్రేమికులైతే మీ నుంచి విషయాలు దాచడానికి చాలా ఉండవచ్చు, వాటికి కారణాలు కూడా బానే ఉండవచ్చు, కానీ క్రష్ అయితే వారికి మీ నుంచి ఏం దాచినా లేకపోయినా ఒకటే. వారి గురించి తెలుసుకోవడం అన్నిటికన్నా చాలా సులభం. ప్రేమికుల లాగా కాకుండా వారి కొత్త ఫోటో పోస్ట్ ను, చెకిన్ ను, ఆ రోజు డ్రస్ వంటివి సులభంగా తెలుసుకోవచ్చు.

వారి భాగస్వామి విషయంలో కూడా మీరు పెద్ద పట్టించుకోరు

వారి భాగస్వామి విషయంలో కూడా మీరు పెద్ద పట్టించుకోరు

మీ క్రష్ కి భాగస్వామి కూడా ఉండవచ్చు. కానీ మీ లవర్ కి భాగస్వామి ఉన్నారని తెలిస్తే వచ్చేంత బాధ అస్సలు రాదు. పైగా మీరు వారి ఛాయిస్ ఎలా ఉందో చూడాలనుకుంటారు, ఆ జంటను చూసి ఆనందపడతారు కూడా.

ఎవరిపైనైనా మీకు ఎన్నిరోజులనుంచైనా క్రష్ ఉండవచ్చు,కానీ వారి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి, అలాగే వారంటే కొంచెం పక్షపాతం, లవర్స్ కన్నా మెరుగనే నిజం ఎప్పటికీ కాదనలేరు.

ఈ కారణాల వలనే ప్రేమికుల కన్నా క్రషెస్ ఏ రోజైనా బెటరే.

English summary

WHAT MAKES CRUSHES BETTER THAN LOVERS? LET'S FIND OUT

You do not miss out on any chance of fantasizing about them. From cute things to the kinkiest, you can fantasize all of them and feel good about yourself. Just imagining doing things to your crush can make you feel being on cloud nine. Rather, your fantasizing game gets strong. With the lover, you have to accept whatever is given to you.
Story first published: Thursday, May 17, 2018, 10:00 [IST]