For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చావులోనూ నీ చితి వెంటే నే వస్తానంటూ... ప్రియుడి సహగమనం...!

|

ప్రస్తుతం ఉన్న యువతలో చాలా మంది మగవారు తమ లవర్ మరణిస్తే... ఎప్పుడెప్పుడు ఇంకోదాన్ని తగులుకుందామా... లేదా ఉన్న లవర్ ని పక్కనబెట్టి ఇంకో బెటర్ పోరీని లైన్లో పెడదామా అని ఆలోచించేవారు ఎక్కడబడితే అక్కడ కనిపిస్తుంటారు...

మరికొందరు తమకు పెళ్లి అయిన కూడా మరో మహిళతో ప్రేమాయణం సాగిస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ ప్రేమికుడు తను ఎంతో నిజాయితీగా, గాఢంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఏకంగా తనువే చాలించాడు.

'చిరునవ్వుల వరమిస్తావా చితి నుండైనా బతికొస్తా' అని ఓ సినీ కవి చెబితే.. ఆ మాత్రం నీవు చస్తే.. నీవు కాలే కట్టెలో నేను దూకేస్తా.. నీతో పాటు నేను వచ్చేస్తా అంటూ మరణంలోనూ నీ తోడై.. నీ చితి వెంటే నే వస్తానంటూ ప్రియురాలి చితిపైనే దూకేసి.. ప్రియుడి సహగమనంగా మార్చేశాడు.

ఈ సంఘటన గురించిన తెలిసిన వారందరి గుండెలు బరువెక్కిపోయాయి. మరుజన్మకు కరుణిస్తావో లేదో తెలీదు కాబట్టి ఈ క్షణమే నీతో పాటు చస్తానంటూ ఆ యువకుడు తనువు చాలించిన తీరు ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. ఇలాంటివి చూస్తుంటే ప్రేమ గుడ్డిదే కాదు.. పిచ్చిది.. అని అవసరమైన ప్రాణాలను కూడా త్యాగం చేస్తుందని తెలుస్తోంది. ఇలాంటి విషాదకరమైన సంఘటన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నా ప్రేయసి ఆ కార్యాన్ని అవాయిడ్ చేస్తోంది? ఏం చేయమంటారు...!

ఓ ప్రైవేట్ కళాశాలలో..

ఓ ప్రైవేట్ కళాశాలలో..

తమిళనాడు రాష్ట్రం నన్నవరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల నిత్య అనే యువతి తిరుచ్చిలోని ఓ ప్రయివేట్ కాలేజీలో నర్సింగ్ ఫస్టియర్ చదువుతోంది. వారం రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

కరోనా తెచ్చిన సంక్షోభం..

కరోనా తెచ్చిన సంక్షోభం..

కరోనా వైరస్ వంటి ఓ సంక్షోభం ఆమె మరణానికి కారణమైంది. ఈ లాక్ డౌన్ సమయంలో తన ఇద్దరు చెల్లెళ్లతో ఆన్ లైన్ క్లాసుల విషయం గురించి ఒకే ఒక్క సెల్ ఫోన్ ను షేర్ చేసుకునే విషయంలో గొడవ పడింది. దీంతో వారి తండ్రి మరణించాడు. దీంతో మనస్తాపం చెందిన నిత్య ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

రాము మిస్సింగ్ కేసు..

రాము మిస్సింగ్ కేసు..

దీంతో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ విషాదకర సంఘటన జరగ్గానే.. మెట్టాటూర్ గ్రామానికి చెందిన మురుగన్ అనే వ్యక్తి తన 20 ఏళ్ల రాము కనబడటం లేదని ఫిర్యాదు అందింది. దీంతో ఉలుండూరు పోలీసులు విచారణ మొదలెట్టారు.

వివాహమైన నాటి నుండి మీ భాగస్వామి మీ విరహ వేదనను పట్టించుకోలేదా? అయితే ఇలా ట్రై చెయ్యండి...

స్నేహితులను ఆరా తీస్తే..

స్నేహితులను ఆరా తీస్తే..

నిత్య చనిపోయిన రోజునే శ్మశాన వాటిక వద్ద రాము తిరుగుతూ కనిపించాడని వారు చెప్పడంతో.. ఆ క్లూ ఆధారంగా అక్కడి నుండే దర్యాప్తు మొదలెట్టారు పోలీసులు. ఆ చితిపై పురుషులు ధరించే ఓ చేతి గడియారంతో పాటు ఓ మొబైల్ ఫోన్ కూడా దొరికింది.

నైరాశ్యంలో ఉన్న రాము..

నైరాశ్యంలో ఉన్న రాము..

రాము వస్తువులను ల్యాబ్ కు పంపగా.. అవి చూసిన తండ్రి మురుగన్ కూడా ఆ వాచ్, మొబైల్ తన కుమారుడిదేనని అంగీకరించాడు. నిత్యతో రాము ప్రేమను నిరాకరించడంతో అప్పటికే నైరాశ్యంలో ఉన్న రామును ఆమె మరణవార్త తీవ్ర నిరాశపరిచింది.

చితిపై దూకేశాడు..

చితిపై దూకేశాడు..

ఎలాగోలా ఆమె చితి వద్దకు చేరుకున్న రాము నిత్య అంత్యక్రియలు చేస్తున్నంతసేపూ అక్కడే ఉండి.. అక్కడినుండి అందరూ వెళ్లిపోయాక ఆమెతో పాటే కాలుతున్న చితిపై దూకేశాడు.

అకస్మాత్తుగా అరుపులు..

అకస్మాత్తుగా అరుపులు..

అదే సమయంలో అక్కడ రాత్రి సమయంలో.. సమీపంలో డిన్నర్ చేస్తున్న తమకు ఏవో అరుపులు వినిపించినట్లు.. కాలుతున్న శవం నుండి ఉన్నపళంగా అరుపులు వినిపించడంతో తాము భయపడి కాటి కాపరులు పోలీసులకు చెప్పారు. దీంతో ఆ రాము ఆ చితిపైనే దూకి తాను ఆత్మాహుతికి పాల్పడి ఉంటాడన్నది పోలీసుల అనుమానం.

వైరాగ్యపు ప్రేమకథ..

వైరాగ్యపు ప్రేమకథ..

యుక్త వయసులోనే ప్రేమ పేరుతో ఆకర్షణ, ఏదో తెలియని వ్యామోహాలే కాదు.. ఇలాంటి త్యాగంతో కూడిన వైరాగ్యపు ప్రేమకథలు ఉంటాయన్నది రాము కథ చెబుతున్న మరో పాఠం. ప్రేమలో ఇంత గాఢత ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రియుడి సహగమనాన్ని చెప్పొచ్చు.

English summary

A Heart Touching love story in these corona pandemic situation at tamilnadu

Here we talking about a heart touching love story in these corona pandemic situation at tamilnadu. Read on