For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ప్రేమను తిరిగి పొందాలనుకుంటే.. ఈ ట్రిక్స్ పాలో అవ్వండి...

|

ప్రేమ అనే రెండక్షరాల్లో ఏదో తెలియని మత్తు ఉంది. అది ఎప్పుడు.. ఎవరిలో ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. అయితే ఈరోజుల్లో చాలా మంది చాలా వేగంగా ప్రేమలో పడుతున్నారు.

అయితే అంతే వేగంగా విడిపోతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ తమ మనసుకు నచ్చిన వ్యక్తితో బ్రేకప్ అంటే ఎవ్వరికైనా చాలా బాధగా ఉంటుంది. అయితే విడిపోయిన తర్వాత వల్ల మీరు జీవితంలో మరింత బలంగా మారేందుకు అవకాశం వస్తుంది.

ఎందుకంటే విడిపోవడం అనేది మీకు ఎన్నో కొత్త విషయాలను నేర్పిస్తుంది. అయితే మీకు అలాంటి బంధాన్ని మళ్లీ తిరిగి కంటిన్యూ చేసే ఛాన్స్ వస్తే ఎంత బావుంటుందో కదా.. మీరు కూడా ఇలాంటి రిలేషన్ ను ఒకవేళ మళ్లీ తిరిగి కొనసాగించాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని వదిలి వెళ్లిన మీ పార్ట్నర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఆ విశేషాలేంటో చూసెయ్యండి మరి..

'ఆ' విషయంలోనే కుర్రాళ్లను ఆంటీలు ఎందుకని ఎక్కువగా ఇష్టపడతారో తెలుసా...

టెక్నాలజీని వాడుకోండి..

టెక్నాలజీని వాడుకోండి..

ఈరోజుల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ చాలా కామన్ గా కనిపిస్తుంది. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి..రాత్రి నిద్రపోయేంత వరకు స్మార్ట్ ఫోన్లేనే గడిపేస్తున్నారు. టెక్నాలజీకి ప్రేమకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం కాస్త ఆగండి.. మీ స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియాలో కొన్ని అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా గడుపుతున్నట్లు సెల్ఫీలు తీసుకొని పేస్ట్ చేయండి. ఇది చూసిన మీ పార్ట్నర్ కు ఆ మధురమైన క్షణాలను మీతో మళ్లీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల వారు మీతో రిలేషన్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

ఇష్టమైన వాటిని..

ఇష్టమైన వాటిని..

మీరిద్దరూ విడిపోయిన తర్వాత, మీ భాగస్వామితో మళ్లీ రిలేషన్ కావాలనుకుంటే.. వారికి ఇష్టమైన పెంపుడు జంతువు లేదా ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టు వారికి తెలిసేలా చేయండి. దీని కోసం కూడా సోషల్ మీడియాను బాగా వాడుకోండి. ఇది చూసిన వారు మిమ్మల్ని.. మీ రుచికరమైన చేతి వంటను కోల్పోతున్నామని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వారు మీతో మళ్లీ రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు. అలా వారు తిరిగొచ్చినప్పుడు మీ బంధం బలంగా మారొచ్చు..

మిమ్మల్ని మిస్సవ్వుతున్నామని..

మిమ్మల్ని మిస్సవ్వుతున్నామని..

మీరు మీ భాగస్వామితో బంధానికి బ్రేకులు వేసిన తర్వాత, మీ కుటుంబ సభ్యులతో మరియు మీ స్నేహితులతో ఎక్కువ సమయం ఆనందంగా గడపండి. వీలైతే మంచి విహారయాత్రలకు వెళ్లండి. అలా వారితో హ్యాపీగా గడిపిన క్షణాలను కెమెరాలో బంధించండి. అలా చేయడం వల్ల మీ భాగస్వామికి మీతో కలవాలని.. అందరినీ మిస్సవ్వుతున్నామనే ఫీలింగ్ రావొచ్చు. ఎందుకంటే అప్పుడు మీ గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తారు.

ఆ కార్యాన్ని అసౌకర్యంగా ఫీలవుతున్నారా? అందుకు కారణాలేంటో తెలుసా...

అందంగా ముస్తాబై..

అందంగా ముస్తాబై..

మీ భాగస్వామి మీతో విడిపోయినందుకు, మీరు ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. వారిని మళ్లీ మీ వైపు తిప్పుకోవాలంటే.. మీరు మరింత అందంగా తయారు కండి. మీ అందాన్ని చూసి వారు అసూయపడేలా తయారవ్వండి. అందంతో పాటు మీ బాడీ ఫిగర్ ను పర్ఫెక్ట్ గా ఉంచుకునేందుకు జిమ్ కు వెళ్లండి. రోజురోజుకు మీ అందాన్ని మెరుగుపరచుకుని వారి కళ్ల ముందే తిరగండి. ఇంత అందాన్ని తాను ఎందుకు మిస్సయ్యానా అనిపించేలా చేయండి. అంతే వారు మీతో మళ్లీ కలిసేందుకు తెగ ప్రయత్నిస్తారు. ఇక నుంచి మిమ్మల్ని వదిలి అస్సలు ఉండనని చెప్పేస్తారు.

మళ్లీ ప్రేమ కావాలంటే..

మళ్లీ ప్రేమ కావాలంటే..

మీ లవర్ బ్రేకప్ చెప్పాడని చింతిస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే కొన్ని బంధాల్లో ఎంత దూరమైతే అంత త్వరగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. సైన్స్ లో సూత్రం మాదిరిగానే దగ్గరుండే వారికి ఆకర్షణ తక్కువగా.. దూరంగా వారికి ఎక్కువ ఆకర్షణ అనేది ఉంటుంది. కాబట్టి మీరు వారి గురించి పెద్దగా పట్టించుకోనట్టు ఉండండి. అప్పుడే వారికి మీ వాల్యూ ఏంటో తెలుస్తుంది. అయితే మీ ఇద్దరికీ ఉండే కామన్ ఫ్రెండ్ తో మాత్రం కాంటాక్టులో ఉన్నండి. మీరు మాత్రం వారికి కనబడకుండా జాగ్రత్త పడండి. ఇలా చేస్తే మీరు వద్దనుకుని వెళ్లిపోయిన వారే తిరిగి మిమ్మల్ని కావాలనుకుంటారు. మళ్లీ మీతో లవ్ జర్నీ స్టార్ట్ చేస్తారు.

English summary

Did You Reunite With Your Love After Years of Separation in Telugu

Here we are talking about the did you reunite with your love after years of separation in Telugu. Have a look
Story first published:Thursday, February 24, 2022, 18:46 [IST]
Desktop Bottom Promotion