Just In
- 1 hr ago
Chaitra Navaratri 2021: ఛైత్ర నవరాత్రుల పూజా పద్ధతులేంటో తెలుసుకుందామా...
- 2 hrs ago
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
- 5 hrs ago
బుధవారం దినఫలాలు : ఓ రాశి వారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు...!
- 1 day ago
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
Don't Miss
- Sports
KKR vs MI: ఆ సమయంలో ఒత్తిడి నెలకొంది.. రోహిత్ ఇచ్చిన విశ్వాసంతోనే రాణించా: చహర్
- News
రేపటితో తిరుపతిలో గప్‌చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?
- Finance
హోమ్‌లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు కొటక్ మహీంద్రా గుడ్‌న్యూస్: అందుకే.. అలాగే
- Movies
తండ్రితో పడుకున్నావ్ అంటోంది.. తప్పని తెలిసినా సరే.. చిన్మయి ఎమోషనల్
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘నేను, తను ప్రేమించుకున్నాం.. కలిసే ఉంటున్నాం.. కానీ మా పెళ్లికి...’!
ఓ అబ్బాయి తన బంధువులలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. వారి ప్రేమలో నిజాయితీ కారణంగా.. వారిద్దరూ నాలుగేళ్లుగా కలిసే జీవిస్తున్నారు.
తొందరలో పెళ్లి కూడా చేసుకుందామని డిసైడ్ అయ్యారు. కానీ వారిద్దరి పెళ్లికి పెద్ద చిక్కే వచ్చి పడింది. అదేంటంటే..
వారిద్దరి మధ్య అన్నాచెల్లెల సంబంధం అవుతుందని.. దీంతో మీ పెళ్లి చేయలమేని పెద్దలు, బంధువులు, పేరేంట్స్ నిర్మోహమాటంగా చెప్పేశారు. ఈ సందర్భంగా ఆ కుర్రాడి సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
'త్వరలో నా పెళ్లి... కానీ నా ఎక్స్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ...'

మా రిలేటివ్ తో..
హాయ్.. ‘నా పేరు ఉమేష్(పేరు మార్చాం). నా వయసు 28 సంవత్సరాలు. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాను. అయితే నాకు జాబ్ రాకముందు నుండే మా రిలేటివ్స్ లోని ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. తనతో కలిసి నాలుగు సంవత్సరాలుగా జీవిస్తున్నాను. దీంతో మేమిద్దరం పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలని డిసైడ్ అయ్యాం.

రక్త సంబంధం లేకున్నా..
అయితే సరిగ్గా అప్పుడే మా పేరేంట్స్ పెళ్లికి నో చెప్పారు. కారణం అడిగితే.. మీ తాత.. వాళ్ల తాత స్నేహితులు. వారిద్దరూ బ్రదర్స్ గా ఫీలయ్యేవారు. దీంతో వారు మమ్మల్ని కజిన్స్ గా భావిస్తున్నారు. తను వరుసకు నాకు చెల్లి అవుతుందని చెబుతున్నారు.అయితే వాళ్ల తాతకు.. మా తాతకు ఎలాంటి రక్త సంబంధం లేదు.

పెళ్లికి ఒప్పుకోవట్లేదు..
వారి స్నేహాన్ని బంధుత్వంగా మలచుకుందామని చెబుతున్నా.. మా పేరేంట్స్, రిలేటివ్స్ అస్సలు ఒప్పుకోవడం లేదు. మీరు అన్నా చెల్లెలి వరుస అవుతుందని.. పెళ్లి చేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మా ఇంట్లో పెద్దలను ఎలా ఒప్పించాలి' అని ఓ యువకుడు తన సమస్యను నిపుణులతో చెప్పుకున్నాడు. దీనికి వారు ఎలాంటి సమాధానం చెప్పారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
‘నన్ను అందరూ వదిలేస్తున్నారు... నాలో ఏదైనా లోపమా...'

బంధువులుగా భావిస్తున్నారు..
మీరు ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే మీరు ప్రేమిస్తున్న అమ్మాయిని మీ పేరేంట్స్ కజిన్ గా భావిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకున్నా మీ పెద్దలు ఒకరినొకరు రిలేటివ్స్ గానే భావిస్తున్నారు.

స్పష్టంగా చెప్పండి..
ఇలాంటి సమయంలో మీరు మీ పేరేంట్స్ స్పష్టంగా ఈ విషయం చెప్పండి. మీ తాతలు కేవలం స్నేహితులు మాత్రమేనని.. బంధువులు కాదని చెప్పండి. ఈ విషయంపై రెండు ఫ్యామిలీలు మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోమని చెప్పండి.

నాలుగేళ్లుగా కలిసున్నట్లు..
మేమిద్దరం ప్రేమించుకోవడమే కాదు.. నాలుగేళ్లుగా కలిసి జీవిస్తున్నామని చెప్పండి. మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టంగా చెప్పండి. ఇది కొంచెం ఇబ్బందికరమే అయినప్పటికీ, తప్పదు. అయితే ఇలాంటి అరుదైన అవకాశం మీకు మాత్రమే లభిస్తుంది.

ధైర్యంగా మాట్లాడండి..
అయితే మీరిద్దరూ ముందు మానసికంగా బలంగా ఉండాలి. మీరు తనని పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబపరంగా ఏ సమస్యలొస్తాయని అడగండి. ఎందుకంటే ఒకవేళ మీకు పెళ్లి చేస్తే.. అన్నాచెల్లెళ్లకు వివాహం చేశారని సమాజం భావిస్తుందనే భయం వారిని వెంటాడుతుందేమో.

భవిష్యత్తుపై ప్రభావం..
ఇది మీరిద్దరూ మాత్రమే కోరుకుంటున్న జీవితం. పైగా మీరు ఇప్పటికే నాలుగేళ్ల నుండి కలిసి జీవిస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరికీ చాలా విషయాల్లో అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ పేరేంట్స్ ను ఎలా ఒప్పించాలనే విషయం గురించి మాట్లాడండి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా దానికి రెస్పాన్స్ మీదే అవుతుంది. అయినా కూడా మీ ప్రాబ్లమ్ కు సొల్యూషన్ దొరకకపోతే మంచి మానసిక నిపుణులను సంప్రదించి.. మీ సమస్యను సవివరంగా చెప్పండి.