For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రానా, మిహీకాలకు జరిగింది నిశ్చితార్థం కాదంట.. కేవలం రోకా జరిగిందట... మరి రోకా అంటే ఏమిటి..?

|

భళ్లాలదేవుడు అలియాస్ దగ్గుబాటి రానా కొన్ని గంటల క్రితం 'ఇట్స్ అఫిషియల్' అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫొటోలు తెగ వైరల్ అయిపోయాయి. అయితే చాలా మంది అవి రానా, మిహీకా నిశ్చితార్థం ఫొటోలు అందరూ తెగ షేర్ చేశారు. కొన్ని న్యూస్ ఛానెళ్లు వీరి ఎంగేజ్ మెంట్ కూడా అధికారికంగా అయిపోయిందని ప్రసారం చేశాయి. అందుకు సాక్ష్యంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను చూపాయి.

అయితే రానా-మిహీకా సోషల్ మీడియాలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించినంతా మాత్రాన వారిద్దరికీ నిశ్చితార్థం జరగలేదంట. కేవలం రోకా ఫంక్షన్ మాత్రమే జరిగిందట. అయితే ఇది నిశ్చితార్థం కాదని, రానా తండ్రి రోకా గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

లాక్ డౌన్ వేళ.. టాలీవుడ్ లో పెళ్లి కళ వచ్చేసిందే బాలా...!

మాటమంతీ మాత్రమే..

అందరూ అనుకున్నట్లు రానా-మిహీకా మధ్య జరిగింది నిశ్చితార్థం కాదంట. కేవలం ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకునే మాటామంతీ కార్యక్రమం అని చెప్పారట. అయితే రోకా ఫంక్షన్ అని రానా దగ్గుబాటి తన సన్నిహితులకు చెప్పాడట. అయితే అప్పటికే చాలా మంది ఇదే ఎంగేజ్ మెంట్ అని రాసుకొచ్చేశారు.

రానా క్లారిటీ..

రానా క్లారిటీ..

అయితే ఇదే ప్రచారం సోషల్ మీడియాలో జరిగిపోవడంతో.. ఈ విషయం తెలుసుకున్న రానా తనకు ఇంకా నిశ్చితార్థం కాలేదని, కేవలం రోకా ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నట్లు రానా తెలిపాడు. ఈ విషయాన్నే న్యాచురల్ స్టార్ నానితో కూడా వాట్సాప్ చాట్ లో చెప్పాడట. ఈ స్క్రీన్ షాట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

నాని రిప్లై ఇలా..

నాని రిప్లై ఇలా..

నాని రానాతో చేసిన వాట్సాప్ లో రానకు నిశ్చితార్థం అయ్యిందా అని అడగ్గా.. లేదు రోకా ఫంక్షన్ అని రానా చెప్పాడట. దీనికి నాని వెంటనే రోకా ఫంక్షన్ అంటే తనకు తెలియదని, నేను గూగుల్ సెర్చ్ చేస్తా అని ఫన్నీ రిప్లై ఇచ్చాడట.

షాకింగ్ సర్వే! లాక్ డౌన్ వేళ వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగాయట... అది కూడా 10 లక్షలకు పైనే...!

రోకా వేడుక అంటే..

రోకా వేడుక అంటే..

ఇంతకీ రోకా వేడుక అంటే ఏంటంటే.. ఇరు కుటుంబాలు కలిసి కూర్చుని, ఎంగేజ్ మెంట్, పెళ్లి, రిసెప్షన్ కు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తారట. ప్రస్తుతం రానా, మిహీక కుటుంబాలు చేసింది కూడా ఇదేనట. కాకపోతే బయట అంతా ఇదే నిశ్చితార్థం అని ప్రచారం జరిగింది. ఇలాంటి మన దక్షిణాదిన ఉండదు కానీ ఉత్తరాదిన దీన్ని ఎక్కువగా పాటిస్తారట.

వధూ వరులకు ఆశీర్వాదం..

వధూ వరులకు ఆశీర్వాదం..

ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం రోకా వేడుకలో పెళ్లిని అధికారికంగా నిర్ణయించుకోవడానికి జరుపుకునే వేడుక. ‘మా అబ్బాయికి వారి అమ్మాయితో పెళ్లి కుదిరింది‘ అని వధూవరుల కుటుంబాలు ప్రకటించడమే ఈ రోకా వేడుక యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇలా ఇరు కుటుంబాలు కలిసి తొలిసారి కలుసుకుని పెళ్లి కుదుర్చుకుని స్వీట్లు, గిఫ్టులు అందజేసుకుంటారు. అలాగే సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తారు.

వరుడి ఇంటి వద్దే..

వరుడి ఇంటి వద్దే..

ఈ రోకా వేడుకను పెళ్లి కుమారుడు ఇంటి వద్దే నిర్వహిస్తారు. అందుకే, ముంబై నుండి మిహీకా కుటుంబం ఈ వేడుక సందర్భంగా హైదరాబాద్ వచ్చింది. మిహీకాది ఉత్తర భారత కుటుంబం కాబట్టి ఆ సంప్రదాయం ప్రకారం రోకా వేడుకను నిర్వహించారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, సింగర్ నిక్ జోన్స్ పెళ్లికి ముందు కూడా ఈ రోకా వేడుక గురించి చర్చ బాగా జరిగింది. ఆ తర్వాత ఈ వేడుకను తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేశారు.

ఈ ఏడాదే పెళ్లి..!

View this post on Instagram

My happy place! 🥰🥰 @ranadaggubati

A post shared by miheeka (@miheeka) on

రానా-మిహీకా పెళ్లి వేడుకపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. డిసెంబరులో గానీ అంతకుముందు గానీ పెళ్లి జరుగుతుందని, మొత్తానికి ఈ ఏడాదిలోనే పెళ్లి జరుగుతుందని, త్వరలోనే నిశ్చితార్థం తేదీలను ప్రకటిస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని ఆయన వెల్లడించారు.

English summary

Its Not Engagement Just Done Roka Function, Says Rana Daggubati

Rana Daggubati getting married with Miheeka Bajaj. Rana Revealed Miheeka Bajaj as his girl friend goes viral. On May 20th, Both sides of the families organised Roka Event to discuss Engagement, Marriage dates.
Story first published: Friday, May 22, 2020, 10:10 [IST]