Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
సర్వే! ఒక అమ్మాయి కోసం ఎంతమంది అబ్బాయిలు పోటీ పడుతున్నారో తెలుసా...!
కరోనా మహమ్మారి సమయంలో మహిళలు కొందరిని మోసం చేశారట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
'డేటింగ్ అంటే ఛీటింగ్' అని మన దేశంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి ఈ పదం కూడా కొత్తగా అనిపించొచ్చు. కానీ ఇది విదేశాల్లో ఉండేవారికి బాగా తెలుసు.

ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా మన దేశంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లో కూడా ఈ డేటింగ్ కల్చర్ వచ్చేసింది. మరో విశేషమేమిటంటే గూగుల్ ప్లేస్టోర్ లో కూడా చాలా డేటింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.

చాలా యాప్స్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ కలిగి ఉండటంతో చాలా మంది వీటిని డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు. ఇలా ఎవరెవరు వీటిని వినియోగిస్తున్నారు.. వీరిలో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారా? అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారా? అనే విషయాలపై ఓ డేటింగ్ యాప్ సంస్థ సర్వే నిర్వహించింది.

మన దేశంలో డేటింగ్ యాప్స్ ను వినియోగిస్తున్న వారిలో మహిళలు దాదాపు 26 శాతం మంది ఉన్నారంట. అయితే అందులో చాలా మంది ఫేక్ వివరాలనే పొందుపరిచారంట. అంతేకాదు కొందరని మోసం చేసినట్లు కూడా వెల్లడించారట. ఈ సర్వేలో ఇలాంటి సంచలన విషయాలు ఇంకా ఎన్నో వెల్లడయ్యాయట. ఆ వివరాలేంటో తెలియాలంటే మీరు ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూడాల్సిందే...

ఒకరికి ముగ్గురు..
మన భారతదేశంలో మగవారి కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజా సర్వేలో ఏమి తేలిందంటే.. డేటింగ్ యాప్ లలో ఒక్క అమ్మాయి వెంట ముగ్గురు అబ్బాయిలు పడుతున్నారట.

ఆన్ లైన్ డేటింగ్..
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది ఆన్ లైన్ డేటింగ్ యాప్ లను విపరీతంగా వినియోగిస్తున్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆన్ లైనులో కూడా అబ్బాయిలకు ఎంతలా కరువు పరిస్థితులు ఉన్నాయో తాజా సర్వే ద్వారా తెలిసింది.

26 శాతం మంది మహిళలు..
మన భారతదేశంలో డేటింగ్ యాప్ లను వినియోగిస్తున్న వారిలో దాదాపు 26 శాతం మంది మహిళలు ఉన్నట్టు ‘వ్యూస్' అనే దేశీయ డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఇది అగ్రరాజ్యం అమెరికాలోని మహిళలకన్నా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ అంతా టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్స్ ను 40 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నారు.

టైమ్ పాస్ కోసమే..
మన దేశం మినహా ఇతర దేశాల్లో చాలా మంది డేటింగ్ యాపులను కేవలం టైమ్ పాస్ కోసమే వినియోగిస్తారంట. అయితే కేవలం మన ఇండియాలో మాత్రం సీరియస్ గా డేటింగ్ చేయాలనే భావనతో వీటిని వినియోగిస్తున్నారని తేలింది.

కొత్తవారితో పరిచయం కోసం..
మన దేశంలో దాదాపు 32 శాతం మంది మహిళలు రిలేషన్ షిప్ సీరియస్ నెస్ కోసం ట్రై చేస్తున్నారంట. 28 శాతం మాత్రం కొత్తవారితో పరిచయం కోసం వాడుతున్నారని తేలింది.

ఫాలోయింగ్ కోసం..
మరి కొందరు మహిళలు సోషల్ మీడియాలో తమ ఫాలోయర్స్ పెరగాలని.. తమకు ఫాలోయింగ్ కోసం ఇలాంటి యాప్స్ ను వినియోగిస్తున్నట్లు తెలిపారట. మరో విశేషం ఏమిటంటే.. చాలా మంది మహిళలు 18 నుండి 21 వయసు గల అబ్బాయిలు మాత్రం అమ్మాయిలతో స్నేహం కోసం ఈ యాప్స్ ను వాడుతున్నట్లు చెప్పారట.

అంతా ఫేక్ డిటైల్స్..
అయితే డేటింగ్ యాప్ లో చాలా మంది ఫేక్ వివరాలను నమోదు చేస్తున్నారంట. ఎవ్వరూ కూడా వాస్తవ వివరాలను వెల్లడించడం లేదంట. అదేంటంటే.. అమ్మాయిల భద్రతను ద్రుష్టిలో ఉంచుకుని, ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలిసింది.



Click it and Unblock the Notifications
