For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బైక్ పై తమ బేబీతో రైడింగుకు వెళ్లాలని బాయ్స్ ఎందుకు కోరుకుంటారో తెలుసా...

|

జర్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎందుకంటే అనునిత్యం మనం జర్నీ చేస్తూనే ఉంటాం. అసలు జర్నీ అనేది లేకుండా మన జీవితం ఆగిపోయినట్టే. అయితే జర్నీ అనగానే చాలా మంది బస్సు, ట్రైన్ లేదా కారు చాలా కంఫర్ట్ అని అనుకుంటూ ఉంటారు.

అయితే వీటన్నింటి కంటే బైక్ పై జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోనూ అబ్బాయిలు బైక్ రైడింగు చేయడాన్ని చాలా ఇష్టపడతారు. ఇదిలా ఉండగా.. బైక్ రైడింగులో వెనుక తమ ప్రియురాలిని కూర్చొబెట్టుకుని రయ్యుమని రైడింగుకెళ్లాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. అంతేకాదు గర్ల్ ఫ్రెండ్ పక్కనుంటే.. బైక్ స్పీడ్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది.

అలా వేగంగా బైక్ రైడింగ్ చేస్తే వచ్చే మజాయే వేరు అని ఫీలవుతారు. అయితే ప్రియురాలితో కలిసి బైక్ రైడింగు కోసం మగవారు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే పురుషులు ఎందుకని అమ్మాయిలతో కలిసి రైడింగుకు వెళ్లేందుకు ఎందుకని ఇష్టపడతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఒక స్త్రీ మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నప్పుడు మీ కోసం ఏమి చేస్తుందో మీకు తెలుసా?

వెనక నుంచి వాటేసుకుని..

వెనక నుంచి వాటేసుకుని..

మనలో చాలా మంది మగాళ్లు మగువలను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచాలని, వారి మనసులో తమ స్థానం పదిలంగా ఉంచుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బైక్ రైడింగ్ వారికి చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తారు. అంతేకాదు తన ప్రియురాలు వెనుక నుండి తమను వాటేసుకున్న సమయంలో జర్నీ చేస్తే ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంటుందని.. అందుకే బైక్ రైడింగులో ప్రియురాలితో ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు వదులుకోరు.

బాడీ టచ్..

బాడీ టచ్..

ఇక తన ప్రియురాలితో కలిసి బైక్ రైడింగులో ఉన్నప్పుడు తనతో ఫిజికల్ టచ్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తారట అబ్బాయిలు. ఇలాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడతారట. కనీసం అలాంటి ఆనందాన్ని ఆస్వాదిద్దామనే ఆలోచనతో తమ ప్రియురాలితో కలిసి బైక్ రైడింగుకు వెళ్లాలని అనుకుంటూ ఉంటారట.

మేఘాల్లో తేలుతున్న అనుభూతి..

మేఘాల్లో తేలుతున్న అనుభూతి..

తన ప్రియురాలిని బైకుపై ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన సమయంలో మేఘాల్లో తేలిపోతున్న అనుభూతిని పొందొచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో చూపినట్టు.. బైక్ పై జర్నీ గర్ల్ ఫ్రెండ్ గొప్ప సరదాగా ఉంటుందని చాలా మంది ఫీలింగ్. అందుకే తనతో బైక్ రైడింగుకు తీసుకెళ్లాలని ఆశిస్తారు.

స్పీడ్ బ్రేకర్ల కోసం..

స్పీడ్ బ్రేకర్ల కోసం..

బైక్ రైడింగ్ సమయంలో చాలా మంది అబ్బాయిలు స్పీడ్ బ్రేకర్ల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తారు. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ల సమయంలో బైక్ ను ఆటోమేటిక్ గా స్లో చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో వేగాన్ని అకస్మాత్తుగా తగ్గించే సమయంలో ప్రియురాలి బాడీ తమ బాడీని ఆటోమేటిక్ గా టచ్ అవుతుందని వారి ఫీలింగ్. అప్పుడు కలిగే మజా మాటల్లో చెప్పలేనిదిగా ఉంటుందని భావిస్తారు.

ఇలా చేస్తే ఈజీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేయొచ్చు...!

నమ్మకం కలిగించేందుకు..

నమ్మకం కలిగించేందుకు..

అంతేకాదండోయ్.. బైక్ రైడింగ్ టైములో బండిని స్టైలీష్ గా నడపడమే కాదు.. జాగ్రత్తగా నడుపుతూ.. ముఖ్యంగా వారిని గమ్య స్థానాలకు చేర్చడంలో వారిపై తమ ప్రేయసికి నమ్మకం కలిగించాలని భావిస్తారు. అంతేకాదు వారితో కలిసి జర్నీ చేసేందుకు తామే కరెక్ట్ అని నిరూపించుకునేందుకు ఇదొక మంచి మార్గంగా ఊహించుకుంటారు.

కొత్త ప్రపంచం..

కొత్త ప్రపంచం..

బైక్ రైడింగులో సాహసోపేతమైన భాగాన్ని తమ ప్రియురాలికి చూపాలనుకుంటారు. ఇలా చేయడం వల్ల తాము మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నట్టు అవుతుందని భావిస్తారు. అందులోనూ సూర్యోదయం, సూర్యుడు అస్తమించే సాయంకాలం వేళ రొమాంటిక్ గా గడిపిపేందుకు బైక్ జర్నీ అద్భుతంగా పని చేస్తుందని చాలా మంది నమ్ముతారు.

ఖర్చులు తక్కువ..

ఖర్చులు తక్కువ..

బైక్ రైడింగ్ సమయంలో తమ ప్రియురాలి మొత్తం ఫోకస్ అంతా తమపైనే ఉంటుందని.. మనకు కూడా కేవలం దారిపైనా ఫోకస్ ఉంటుందని.. అందుకే వారు తమపై ఆసక్తి చూపుతారని అనుకుంటారు. అలాగే బైక్ రైడింగ్ అనేది పెద్దగా ఖర్చుతో కూడుకున్న విషయమేమీ కాదు.. బైక్ రైడింగ్ సమయంలో.. మీరు తనతో గడపాలని.. తనతో అద్భుతమైన క్షణాలను గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారట.

రొమాన్స్ పై ఆసక్తి..

రొమాన్స్ పై ఆసక్తి..

బైక్ రైడింగ్ సమయంలో ఫిజికల్ టచింగ్స్ జరగడం వల్ల అమ్మాయిలు ఆ తర్వాత రొమాన్స్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారట. ముఖ్యంగా బైక్ రైడింగ్ అయిపోయిన వెంటనే ఆ కార్యంలో పాల్గొనేందుకు తమ ప్రియురాలు కచ్చితంగా ఇష్టపడతుందని చాలా మంది అబ్బాయిలు భావిస్తారట

బైక్ పై తమ బేబీతో రైడింగుకు వెళ్లాలని బాయ్స్ ఎందుకు కోరుకుంటారో తెలుసా...

మనలో చాలా మంది మగాళ్లు మగువలను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచాలని, వారి మనసులో తమ స్థానం పదిలంగా ఉంచుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో బైక్ రైడింగ్ వారికి చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తారు. అంతేకాదు తన ప్రియురాలు వెనుక నుండి తమను వాటేసుకున్న సమయంలో జర్నీ చేస్తే ఆ ఫీల్ చాలా అద్భుతంగా ఉంటుందని.. అందుకే బైక్ రైడింగులో ప్రియురాలితో ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు వదులుకోరు.

English summary

Reasons Why Men like Taking Their Girl On a Bike Ride

Here are these reasons why men like talking their girl on a bike ride. Have a look