For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దాంపత్య జీవితంలో ‘ఆ’కోరికలు తగ్గిపోతున్నాయా? అందుకు గల కారణాలేంటో తెలుసా..

మీ రిలేషన్ షిప్ లో రొమాన్స్ లేకపోవడానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.

|

పెళ్లైన కొత్తలో లేదా ప్రేమలో ఉన్నప్పుడు జంటలకు అంతా కొత్త కొత్తగా ఉంటుంది. తామిద్దరూ కలిసి రొమాన్స్ లో పాల్గొనాలని తహ తహలాడుతూ ఉంటారు.

Reasons Why Theres No Romance In Your Relationship in Telugu

కొందరు పురుషులు స్త్రీలను వదిలి అస్సలు ఉండలేరు. హనీమూన్ లో ఎంచక్కా ఎంజాయ్ చేద్దామని ఏవేవో కలలు కంటారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ కార్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

Reasons Why Theres No Romance In Your Relationship in Telugu

అయితే కొన్నిరోజులు గడిచాక ఇద్దరికీ కలయిక పట్ల పెద్దగా ఇంట్రస్ట్ ఉండదు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు కోరికలు అనేవి దాదాపు తగ్గిపోతాయి. అందుకు గల కారణాలేంటి.. వీటి గురించి నిపుణులు ఏం చెబుతున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వెంటనే మంచి మూడ్ రావాలంటే ఇలా చేస్తే సరి!వెంటనే మంచి మూడ్ రావాలంటే ఇలా చేస్తే సరి!

పడకగదిలో...

పడకగదిలో...

భార్యభర్తలు లేదా ప్రేమికులిద్దరికీ కలయిక విషయంలో ఒకే రకమైన కోరికలు, ఆలోచనలు, అభిరుచులు ఉండాలన్న రూలేమీ లేదు. ఒక్కోసారి మగవారికి కోరికలు ఎక్కువగా ఉంటే.. ఒక్కోసారి ఆడవారికి కోరికలు తక్కువగా ఉండొచ్చు. దీని వల్ల మీ ఇద్దరికి పడకగదిలో సమస్యలు ఏర్పడొచ్చు. ఇలాంటి సమయంలో మీరిద్దరూ మానసికంగా సిద్ధమై పరిష్కారం కనుగొనాలి.

శారీరకంగా దూరంగా..

శారీరకంగా దూరంగా..

కొందరు జంటలు పెళ్లైన కొత్తలో బాగా దగ్గరగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఉద్యోగం రీత్యా లేదా ఇతర పనుల కారణంగా శారీరకంగా దూరమవుతారు. దీంతో ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం చాలా కష్టమవుతుంది. ఇలాంటి కారణాల వల్ల కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. కాబట్టి వీలైనంత మేరకు ఆ దూరం తగ్గించుకోవాలి. మీరు రెగ్యులర్ గా ఫోన్లో టచ్ లో ఉండాలి.

ఒత్తిడి వల్ల..

ఒత్తిడి వల్ల..

చాలా మంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత కొంత ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఆ సమయంలో వారికి రొమాన్స్, కలయిక పట్ల ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంతేకాక.. మోనోపాజ్ దశకు చేరుకున్న తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

అనారోగ్య సమస్యలు..

అనారోగ్య సమస్యలు..

పెళ్లై పిల్లలు పుట్టాక..కొందరికి మోనోపాజ్ దశ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. దీని వల్ల రొమాంటిక్ లైఫ్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేరు. ఇక పురుషుల విషయానికొస్తే అంగస్తంభన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యల వల్ల డిప్రెషన్ కు గురవుతుంటారు.

పడకగదిలో మూడ్ పెరగాలంటే.. ఇలా ట్రై చేయండి..పడకగదిలో మూడ్ పెరగాలంటే.. ఇలా ట్రై చేయండి..

కమ్యూనికేషన్ గ్యాప్..

కమ్యూనికేషన్ గ్యాప్..

భార్యభర్తలు లేదా ఇతర సంబంధాల్లో ఉండే వారి మధ్య బంధం బలపడాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా ఆ బంధంలో ఆటోమేటిక్ గా దూరం అనేది పెరిగిపోతుంది. కాబట్టి మీ ఇద్దరి మధ్య సాధ్యమైనంత మేరకు గ్యాప్ రాకుండా చూసుకోవాలి.

ఇతర అలవాట్లు..

ఇతర అలవాట్లు..

కొందరికి మద్యం తాగడం..పొగ తాగడం..డ్రగ్స్ తీసుకోవడం వంటి అలవాట్లు ఉండటం వల్ల రొమాంటిక్ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి అలవాట్లు ఆ కార్యాన్ని అంతగా ఆస్వాదించలేరు. కాబట్టి ఇలాంటి అలవాట్లను ఎంత త్వరగా తగ్గించుకుంటే అంత మంచిగా సెక్స్ లైఫ్ లో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

వాసన చూడండి..

వాసన చూడండి..

మీరు పడకగదిలో అడుగుపెట్టాక వెంటనే మూడ్ రావాలంటే.. మీ బెడ్ రూమ్ లో మంచి సువాసన వెదజల్లే వనిల్లా లేదా లావెండర్ సెంట్ వాసన చూడండి. దీని వల్ల మీ మూడ్ ఒక్కసారిగా మారిపోతుంది. దీంతో మీలో ఎండార్ఫిన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీని వల్ల మీ బ్రెయిన్ కూడా బాగా పని చేస్తుందట.

ఒంటరిగా కాకుండా..

ఒంటరిగా కాకుండా..

మీరు ఆ కార్యాన్ని బాగా ఆస్వాదించాలంటే.. మీరు ఒంటరిగా కాకుండా స్నేహితులతో కలసి ఒక గ్రూపులో వ్యాయామం చేయండి. దీని వల్ల మీకు మంచి ఉత్సాహం వస్తుంది. ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇలా చేయడం వల్ల కూడా మీ బాడీలో ఎండార్ఫిన్ల లెవెల్స్ పెరుగుతాయట.

English summary

Reasons Why There's No Romance In Your Relationship in Telugu

Here are the reasons why there's no romance in your relationship in Telugu. Have a look
Story first published:Saturday, August 14, 2021, 13:44 [IST]
Desktop Bottom Promotion