For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలాంటి వ్యక్తులతో మీరు కలిసి జీవించడం అసాధ్యమని తెలుసా...

|

మనం పుట్టినప్పటి నుండి ఎవరో ఒకరితో ఏదో ఒక బంధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది స్నేహ బంధం లేదా ప్రేమ బంధం, వివాహ బంధం ఇంకా ఏదైనా కావొచ్చు.

అలా మన జీవితంలో ఏర్పడే బంధాలన్నీ ముఖ్యమే. మనం ప్రతి ఒక్కరితోనూ మంచి సంబంధాలే కావాలని కోరుకుంటాం. అయితే బంధాలన్నింటీలో ఆలుమగల అనుబంధం అత్యంత ముఖ్యమైనది. మనకు ఎవరితో ఎలాంటి బంధం లేకపోయినప్పటికీ.. భాగస్వామితో మాత్రం కచ్చితంగా బలమైన బంధం ఉండాలి. అప్పుడే భార్యభర్తల కాపురం జీవితాంతం హాయిగా సాగిపోతుంది.

అయితే మనం ఎంతో ప్రేమించిన వ్యక్తి.. మనల్ని ప్రేమించకపోతే ఆ బంధం సమస్యల వలయంలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిమ్మల్ని సగం ప్రేమించే వ్యక్తితో మీరు బంధాన్ని జీవితాంతం కొనసాగించడం దాదాపు అసాధ్యమే. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో తమను మాత్రమే ప్రేమించే ఓ భాగస్వామి ఉండాలని.. వారితో కలకాలం ఆనందంగా గడపాలని కోరుకుంటారు.

కానీ మనల్ని పట్టించుకోకుండా.. వాళ్లకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనతో మాట్లాడటం.. మనతో రొమాంటిక్ గా గడపటం వంటివి చేస్తే.. అలాంటి వాటిని ఎవ్వరూ ఇష్టపడరు. ప్రతి బంధంలో ఒకరిపై మరొకరికి ప్రేమ, గౌరవం, అర్థం చేసుకునేతత్వం ఉండాలి. తమ బంధాన్ని ఆనందంగా కొనసాగించాలంటే.. అందుకు ఇద్దరూ కలిసి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా మీ రిలేషన్ షిప్ హెల్దీనా లేక అన్ హెల్దీనా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సినిమాల్లో చూపే శోభనానికి.. నిజ జీవితంలో తొలిరాత్రికి మధ్య ఉండే తేడాలేంటో తెలుసా...సినిమాల్లో చూపే శోభనానికి.. నిజ జీవితంలో తొలిరాత్రికి మధ్య ఉండే తేడాలేంటో తెలుసా...

హెల్దీ రిలేషన్ షిప్..

హెల్దీ రిలేషన్ షిప్..

ఆలుమగలిద్దరూ వివాహ జీవితంలో ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే తమ అభిప్రాయాలకు విలువ ఇస్తారో.. అలాంటి రిలేషన్ షిప్ ను హెల్దీ రిలేషన్ షిప్ అంటారు. అలా కాకుండా అస్తమానం భాగస్వామి చేసే పనిలో లోపాలు వెతుకుతూ గొడవపడుతూ ఉంటే ఆ రిలేషన్ ను అన్ హెల్దీ రిలేషన్ షిప్ అంటారు.

మీకు దూరంగానే..

మీకు దూరంగానే..

మీరు ఎంతగా ప్రేమించినా.. మీ నుండి తను ఎప్పుడూ దూరంగా ఉండాలని భావిస్తుంటారు. మీకు దూరంగా వెళ్లేందుకే ప్రయత్నిస్తారు. ఉదయాన్నే బయటికి వెళ్లిన వారు.. చీకటి పడిన తర్వాతే ఇంటికి చేరుకుంటూ ఉంటారు. వారిద్దరికీ కలిసి తిరిగే అవకాశం దక్కినా.. స్నేహితులతో టైంపాస్ చేస్తారు తప్ప మిమ్మల్ని మాత్రం బయటకు తీసుకెళ్లరు. ఇలాంటి వారితో కలిసి జీవించడం కొంత కష్టమే.

మిమ్మల్ని ఏడిపిస్తూనే..

మిమ్మల్ని ఏడిపిస్తూనే..

మీరు తనతో కలిసి జీవించాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. తను మాత్రం నిత్యం మిమ్మల్ని ఏడిపించడం.. మీరు చేసిన ఏ పనిలో అయినా తప్పులు వెతకడం.. ప్రతి విషయంలో తానే కరెక్ట్ అని మొండి పట్టు ఉండేవారితో జీవితాంతం హాయిగా, ఆనందంగా కలిసి జీవించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు మీ బంధానికి గుడ్ బై చెప్పాలని అనిపిస్తుందట.

‘నా ప్రేయసి అందరితో అలా చేస్తోంటే అనుమానం కలుగుతోంది...'‘నా ప్రేయసి అందరితో అలా చేస్తోంటే అనుమానం కలుగుతోంది...'

బాధ్యతతో వ్యవహరించకపోతే..

బాధ్యతతో వ్యవహరించకపోతే..

ప్రతి ఒక్క రిలేషన్ షిప్ లో భాగస్వామికి గౌరవం, బాధ్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు మీరు రాజీ పడాల్సి ఉంటుంది. కానీ మీ పార్ట్నర్ మాత్రం మీ పట్ల, మీ ఫ్యామిలీ పట్ల ఏ మాత్రం బాధ్యతతో వ్యవహరించకపోతే.. అలాంటి వ్యక్తి మీతో కలిసి జీవించడానికి అర్హులు కాదని గుర్తుంచుకోండి.

ఎంత మాట్లాడినా..

ఎంత మాట్లాడినా..

పెళ్లి తర్వాత భార్యభర్తలిద్దరూ కలిసి ఉండేందుకు కమ్యూనికేషన్ అనేది అత్యంత అవసరం. ఏ విషయంలోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా మీరు ఏమి మాట్లాడినా.. ఎంత మాట్లాడినా పట్టించుకోకపోవడం.. కనీసం తను కూడా తిరిగి మాట్లాడకపోవడం వంటివి చేస్తుంటే అలాంటి కపుల్స్ కలకాలం హాయిగా జీవించలేరు.

అలాంటి బంధాన్ని..

అలాంటి బంధాన్ని..

అయితే అన్ హెల్దీ రిలేషన్ షిప్ ను కూడా మనం కొంత సమయం వరకు భరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దానికి కూడా పరిమితులు ఉంటాయని.. ఎలాంటి బంధంలో అయినా ఎదుటి మనిషి మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలా కాకుండా ప్రతిసారీ మీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారంటే.. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Red Flags in an Unhealthy Relationship

Here are red flags in an unhealthy relationship. Take a look
Story first published: Tuesday, July 13, 2021, 17:28 [IST]