For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే ఈజీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేయొచ్చు...!

|

మనలో చాలా మంది మగాళ్లు కోరుకునే విషయాల్లో అత్యంత ముఖ్యమైనది.. అమ్మాయి నుండి నిజమైన ప్రేమను.. నిజాయితీగా ఉండే ఆప్యాయతను. అలాంటి ప్రేమను పొందాలంటే మీరు చాలా కష్టపడాలట.

మరీ ముఖ్యంగా కఠినంగా ఉండే అమ్మాయిలను ప్రేమలోకి దింపాలంటే.. మరింత కష్టపడాలి..అందుకోసం చాలా మంది విలువైన గిఫ్టులు ఇవ్వాలనుకుంటారు.. అయితే అందులో ఏ మాత్రం నిజం లేదు.. ఎలాంటి అమ్మాయి మనసునైనా గెలుచుకోవాలంటే.. తనకు నచ్చే కొన్ని చిన్నపనులు చేయాలి.. అందుకోసం ఎన్నో అద్భుతమైన మార్గాలున్నాయి.

అయితే కేవలం రోజ్ ఫ్లవర్స్, చాక్లెట్లు ఇస్తే మీకిష్టమైన వారు మిమ్మల్ని ప్రేమిస్తారనుకుంటే కూడా పొరపాటే.. ఇలాంటి వాటి కంటే తనపై మీరు నిజంగా.. నిజాయితీ చూపించే అభిమానమే ప్రేమ కలిగేలా చేస్తుంది. ఈ విషయం తను గుర్తించిందంటే చాలు.. అయితే ఇలాంటివి జన్మలో జరగవు. కాబట్టి మీరు పనిగట్టుకుని తనను ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో మీరు ఒక అమ్మాయి ప్రేమను పొందాలంటే ప్రేమికుడిగా ఏం చేయాలి? తనతో ఎలా ప్రవర్తించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

లావుగా ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే, మీ జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉంటారట!

సూటిగా చెబితే..

సూటిగా చెబితే..

ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు బాగా అప్ డేట్ అయ్యారు. కాబట్టి మీరు కూడా ముందుగా అప్ డేట్ అవ్వాలి. కేవలం ఒక్క రంగంలో కాదు.. చాలా విషయాల్లో మీరు తన కంటే అప్ డేట్లో ఉండాలి. ముఖ్యంగా తన ఫీలింగ్స్ కు విలువనిస్తూ.. ప్రతి విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెబితే.. మీ ప్రేమ సక్సెస్ అవ్వొచ్చు. ఇలాంటి అబ్బాయిలను ఎక్కువ మంది మహిళలు ఇష్టపడతారట.

సరదాగా మాట్లాడాలి..

సరదాగా మాట్లాడాలి..

చాలా మంది అమ్మాయిలకు సరదాగా మట్లాడే అబ్బాయిలంటే చాలా ఇష్టం. అయితే ఆ విషయాన్ని ఎవ్వరూ బయటకి చెప్పరు. నిజం చెప్పాలంటే మగువలను ఇంప్రెస్ చేయడానికి ఇదొక మంచి పద్ధతి. అయితే ఇలా మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ సరదా వల్ల వారు భయపడి పారిపోయేలా ఉండకూడదు.

నమ్మకం ఉండాలి..

నమ్మకం ఉండాలి..

ఏ బంధం అయినా బలపడటానికి నమ్మకం అనేది చాలా కీలకం. కాబట్టి మీ ప్రేమ బంధంలోనూ నమ్మకం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మీపై తను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటే.. మీ ఇద్దరి రిలేషన్ పట్ల మీరు నిజాయితీగా ఉంటే.. చాలు తను మిమ్మల్ని బాగా ఇష్టపడతారు.

ఫస్ట్ టైమ్ రొమాన్స్ టైంలో మగాళ్లు ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే...!

కష్టపడి జీవించే వారంటే..

కష్టపడి జీవించే వారంటే..

జీవితంలో ఎవరైతే అబ్బాయిలు కష్టపడి పని చేస్తారో.. ఆత్మాభిమానం చంపుకోకుండా స్వయంగా తమ కాళ్లపై తాము నిలబడే అబ్బాయిలంటే మగువలకు చాలా ఇష్టమట. ముఖ్యంగా ఏదైనా టార్గెట్ పెట్టుకుని.. దాన్ని సాధించేంత వరకు వెనుకడగు వేయని వారంటే బాగా ఇష్టమట.

మద్దతుగా ఉంటే..

మద్దతుగా ఉంటే..

మనలో ఏదైనా సందర్భాల్లో కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వారికి మీరు కాస్త అండగా నిలిస్తే చాలు.. అలాంటి వారిని అమ్మాయిలు అస్సలు విడిచి పెట్టరట.

ఓపెన్ మైండ్ ఉంటే..

ఓపెన్ మైండ్ ఉంటే..

మనలో కొందరు వ్యక్తులు లోపల ఒక విషయాన్ని ఉంచుకుని.. బయటకు మరోలా మాట్లాడుతూ ఉంటారు. అలా మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు వెటకారంగా మాట్లాడే వారిని అమ్మాయిలు ఏ మాత్రం ఇష్టపడరట. ఎవరైతే మగాళ్లు ఓపెన్ మైండ్ తో ఉంటారో.. అలాంటి భావోద్వేగ బంధాన్ని కోరుకుంటారట. వారితో జీవితాంతం కలిసుండేందుకు ఆసక్తి చూపుతారట.

English summary

These Qualities in Men That Strong Women Love in Telugu

Here are these qualities in men that strong women love in Telugu. Have a look
Story first published: Monday, November 15, 2021, 16:23 [IST]