For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కపుల్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ హ్యాపీగా జరుపుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి...

క్రిస్మస్ పండుగను జరుపుకునేందుకు గల మార్గాలేంటో తెలుసుకుందాం.

|

క్రిస్మస్ అంటే కేవలం పండుగ మాత్రమే కాదు. ఒక బ్యూటీఫుల్ ఎమోషన్. ఈ సమయంలో ప్రేమ, ఆనందం, బహుమతులతో నిండిపోయే సమయం.

Tips for couples to celebrate christmas

క్రిస్మస్ ఫెస్టివల్ టైమ్ లో పిల్లల నుండి పెద్దల దాకా అందరూ బహుమతులు పొందుతూ ఉంటారు. ఇదే సమయంలో జంటలు కూడా వారి భాగస్వాములకు గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా ఏదైనా చేయొచ్చు.

Tips for couples to celebrate christmas

ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఎంగేజ్ మెంట్ లేదా పెళ్లి చేసుకుంటే ఈ క్రిస్మస్ సమయంలో వారితో ఆనందంగా గడపొచ్చు. అయితే అదెలా అని ఆలోచిస్తున్నారా? దానికి సంబంధించిన చిట్కాలేంటో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి...

ఇది మగవాళ్ళకు మాత్రమే: మీ ఆటలో గెలవాలంటే చాలా సింపుల్ఇది మగవాళ్ళకు మాత్రమే: మీ ఆటలో గెలవాలంటే చాలా సింపుల్

సీక్రెట్ శాంటా ఎలా?

సీక్రెట్ శాంటా ఎలా?

మనలో చాలా మంది బహుమతులను బాగా ఇష్టపడతారు. గిఫ్టులను చూస్తే చాలా మంది ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. కాబట్ట అలాంటి భాగస్వామి కోసం మీరు ఎందుకు ప్రయత్నించకూడదు. దీని కోసం మీరు శాంటా లాగా డ్రెస్సులు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మీరు కచ్చితంగా ఒకరిలా వ్యవహరించవచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తికి గిఫ్టును ఇవ్వడాన్ని ప్లాన్ చేయొచ్చు. మీ భాగస్వామికి బాగా ఇష్టమైన డ్రస్సు, షుూస్, పుస్తకాలు, ఇష్టమైన ప్రదేశం కోసం సెలవు టిక్కెట్లు, వోచర్లు లేదా ఏదైనా కావచ్చు. అది వారి మనసుకు దగ్గరగా ఉంటుంది. అంతేకాదు మీ భాగస్వామి దీనికి చాలా ఆశ్చర్యంగా ఫీలవుతారు. మిమ్మల్ని ఎప్పటికీ మరచిపోరు. అందరికంటే మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

స్వీట్ డిష్..

స్వీట్ డిష్..

క్రిస్మస్ వేడుకలంటే కేకులు, స్వీట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా మీరు బయటి నుండి కేక్ తెచ్చుకోడానికి బదులుగా. మీ ఇంట్లోనే తయారు చేయండి. ముఖ్యంగా మీ భాగస్వామి తీపి వంటకాలను తయారు చేయడంలో మీరు కూడా సహాయం చేసి వారిని ఆశ్చర్యపరచండి. అప్పుడు వారు మిమ్మల్ని బాగా ఇష్టపడతారు.

డెకరేషన్ ఐడియాలు..

డెకరేషన్ ఐడియాలు..

క్రిస్మస్ గురించి మరో విశేషమేమిటంటే.. ఇది కలర్ ఫుల్ వేడుక. ఈ పండుగను మీ భాగస్వామితో కలిసి పండుగలా జరుపుకోవడానికి మీరు ఇప్పటికే ఆసక్తిగా ఉంటే, మీరు కొన్ని డెకరేషన్ ఐడియాలను ఫాలో అవ్వాలి. క్రిస్మస్ చెట్టుకు క్యాండిల్స్ పెట్టడం, అద్భుతమైన రంగు రంగుల లైట్లు, మెరిసే నక్షత్రాలు, బహుమతులు మరియు అందమైన బల్బులతో అలంకరించొచ్చు. వీటిని మీ బెడ్ రూమ్ లో కూడా అలంకరించొచ్చు. వీటితో పాటు శాంటా క్యాప్స్ తీసుకురావడం కూడా ఒక మంచి ఆలోచన.

సడన్ గా ఏదైనా ప్లాన్ చేయండి..

సడన్ గా ఏదైనా ప్లాన్ చేయండి..

మీ సంబంధంలో మధురమైన అనుభూతులు మిగిలిపోవాలంటే మీరు మీ భాగస్వామిని అకస్మాత్తుగా ఆశ్చర్యపరచాలంటే మీరు ఏదైనా లాంగ్ డ్రైవ్ కు వెళ్లండి. లేదా ఏదైనా విందు, డిన్నర్ ను ప్లాన్ చేయండి. దీని మీ ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంతేకాదు మీ ఇద్దరి మధ్య ఇది ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. అలా ఈ క్రిస్మస్ పండుగను మీరిద్దరూ రొమాంటిక్ గా కూడా జరుపుకోవచ్చు.

సర్ ప్రైజ్ చేయండి..

సర్ ప్రైజ్ చేయండి..

మీరు మీ భాగస్వామిని ఈ క్రిస్మస్ టైమ్ లో సర్ ప్రైజ్ చేయాలనుకుంటే.. ఇలా చేయడం ద్వారా మీ రిలేషన్ షిప్ మరింత దెబ్బతింటుంది. మీరు మీ భాగస్వామికి ఎలాంటి బహుమతులు తీసుకురాకపోయినా, అతను లేదా ఆమె ఇంకా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీరు వారితో కలిసి ఉండటం అనేది చాలా ముఖ్యం. దీని వల్ల నిజమైన భావాలు మరియు నిస్స్వార్థ ప్రేమ గురించి తెలుస్తుంది.

షాపింగుకెళ్లండి..

షాపింగుకెళ్లండి..

మనలో చాలా మంది షాపింగ్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లేదా ఏదైనా దుకాణాలలో అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ఉన్నప్పుడు, అలాంటి సమయంలో క్రిస్మస్ షాపింగ్ కోసం వెళ్లడం.. మీ బడ్జెట్ ప్రకారం ఇది మీ భాగస్వామికి ప్రియమైన మరియు సంతోషంగా అనిపించేలా చేస్తుంది. మీకు నచ్చిన వస్తువులను ఎల్లప్పుడూ అక్కడ కొనుగోలు చేయొచ్చు.

అనాధశ్రమాన్ని సందర్శించండి..

అనాధశ్రమాన్ని సందర్శించండి..

మీరు అద్భుతమైన లైట్లు మరియు మెరిసే నక్షత్రాలతో మీ స్థలాన్ని అలంకరించడం గురించి మీరు ఆలోచిస్తుంటే, ప్రపంచంలో సంరక్షణ లేని పిల్లలు కొందరు ఉన్నారు. ప్రతి పండుగ యొక్క ఉద్దేశ్యం ప్రజలలో ఆనందం మరియు ప్రేమను వ్యాప్తి చేయడం. ఇది సోదరభావం మరియు సామరస్యాన్ని ప్రోత్సహించడం. ఇలాంటి మంచి మార్గాలలో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి, మీరు మీ భాగస్వామితో కలిసి కొన్ని అనాథశ్రమాలను సందర్శించి వారితో పండుగలను జరుపుకోవచ్చు. అంతేకాక, మీ భాగస్వామి మీ మంచి స్వభావం గురించి తెలుసుకునేందుకు మంచి అవకాశం వస్తుంది. దీని వల్ల మీకు ఎక్కువ గౌరవం లభిస్తుంది.

English summary

Tips for Couples to Celebrate Christmas

Christmas is not just a festival, it is more of an emotion. It is that time of the year, which is filled with celebration, love, joy and gifts of course! All of us look forward to spending it surrounded by loving family and friends.
Desktop Bottom Promotion