For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలుమగల మధ్య అనుబంధం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే...

మీ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ ఎలా ఉందో ఈ లక్షణాలను బట్టి చెప్పొచ్చు.

|

మన జీవితంలో చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరితోనూ మనకు ఏదో ఒక బంధం అంటూ ఏర్పడుతూ ఉంటుంది. అందులో వారి పరిచయాన్ని బట్టి కొన్ని స్నేహంగా.. మరికొన్ని ప్రేమగా మారుతూ ఉంటాయి. అయితే వివాహ బంధం కేవలం ఒక్కరితోనే సాధ్యపడుతుంది.

What Are the Differences Between Healthy and Unhealthy Relationships?

కొందరికి మరికొన్ని అవకాశాలు దక్కుతాయనుకోండి. అది వేరే విషయం. అయితే మీ ప్రేమ బంధం లేదా వివాహ బంధం ఎలా ఉంది.. మీ రిలేషన్ షిప్ హెల్దీగా ఉందా లేదా అన్ హెల్దీగా అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన సంబంధంలో ఉన్న వారు తమ భాగస్వామితో ప్రతిదీ షేర్ చేసుకుంటారు. అన్ని విషయాల్లో చాలా నిజాయితీగా ఉంటారు.

What Are the Differences Between Healthy and Unhealthy Relationships?

అసత్యాలు అస్తమానం మాట్లాడరు. కానీ ఎవరైతే అస్తమానం అబద్ధాలు చెబుతారో.. పార్ట్ నర్ తో అన్ని విషయాలను రహస్యంగా పెట్టేందుకు ప్రయత్నిస్తారో అలాంటి వారి బంధం అన్ హెల్దీ కిందకే వస్తుంది. ఈ నేపథ్యంలో మీది హెల్దీ రిలేషన్ షిప్ లేదా అన్ హెల్దీ రిలేషన్ షిప్ అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అలాంటోళ్లు మాత్రమే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట...!అలాంటోళ్లు మాత్రమే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారట...!

మీరిద్దరే..

మీరిద్దరే..

ప్రతి ఒక్కరికీ తొలి ప్రేమ అనేది చాలా ప్రత్యేకమైనది. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మీరిద్దరూ మాత్రమే ఉన్నారనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీరిద్దరూ కలిసి కొత్త లోకాన్నే ఏర్పాటు చేస్తారు. ఇలాంటి బంధాల్లో రాత్రి వేళల్లో ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడం, ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం, ప్రేమ ఒక్కటే ఉంటే చాలు. ఈ లోకాన్నే జయించవచ్చు అన్న భావన కలుగుతుంది.

చాలా సన్నిహితంగా..

చాలా సన్నిహితంగా..

హెల్దీ రిలేషన్ షిప్ లో ఉన్న వారు మాత్రమే తమ బంధంలో చాలా సన్నిహితంగా మరియు కంఫర్టబుల్ గా ఉంటారట. తమ ఆలోచనలను భాగస్వామితో నిర్మోహమాటంగా షేర్ చేసుకుంటారట. అదే అన్ హెల్దీ రిలేషన్ షిప్ లో ఉండే భాగస్వామితో ఏ విషయాన్ని షేర్ చేసుకోరట. ప్రతిదీ సీక్రెట్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తారట.

సమానంగా..

సమానంగా..

హెల్దీ రిలేషన్ షిప్ లో ఉండే వారు తమ భాగస్వామిని సమానంగా చూస్తారట. వీరు తమ భాగస్వామికి నచ్చే విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తారట. అంతేకాదు భాగస్వామి కోసం తమలో ఉన్న లోపాలు బలహీనతలను సైతం అంగీకరించి పార్ట్ నర్ కు మద్దతుగా నిలుస్తారట. ఇలా ఒకరినొకరు ఇష్టపడుతూ అమితంగా ప్రేమించుకుంటూ కేవలం భాగస్వామి సంతోషానికే ప్రాధాన్యత ఇస్తారట. అదే అన్ హెల్దీ రిలేషన్ షిప్ లో మాత్రం అలా ఉండరట. ఇందులో కేవలం ఒక్కరిదే ఆధిపత్యం ఉండాలని భావిస్తారట.

అప్పుడే పెళ్లి ఎందుకు చేసుకున్నామా అనిపించే సందర్భాలేవో తెలుసా...అప్పుడే పెళ్లి ఎందుకు చేసుకున్నామా అనిపించే సందర్భాలేవో తెలుసా...

విలువనిస్తారు..

విలువనిస్తారు..

హెల్దీ రిలేషన్ షిప్ లో ఉండే వారు తమ భాగస్వామిని గౌరవిస్తారు. అంతేకాదు సమాజంలో తన మర్యాదను కాపాడతారు. వీరు తమ భాగస్వామి ఆలోచనలకు కూడా విలువిస్తారు. వాటిని ఆచరణలో పెట్టడానికి కూడా ఎల్లప్పుడూ సహకారం అందిస్తారు. అదే అన్ హెల్దీ రిలేషన్ షిప్ లో ఉండేవారు తమ పార్ట్ నర్ ని ప్రతి నిమిషం విమర్శించడం.. నిందలు వేయడం.. లోపాలు వెతకడం వంటివి చేస్తుంటారు.

పూర్తి నమ్మకంతో..

పూర్తి నమ్మకంతో..

హెల్దీ రిలేషన్ షిప్ లో తమ భాగస్వామి పట్ల పూర్తి నమ్మకంగా ఉంటారట. తమ పార్ట్ నర్ గురించి ఎవరైనా ఏదైనా తప్పుగా చెబితే.. వాటిని గుడ్డిగా నమ్మకుండా వాస్తవాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారట. అంతేకాదు తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తారట. అయితే అలా కాకుండా చెప్పుడు మాటలు విని భాగస్వామిని అనుమానించే వారు.. శిక్షించేందుకు సిద్ధపడితే.. అది అన్ హెల్దీ రిలేషన్ కిందకే వస్తుంది.

ఆంక్షలు ఉండవు..

ఆంక్షలు ఉండవు..

హెల్దీ రిలేషన్ షిప్ లో ఉండే వారికి భాగస్వామి నుండి ఎలాంటి ఆంక్షలు ఉండవు. పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వారు ఎప్పుడు ఏది కావాలనుకుంటే.. అది పూర్తిగా చేసేయొచ్చు. అంతేకాదు ఏ విషయంలో లిమిట్స్ అనేవి ఉండవు. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే హద్దులు వంటివి మీ రిలేషన్ షిప్ లో స్టార్టవుతాయో.. అప్పుడు మీది అన్ హెల్దీ రిలేషన్ షిప్ అని చెప్పొచ్చు. అంతేకాదు అన్ హెల్దీ రిలేషన్ షిప్ లో భాగస్వామిని అస్తమానం భయపెట్టే ప్రయత్నం కూడా చేస్తుంటారు.

English summary

What Are the Differences Between Healthy and Unhealthy Relationships?

Here we are talking about the differences between healthy and unhealthy relationships? Read on
Story first published:Thursday, June 17, 2021, 18:26 [IST]
Desktop Bottom Promotion