For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భర్త ఇక మిమ్మల్ని ప్రేమించట్లేదనటానికి 10 సంకేతాలు!

|

ప్రతిరోజూ చిన్నచిన్న విషయాలు మీ భాగస్వామి మీపట్ల ప్రేమను కలిగిఉన్నారో లేదో తెలియచేస్తూనే ఉంటాయి. ఈ చిన్ని విషయాలు మీరు ఒప్పుకోలేని నిజాలను మీ కళ్ళకి కట్టినట్లు, అంటే మీ మధ్య ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇక లేదని చూపిస్తూ ఉంటాయి.

ప్రతి బంధంలో ఈ చిన్న విషయాలు చాలా ముఖ్యం, ఎందుకంటే అలాంటివే మీ బంధానికి భవిష్యత్తు ఉందా లేదా అని నిర్ణయిస్తాయి, అందుకని వాటిని నిర్లక్ష్యపర్చవద్దు.

<strong>భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే..</strong>భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడాలంటే..

ఈ వ్యాసంలో మేము 10 సంకేతాల గురించి చర్చించాం. మీ భాగస్వామి మీరు ప్రేమించినట్లే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోటానికి ఇవి ఉపయోగపడతాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి!

ఇదివరకు లాగా ప్రేమను వ్యక్తీకరించకపోవడం

ఇదివరకు లాగా ప్రేమను వ్యక్తీకరించకపోవడం

మీ భాగస్వామికి ఇక మీపై ఆసక్తిలేదని, మరొకర్ని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు గమనిస్తే, ఇక మీరు మీ దారి చూసుకోటం మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రేమ అయిపోయింది. ఇలాంటి సందర్భాలలో చేయాల్సిన ముఖ్యమైన పని మీ గురించి మీరు ఆలోచించటం.

ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుండటం

ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుండటం

ఇది సులభంగా గుర్తుపట్టగలిగే సంకేతం. అందుకని మీ భాగస్వామికి మీ పై ఆసక్తలేదని తెలిసినా, వారి మనస్సు మరే ఆలోచనల్లో ఉందని గమనించినా, వెంటనే మాట్లాడి తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవడం ఉత్తమం. మీరు మీ గురించే దృష్టిపెట్టండి.

సంభాషణకి విషయాల కరువు

సంభాషణకి విషయాల కరువు

మీ భాగస్వామికి మీ జీవితంపట్ల ఏ ఆసక్తి లేకపోయినా, ఇద్దరికీ మాట్లాడుకోటానికి విషయాలు కూడా లేకపోయినా- ఇదిగో నిజం చెప్తున్నాం- ఇద్దరికీ ఒకరిపట్ల మరొకరికి ఏ ప్రేమా లేదు. ఇద్దరూ విడిపోవటం మంచిది.

మీరు పుట్టిన రోజును బట్టి మీరు ఏ రకపు స్త్రీయో తెలుసుకోండి

మీరు పుట్టిన రోజును బట్టి మీరు ఏ రకపు స్త్రీయో తెలుసుకోండి

ఏం జరిగినా మీ భాగస్వామి మిమ్మల్నే నిందించటం జరిగే ప్రతిదానికీ మీ భాగస్వామి మిమ్మల్నే నిందిస్తూ ఉంటే, మీరు చేయగలిగే మంచి విషయం అతను/ఆమెను వదిలేయడం.

ఇద్దరూ ఇక ఒకరికొకరు అండగా లేకపోవటం

ఇద్దరూ ఇక ఒకరికొకరు అండగా లేకపోవటం

మీ భాగస్వామి మీ చుట్టూ లేదా దగ్గరలో అస్సలు ఏ పరిస్థితిలో ఉండలేకపోవడం, ఉండటాన్ని అసహ్యించుకోవడం, మీతో చిరాకుగా ప్రవర్తించడం, మీరేం చేసినా అతనికి నచ్చక, తప్పుగా ప్రవర్తించడం, ఇలా జరుగుతుంటే అతన్ని వదిలేసి కొత్త జీవితం మొదలుపెట్టడం మంచిది.

ఇంటికి రాకుండా ఉండటానికి ఎప్పుడూ ఏదో వంక చెప్పడం

ఇంటికి రాకుండా ఉండటానికి ఎప్పుడూ ఏదో వంక చెప్పడం

అతను ఎప్పుడూ పనిచేస్తూ, బిజినెస్ టూర్లకి వెళ్తూ, లేదా ప్రయాణిస్తూ, స్నేహితులతో డ్రింక్ చేస్తూనో, ఆడుకుంటూనో ఉంటూ, మిమ్మల్ని వీటిల్లో వేటికీ తనతో తీసుకెళ్ళకుండా ఉంటున్నారా? ఇదే అయితే మీకు చెడువార్త. అతను ఇక మిమ్మల్ని ప్రేమించట్లేదు లేదా అతని జీవితంలో మరొక స్త్రీ ఉన్నది.

<strong>అమ్మాయిలు పైకి చెప్పనివి,కానీ కోరుకునేవి ఏమిటి</strong>అమ్మాయిలు పైకి చెప్పనివి,కానీ కోరుకునేవి ఏమిటి

మీ భాగస్వామి ప్లాన్స్ లో మీరు ఇక భాగం కాదు

మీ భాగస్వామి ప్లాన్స్ లో మీరు ఇక భాగం కాదు

మీరు ఇద్దరూ కలలుకన్నవి అన్నీ కల్లలయిపోయి, భవిష్యత్తుకోసం కొత్త కలలు కంటున్నప్పుడు, మీరు అందులో లేరా, అయితే మీరు ఆ బంధాన్ని ముగించేసి, వేర్వేరు మార్గాలలో వెళ్ళటం మంచిది.

మీ భాగస్వామి అగౌరవంగా మాట్లాడటం

మీ భాగస్వామి అగౌరవంగా మాట్లాడటం

మీరు ఇద్దరూ గడిపిన మధురక్షణాలన్నీ మర్చిపోయి, కేవలం మీరు బాధపడ్డ క్షణాలే గుర్తుంచుకున్నారా? అయితే మీరు బాగుచేయాలనుకుంటున్న ఈ బంధం విలువలేనిది, వెంటనే దాన్ని వదిలించుకోండి.

అతను/ఆమె మీకు వివరణ ఇవ్వకపోవడం

అతను/ఆమె మీకు వివరణ ఇవ్వకపోవడం

ఇలాంటి సందర్భాలలో, మీ భాగస్వామి మిమ్మల్ని తన జీవితంలో భాగం అనుకోకుండా, తను ఏంచేసినా మీకు వివరణ ఇవ్వక్కర్లేదు అనుకుంటారు. మీరసలు తనకి ఏదీ కాదు.

అయితే ఇక తనతో ఉండటం కూడా ఎందుకు?

మిమ్మల్ని మీరు అసహ్యించుకుంటూ, బాధపెట్టుకుంటారు

మిమ్మల్ని మీరు అసహ్యించుకుంటూ, బాధపెట్టుకుంటారు

అబద్ధాలు చెప్తూ, మోసం చేస్తూ, మాట్లాడకుండా ఉంటూ, అతను మిమ్మల్ని బాధపెడుతూ మిమ్మల్ని మీరు అసహ్యించుకునేలా చేస్తున్నారు. ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాల్సినది మీ ప్రేమ ముగిసిపోయిందని. అతన్ని వదిలేసి మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీరు దానికి అర్హులు!

English summary

10 Signs Indicating That Your Husband No Longer Loves You

All the everyday little details can show you whether your partner feels the same way for you. These small details can also show you what you usually do not want to realize, which is that the love that you once felt for each other is no longer present.
Story first published:Thursday, November 16, 2017, 13:20 [IST]
Desktop Bottom Promotion