సంబంధ బాంధవ్యాల్లో ఉన్నప్పుడు శక్తివంతమైన మహిళలు ఈ 10 విషయాలు అస్సలు చేయరు

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఇప్పుడు ఉన్న ఆధునిక సమాజంలో సంబంధ బాంధవ్యాలు అనేటివి చాల సంక్లిష్టంగా మరియు పనికిమాలినివిగా తయారవుతున్నాయి. చాలా మంది వ్యక్తులు సంబంధ బాంధవ్యాల గీతను దాటి ఎలా వ్యవహరిస్తున్నారు అనే వార్తలను తరచూ మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మనం అందరం మన సంబంధ బాంధవ్యాలను కలకాలం ఆనందమయంగా ఉంచుకొని వెలుగులు వెదజల్లేలా చేయాలంటే, అందుకోసం మరింత ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏ సంబంధ బాంధవ్యాల్లోనైనా ఇచ్చి పుచ్చుకోవడం అనేది చాలా కీలకం. ముఖ్యంగా స్త్రీలు తమ మనస్సుని మరియు ఆత్మని మొత్తాన్ని అర్పిస్తారు. అంటే దీనర్ధం పురుషులు సంబంధ బాంధవ్యాల విషయంలో అలా ఉండరు అని కాదు కానీ, స్త్రీలు ఈ విషయంలో మరింత ఎక్కువగా కృషి చేయడానికి కూడా వెనుకాడరు. కలిసి ఉండటానికి ఏ చిన్న అవకాశం మిగిలి ఉన్నా కూడా దానిని కూడా ఉపయోగించుకొని తమ భాగస్వామితో కలిసి ఉండాలని స్త్రీలు ఎక్కువగా భావిస్తారు. స్త్రీలు చేసే ఈ పని వల్ల తమ అవసరం వాళ్ళకు చాలా ఉంది అని ఒక చెడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు పురుషులు.

how do strong women react when it comes to a relationship

భావోద్వేగ పరంగా శాస్త్రీయ ఆధారాల ప్రకారం రుజువైన విషయం ఏమిటంటే, పురుషులకంటే కూడా స్త్రీలు భావద్వేగం విషయంలో చాలా బలవంతులుగా ఉంటారు. భావోద్వేగానికి సంబంధించిన విషయాలను నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు స్త్రీలు ఆ పనిని అద్భుతంగా నిర్వర్తించగలరట. అంతే కాకుండా ఒత్తిడితో కూడుకున్న సందర్భాలను ఎదురుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వారు ఎంతో నేర్పుగా వ్యవహరిస్తారట. దురహంకారం, అవసరం ఉన్నవారిగా లేదా కొన్ని సందర్భంలో ఏదో ఆలోచిస్తున్న వ్యక్తులుగా ఉన్నట్లుగా అప్పుడప్పుడు కనిపించవచ్చు. కానీ, అది నాణానికి ఒక వైపు మాత్రమే. కానీ, అసలు విషయం ఏమిటంటే, భావోద్వేగ పరంగా వాళ్ళు చాలా బలవంతులు.

స్త్రీల కున్న బలమైన స్వభావం ఏమిటంటే, త్యాగం చేసే గుణం. సంబంధ బాంధవ్యాల కోసం లేదా కుటుంబం కోసం లేదా భాగస్వామి కోసం తమ జీవితంలో ఎన్నో విషయాలను స్త్రీలు త్యాగం చేస్తారు. ఇలా చేయడాన్ని స్త్రీలకున్న ఒక బలహీనతగా కూడా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో స్త్రీలు సంబంధ బాంధవ్యాల విషయాల్లో అంత ఆనందంగా ఉండనప్పటికీ కూడా అలానే కొనసాగుతారు. కానీ, సంబంధబాంధవ్యాల విషయంలో కొన్ని విషయాలను మాత్రం అస్సలు సహించకూడదు.

మీరు ఎప్పుడైనా ఒక సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు మీ భాగస్వామి మీతో గనుక సరిగ్గా వ్యవహరించకుండా చిన్న చూపు చుస్తే అటువంటి సమయంలో మీ భావాలను కప్పి పుచ్చడానికి అస్సలు ప్రయత్నించకండి. స్త్రీలు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటకు వ్యక్తపరిచే విధంగా ఎవ్వరు ప్రోత్సహించారు. ఎప్పుడు వాళ్ళు త్యాగాలు చేస్తూనే ఉండాలి అని భావిస్తుంటారు. మీరు సంబంధ బాంధవ్యాల్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలను మాత్రం మీరు ఎప్పటికి సహించకూడదు.

శక్తివంతమైన మహిళలు సంబంధ బాంధవ్యాల్లో ఉన్నప్పుడు ఈ పది విషయాలను మాత్రం అస్సలు చేయకండి.

1. మిమ్మల్ని దూషిస్తే ముభావంగా అస్సలు ఉండకండి :

1. మిమ్మల్ని దూషిస్తే ముభావంగా అస్సలు ఉండకండి :

ఎప్పుడైతే మీ భాగస్వామి మిమ్మల్ని శారీరికంగా మరియు మానసికంగా దూషించడం ప్రారంభిస్తారో అటువంటి సందర్భంలో వాళ్ళు చేసేది సరైనదే అని మీరు మీ హావభావాల ద్వారా అస్సలు చెప్పకండి. కారణం ఏదైనప్పటికీ మీ తప్పులేకపోయినా మిమ్మల్ని గనుక మానసికంగా దూషిస్తుంటే ఆ దూషణకు కారణం మీరే అనే భావన మీలో కలిగే అవకాశం ఉంది. దీంతో మీరు ఒకింత ఒత్తిడికి కూడా లోనయ్యే ప్రమాదం ఉంది. మిమ్మల్ని ఏ విధంగా అయినా మీ భాగస్వామి దూషించడం ప్రారంభిస్తే ఆ క్షణమే మీ భాగస్వామి ని వదిలి వచ్చేయండి.

2. విశ్వాసం లేకుండా వ్యవహరిస్తే అస్సలు క్షమించకండి :

2. విశ్వాసం లేకుండా వ్యవహరిస్తే అస్సలు క్షమించకండి :

ఎప్పుడైతే తమ భాగస్వాములు మోసం చేస్తున్నారని భావిస్తారో అటువంటి సమయంలో చాలా మంది స్త్రీలు తమ సంబంధ బాంధవ్యాల నుండి బయటకు వచ్చేస్తారు. మీ విషయంలో కూడా అలాంటిదే గనుక జరిగితే ఆలా బయటకు వచ్చేయడానికి అస్సలు వెనకాడకండి. బలవంతమైన స్త్రీలు అవిశ్వాసాన్ని ఎప్పుడు గాని సహించలేరు. మీ భాగస్వామి మరొక్కసారి ఆలా చేయనని ఒట్టు వేసినప్పటికీ అతడు మళ్ళీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు గ్రహించండి.

3. ఆర్ధిక సంబంధమైన వ్యవహారాలను ఎప్పుడు కానీ పంచుకోకండి :

3. ఆర్ధిక సంబంధమైన వ్యవహారాలను ఎప్పుడు కానీ పంచుకోకండి :

ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండటం చాలా మంచిదే. అయితే ఆ నిజాయితీ ఎక్కడి వరకు ఉండాలి అనే విషయమై ఒక గీతను గీసుకోండి. ఆర్థికపరంగా మీరు స్వతంత్రురాలు అయితే అటువంటి సమయంలో మీ బ్యాంకు అకౌంట్ లేదా డెబిట్ కార్డు వివరాలను అస్సలు తెలపకండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు కాబట్టి అది మీ అధీనంలో మాత్రమే ఉండాలి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి.

4. మీ భావాల గురించి అబద్దాలు చెప్పడానికి ఎప్పుడు గాని ప్రయత్నించకండి :

4. మీ భావాల గురించి అబద్దాలు చెప్పడానికి ఎప్పుడు గాని ప్రయత్నించకండి :

మీరు ఏ విషయంలో అయినా ఆనందంగా లేకపోతే మీ భాగస్వామితో నిర్మొహమాటంగా చెప్పడానికి మాత్రం అస్సలు వెనకాడకండి. చాలా సందర్భాల్లో స్త్రీలు తమకు కావాల్సిన అవసరాలను బయటకు చెప్పకుండా పురుషులే వాటిని అర్ధం చేసుకోవాలని భావిస్తుంటారు. కానీ, అది ఎప్పటికి జరగదు. కాబట్టి దానిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు ఏ విషయమై ఇబ్బంది పడుతున్నారో బయటకు చెప్పకపోతే, మీ భాగస్వామికి ఎప్పటికీ ఆ విషయం గురించి తెలీదు, అర్ధం కాదు.

5. ప్రతి విషయంలోనూ మరీ ఎక్కువ సూక్ష్మంగా ఉండటానికి ప్రయత్నించకండి :

5. ప్రతి విషయంలోనూ మరీ ఎక్కువ సూక్ష్మంగా ఉండటానికి ప్రయత్నించకండి :

ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. భాగస్వాములు ఇద్దరు కలిసి సమయాన్ని గడపడం ఎంత అవసరమో వ్యక్తిగతంగా కూడా తమకు తాము సమయాన్ని కేటాయించుకోవడం చాలా అవసరం. అప్పుడు మాత్రమే సంబంధ బాంధవ్యాలు మరింత బలంగా మారుతాయి. మీ భాగస్వామి పై మీకు గనుక నమ్మకం ఉంటే, వారియొక్క ప్రతి ఒక్క విషయమై విపరీతమైన ప్రశ్నల వర్షం సంధించడానికి ప్రయత్నించకండి. మీ భాగస్వామి గనుక వారి యొక్క స్నేహితులతో సరదాగా సాయంత్రాన్ని గడపాలని భావిస్తే తనకి ఇష్టమైన పనిని చేయనివ్వండి.

6. మరీ ఎక్కువ భావోద్వేగంగా వ్యవహరించకండి :

6. మరీ ఎక్కువ భావోద్వేగంగా వ్యవహరించకండి :

ప్రకృతి పరంగా స్త్రీలలో భావద్వేగం పాళ్ళు కొద్దిగా ఎక్కువున్న వ్యక్తులు. సంబంధ బాంధవ్యంలో సుదీర్ఘ కాలం పాటు మీ భాగస్వామితో గనుక ఉంటుంటే అటువంటప్పుడు మీ ఆలోచనలు ఎలా మారిపోతుంటాయి అనే విషయమై మీ భాగస్వామి ముందే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా భావోద్వేగంగా వ్యవహరించి భాగస్వామి దృష్టిని తమ వైపుకి మరల్చుకోవాలని కొంతమంది భావిస్తుంటారు. కానీ కొంతమంది భాగస్వాములకు ఇలా చేస్తే కోపంతో కూడిన అసహ్యం వచ్చే అవకాశం ఉంది, అది మీ బలహీనతగా కూడా భావించే ప్రమాదం ఉంది. మీరు ఒక భావద్వేగమైన స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని మీ భాగస్వామికి తెలియజేయండి. ఇద్దరు కలిసి సామరస్యపూర్వకంగా ఆ సమస్యను పరిష్కరించుకోండి.

7. మీ భాగస్వామికి నచ్చని విషయాలను చేయాలి అని పట్టుబట్టకండి :

7. మీ భాగస్వామికి నచ్చని విషయాలను చేయాలి అని పట్టుబట్టకండి :

మీ భాగస్వామికి ప్రేమ సినిమాలు నచ్చలేదనుకోండి వేరొకరితో కలిసి మీరు ఆ సినిమాకు వెళ్ళండి. మీ భాగస్వామితో గడపాలి అనేదే మీ యొక్క భావన అయితే, ఇద్దరికీ ఇష్టమైన పనులను కలిసి చేయడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామికి ఇష్టంలేని పనులను చేయమని విపరీతంగా బలవంత చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాల విషయంలో ఒక తెలియని దూరం ఏర్పడే అవకాశం ఉంది. మీరు విపరీతంగా అడిగారు కాబట్టి మీతో రావొచ్చు గాని, అక్కడ మీతో మంచి సమయాన్ని అయితే గడపలేరు.

8. నమ్మకానికి సంబంధించిన విషయాల్లో అస్సలు సహించకండి :

8. నమ్మకానికి సంబంధించిన విషయాల్లో అస్సలు సహించకండి :

మీ భాగస్వామి గనుక సహేతుకంగా వ్యవరించకపోతే మరియు మీ యొక్క పురుష స్నేహితుల మరియు స్నేహం గురించి తరచూ ప్రశ్నలు సంధిస్తుంటే, లేదా మీ యొక్క పని గంటలు పెరిగినందుకు గాను తరచూ కారణాలు అడుగుతుంటే, మీ సంబంధ బాంధవ్యం తెగతెంపులు దశకు వచ్చింది అని అర్ధం. మీ భాగస్వామి యొక్క ఆందోళనకు కారణం ఏమిటో కనుక్కోండి. మీ పై నమ్మకం పెరగడానికి మీ వంతుగా మీరు ప్రయత్నించి మీ భాగస్వామిలో నమ్మకాన్ని కలిగించండి. ఏ కారణం లేకపోయినా మిమ్మల్ని గనుక అనుమానిస్తుంటే, మిమ్మల్ని ఎక్కువగా స్వాధీన పరుచుకోవాలని మీ భాగస్వామి భావిస్తున్నట్లు అర్ధం. ఇది మీ యొక్క సంబంధ బాంధవ్యంలో అడ్డంకిగా మారే ఆస్కారం ఉంది.

9. ఎప్పుడు గాని మీరు మాత్రమే త్యాగాలు చేయడంలో ముందు ఉండకండి :

9. ఎప్పుడు గాని మీరు మాత్రమే త్యాగాలు చేయడంలో ముందు ఉండకండి :

మీకు నచ్చిన వ్యక్తులతో లేదా మీ కుటుంబ సభ్యులతో వారాంతంలో బయటకు వెళ్ళడానికి లేదా ఆనందంగా గడపటానికి మీ భాగస్వామి ఆసక్తి చూపకపోతున్నట్లైతే సంబంధ బాంధవ్యాలను అతడు అంత విలువ ఇవ్వడం లేదని అర్ధం. అతడి కోసం మీరు ఎప్పుడూ త్యాగాలు చేస్తూనే ఉండాలని అతడు భావిస్తున్నాడా ? మీరు ఎంతో ప్రేమించే వాటిని కేవలం అతడి కోసమే దూరం చేసుకుంటున్నారా ? ఇక దీనర్ధం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మేల్కొనండి అసలు విషయాన్ని గ్రహించండి. మీ సంబంధ బాంధవ్యాలు ఇక అవసరం లేదు అని అతడు భావిస్తున్నాడు.

10. అలా అంటిపెట్టుకొని ఉండకండి :

10. అలా అంటిపెట్టుకొని ఉండకండి :

ఇది చివరి విషయం అయినప్పటికీ చాలా ముఖ్యమైన విషయం. ఎదో ఉండాలి కదా అని అలానే మీ భాగస్వామితో ఇష్టంలేకపోయినా అంటి పెట్టుకొని మీ జీవితాన్ని గడపకండి. చాలా సందర్భాల్లో సంబంధ బాంధవ్యాలను తెగతెంపులు చేసుకోవడానికి స్త్రీలు అంత సుముఖంగా ఉండరు మరియు అంత బలంగా కూడా వ్యవహరించారు. వారి యొక్క భాగస్వాములు చేసే పనులను కప్పి పుచ్చుకోవడానికి వివిధరకాల సాకులను ప్రపంచానికి చెబుతుంటారు. మీ సంబంధ బాంధవ్యాల్లో మెరుపు తగ్గిందని మీరు భావిస్తే ఇక ఆ తర్వాత పని కూడా మీరే చేయవలసి ఉంది. ఇప్పటి వరకు జరిగింది విడిచిపెట్టి ఆత్మగౌరవంతో బయటకు వెళ్లిపోవడం మంచిది. సంబంధ బాంధవ్యంలో అలానే గనుక మరికొంత కాలం కొనసాగితే వారి యొక్క భాగస్వాములు మళ్ళీ తమ గురించి అలోచించి, తమ వద్దకు వస్తారని చాలా మంది స్త్రీలు భావిస్తుంటారు. కానీ, అది అంత సులువుగా జరగదు. మిమ్మల్ని మీ జేవితంలో ఏ పురుషుడు గాని చిన్న చూపు చూసేలా లేదా ఏ విధంగా అయినా మిమ్మల్ని దూషించే అవకాశం ఎప్పటికి, ఎవ్వరికి ఇవ్వకండి.

English summary

how do strong women react when it comes to a relationship | things strong women will never do in a relationship

The strongest nature of women is their sacrifices. They sacrifice many things in life just for their relationship or family. This is often taken into view as women being weak.
Story first published: Wednesday, December 20, 2017, 18:00 [IST]