భర్త నుండి భార్య కోరుకునేదేంటి..మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే విషయాలు..!

Posted By:
Subscribe to Boldsky

మగవాడిలో తండ్రి, భర్త ఈ రెండు ధోరణులూ ఉన్నప్పుడు సహచరికి ఓ వరం.ఈ గుణాలు పుష్కలంగాఉన్న భర్త దొరికితే వారి దాంపత్య జీవితం పదికాలాలు సంతోషంతో వుంటుందట .

అమ్మాయిల మనస్తత్వం గురించి అనేకమంది వర్ణించి చెప్పారు, అయితే మగవాళ్ల మనస్తత్వాల గురించి తెలుసుకునే అవకాశాలు మాత్రం అమ్మాయిలకు తక్కువనే చెప్పాలి.

ఓ మగవాడిలో స్నేహితుడు కనిపిస్తాడు, భర్త కనపడతాడు, తండ్రి కనపడతాడు. అయినా కూడా ప్రతి స్త్రీ తన భర్త ఇలా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటుంది. మరి మన ఇండియన్ గర్ల్స్ భర్తలో ఎలాంటి లక్షణాలు కోరుకుంటారో తెలుసుకుందాం..

కాభోయే భర్త రూపవంతుడూ, గుణవంతుడుగా ఉండాలని కోరుకుంటుంది:

కాభోయే భర్త రూపవంతుడూ, గుణవంతుడుగా ఉండాలని కోరుకుంటుంది:

ప్రతి మగువ తనకు కాబోయే భర్త రూపవంతుడూ, గుణవంతుడూ కావాలని కోరుకుంటుంది. మహిళలు ఎక్కువగా వారి స్వభావంకన్నా తమతో చురుగ్గా ఉంటూ, తమ మాటలు వినాలని కోరుకుంటారని మానసిక తత్వవేత్తలు చెప్తున్నారు. మంచి భర్త మాత్రమే మంచి తండ్రి కాగలడు .

అన్ని విషయాల్లో ఓపెన్ గా ఉండాలని కోరుకుంటారు :

అన్ని విషయాల్లో ఓపెన్ గా ఉండాలని కోరుకుంటారు :

చాలామంది మగవారు దృఢంగా, గంభీరంగా ఉంటే తమ భావోద్రేకాల్ని అంత సులువుగా వ్యక్తం చేయరు.అయితే తమ భావోద్రేకాల గురించి అస్సలు చెప్పరు. మరికొందరేమో అన్ని విషయాల్లో ఓపెనగా ఉంటారు.

అన్ని విషయాలను తమతో షేర్ చేసుకోవాలని కోరుకుంటారు:

అన్ని విషయాలను తమతో షేర్ చేసుకోవాలని కోరుకుంటారు:

నేటితరం అమ్మాయిలు తాము మెచ్చేమగవాడు సకల విషయాలను చివరకి పాత రిలేషన్ షిప్స్ ఏమైనా ఉన్నా సరే, వాటి గురించి కూడా చెప్పాలని కోరుకుంటారు.ఇలా ఉండడంవల్ల తమ మధ్య విశ్వసనీయత పెరుగుతుందని వారు భావిస్తున్నారు. ఫలితంగా వారిబంధం మరింత దృఢంగా మారుతుందన్న ఉద్దేశం.

వారి పక్కన లేకున్నా..అన్ని విషయాలను తమతో చర్చించాలని కోరుకుంటారు:

వారి పక్కన లేకున్నా..అన్ని విషయాలను తమతో చర్చించాలని కోరుకుంటారు:

పక్కన లేకున్నాసరే ప్రతివిషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పే హజ్బెండ్‌ ఉంటే మీరు లక్కీనే.

భర్త సపోర్ట్ చాలా అవసరం:

భర్త సపోర్ట్ చాలా అవసరం:

ఈ కాలం మగువలు చాలామంది స్వతంత్ర ధోరణిలో ఉన్నాసరే కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా భర్త అండగా ఉండాలని కోరుకుంటారు .దీనివల్ల జీవితం సజావుగా ఉంటుందని వారి నమ్మకం.

అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ను అందించేవాడే భర్త అనుకుంటుంది:

అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ను అందించేవాడే భర్త అనుకుంటుంది:

ఇబ్బందికర పరిస్థితుల్లో ఆదరించి పరిష్కారంచూపే దిశగా గైడ్‌చేసి ఒత్తిడిని తగ్గిస్తాడు. ఉద్యోగం నుంచి రాత్రిళ్ళు ఇంటికి చేరినా సరే తనకోసం చూడకుండా ఆహారం సిద్ధం చేసే వ్యక్తినీ, ఆర్థిక అంశాల్లో సమతుల్యం పాటించగలమన్న భరోసా ఇచ్చే వ్యక్తినీ కోరుకుంటున్నారు.

కుటుంబ విషయాలు పట్టించుకోకపోతే , అలాంటి వారిని అస్సలు ఇష్టపడరు:

కుటుంబ విషయాలు పట్టించుకోకపోతే , అలాంటి వారిని అస్సలు ఇష్టపడరు:

తన కుటుంబానికి, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలు వినడంలో నిరాసక్తత చూపిస్తే అలాంటి వ్యక్తిని వదులుకోవడానికి సైతం సిద్ధంగా ఉంటున్నారట.

ఒకరినొకరు అర్ధం చేసుకోగలిగే మనస్థత్వం ఉండాలి:

ఒకరినొకరు అర్ధం చేసుకోగలిగే మనస్థత్వం ఉండాలి:

బాంధవ్యం కలకాలం నిలిచి ఉండాలంటే ఇద్దరూ ఒకరినొకరు ప్రభావితం చేసుకోగలగాలి. నిరంతరం కేరింగ్‌ చూపుతూ బాధ్యతలు పంచుకోవడానికి, మీరు చేసుకునే అబ్బాయి సదా సన్నద్ధంగా ఉండే వ్యక్తి అయితే అదృష్టవంతుడే.

ఆ చేతిని విడవనేకూడదు.

ఆ చేతిని విడవనేకూడదు.

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహాయపడుతూ జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో తోడుగా నిలిచే వ్యక్తి దొరికితే పూర్తి అనుకూలత కలిగిన భర్తగా అతన్ని చెప్పవచ్చు. అలా ప్రభావితంగా ఉండే అబ్బాయి కోసం అమ్మాయిలు ఎప్పుడూ ఆలోచిస్తూ వుంటారు.

దాంపత్య జీవితం సుఖవంతంగా ఉండాలంటే..

దాంపత్య జీవితం సుఖవంతంగా ఉండాలంటే..

దాంపత్య జీవితంలో చిన్న చిన్న తగాదాలు, గొడవలు ఎప్పటికప్పుడు సమసిపోయే విధంగా ఉండాలి. అసలు వాగ్వాదాలు లేవు అని ఏ దంపతులైనా చెబితే అది నమ్మశక్యం కాని విషయమే.

భర్తపాత్రని సక్రమంగా నిర్వర్తించగలిగే వ్యక్తి:

భర్తపాత్రని సక్రమంగా నిర్వర్తించగలిగే వ్యక్తి:

భర్తపాత్రని సక్రమంగా నిర్వర్తించగలిగే వ్యక్తి తప్పకుండా తండ్రి పాత్రని కూడా సక్రమంగా పోషించగలుగుతాడు. పిల్లలు పుట్టినతర్వాత తల్లిదండ్రులు ఎంత సంతోషంతో ఉంటారో వారు పెరుగుతున్నకొద్దీ ఆ సంతోషంతో పాటు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి

కాబోయే భర్తకు సహనం..ఓర్పు చాలా ముఖ్యం:

కాబోయే భర్తకు సహనం..ఓర్పు చాలా ముఖ్యం:

కాబోయే భర్త పట్టువిడుపులుగల వ్యక్తిత్వం ఉన్నవాడైతే పిల్లల వ్యవహారాలను సమర్థవంతంగా స్వీకరించగలడు. అతనికి సహనం, ఓర్పు కీలకం. పిల్లలు చికాకు పెట్టినా సరే తిట్టకుండా, శాంతంగా, వారిని హ్యాండిల్‌ చేయగలుగుతుంటే అతని భార్య గొప్ప అదృష్టవంతురాలని చెప్పొచ్చు

వృత్తి పట్ల గౌరవం ఉన్నవాడు:

వృత్తి పట్ల గౌరవం ఉన్నవాడు:

వృత్తి ఏదైనా సరే భర్త తన వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని సునాయాసంగా నిర్వర్తించగలుగుతున్నాడో లేదో చూడాలి. అతను కనుక అలా చేయగలిగితే కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలవాడని చెప్పవచ్చు

English summary

13 Things Every Woman Expects From Would-Be-Husband?

A woman may be complicated to handle but she can be a steel of spine and a compassionate soul. As we all know a woman is the backbone of a man's success. There are obviously things women look for in a husband. Does your list match this one?
Story first published: Wednesday, May 24, 2017, 16:49 [IST]
Subscribe Newsletter