For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దురుసుగా ఉండే భార్యతో వేగేందుకు 7 మార్గాలు

By Sujeeth Kumar
|

పెళ్లి అనేది ఇద్ద‌రి మ‌ధ్య ఎల్ల‌కాలం ఉండే ప్రేమానుబంధం. ఇద్ద‌రూ క‌లిస్తేనే వైవాహిక జీవితం స‌జావుగా సాగుతుంది. అందుకే స‌రైన జీవిత భాగ‌స్వామి ఎంపిక చాలా ముఖ్య‌మైన నిర్ణ‌యం.

మ‌న‌కు సాధార‌ణంగా క‌నిపించే సంబంధాల్లో ఎక్కువ‌గా మ‌గ‌వాడు త‌న భార్య‌పై పెత్త‌నం చెలాయించడం లాంటివి చూస్తుంటాం. ఆడ‌వాళ్లు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి, ఎందుకంటే త‌ర్వాతి ప‌రిణామాలంటే వారికి భ‌యం. పెళ్లి త‌ర్వాత పిల్ల‌లు ఉంటే వారి భ‌విత‌వ్యం గురించి ఆలోచించేట‌ప్పుడు ఎన్నో ఏళ్ల‌పాటు శారీర‌క‌, మాన‌సిక క్షోభ‌ను మౌనంగా భ‌రిస్తూ ఉంటారు. ఎప్పుడూ మ‌గ‌వాడు ఆడ‌దాన్ని హింసించ‌డం స‌హ‌జంగా చూస్తుంటాం. కొంద‌రు ఆడ‌వాళ్లు మ‌గ‌వాళ్ల‌ని హింసిస్తుంటారు.

How To Handle An Abusive Wife

పెళ్లి త‌ర్వాత భార్య భ‌ర్త‌ను నానార‌కాలుగా ఇబ్బంది పెడుతుంటే. అలాంటివి మ‌న ఆలోచ‌న‌కు త‌ట్ట‌దు క‌దా! ఐతే ఈ రోజుల్లో ఇలాంటి వారి వ‌ల్ల పాపం అమాయ‌కులైన భ‌ర్త‌లు ఇబ్బందిప‌డుతున్నారు. అంత‌కంటే ముందు బంధంలో ఇలాంటి పొర‌ప‌చ్ఛాల‌కు కార‌ణ‌మేమిటో తెలుసుకుందాం.

వైవాహిక బంధంలో భాగ‌స్వామి త‌ప్పు లేక‌పోయినా స‌రే శారీర‌కంగా, మాన‌సికంగా హింసిస్తుంటే ఆ బంధం దృఢంగా లేన‌ట్టే. శారీర‌క హింస అంటే కొట్ట‌డం, చెంప‌లు వాయించేయ‌డం, దెబ్బ‌లు త‌గిలేలా గోడ‌కేసి నెట్టేయ‌డం లాంటివి వ‌స్తాయి.

ఇక మాన‌సిక హింస అంటే చురుకైన మాట‌ల‌తో అన‌రాని మాట‌లు అన‌డం, చీటికిమాటికి ఏదో ఒక‌ర‌కంగా తిట్ట‌డం, మీ తో మాట్లాడే ప్ర‌తిసారీ బూతులు వాడ‌డం లాంటివ‌న్నీ దీనికి సంకేతాలే. ఈ రెండు ర‌కాల టార్చ‌ర్ల వ‌ల్ల ఒక్కోసారి డిప్రెష‌న్‌కు వెళ్లే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

వివాహ బంధంలో ఒక్క‌రు ఇలా మారినా స‌రే ఇద్ద‌రి జీవితాలు న‌ర‌క‌ప్రాయంగా అవుతాయి. మ‌హిళ‌లు త‌మ స‌మ‌స్య‌లను ఎవ‌రికీ చెప్పుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు. మొగుడు తిట్టినా వారితోనే జీవితాంతం ఉండేందుకు స‌హిస్తారు.

అదే మ‌గ‌వాడు త‌న గ‌య్యాళి భార్య‌తో అలాంటి ప‌రిస్థితి ఎదురైతే ఏం చేయాలో పాలుపోదు. ఈ నేప‌థ్యంలో వివాహ బంధాన్ని తెంచుకునేందుకు చూస్తారు. ఐతే ఈ స‌మ‌స్య‌కు అదొక్క‌టే ప‌రిష్కారం కాదు. ముఖ్యంగా పిల్ల‌లున్న దంప‌తుల‌కు ఇది ఎంత‌మాత్రం త‌గ‌దు.

మీ భాగ‌స్వామి చిరాకు మొత్తం మీ మీద చూపిస్తే ఆమె లోతుగా ఏదో సైక‌లాజిక‌ల్‌గా బాధ‌ప‌డుతుంద‌ని అర్థం. జీవిత భాగ‌స్వామిగా అది మీరు అర్థం చేసుకొని సంద‌ర్భాన్ని స‌రిగ్గా డీల్ చేయాలి.


మీ భార్య అచేత‌నంగా మీపై దూషిస్తుంటే, కంట్రోల్ త‌ప్పి మాట్లాడుతున్న‌ట్టు అనిపించినా, మీపై అధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తున్నా.. ఆమె బార్డ‌ర్‌లైన్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు. మీ భార్య ఇలాంటి ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతుంటే మీరు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మాట్లాడండి

1. మాట్లాడండి

మీ భార్య మీతో దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని గ్ర‌హించాక ఆమెతో కూర్చొని మాట్లాడేందుకు ప్ర‌యత్నించండి. ఆమె చ‌ర్య‌లు, మాట‌లు మిమ్మ‌ల్ని బాధ‌పెట్టేలా చేస్తున్నాయ‌ని వివ‌రంగా చెప్పి అలాంటివి మానేయాల్సిందిగా సూచించండి. ఆమె ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకునేలా ఎంక‌రేజ్ చేయండి. దీంతో ఆమె చ‌ర్య‌ల ప‌ట్ల ఆమెకు అప‌రాధంగా అనిపించి మిమ్మ‌ల్ని తిట్టేముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తుంది.

1. మాట్లాడండి

1. మాట్లాడండి

మీ భార్య మీతో దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తుంద‌ని గ్ర‌హించాక ఆమెతో కూర్చొని మాట్లాడేందుకు ప్ర‌యత్నించండి. ఆమె చ‌ర్య‌లు, మాట‌లు మిమ్మ‌ల్ని బాధ‌పెట్టేలా చేస్తున్నాయ‌ని వివ‌రంగా చెప్పి అలాంటివి మానేయాల్సిందిగా సూచించండి. ఆమె ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకునేలా ఎంక‌రేజ్ చేయండి. దీంతో ఆమె చ‌ర్య‌ల ప‌ట్ల ఆమెకు అప‌రాధంగా అనిపించి మిమ్మ‌ల్ని తిట్టేముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తుంది.

2. కార‌ణ‌మేదో తెలుసుకోండి

2. కార‌ణ‌మేదో తెలుసుకోండి

ఏదో బ‌ల‌మైన సంఘ‌ట‌న త‌ర్వాత మీ భార్య ప్ర‌వ‌ర్త‌న‌లో తేడాను గ‌మ‌నించారా? అదే ఆమె కోపానికి కార‌ణ‌మై ఉంటుందా? అలాంటి సంద‌ర్భాలేమైనా ఉంటే సాధ్య‌మైనంత మేర‌కు రానీయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డండి.

3. కౌన్సిల‌ర్ వ‌ద్ద‌కు...

3. కౌన్సిల‌ర్ వ‌ద్ద‌కు...

వాళ్ల‌కున్న ఫ్ర‌స్టేష‌న్ కార‌ణంగానే భాగ‌స్వామిని చాలా సంద‌ర్భాల్లో ఆడిపోసుకుంటారు. మీ భార్య‌కు అలాంటి ప‌రిస్థితి ఎదురైతే ఆమెను మంచి కౌన్సిల‌ర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లండి. ఆమెలో ఉన్న నెగెటివ్ ఎన‌ర్జీని తీసేందుకు ఉప‌యోగ‌క‌ర‌మైన ప‌నుల్లో నిమ‌గ్నులు చేయండి.

4. రికార్డు చేయండి

4. రికార్డు చేయండి

కోపంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రెలా ప్ర‌వ‌ర్తిస్తారో తెలియ‌దు. వాళ్లు చేసే చ‌ర్య‌ల‌పై వారికి నియంత్ర‌ణ ఉండ‌దు. మీ భార్య కోపంలో ఉన్న‌ప్పుడు ఆమె మాట‌ల‌ను లేదా చేత‌ల‌ను రికార్డు చేయండి. ఆమె ప్ర‌శాంతంగా ఉన్న స‌మ‌యంలో వాటిని చూపించండి. ఆమె చేసిన త‌ప్పేమిటో తెలుసుకొని త‌ర్వాత అంత తీవ్రంగా ప్ర‌వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు.

5. మీ ప్ర‌వ‌ర్త‌నా లోప‌మా?

5. మీ ప్ర‌వ‌ర్త‌నా లోప‌మా?

ఆమె ఎందుక‌లా అరుస్తుందా? మీ ప్ర‌వ‌ర్త‌న ఆమె కోపానికి కార‌ణ‌మా? ఆమె కోపం అప్ప‌టిక‌ప్పుడు వ‌చ్చిన‌దేమీ కాక‌పోవ‌చ్చు. మీకు కొంత‌కాలంగా ఉన్న అల‌వాట్లే కార‌ణం కావ‌చ్చు. మీతో న‌మ్మ‌కం విష‌యంలో ఏమైనా సందేహాలున్నాయా? వివాహ జీవితంలో ఆమె అభ‌ద్ర‌త‌భావంతో ఉందా? మీ ప్ర‌వ‌ర్త‌న వ‌ల్లే ఆమె ఇలా మారుతుందో మీలోనూ మార్పు తెచ్చుకోవాల్సిన స‌మ‌య‌మిదే. ఆమెను ప్రేమిస్తున్నార‌ని, న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌న‌ని ఆమెకు న‌మ్మ‌కం క‌లిగించండి. మీరు అదృష్ట‌వంతులైతే ఆమె మిమ్మ‌ల్ని అర్థం చేసుకుంటుంది.

6. స్థిర‌త్వాన్ని, భ‌ద్ర‌త‌ను ఇవ్వండి

6. స్థిర‌త్వాన్ని, భ‌ద్ర‌త‌ను ఇవ్వండి

బీపీడీ డిజార్డ‌ర్ ఉన్న‌వారికి త‌మ రిలేష‌న్‌షిప్‌లో అభ‌ద్ర‌తా భావం ఎక్కువ‌గా అనిపిస్తుంటుంది. త‌మ భాగ‌స్వామిని ఎక్క‌డ కోల్పోతామో అని బెంగ‌గా ఉంటుంది. ఆమె ఎమోష‌న‌ల్ ఫీలింగ్ మిమ్మల్ని బాధ‌పెడుతుంటే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే .

7) ఎదురు తిర‌గండి

7) ఎదురు తిర‌గండి

చాలా సంద‌ర్భాల్లో భాగ‌స్వామి త‌మ‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నా ఏమీ చేయ‌కుండా మిన్న‌కుండిపోతారు. అదే మీరు చేసే అతిపెద్ద త‌ప్పు. దీంతో అవ‌త‌లి వ్య‌క్తులు మీదే త‌ప్పు అనే ధోర‌ణితో ఉంటారు. ఇలా దురుసుగా ప్ర‌వ‌ర్తించే గుణాన్ని ప్రోత్స‌హించిన‌ట్టే లెక్క‌. అదే స‌మ‌యంలో మ‌రీ ఎక్కువ‌గా కూడా ఎదురుతిర‌గ‌కండి. ఒక్కోసారి కామ్‌గా ఉండ‌ట‌మూ మంచిదే. BPD లేదా వ్యక్తిత్వ లోపాలతో ఉన్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా బాధ పెట్ట‌రు. కేవలం రోజువారీ జీవితంలో ఒత్తిడి, కోపం, ఒంటరితనం కారణంగా మానసిక రుగ్మతతో బాధపడుతుంటారు. తరచు మీ భాగస్వామికి మీరు చేయగలిగినదంతా ప్రేమతో, శ్రద్ధతో చూసుకోవ‌డం. వారికి గౌరవనీయ, ప్రశంసలు కలిగించేలా చేస్తుంది. అదే సమయంలో వారితో బాహాటంగా చ‌ర్చించి ఇద్ద‌రి మ‌ధ్య హ‌ద్దుల‌ను తుడిచేయండి. దీంతో త‌మ ప్ర‌వ‌ర్త‌న‌ను నిదానంగా మార్చుకొని మీ ప‌ట్ల ప్రేమాభావాన్ని వ్య‌క్త‌ప‌రుస్తారు.

English summary

How To Handle An Abusive Wife

Usually, it is the male partner who is abusive in a relationship. But what if you come across a marriage where the wife is abusive? We haven't really thought about it, right? But it is a reality that many men are facing nowadays. Lets define an abusive relationship first.
Desktop Bottom Promotion