For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంతానోత్పత్తి లేకపోవడం వల్ల భార్యభర్తలు తెగతెంపులు!

పెళైన వ్యక్తి సంతానోత్పత్తి లేమితో బాధపడుతునట్లయితే, ఆ పెళ్ళి ఫెయిల్ అయ్యినట్లా ? కాదని పరిశోధకులు చెబుతున్నారు.

|

పెళైన వ్యక్తి సంతానోత్పత్తి లేమితో బాధపడుతునట్లయితే, ఆ పెళ్ళి ఫెయిల్ అయ్యినట్లా ? కాదని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ కొత్త అధ్యయనం ప్రకారం, సంతానోత్పత్తి లేమి అనేది విడాకులకు కారణం కాదని, దంపతులు విడివిడిగా ఉండనవసరం లేదని స్పష్టం చేశారు.

గత అధ్యయనాల ప్రకారం, సంతానోత్పత్తి లేమి అనేది ఒత్తిడికి, ఆందోళనకు, తరచూ గొడవ పడటం - చివరికి విడాకులకు దారి తీస్తాయని చెప్పారు.

ఈ జనరేషన్ లో ఉన్న దంపతుల పై చేసిన అధ్యయనం లో ఈ విధానంలో మార్పు వచ్చిందని తేలింది. అవేమిటో చూద్దాం.

స్త్రీ-పురుషుల్లో సంతానలేమి సమస్యను నిరోధిండం ఎలా స్త్రీ-పురుషుల్లో సంతానలేమి సమస్యను నిరోధిండం ఎలా

కొంత మందికి ఆశ ఉండటం :

కొంత మందికి ఆశ ఉండటం :

మొదటగా, ఈ అధ్యయనంలో భాగంగా చేసిన సర్వేలో "కొత్త పద్దతుల ద్వారా వచ్చిన ట్రీట్మెంట్స్ పై వారికి నమ్మకం ఉందని - అవి కూడా ఫెయిల్ అయితే 'దత్తత' తీసుకున్నేందకు సిద్దంగా ఉన్నామని తెలిపారు".

విద్య వల్ల వచ్చిన మార్పులు :

విద్య వల్ల వచ్చిన మార్పులు :

కొన్ని దశాబ్దాల క్రితం, గర్భం రాని ఆడవాళ్లు (మహిళలు) చాలా ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారు. అలాగే మగవాళ్లు కూడా వాళ్ళ జీవితాల గూర్చి బెంగ పడేవారు. ఇప్పుడు అలాంటివేమి లేవని ఈ అధ్యయనం చెప్తుంది.

ఎందుకంటే అమ్మాయిల్లో చదువు, అవగాహన స్థాయి పెరగటం వంటి కారణాల వల్ల. కేవలం పిల్లల కోసమే జీవితం కాదన్న ఆలోచనని కలిగి ఉన్నారు.

మగవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే మోడ్రన్ హ్యాబిట్స్..!! మగవాళ్లలో ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే మోడ్రన్ హ్యాబిట్స్..!!

అందమైన జీవితం కోసం ఇంకా ఎన్నెన్నో :

అందమైన జీవితం కోసం ఇంకా ఎన్నెన్నో :

ఈ రోజుల్లో విలువైన జీవితాన్ని ఆస్వాధించడానికి ఇంకా చాలా రకాలైన విషయాలు ఉన్నాయని చాలా మంది దంపతులు ఒప్పుకున్నారు. వృత్తి (కెరియర్), లక్ష్యాలు (గోల్స్), సాహసాలు, ఇతర దేశాల ప్రయాణాలు వంటివి పిల్లలు లేని లోటును మరచిపోయి పూర్తిగా లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడంలో హెల్ప్ చేస్తున్నాయి.

కొత్త అధ్యయనం ప్రకారం :

కొత్త అధ్యయనం ప్రకారం :

45,000 మంది జంటలపై చేసిన ఇంటర్వ్యూ ఆధారంగా, భాగస్వామికి సంతానోత్పత్తి లేమి కారణంగా విడాకులు ఇవ్వడానికి 1% కూడా రెడీ గా లేరని తేలింది.

సమాజపరమైన ఇబ్బందులు :

సమాజపరమైన ఇబ్బందులు :

పిల్లలు లేని దంపతులను ఈ సమాజం ఏ విధంగా చూస్తూంది? అనే విషయం మీద పాల్గొన్న జంటలు అభివృద్ధి చెందిన దేశాలలోని గల నగరాల్లో జీవిస్తున్నవారు. వారు ఉన్నత చదువులు చదివినవారు కావడం వల్ల, వాళ్ల చుట్టూ ఉన్న వారి నుండి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దంపతులు నేటికీ వారి దగ్గర బంధువుల నుండి, స్నేహితుల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

సంతానలేమి గురించి కొన్ని షాకింగ్ అపోహలు..వాస్తవాలు.. సంతానలేమి గురించి కొన్ని షాకింగ్ అపోహలు..వాస్తవాలు..

మారుతున్న కాలానికి అనుగుణంగా :

మారుతున్న కాలానికి అనుగుణంగా :

ప్రస్తుత పరిస్థితులు ముందు ముందు ఇంకా మారబోతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

భవిష్యత్తులో సంతానోత్పత్తి చికిత్స విధానం బాగా అభివృద్ధి చెందుతాయని, అలాగే కొత్త మార్గాలను అన్వేషించడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని పొందవచ్చని చెబుతున్నారు.

అవిశ్వాసం, అనుకూలత లేకపోవడమే విడాకులకు కారణమని - సంతానోత్పత్తి లేమి కారణంగా ఇప్పుడున్న ప్రపంచంలో ఎవరూ విడిపోలేదని ముగించారు.

English summary

Does Infertility Lead To Divorce?

If a married person is suffering from infertility, does the marriage fail? No, say researchers. Read this!
Desktop Bottom Promotion