For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వివాహ జీవితంలో కష్టతరమైన దశలు

  |

  ప్రతి బంధానికి వివిధ దశలు ఉంటాయి. కొన్ని దశలు చాలా అందంగా ఉంటే, మరికొన్ని కష్టంగా గడుస్తాయి. పెళ్ళి విషయానికొస్తే, ఏ దశలు సంతోషకరమైనవి? ఏవి కష్టతరమైనవి?

  మీరు కేవలం పెళ్ళయిన మొదటి దశలే ఆనందంగా ఉంటాయని భావిస్తే, అది సరికాదు. ఆ దశలో మీరు అదో రకమైన ఉల్లాసకర మత్తులో ఉంటారు. మీ బంధం మొదలైందన్న ఆనందం తాత్కాలికంగానే ఉంటుంది. అది ఎప్పటికీ అలానే నిలిచిపోదు. మీరు గాల్లో మేఘాల్లో తేలిపోతున్నా, తొందరగానే కిందకి వస్తారు. అప్పుడే నిజజీవితాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  The Hardest Phases Of Married Life

  బంధాల నిపుణులు చెప్పిందాని ప్రకారం పెళ్ళయిన 3వ సంవత్సరం చాలా సంతోషకరంగా, 5 మరియు 7వ సంవత్సరం చాలా కష్టతరంగానూ గడుస్తాయి. ఈ అనేక సర్వేల డేటా దీన్ని సమర్థిస్తోంది. అలా ఎందుకో చర్చిద్దాం…

  3 ఏళ్ల తర్వాత

  3 ఏళ్ల తర్వాత

  చాలా పాపులర్ అయిన అభిప్రాయం ఏ బంధంలోనైనా 3 ఏళ్ళ తర్వాత ప్రేమ ఆవిరైపోతుంది. కానీ దానికి భిన్నంగా మూడేళ్ల తర్వాతనే జంటల మధ్య బంధం గట్టిపడటం మొదలవుతుంది. ఈ సమయంలోనే జంటలు ఒకరిలోఒకరి బలహీనతలను ఒప్పుకోవడం ప్రారంభిస్తారు. సాధారణంగా, వివాహ బంధం 3 ఏళ్ళు దాటితే జంటలు అప్పుడు పిల్లల కోసం ప్రయత్నిస్తారు.

  5 ఏళ్ళ తర్వాత

  5 ఏళ్ళ తర్వాత

  ప్రస్తుత సర్వేలు సూచించినదాని ప్రకారం 5వ ఏడాది చాలా ముఖ్యమైనది. అప్పటికి పిల్లలు కలగకపోతే, జంటలు ఆ విషయంపై వాదించుకుంటారు. పిల్లలు ఉంటే, జంటలు వారి బాధ్యత గురించిన అనేక విషయాలపై వాదించుకోవచ్చు. పిల్లలకి ఆ సమయంలో చాలా శ్రద్ధతో పాటు మీ ఉద్యోగ బాధ్యతలు మిమ్మల్ని కొంచెం కుంగదీస్తాయి. జంటలు ఈ దశను విజయవంతంగా దాటితే, వారు మరొక దశకి ముందుకి వెళ్తారు.

  7 ఏళ్ళ తర్వాత

  7 ఏళ్ళ తర్వాత

  5 వ ఏడాది తర్వాత మళ్ళీ వివాహ బంధంలో ప్రకంపనలు తెచ్చేది 7 వ ఏడాది. సాధారణంగా నిపుణులు 7 వ ఏడాదిని “కాంక్రీటు గోడ”తో పోలుస్తారు. 7ఏళ్ళు కలిసి ఉన్నాక జంటలు తమ జీవన రొటీన్ ను బోరుగా భావిస్తారు. అనేకమంది పెళ్ళయిన వారిలో ఆ దశలో గొడవలు పెరిగిపోవచ్చు. కారణం ఏదైనా కావచ్చు, ఆర్థిక సమస్యలు, పిల్లల పెంపకం, ఇంటిపనులు లేదా చిన్న చిన్న ఇగో సమస్యలు ఏవైనా కావచ్చు. ఈ దశ దాటిన జంటలు మానసికంగా చాలా ధృఢమైనవారు.

  కారణాలు

  కారణాలు

  పెళ్ళి గురించి తప్పుడు అపోహలే విడాకులు పెరగటానికి ముఖ్య కారణం. మరొక కారణం కూర్చుని మాట్లాడుకొని, సమస్యలనుంచి బయటపడటానికి సహనం లేకపోవడం.

  వినే ఓపిక లేకపోవటం

  వినే ఓపిక లేకపోవటం

  వాదన సమయంలో, ఇద్దరు భాగస్వాములు ఒకరిపై ఒకరు తమ చిరాకును ప్రదర్శిస్తూ పోతే విడాకుల అవకాశాలు తప్పక పెరుగుతాయి. ఒకరు మాట్లాడినప్పుడు మరొకరు వినాలి. నిపుణులు చెప్పేది ఏంటంటే అసలైన జంట సహనంగా వినే ఓపికను, ఆ అలవాటును కలిగిఉంటుంది.

  డబ్బు

  డబ్బు

  వైవాహిక జీవితంలో డబ్బు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. డబ్బు సమస్యలు తీర్చుకోలేక అనేకమంది విడాకులు తీసుకుంటారు.

  బోర్

  బోర్

  బోర్ కొట్టి కూడా కొంతమంది తమ భాగస్వాములను మరొకరితో ఉండి మోసం చేస్తారు, మరికొంతమంది విడాకులు తీసేసుకుని ఇంకొకరిని పెళ్ళి చేసుకుంటారు. ఆఖరికి చెప్పేదేంటంటే, జంటలు తమ బోరింగ్ జీవితాలను మార్చుకొని తమ బంధంలో సరికొత్త అనుభూతులు తీసుకురాగలిగితే, విడాకుల వరకూ వెళ్ళదు. అందులో విఫలమైతే, ఇలా విడాకుల కేసులు పెరుగుతూనే ఉంటాయి.

  English summary

  The Hardest Phases Of Married Life

  So, relationship experts say that the 3rd year is generally the happiest year whereas the 5th and the 7th years are the toughest in married life. The data of many surveys seems to support this argument. Now, let us discuss why...
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more