For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఈ లక్షణాలు మీ భార్యలో కనబడుతుంటే..ఆమె ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుట లేదు!

  By Lekhaka
  |

  మీ భార్య ప్రేమతో కూడిన చూపు మీకు గుర్తుందా? మీరు వేసిన జోక్ కి ఆమె నవ్వినపుడు ఆమె కళ్ళు మెరిసాయా? ఆమె మిమ్మల్ని ఉదయానే నిద్రలేపడానికి వచ్చినపుడు ఆమె వంపు తిరిగిన పెదవులపై ఉన్న నవ్వు మీకు గుర్తుందా? అవును అయితే, మీరు క్షేమంగా ఉన్నట్టే, బాధపడాల్సిన అవసరం లేదు. కానీ కాదు అని జవాబు చెప్తే మీ భార్య ఇకముందు మిమ్మల్ని ఇష్టపదట్లేదని సంకేతంతో మీరు ఆశ్చర్యపోవాల్సిందే.

  ఇలాంటి సంకేతాలు చాలా చిన్నవిగా ఉండి, తరచుగా గుర్తించలేము కూడా. మీ భాగస్వామి మిమ్మల్ని ఆకర్షించబడలేదు అనే సంకేతం మీ భాగస్వామి అయిన ఆమెకు కూడా సరిగా తెలీదు. ఇది కేవలం కొంత కాలంగా ప్రేమ, ఆకర్షణ లోపం వల్ల జరుగుతుంది. కొంత సమయం గడిచాక, మనం ఇంటి పనులలో, ఆఫీసు పనులలో నిమగ్నమైపోతాము.

  ఒక జంట కేవలం తరచుగా సంభాశించేది వారి పిల్లల గురించి లేదా ఇంటి విషయాలలో అవసరమైన వాటిపట్ల శ్రద్ధ చూపడం. శృంగారం, ప్రేమ వెనుక సీటులో ఉంటాయి. రోజువారీ జీవితానికి చెందిన మనోవేదన కూర్చొని మాట్లాడుకోడానికి అసాధ్యంగా చేస్తుంది, నిజానికి మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన వివాహం ఇప్పటికీ అదే పాత మంటలు రేపుతుంది.

  మీ భార్య మిమ్మల్ని ఆకర్షించ బడట్లేదు అనే సంకేతాన్ని మీరు వెంటనే గుర్తించండి లేదా కనీసం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా. ఇలా చేయడం వల్ల మీ అనుబంధంలో ఏమి కోల్పోయారో, ఈ సమస్యకు కారణం ఏంటో తెలుసుకోవచ్చు. ఒకసారి సమస్య గుర్తిస్తే, దానిని సరిచేసుకోడానికి ప్రయత్నించి, మీ వైవాహిక జీవితాన్ని తిరిగి వెనక్కు తెచ్చుకోవచ్చు.

  చాలాసార్లు, మీరు పంచుకున్న ప్రేమ జ్వాల వేడిని కోల్పోయి, ఒక చిన్న ప్రేరేపణ వంటరిని చేయోచ్చు. మీ భార్య వివాహంలో ప్రేమలేక లేదా తృప్తిగా లేనపుడు, మోసం చేసే అవకాశం ఎక్కువ ఉంది. మీరు కళ్ళు తెరవండి, మీ భార్య మిమ్మల్ని కోరుకోనపుడు అది జరగడానికి ముందే మోసం చేసే అవకాశాలను నిలిపెయవచ్చు. మీ భార్య మీకు ఆకర్షించ బడట్లేదు అని ఎలా సూచిస్తుంది ఈ క్రింది లక్షణాలను బట్టి తెలుసుకుందాం..

  మీ భార్య మిమ్మల్ని ఆకర్షించ బడట్లేదు అనడానికి సంకేతాలు:

  ఆమె ఇకముందు మీతో సంభాషించదు

  ఆమె ఇకముందు మీతో సంభాషించదు

  సంభషణ అనేది ఏ అనుబంధానికైనా అంతర్గత భాగం. ఒక ఆరోగ్యకర అనుబందంలో భాగస్వాములు వారి జీవితంలోని ప్రతి విషయం గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుంటారు. వారు ఏమి అనుకుంటున్నారో, ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారో తెలియచేసుకుంటారు.

  మీ భార్య కేవలం పిల్లలు, సరుకుల జాబితా గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటే, జాగ్రత్త వహించండి మీ భార్య మీపట్ల ఆశక్తికరంగా లేదని అర్ధం. విషయం ఏ అయితే, ఆమెతో మాట్లాడడం ప్రారంభించండి, ఆమెను మీరు ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి, కొంత రొమాన్స్ చేసి చూపించండి. ఆమె ఖచ్చితంగా స్పందిస్తుంది.

  ఆమె మీకోసం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది

  ఆమె మీకోసం ఎప్పుడూ బిజీగానే ఉంటుంది

  మంచి జంటలు ఎంత బిజీగా ఉన్నా ఒకరికోసం ఒకరు సమయాన్ని కేతాయి౦చుకుంటారు. మీ భార్య ఎల్ల వేళలా బిజీగా ఉంటూ లేదా మీకంటే ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటే, మీకోసం ఎర్ర లైట్ వెలిగినట్లే. ఆమె మనసులో ఏముందో ఆమెతో మాట్లాడి తెలుసుకోండి.

  ఆమె తన గురించి మాత్రమే పట్టించుకుంటుంటే

  ఆమె తన గురించి మాత్రమే పట్టించుకుంటుంటే

  ఆమె తనపై తనే ఎక్కువ శ్రద్ధ కనబరిస్తే, జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్యులు ఇద్దరూ తప్పనిసరిగా ఒకరిపై ఒకరు శ్రద్ధ ఉంచుకోవాలి. ఆమె కేవలం తన గురించి మంచిని మాత్రమే ఆలోచిస్తుంటే, మీపట్ల ఆమెకు ప్రేమ లేదని తెలుసుకోండి.

  ఆమె మిమ్మల్ని తరచుగా అగౌరపరచడం

  ఆమె మిమ్మల్ని తరచుగా అగౌరపరచడం

  ఏ అనుబంధంలోనైనా ఒప్పందం లేకపోవడం అనేది సహజం. కానీ ఒకర్నొకరు గౌరవి౦చుకోకపోవడం అనేది అంగీకరించబడదు. ప్రేమ అనేది ఒకరిని ఒకరు గౌరవి౦చుకోవడంతో పుడుతుంది, ఆమె మిమ్మల్ని తరచుగా అగౌరవిస్తుంటే, హెచ్చరిక గంటలు మోగడం ప్రారంభించినట్టే.

  ఆమె మిమ్మల్ని అధ్వాన్నంగా మారుస్తుంది

  ఆమె మిమ్మల్ని అధ్వాన్నంగా మారుస్తుంది

  వివాహం ప్రతి ఒక్కరినీ మారుస్తుంది, ఎక్కువగా మంచిగా. ప్రతి భాగస్వామి అనుబంధాన్ని కొంత జతచేసుకుని, తన భాగస్వామికి అనుగుణంగా తననితాను లేదా ఆమెను మార్చుకుంటారు. ప్రేమలో ఇది సహజంగా జరుగుతుంది.

  కానే ప్రేమ లేనపుడు, ఆ అనుబంధం విషంతో సమానం. మీరు దురలవాట్లకు, విధ్వంసక మార్పులు మీలో కనిపిస్తే, ఇది మీభార్య ప్రవర్తన కారణంగా మీరు అచేతనంగా అయిన పరిస్థితి.

  ఆమె తన ప్రణాళికల్లో మిమ్మల్ని చేర్చకపోవచ్చు

  ఆమె తన ప్రణాళికల్లో మిమ్మల్ని చేర్చకపోవచ్చు

  మీరు జంట అయినప్పటికీ ప్రతి భాగస్వామి తన స్వంతంగా ప్రణాళికలు వేసుకోవచ్చు కూడా. కానీ మీ భార్య మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రణాళికలలో కలుపుకోవాలని చూడకపోతే, ఆమె మీతో ఎలాంటి సమయాన్ని గడపడానికి ఇష్టపదట్లేదని అనుకోవచ్చు.

  ఆమె మిమ్మల్ని, మీ పనులను ఇకముందు పట్టించుకోదు

  ఆమె మిమ్మల్ని, మీ పనులను ఇకముందు పట్టించుకోదు

  ఒక జంటగా, మీరు ఒక యూనిట్. ఎదుటి వ్యక్తి పనులను పట్టించుకుంటూ, ఒకరిపై ఒకరు శ్రద్ధ వహించాలి. మీ భార్య మిమ్మల్ని, మీ విషయాలను నిర్లక్ష్యం చేయాలనీ నిర్ణయించుకుంటే, మీ అనుబంధంలో ప్రేమను కోల్పోయినట్లే.

  మీకు దగ్గరగా ఉండే వారిని ఆమె విస్మరిస్తుంటే

  మీకు దగ్గరగా ఉండే వారిని ఆమె విస్మరిస్తుంటే

  ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే, ఆమె ఖచ్చితంగా మీ దగ్గర స్నేహితులను, బంధువులను కూడా ఇష్టపడుతుంది. ఆమె వారి ప్రేమకు, అంగీకారానికి ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ ఆమె వారిని విస్మరిస్తే, ఎందుకంటే ఆమె బహుశ మీపట్ల ప్రేమ కోల్పోయినట్లే.

  ఆమె మీకంటే ఇతరులను మెరుగైన వారుగా పరిగణిస్తుంది

  ఆమె మీకంటే ఇతరులను మెరుగైన వారుగా పరిగణిస్తుంది

  ఆమె భర్తగా, మీరు ఆమెపట్ల చాలా శ్రద్ధగా, ప్రేమగా ఉండడం చాలా అవసరం. ఆమె మీకంటే ఇతరులే మెరుగైనవారు అనే మార్గంలో వెళ్తుంటే, ఇది మీపై మీభార్య ఆశక్తి చూపట్లేదనే ఒక సంకేతం కావొచ్చు.

  ఆమె మీ పుట్టినరోజులు, పెళ్లిరోజున మాత్రమే బహుమతులు, కార్డు లు ఇచ్చి ప్రేమను తెలియచేస్తుంటే చిన్న చిన్న బహుమతులు, కార్డ్ లు దంపతులకు ఎంతో ప్రేమను, ఆకర్షణను కలిగిస్తుంది. వారి పుట్టినరోజులు, పెళ్లి రోజుల్లో మాత్రమే రహస్య బహుమతులు పరిమితమై ఉంటే, బహుశ మీభార్య ఇకపై మీతో ప్రేమలో లేదని అర్ధం.

  English summary

  Signs Your Wife Is Not Attracted To You

  The signs your wife is not attracted to you must be noticed immediately or at least as soon as possible. Doing so will make you understand what your relationship lacks and what the reason behind this problem is. Once the problems are recognized, you can try to correct them and bring your marriage back to life.
  Story first published: Friday, May 26, 2017, 19:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more