భార్యాభర్తలంతా ఇలా చేసి ఉంటారండోయ్

Posted By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

భార్యాభర్తల మధ్య నిత్యం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కొందరేమో చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. మరికొందరు కాస్త కస్సుబుస్సులాడుతుంటారు. అయితే భార్యాభర్తల్లో ప్రతి ఒక్కరూ కొన్ని విషయాల్లో ఒకే మాదిరిగా ఉంటారు. వారి జీవితంలో ఒక్కసారైనా అందరు దంపతుల మాదిరిగానే వ్యవహరించి ఉంటారు.

ఇలా తెలియకుండానే ప్రతి ఒక్కరూ ఒకేవిధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే జంటగా మారుతారో అప్పుడే వారి కొత్త ప్రయాణం ప్రారంభవుతుంది. మీరిద్దరూ అలా నడుకుంటూ వెళ్తున్నారనుకో.. అనుకోకుండానే మీ పార్టనర్ చేయిని పట్టుకుంటారు.

things all couples do

రొమాంటిక్ కపుల్ లైలా & మజ్నుల ప్రేమ కథ గురించి మీకు తెలియని 7 ఆసక్తికర రహస్యాలు

అలాగే మీ భాగస్వామి మాట్లాడే విధానాన్ని కూడా మీకు తెలియకుండానే అప్పుడప్పడూ అనుకరిస్తూ ఉంటారు. ఇలా భార్యాభర్తలిద్దరూ తమ జీవితంలో ఒక్కసారైనా చేసి ఉంటారు. అంతేకాదండోయ్.. ఇంకా చాలా చాలా పనుల్ని ప్రతి జంట ఒక్కసారైనా తమ జీవితంలో చేసి ఉంటుంది. మరి అవి ఏమిటో ఒక్కసారి చదువుదామా...

పుట్టబోయే పిల్లలకు పేర్లు పెట్టడం

పుట్టబోయే పిల్లలకు పేర్లు పెట్టడం

చాలా మంది భార్యాభర్తలు దీన్ని ఇష్టపడతారు. భవిష్యత్తులో వారికి పుట్టబోయే పిల్లలకు ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తారు. ఇక మీ ఇద్దరి మధ్య ప్రేమ వికసించిన తొలి రోజులు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఇద్దరూ పార్క్ లో కూర్చొని ఆనందంగా గడుపుతున్న క్షణాల్లో మీరు మీ పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలి అని చర్చించారా ? దాదాపు చాలా మంది ఇలా చర్చిస్తుంటారు.

పోల్చడం

పోల్చడం

దాదాపు అందరు భార్యాభర్తలు ఈ విధంగా చేస్తారు. వారికి తెలిసిన వారిలో ఆనందంగా లేని దంపతులతో తమను పోల్చుకుంటారు. వారితో పోలిస్తే తాము ఎంతో సంతోషంగా ఉన్నామనే భావనలోకి వెళ్లిపోతారు. వాస్తవానికి ఇది మొదట్లో ఏ జంటకైనా మంచి కిక్ ఇస్తుంటుంది. ఇక మరికొందరు భార్యాభర్తలు తామే బెస్ట్ కపుల్స్ అని అనిపించుకోవాలని భలే తహతహలాడుతుంటారు. దీని కోసం అందరి దృష్టి తమపై పడాలని కోరుకుంటారు. తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామనే భావన అందరిలో కలిగిలే ప్రవర్తిస్తుంటారు.

ఒకరి దుస్తులు మరొకరు వాసన చూసుకోవడం

ఒకరి దుస్తులు మరొకరు వాసన చూసుకోవడం

మీ భాగస్వామి బయటకు వెళ్లినప్పడు మీరు ఎప్పుడైన వారి దుస్తుల వాసన చూశారా? దాదాపుగా దంపతుల్లో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఒక్కసారైనా చేసి ఉంటారు. అది వారి మధ్య ఉండే ప్రేమకు నిదర్శనం. తమ భాగస్వామిని మిస్ అయ్యామనే ఫీలింగ్ దీనివల్ల కలుగుతుంది.

బాగా వంట చేయనా అని అడగాలనుకుంటారు

బాగా వంట చేయనా అని అడగాలనుకుంటారు

మీరు ఒక మంచి రుచికరమైన వంటకం సిద్ధం చేసి ఉంటారు. ఇక అది తింటే మీ భర్త కచ్చితంగా మిమ్మల్ని పొగడ్తల్లో ముంచివేయడం ఖాయం అని అనుకుంటారు. కానీ అతను మాత్రం కొద్దిగా తిని మిగతాదంతా వదిలేస్తాడు. దీంతో మీరు వంట బాగా చేశామా లేదా అని మదనపడుతారు. నేను అంత బాగా వండలేదా అని అతన్ని అడగాలని మీకు అనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా జరిగి ఉంటుంది.

డర్టీ మెసేజ్ పంపడం

డర్టీ మెసేజ్ పంపడం

కొన్ని సందర్భాల్లో చాలామంది భార్యాభర్తలు ఒకరికొకరు డర్టీ మెసేజె స్ పంపుకోవడంలో భలే ఎంజాయ్ చేస్తారు. అయితే మీ భాగస్వామిని ఇలా సరదాగా ఆటపట్టించడం అంత చెడ్డ విషయం ఏమీ కాదు. కాబట్టి అప్పడప్పుడు ఇలా చేస్తూ ఉండండి. సరదాగా గడుపుతుంటూ ఉండండి.

నిక్ నేమ్స్ పెట్టుకోవడం

నిక్ నేమ్స్ పెట్టుకోవడం

చాలామంది భార్యాభర్తలు ఒకరికొకరు నిక్ నేమ్స్ పెట్టుకుంటారు. పండు, బంగారం, డార్లింగ్ అంటూ ముద్దుగా క్యూట్ క్యూట్ గా పిలుచుకుంటు ఉంటారు. అలాంటి పిలుపులంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే కదా. అందుకే తమ భాగస్వామి ఇలా నిక్ నేమ్ తో పిలవడమంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే.

పిల్లలు పుట్టిన తర్వాత ఇలా చేయడం కొంచెం కష్టం కదండీ...!

పిల్లల మాదిరిగా ఒడిలో వాలిపోతారు

పిల్లల మాదిరిగా ఒడిలో వాలిపోతారు

ఇక మీ భర్త ఆఫీస్ నుంచి విచారకరంగా ఇంటికొచ్చినప్పడు.. మీరు ఏమైందని అతన్ని అడుగుతారు. ఇక అతను తిన్నగా మీ దగ్గరకు వచ్చి మీ ఒడిలో తన తల వాల్చి జరిగిందంతా చెప్పుకొస్తాడు. అప్పడు తను మీ దగ్గర ఒక చిన్నపిల్లాడిలా మారిపోతాడు. మా ఆఫీసులో అన్ని చెత్త రాజకీయాలున్నాయి.. అని అక్కడి విషయాలన్నీ మీకు పూసగుచ్చినట్లు వివరిస్తాడు. భార్యాభర్తల్లో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక్కసారైనా ఇలా చేసి ఉంటారు. అయితే భార్యభర్తల్లో ఒకరి ఇలా వారి బాధలు చెప్పుకుంటుంటే మరొకరేమో వారిని ఓదార్చుతుంటారు.

అక్కడ వచ్చే దద్దుర్లను చూపిస్తారు

అక్కడ వచ్చే దద్దుర్లను చూపిస్తారు

ఇక శరీరంలో కొన్ని ప్రాంతాల్లో దద్దుర్లు ఏర్పడినా లేదంటే ఏదైనా మచ్చలా ఉన్నా వాటిని కనీసం అద్దంలో కూడా మనం చూడలేని పరిస్థతి ఉంటుంది. భార్యాభర్తల్లో ఎవరికైనా ఈ పరిస్థితి వస్తే వారు వారి భాగస్వామికి చూపిస్తారు. నాకు అక్కడ ఏమైందో ఒకసారి చూడండి.. బాగా దురదగా ఉంది అంట భాగస్వామి సాయం కోరుతారు.

ఇక వారి పార్టనర్ అక్కడ చూసి ఏముందో వివరిస్తారు. దాదాపు అందరూ దంపతులు ఈ విధంగా చేసి ఉంటారు.

వృద్ధాప్యంలో ఎలా ఉంటామని ఊహించుకోవడం

వృద్ధాప్యంలో ఎలా ఉంటామని ఊహించుకోవడం

ఇక వృద్ధాప్యంలో తాము ఎలాగుంటామని భార్యాభర్తలు ఊహించుకుంటారు. ఇలా దంపతుల్లో ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఒక్కసారైనా ఊహించుకుని ఉంటారు. ఇలా చేయడాన్ని కూడా థ్రిల్ గా భావిస్తారు. మీరు కూడా మీ వైవాహిక జీవితంలో ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే మీ మధ్య ప్రేమ ఎప్పటికప్పడు మరింత బలపడుతుందని అర్థం.

English summary

Things All Couples Do But Never Admit

There are some things all couples do but never admit. Some of them are cute and some of them are weird.
Story first published: Thursday, November 2, 2017, 18:00 [IST]