భార్య కన్నా భర్త తక్కువ డబ్బు సంపాదిస్తుంటే..?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రపంచమంతా డబ్బు వెనకాలే తిరుగుతూ ఉంటుంది, దురద్ర్ష్టవశాత్తూ మానవ సంబంధాలు కూడా డబ్బు మీదే అల్లుకుని ఉంటాయి.కానీ మీకిష్టమైన వారి దగ్గరకి వచ్చేసరికి మాత్రం మీ మధ్యలో డబ్బు ప్రసక్తి తేవడం మీకు నచ్చదు.

మీ బంధం మధ్యలో డబ్బు చేరితే ఆ బంధం ఆకర్షణని కోల్పోతుంది.ఈ రోజు మేము వివాహ బంధంలో డబ్బు ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాము.కేవలం ప్రేమ మాత్రమే మీ కడుపు నింపదు కాబట్టి మీ కుటుంబాన్ని పోషించుకోవడానికి డబ్బు సంపాదించడం ముఖ్యం.

కానీ భార్యగా మీరు ఎక్కువ సంపాదిస్తూ మీ భర్త తక్కువ సంపాదిస్తోంటే? మీరు ఆయనని తక్కువ చేసి చూస్తారా? ఆయనని మీరు ఎలా చూసుకుంటారు? తమ సంపాదన భార్య సంపాదన కన్నా తక్కువయితే పురుషులు ఆత్మ న్యూనతతో బాధపడతారు.భార్య సంపాదన భర్త సంపాదన కన్నా ఎక్కువ ఉంటే ఎదురయ్యే పరిస్థితులేమిటో తెలుసుకుందాం..

తక్కువ చేసి చూడటం:

తక్కువ చేసి చూడటం:

మీ భర్త కనుక మీ కన్న తక్కువ సంపాదిస్తోంటే అతని శక్తి సామర్ధ్యాలని కేవలం సంపాదన ఆధారంగా అంచనా వేయడమంటే అతన్ని అవమానించడమే. ఆయనని మీతో సమానంగా గౌరవించండి.

ఆడంబరంగా మాట్లాడటం:

ఆడంబరంగా మాట్లాడటం:

మీరెక్కువ సంపాదిస్తున్నారని మీ జీతం గురించి మీ భర్త దగ్గర పదే పదే ప్రస్తావిస్తే అది ఆయన మనస్సుకి ముల్లులా గుచ్చుకుంటుంది. మీరు ఎక్కువ సంపాదిస్తున్నారని ఆయనకి తెలుసు, కానీ అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తే తన జీతం తక్కువ అని మీరు ఆయనకి పదే పదే గుర్తు చేసినట్లవుతుంది.

సరిపోల్చుకోవడం:

సరిపోల్చుకోవడం:

పదే పదే సంపాదనలని పోల్చి చూసుకుంటే మీ బంధం మరింత జటిలమవ్వడం తప్ప ఏమీ ఒరగదు. మీ ప్రక్కింటివారు అంత సంపాదిస్తున్నారనీ, అవి కొనుక్కున్నారనీ చెప్తూ మీ భర్తని ప్రక్క వాళ్ళతో పోల్చడం వల్ల అతని ఆత్మ గౌరవం దెబ్బతింటుంది.

సహకారాన్ని తక్కువ చేయడం:

సహకారాన్ని తక్కువ చేయడం:

ఏదైనా బిల్లు కట్టడంలో తానూ పాలుపంచుకుంటానని మీ భర్త ముందుకి వస్తే అతను చాలా తక్కువ మొత్తాన్ని ఇస్తున్నాడని నవ్వవద్దు. మీ ఇంటి నిర్వాహణకి తన జీతంలోంచి అతను ఎంత ఇచ్చినా ఆనందంగా తీసుకోండి. గృహ నిర్వాహణలో తానూ తోడ్పాటు అందిస్తున్నాడన్న భావన కలుగచేయండి.

భర్త ఖర్చులు:

భర్త ఖర్చులు:

మీ భర్త మీద మీరెప్పుడైనా ఖర్చు చెయ్యాల్సి వస్తే మీరు అతని కోసం ఇంత చేస్తున్నారు అంత చేస్తున్నారని పదే పదే అనకండి. అది ఆయన మనసుని గాయపరచి ఇక జీవితంలో మీ నుండి ఎటువంటి బహుమతినీ తీసుకోకుండా చేస్తుంది.

భర్త ఉద్యోగం గురించి హేళన చేయడం:

భర్త ఉద్యోగం గురించి హేళన చేయడం:

మీ భర్త మీ కన్నా తక్కువ సంపాదిస్తున్నాడని అతని ఉద్యోగాన్ని అవహేళన చేయవద్దు. ప్రతీ ఉద్యోగమూ గౌరవనీయమైనదే. మీ భర్త తాను చేసే ఉద్యోగాన్ని ఆస్వాదించనీయండి.

English summary

What If Your Husband Earns Less?

The world runs on money and unfortunately, most of the human relationships are also built on money. But when it comes to your loved ones, you don't want to bring money into the equation.
Story first published: Saturday, June 10, 2017, 16:00 [IST]
Subscribe Newsletter