అతనితో ఆ సుఖం కోసమే నా భర్తను చంపాను

Written By: Bharath
Subscribe to Boldsky

స్వాతి ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు జనం లేరు. ఏడు అడుగులు నడిచిన భర్తను ఎందుకు చంపింది. అందరూ ఎవడు సినిమా స్టోరీలా ఉంది ఈ కథ అంటున్నారు. కానీ ఆమె కోణంలో మాత్రం ఇది ఒక సీరియల్ ను చూసి ప్రేరణ పొంది చేసిన మర్డర్. చంపేముందు వేసిన స్కెచ్ ఏమిటి? అంత పకడ్బందీగా ఎలా ప్లాన్ చేయగలిగింది? చివరకు ఈ కేసు వెలుగులోకి రావడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి? ఈ ఘటనపై జడ్జికి రాత పూర్వక వాంగ్మూలం కూడా ఇచ్చింది స్వాతి. అసలు ఎలాంటి స్కెచ్ వేసింది.. ఎలా ప్లాప్ అయిందో స్వాతి మాటల్లోనే చూద్దామా.

మాది ప్రేమ పెళ్లి

మాది ప్రేమ పెళ్లి

మాది నాగర్‌కర్నూల్‌ పట్టణం. మా ఆయన పేరు సుధాకర్‌రెడ్డి. ఆయన కాంట్రాక్టర్‌. మేము నాగర్ కర్నూల్ లోని ఓ కళాశాల పక్కన ఓ అద్దెఇంట్లో నివాసం ఉండేవాళ్లం. మా ఆయన నన్ను ఇంట్లో ఉంచి కాంట్రాక్ట్‌ పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లేవాడు. మా ఆయన సొంతగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం, బండపల్లి. నాది కూడా అదే మండలం. మా పెళ్లి ఎనిమిదేళ్ల క్రితం జరిగింది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. హైదరాబాద్‌లో కొంతకాలం ఓ ప్రైవేటు కంపెనీలో మా ఆయన పనిచేశాడు. తర్వాత కాంట్రాక్టర్ గా మారి నాగర్ కర్నూల్ సమీపంలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేశాడు.

టీవీ సీరియల్స్ చూసేదాణ్ని

టీవీ సీరియల్స్ చూసేదాణ్ని

అప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. నేను ఎక్కువగా టీవీ సీరియల్స్ చూసేదాణ్ని. అందులో చేసే వాటిని ఒక్కోసారి నిజ జీవితంలో కూడా అనుసరించేదాన్ని. ఒంటరిగా ఉండే నాకు ఏమి తోచేది కాదు. వ్యాపారం విషయాలతో మా ఆయన తీరికలేకుండా తిరగడంతో నన్ను పట్టించుకోవడంలేదనే నాకు కోపం వచ్చేది. నాకు ఎవరితో మాట్లాడాలో అర్థం అయ్యేదికాదు.

రాజేష్ పరిచయం

రాజేష్ పరిచయం

ఆ క్రమంలో నాకు రాజేష్‌ పరిచయమయ్యాడు. అతనిది కొత్తకోట మండలం అజ్జకోలు గ్రామం. నాగర్ కర్నూల్ లోని ఓ ఫిజియోథెరపి సెంటర్‌లో రాజేష్‌ పని చేసేవాడు. మా పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. మా ఆయన నన్ను సరిగ్గా పట్టించుకోవడంతోనే అడ్డదారి తొక్కాను. రెండేళ్లుగా రాజేశ్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నా.

మా ఆయకు తెలిసింది

మా ఆయకు తెలిసింది

మా ఇద్దరి వ్యవహారం మా ఆయనకు తెలిసింది. నన్ను గత నెల 26న నిలదీశాడు. నాపై చేయిచేసుకున్నాడు. ఇద్దరం తోసుకోవడంతో మా ఆయన తలకు గాయమైంది. అదేరోజు రాత్రి మా ఆయన ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికివచ్చాడు. అయితే ఇక నుంచి నాకు రాజేశ్ తో ఆ సుఖం ఉండదని భావించాను. ఎలా అయినా సరే రాజేశ్ తోనే ఉండాలనుకున్నా. దీంతో నేను నా బాయ్ ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి మా ఆయన్ని హత్య చేసేందుకు ప్లాన్ వేశాం.

హత్య ఇలా చేశాం

హత్య ఇలా చేశాం

ఆరోజు రాత్రే మా ఆయన్ని చంపాలనుకున్నాం. కానీ మా ఇంట్లో మరో వ్యక్తి ఉన్నాడు. పని కుదరలేదు. తెల్లవారుజామున వచ్చిన అతను బయటకు వెళ్లాడు. వెంటనే రాజేష్‌ ను ఇంటికి పిలిపించా. నిద్రిస్తున్న మా ఆయన మెడకు మత్తు ఇంజక‌్షన్‌ ఇచ్చాం. అతను అరవకుండా నోట్లో బట్టలు కుక్కాం. తర్వాత నేను నా బాయ్ ఫ్రెండ్ కలిసి ఇనుప రాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై బాదాను. వెంటనే మా ఆయన చచ్చిపోయాడు.

శవాన్ని అలా తరలించాం

శవాన్ని అలా తరలించాం

మా ఆయన శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేశాం. నేను నా బాయ్ ఫ్రెండ్ రాజేష్‌ తో కలిసి నవాబ్‌పేట వద్దనున్న అడవిలోకి శవాన్ని తీసుకెళ్లాం. అక్కడ శవాన్ని పడేశాం. మా వెంట పెట్రోల్‌ తీసుకెళ్లాం. దాంతో మా ఆయన శవాన్ని తగులబెట్టాం. తర్వాత అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చాం.

మా ఆయనను కొట్టినట్లు ప్లాన్ వేశాం

మా ఆయనను కొట్టినట్లు ప్లాన్ వేశాం

మా ఆయనను కొందరు వ్యక్తులు ముసుగులు ధరించి కొట్టారని, యాసిడ్‌ దాడికి పాల్పడ్డారని మేము ప్లాన్ వేశాం. మా ఆయనపై యాసిడ్ దాడి జరిగిదంటూ ఇంట్లో వాళ్లకు చెప్పా. దీంతో మా ఆయన సోదరుడు సురేందర్‌రెడ్డి గత నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేను మా ఆయనను చికిత్స కోసం హైదరాబాద్‌కు హుటాహుటిన తీసుకెళ్తున్నట్లు సురేందర్‌రెడ్డికి చెప్పాను. అదేవిధంగా సురేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అతని ప్లేస్ లో రాజేశ్

అతని ప్లేస్ లో రాజేశ్

టీవీ సీరియల్స్ చూసే నాకు మా ఆయన్ని చంపాక ఒక ఐడియా వచ్చింది. రాజేశ్ ను నా భర్త స్థానంలోకి తెచ్చుకోవాలనుకున్నా. సేమ్ మా ఆయన మాదిరిగా అతనికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించాలనుకున్నా. కానీ అంత వరకు ఒక హైడ్రామా ఆడుదామనుకున్నా. రాజేష్‌ ముఖం ఎవరూ గుర్తుపట్టకుండా చేసుకోవాలని ఐడియా ఇచ్చా. దీంతో అతను ముఖానికి ఓ టవల్‌ కట్టుకుని దానిపై పెట్రోల్‌ పోసుకుని పెద్దగా గాయాలు కాకూండా నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ముఖం నల్లగా మారడంతో ఇక ఎవరూ గుర్తుపట్టరని భావించాం.

ప్లాస్టిక్ సర్జరీ చేయించొచ్చు అనుకున్నా

ప్లాస్టిక్ సర్జరీ చేయించొచ్చు అనుకున్నా

ఆ తర్వాత ప్లాస్టిక్‌ సర్జరీ చేయించి సేమ్ మా ఆయన మాదిరిగా మార్చుకుని ఇంట్లోనే పెట్టుకుందామనుకున్నా. కొంతమంది దుండగులు వచ్చి నా భర్తపై యాసిడ్‌ పోశారని అందరిని నమ్మించాను. హుటాహుటిన రాజేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్‌ చేయించాను. ఈ విషయంలో మా ఆయన కుటుంబ సభ్యులందరినీ నమ్మించాను. రాజేశ్‌ ట్రీట్‌మెంట్‌కు అయిన ఖర్చును కూడా వారితోనే పెట్టించాను.

వారం రోజుల వరకు నమ్మారు

వారం రోజుల వరకు నమ్మారు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్ ను మా ఆయనే అని మా బంధువులు, పోలీసులు అందరినీ నమ్మించా. ఇలా వారంరోజుల వరకు ఎవరికీ డౌట్ రాలేదు. డాక్టర్లు కాలిన గాయాలు నయం అయ్యాయని, డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో మా ఆయన సోదరుడు, ఆయన తల్లి ఆస్పత్రికి వచ్చారు. అప్పటి వరకు రాజేశ్ ముఖం ఎవరికీ చూపించలేదు. అయితే వారిద్దరూ ఇబ్బందిపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి ఉన్న ముసుగు తీయాల్సి వచ్చింది. దీంతో అతను మా ఆయన కాదని అనుమాన పడ్డారు.

మటన్ సూప్ ఇచ్చారు తాగలేదు

మటన్ సూప్ ఇచ్చారు తాగలేదు

ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది మా ఆయన కాదని అతని కుటుంబసభ్యులకు అనుమానం బలపడడానికి చాలా కారణాలున్నాయి. అందులో ఒకటి మటన్ సూప్. మా ఆయనకు నాన్ వెజ్ చాలా ఇష్టం. నా బాయ్ ఫ్రెండ్ రాజేశ్ నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదు. మా ఆయన అనుకుని రాజేశ్‌ కు మా అత్త, మా ఆయన సోదరుడు మటన్ సూప్ తీసుకొచ్చారు. దాన్ని రాజేశ్ తాగలేదు. దీంతో మా ఆయన కుటుంబీకులకు అనుమానం పెరిగింది.

పోలీసులకు సమాచారం ఇచ్చారు

పోలీసులకు సమాచారం ఇచ్చారు

మా ఆయనపై యాసిడ్ దాడి జరిగిందని అందరినీ నమ్మిచడంతో ఆ కేసుపై దర్యాప్తు కొనసాగించారు పోలీసులు. అయితే సురేందర్‌రెడ్డికి, మా ఆయన తల్లి మా అత్త సుమతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది మా ఆయన కాదని డౌట్ రావవడంతో దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మా కేసు కొత్త మలుపు తిరిగింది.

వేలి ముద్రలు

వేలి ముద్రలు

పోలీసులు విచారించడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాం. నన్ను, నా ప్రియుడు రాజేష్‌ ను పోలీసులు వారి శైలిలో విచారణ జరపడంతో అసలు విషయం చెప్పాం. కేసు విచారణలో భాగంగా నా ప్రియుడు రాజేశ్‌ ఆధార్‌ కార్డు వేలిముద్రలతో దొరికిపోయాడు.

అంగీకరించాం

అంగీకరించాం

పథకం ప్రకారమే మా ఆయన సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించాం. దీంతో నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా ఆయన సుధాకర్‌రెడ్డి శవాన్ని తగలబెట్టిన నవాబ్‌పేట మండలం ఫతేపూర్‌ మైసమ్మ అడవి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ కాలిన శవం, ఎముకలు, పుర్రెను తీసుకొని వచ్చారు పోలీసులు. వాటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు.

English summary

why this woman kills hubby in a sinister plan with lover

Nagarkurnool swathi kills husband, pours acid on lover's face. Why? Aadhaar, mutton soup helps find answer
Story first published: Wednesday, December 13, 2017, 9:00 [IST]
Subscribe Newsletter