మా అమ్మకు నేనే దగ్గరుండి మళ్లీ పెళ్లి చేయించాను - My Story #54

Written By:
Subscribe to Boldsky

నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటే ఎంతో ఇష్టం. నాకోసం ఆమె పడ్డ ప్రతి కష్టం నాకు గుర్తుంది. అందుకే ఆమెకు ఏ కష్టం వచ్చినా కూడా నేను తట్టుకోలేను. మా నాన్న ఉన్నన్ని రోజుల్లో ఆమెకు ఏ కష్టం రాలేదు. కానీ మా నాన్న మా నుంచి దూరం అయ్యాక ఆమెలో ఏదో తెలియని వెలితి ఏర్పడింది. నేను ఎన్ని రకాలుగా ఆమెను సంతోషంగా ఉంచాలని ప్రయత్నించినా నాన్న లేని లోటును మాత్రం తీర్చలేకపోయాను. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అసలు స్టోరీ ఏమిటో మీరే చదవండి.

ఆమెకు నేనే దిక్కు

ఆమెకు నేనే దిక్కు

మా నాన్న గుండెపోటుతో మరణించాడు. మా అమ్మ వితంతువు అయ్యింది. నా తల్లికి ఉన్న ఒక్క కూతుర్ని నేనే. ఆమెకు నేను దిక్కు అయ్యాను అందుకే నేనే పెళ్లి పెద్దగా మారి మా అమ్మకు రెండో పెళ్లి జరిపించాను.

దు:ఖాన్ని దూరం చేయాలనుకున్నాను

దు:ఖాన్ని దూరం చేయాలనుకున్నాను

మాది రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరం. జైపూర్ నగరంలో మా అమ్మ గీతా అగర్వాల్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. మా నాన్న ముకేష్ గుప్తా గుండెపోటుతో రెండేళ్ల క్రితం మరణించాడు. దీంతో అమ్మవిషాదంలో మునిగిపోయింది.మా నాన్న ఆకస్మిక మరణంతో వితంతువుగా మారిన మా తల్లి నిరాశ చెందడం నేను రోజూ చూసేదాన్ని. ఎలాగైనా నా తల్లి దు:ఖాన్ని దూరం చేయాలనుకున్నాను.

తోడు ఉండాలని అనుకున్నాను

తోడు ఉండాలని అనుకున్నాను

నేను గురుగ్రామ్‌లో ఉద్యోగం చేస్తున్నాను. వారాంతాల్లో జైపూర్ వచ్చి రెండురోజులు నా తల్లితో గడిపి ఆమెను సంతోషంగా ఉంచుతూ ఉంటాను. అయినా నా తల్లి నైరాశ్యాన్ని దూరం చేసేందుకు ఆమెకు జీవితాంతం ఒక తోడు ఉండాలని నేను అనుకున్నాను.

మరో పెళ్లి

మరో పెళ్లి

మా అమ్మకు మరో పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నేను నా తల్లి ప్రొఫైల్ ను తయారు చేసి దానిలో తన ఫోన్ నంబరు ఇచ్చి రెండోపెళ్లికి ప్రకటన ఇచ్చారు. తన భార్య కేన్సర్ తో మరణించడంతో ఒంటరి అయిన ఒక రెవెన్యూ ఇన్ స్పెక్టరు కృష్ణగోపాల్‌ గుప్తా మా అమ్మ సంబంధం నచ్చింది.

అతనికి చాలా పరిణతి

అతనికి చాలా పరిణతి

ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని మేమసలు ఊహించనే లేదు. అంతా హటాత్తుగా జరిగిపోయింది. ఆరోగ్యంగా ఉన్న మా నాన్నగారు ఉన్నట్లుండి పోయారు అని ఆయనతో చెప్పాను. అతను కూడా నా మాటను అంగీకరించాడు. అతనికి చాలా పరిణతి ఉంది.

ఆర్యసమాజం సంప్రదాయంలో

ఆర్యసమాజం సంప్రదాయంలో

గత డిసెంబర్‌ మూడవ తేదీన ఆర్యసమాజం సంప్రదాయంలో మా అమ్మకు, కృష్ణగోపాల్‌కూ పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల నుంచి నాలుగు వందల మంది మిత్రులు, బంధువులు హాజరయ్యి దంపతులను అభినందనలు తెలిపారు.

నేను పెళ్లి పెద్దగా

నేను పెళ్లి పెద్దగా

అయితే కొందరు బంధువులంతా మా అమ్మ పెళ్లికి వ్యతిరేకించారు. వారి మాటను నేను ఖాతరు చేయలేదు. నేను పెళ్లి పెద్దగా మారి నా తల్లికి కృష్ణగోపాల్‌ గుప్తాతో రెండో పెళ్లి చేశాను. పెళ్లికి ముందే తల్లికి గర్భాశయాన్ని తొలగిస్తూ శస్త్రచికిత్స చేయించి పెళ్లి జరిపించాను. రెండో పెళ్లి అనంతరం తల్లి ముఖంలో విరిసిన చిరునవ్వు నాలో సంతోషాన్ని నింపింది.

Image Source :http://www.vanitha.in

English summary

daughter plays matchmaker for her widowed mother

daughter plays matchmaker for her widowed mother
Story first published: Monday, January 22, 2018, 14:42 [IST]