2018లో మీ రాశిని బట్టీ మీ రంగంలో ఎలాంటి స్థాయికి వెళ్తారో తెలుసుకోండి

Written By:
Subscribe to Boldsky

2017లో మీరు చాలా ఇబ్బందులుపడి ఉంటారు. అయితే 2018లో మీరు మీ రంగంలో ఎదుగుతారా లేదా అనే సందేహం ఉంటుంది. అయితే మీ రాశి ప్రకారం మీరు ఉన్న రంగంలో రాణిస్తారో లేదో తెలుసుకోవొచ్చు.

మేషం

మేషం

2018లో మీకు మీ భాగస్వామితో అన్యోన్య బంధం ఏర్పడుతుంది.

ఇక మీరు మీ రంగంలో బాగానే రాణిస్తారు. అలాగే మీకు ప్రమోషన్లు కూడా వస్తాయి. మీరు ఉద్యోగరీత్యా బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంటిని కూడా నిర్మించుకునే అవకాశం ఉంటుంది.

వృషభం

వృషభం

ఈ ఏడాది మీకు కొన్నిరకాల సవాళ్లు ఏర్పడుతాయి. వాటిని అధిగమించేందుకు మీరు కాస్త ప్రయత్నిస్తే చాలు. మీరు వ్యాపారంలో.. మీ రంగంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీరు ఎలాంటి ఇబ్బందులుపడకుండా ఉండాలంటే కాస్త ఎక్కువగానే కష్టపడాలి. మీ రంగంలోని సీనియర్ల వల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకోగలగాలి.

మిథునం

మిథునం

కొన్ని రంగాల్లో పని చేసేవారికి ఈ ఏడాది బాగుంటుంది. కళారంగం, జర్నలిజం రంగాల్లో పని చేసేవారు సంతోషంగా ఉంటారు. మీకు దాదాపుగా ఎలాంటి కష్టాలు రావు. మిగతా రంగాల్లో పని చేసే వారు కూడా సంతోషంగానే ఉంటారు.

కర్కాటకం

కర్కాటకం

ఈ ఏడాది మీకు చాలా బాగుంటుంది. మీ రంగంలో మీరు ఉన్నతస్థానాలకు వెళ్తారు. కొన్ని వందల మంది మీకు ఆటంకాలు కలిగించాలనుకున్నా మీరు మాత్రం అనుకున్న స్థానాలకు చేరుతారు. అలాగే మీకు పెళ్లి కాకుంటే ఈ ఏడాది కచ్చితంగా అవుతుంది. మీరు ఆరోగ్యంగా కూడా బాగానే ఉంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు అన్ని రకాలుగా అండగా నిలుస్తారు.

సింహరాశి

సింహరాశి

2018లో మీ రంగంలో మీకు కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడుతాయి. మీరు మీ తోబుట్టువులు కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారిన పడతారు. అయితే మీ వైవాహిక బంధం మాత్రం బాగానే ఉంటుంది.

కన్య

కన్య

మీ రంగంలో మీరు మంచి స్థానాలకే చేరుకుంటారు. మీరు ఆర్థికంగా ఎదుగుతారు. మీ సీనియర్లు మీ పనిని గుర్తిస్తారు. మిమ్మల్ని అభినందిస్తారు. అయితే మీరు రుణాలు తీసుకోకుండా ఉండడం మంచిదే. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల మీరు కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి.

తుల

తుల

మీకు మీ రంగంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆనందంగా ఉంటారు. మీ రంగంలోని సహచరులతో, ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉండండి.

వృశ్చికం

వృశ్చికం

మీరు మీ రంగంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోరు. అయితే కొన్నిరకాల చిన్నచిన్న సమస్యలు వస్తాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకండి. వెనక్కి వెళ్లకండి.

ధనుస్సు

ధనుస్సు

మీరు చేసే పనులు విజయవంతం అవుతాయి. మీకు ఆదాయం పరంగా కూడా బాగానే ఉంటుంది. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యులు కూడా మంచి మద్దతు ఇస్తారు. అయితే కొన్ని రకాల చిన్నచిన్న సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోని ముందుకెళ్లండి.

మకరం

మకరం

మీకు వృత్తిపరంగా అంతా సానుకూలంగానే ఉంటుంది. చిన్నచిన్న సమస్యలు వచ్చినా వాటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితభాగస్వామి కూడా మీతో అన్యోన్యంగానే ఉంటారు.

కుంభం

కుంభం

మీరు వృత్తిపరంగా ఈ సారి మంచి స్థాయికి చేరుకుంటారు. మీకు ఎలాంటి ఇబ్బందులుండవు. మీరు కొన్ని విషయాల్లో ఇన్వెస్ట్ మెంట్స్ కూడా పెడతారు. మీకు లాభాలు బాగానే వస్తాయి.

మీనం

మీనం

మీరు మీ రంగంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. అయితే మిమ్మల్ని దెబ్బతీసేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. వాటిని మీరూ లెక్కచేయకుండా ముందడుగు వేయండి. మీరు అనుకున్న స్తాయికి ఎదుగుతారు.

English summary

Future Horoscope Predictions 2018 based on Zodiac sign

Future Horoscope Predictions 2018 based on Zodiac sign
Story first published: Thursday, January 4, 2018, 15:30 [IST]