పెళ్లికాక ముందు ఆ కోరికలే లేవు.. కానీ ఇప్పుడు ఏ మగాడ్ని చూసినా టెంప్ట్ అయిపోతున్నా - My Story #44

Written By:
Subscribe to Boldsky

నా పేరు బిందు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నేను ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతాను. నేను ఇప్పుడు బెంళూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నేను ఈజీగా ఆకర్షనకు లోనవుతున్నాను. నాకు ప్రతి ఒక్కరూ నచ్చుతూ ఉంటారు. నాది కాస్త లూజ్ క్యారెక్టరేమోనని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు నేను ఏ అబ్బాయిని కూడా తలెత్తి చూసేదాన్ని కాదు.

పెళ్లయ్యింది.. బాబు ఉన్నాడు

పెళ్లయ్యింది.. బాబు ఉన్నాడు

ఇప్పుడేమో ప్రతి ఒక్కరూ నచ్చుతూ ఉంటారు. నాకు పెళ్లయ్యింది. ఒక బాబు కూడా ఉన్నాడు. మా ఆయన కూడా మా కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఆయనది వేరే డిపార్ట్ మెంట్. నాకు ఆఫీసులో ఆడవాళ్లకంటే ఎక్కువగా అబ్బాయిలతోనే మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. వారిని టెంప్ట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నేను చేసేది తప్పు అని నాకు అప్పుడప్పుడు అనిపించినా ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.

డెస్క్ పై బాడీ మొత్తం పెట్టి

డెస్క్ పై బాడీ మొత్తం పెట్టి

ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి డెస్క్ పై అలా నా బాడీని మొత్తం ఆన్చి మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక పెళ్లి కాని కుర్రాళ్లు చాలామంది నాతో మాట్లాడడానికి బాగా ఇష్టపడతారు. ఆంటీ.. ఆంటీ అంటూ అందరూ నేనంటే పడి చచ్చిపోతారు. ఒక పెళ్లయిన మహిళగా నేను చేసేది కాస్త తప్పని అనిపించినా ఎందుకో కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.

భర్త బాగా చూసుకుంటాడుగానీ..

భర్త బాగా చూసుకుంటాడుగానీ..

అబ్బాయిలు ఆఫీసులో అంతమంది అందమైన అమ్మాయిలున్నా కూడా నాపైనే ఆసక్తి చూపడంతో నేను కూడా లిమిట్స్ దాటుతున్నా. నా భర్త కూడా నన్ను బాగానే చూసుకుంటాడు. కానీ కాస్త అమాయకుడు. అతన్ని మోసం చేస్తున్నామోనని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది.

శారీరకంగా కలవాలని ఉంటుంది

శారీరకంగా కలవాలని ఉంటుంది

ఆఫీసులోని అబ్బాయిలతో శారీరకంగా కూడా కలవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్లతో బాహాటంగా చెప్పలేకపోతున్నాను. ఆఫీసులో పని విడిచిపెట్టి వాళ్లతో గంటల తరబడి ముచ్చట్లు పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆఫీసులో పని కూడా పెద్దగా ఉండదు. అందుకే ఏం చేయాలో తోచదు. మధ్యమధ్యలో నాకు పరిచయం ఉన్న అబ్బాయిలతో చాటింగ్ చేస్తూనే ఉంటా.

అన్ని పనికిరాని మాటలే

అన్ని పనికిరాని మాటలే

నేను అన్నీ అక్కరకు రాని విషయాల గురించే మాట్లాడుతుంటాను. ఏదో మాట్లాడాలంటూ అంటూ అలా అందరితో మాట్లాడుతుంటాను. అందులో పనికి వచ్చేది ఒక్కటి కూడా ఉండదు. నా కెరీర్ పై నేను ఆసక్తి చూపలేకపోతున్నాను.

తిట్టుకున్నా ఫర్వాలేదు

తిట్టుకున్నా ఫర్వాలేదు

నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇక ఆఫీసులోని అమ్మాయిల్లో చాలామందికి నా క్యారెక్టర్ తెలుసు. నన్ను వాళ్లంతా మనస్సులో తిట్టుకుంటూ కూడా ఉంటారు. కానీ నాకు పెద్దగా సిగ్గు అనిపించదు.

అప్పుడు నా క్యారెక్టర్ వేరు

అప్పుడు నా క్యారెక్టర్ వేరు

కానీ నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నా క్యారెక్టర్ ఇలా లేదు. అప్పుడు నేను చాలా సిన్సియర్ గా ఉండేదాన్ని. స్నేహానికి ఎక్కువగా విలువ ఇచ్చేదాన్ని. ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డ కూడా నేను అతని ప్రేమను కూడా అంగీకరించలేదు. అప్పుడు అంత సిన్సియర్ గా ఉన్న నా క్యారెక్టర్ ఇప్పుడు ఎందుకో చాలా లూజ్ గా మారింది.

నా ఇంజనీరింగ్ ప్రేమ కథ ఒక్కసారి చూద్దామా..

నా ఇంజనీరింగ్ ప్రేమ కథ ఒక్కసారి చూద్దామా..

" నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నాకు కాలేజీలో ఒక అతను పరిచయం అయ్యాడు. అతను నా కన్నా రెండేళ్లు సీనియర్. మొదట నేను అతనితో ఎక్కువగా మాట్లాడలేదు. కానీ నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ కు మొత్తం అతను పరిచయం. వాళ్లందరితో అతను బాగా మాట్లాడేవాడు.

ఫేస్ బుక్ లో రిక్వెస్ట్

ఫేస్ బుక్ లో రిక్వెస్ట్

తర్వాత అతనికి నేను ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను. నన్ను చాలా రోజుల వరకు అతను ఫ్రెండ్ గా యాక్సెఫ్ట్ చేయలేదు. దీంతో నేను తర్వాత రిక్వెస్ట్ డిలీట్ చేశాను.

ఒకే చేశాడు

ఒకే చేశాడు

మళ్లీ తర్వాత కొన్ని రోజులకు రిక్వెస్ట్ పంపాను. తర్వాత వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. తను నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాడు. తర్వాత కాస్త భయపడుకుంటూనే నేను అతనికి హాయ్ అని మెసేజ్ పంపాను. అప్పటికే అతను వ్యక్తిత్వం పరంగా నాకు బాగా నచ్చాడు.

మొదట మామూలుగానే

మొదట మామూలుగానే

అతను కూడా నాకు మెసేజ్ పంపాడు. మొదట్లో మేమిద్దరం ఏదో జనరల్ గా చాట్ చేసుకునేవాళ్లం. అన్నం తిన్నావా.. ఏం చేస్తున్నావ్.. ఎక్కడున్నావంటూ చాట్ చేసేవాళ్లం. అయితే రోజూ చాట్ లో ఇద్దరం టచ్ లో ఉండేవాళ్లం. కానీ కాలేజీలో మాత్రం మాట్లాడుకునేవాళ్లం కాదు.

ఇంగ్లిష్ క్లబ్

ఇంగ్లిష్ క్లబ్

కాలేజీలో ఇంగ్లిష్ క్లబ్ ఉండేది. మేమిద్దరం అక్కడికి వెళ్లి మాట్లాడుకునేవాళ్లం. అతను నాకు కొన్ని రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు. ఒక రోజు అతను తన బాధను మొత్తం నాతో చెప్పుకున్నాడు.

కథ విని

కథ విని

తన గర్ల్ ఫ్రెండ్ ప్రేమించినట్లు నటించి తనని మోసం చేసిందని చెప్పారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కథ మొత్తం చెప్పాడు. తన కోసం ఎంతో టైమ్ వేస్ట్ చేసుకున్నానని బాధపడ్డాడు. ఆ కథ వింటే నాకు కూడా బాధగా అనిపించింది.

ధైర్యం ఇచ్చాను

ధైర్యం ఇచ్చాను

నువ్వు ఏమి బాధపడకు అని నేను ధైర్యం చెప్పాను. అతనితో రోజూ మాట్లాడుతూ ఆ బాధ నుంచి బయపడేలా చేసేదాన్ని. ఇద్దరం నైట్ మొత్తం కూడా చాట్ చేసుకునే వాళ్లం. తనని నేను బెస్ట్ ఫ్రెండ్ గా ఫిక్స్ అయ్యాను. అతను చాలా మంచివాడు. ఏ చెడు అలవాటు లేదు. అందుకే నాకు బాగా నచ్చాడు. నన్ను చాలా మెచ్చుకునేవాడు.

చీర కట్టుకుని వెళ్లా

చీర కట్టుకుని వెళ్లా

అయితే ఒక రోజు నేను చీర కట్టుకుని కాలేజీకి వెళ్లాను. అతను నన్ను పొగడ్తలతో ముంచెత్తాడు. నువ్వు చాలా బాగున్నావని అన్నారు. నేను రోజూ చెప్పినట్లుగానే చెప్పాడనుకున్నాను. కానీ రాత్రి అతను చాలా రకాల మెసేజ్ లు పంపాడు. నేను అతని నుంచి వాటిని ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.

అలా ఊహించుకుంటాడనుకోలేదు

అలా ఊహించుకుంటాడనుకోలేదు

నాతో స్నేహంగా ఉంటున్నాడనుకున్నా కానీ నాపై అతనికి ఇలాంటి అభిప్రాయం ఉందనుకోలేదు. నేను నిన్ను ప్రేమిస్తాను.. నువ్వంటే ప్రాణం అంటూ ఏవేవో మెసేజ్ లు పంపాడు. అతను నన్ను అలా ఊహించుకుంటాడని నేను అనుకోలేదు. నేను అతని మెసేజ్ లకు రిప్లై పంపలేదు. తర్వాత అతనితో నేను మాట్లాడలేదు. తను కూడా నాతో మాట్లాడలేదు.

ఇలా చేస్తే ఎలా?

ఇలా చేస్తే ఎలా?

తర్వాత మేము ఒక రెస్టారెంట్లో కలుద్దామని అనుకున్నాం. అతని మెసేజ్ పంపాను. అతను అక్కడికి వచ్చాడు. ఒక్కసారిగా నువ్వు మాట్లాడకపోయేసరికి నాకు ఏదేదో అనిపిస్తోంది అని అతనితో అన్నాను. నువ్వు నన్ను బెస్ట ఫ్రెండ్ అని చెప్పావు. నీ లవ్ స్టోరీ కూడా నాతో చెప్పావు. కానీ ఇప్పుడు నన్ను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్థానంలో ఊహించుకుంటున్నావు. ఇది తప్పు కదా అని చెప్పాను.

జ్ఞాపకాలను గుర్తు చేశాను

జ్ఞాపకాలను గుర్తు చేశాను

నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి. నువ్వు ఇలా ఒక్కసారి దూరం అయితే నేను తట్టుకోలేను అని చెప్పాను. అప్పుడు అన్నీ జ్ఞాపకాలను అతనికి గుర్తు చేశాను. కానీ అతను మాత్రం కేవలం నన్ను ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెబుతున్నాడు గానీ అతని మనస్సును మాత్రం మార్చుకోలేదు.

నన్ను అలా ఊహించుకోవడం నచ్చలేదు

నన్ను అలా ఊహించుకోవడం నచ్చలేదు

నేను అతనితో స్నేహాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధం అయ్యాను. ఎందుకంటే స్నేహం పేరుతో ఇలా నన్ను ప్రేమించడం నాకిష్టం లేదు. బెస్ట్ ఫ్రెండ్ వి అని చెప్పి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ స్థానంలో నన్ను ఊహించుకున్నాడు. అది నాకు అస్సలు నచ్చలేదు " ఇంత మంచి క్యారెక్టర్ అప్పుడు నాకు ఉండేది.

క్యారెక్టర్ లూజ్ అయ్యింది

క్యారెక్టర్ లూజ్ అయ్యింది

కానీ ఇప్పుడెందుకో ఇంత లూజ్ అయిపోయాను. నాకే అర్థం కావడ లేదు. మళ్లీ అలా సిన్సియర్ గా మారుదామని అనుకుంటున్నాను. నా జీవితం నా భర్తకు మాత్రం అర్పితం చేద్దామనుకుంటున్నాను. చూద్దాం.. ఏమవుతుందో.

English summary

he called me his best friend only to use me as a replacement for his ex

he called me his best friend only to use me as a replacement for his ex
Story first published: Saturday, January 13, 2018, 13:30 [IST]