అప్పుడు ఎంజాయ్ చేయలేదు.. ఇప్పుడు నా భర్తతో కావాల్సినంత సుఖాన్ని పొందుతున్నా - My Story #87

Written By:
Subscribe to Boldsky

పెళ్లి.. ప్రతి అమ్మాయి జీవితంతో ఇదో లొల్లి. మంచిగున్నోడు భర్తగా వస్తే జీవితమంతా మస్త్ గా ఉంటది లేదంటే అంతే సంగతులు. ఇక నేను కాస్త పెద్దగైనప్పటి నుంచి మా అమ్మ ఇంట్ల ఒకటే లొల్లి పెట్టేది. మంచి వంటలు వడడం నేర్చుకో. బుద్దిగా చదువుకో. రేపు పొద్దున పెళ్లి అయ్యాక భర్తతో ఎలా ఉండాలో తెలుసుకో.

రెండు రోజులకే నిన్ను పుట్టింటికి పంపిస్తారు

రెండు రోజులకే నిన్ను పుట్టింటికి పంపిస్తారు

ఇక్కడున్నట్లు మీ అత్తాగారింట్లో ఉంటే రెండు రోజులకే నిన్ను పుట్టింటికి పంపిస్తారని రోజూ మా అమ్మ అనేది. నేను ఆమె జాగ్రత్తలు చెప్పేటప్పుడు.. తిట్టేటప్పుడు ఎక్కువగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ అప్పుడప్పుడు నాకు కూడా అనిపించేది.

నా ఫ్రెండ్స్ ఎవరూ అలా ఉండేవారు కాదు

నా ఫ్రెండ్స్ ఎవరూ అలా ఉండేవారు కాదు

మా అమ్మ ప్రతి విషయం నాకోసమే కదా చెప్పేది అని అనిపించేది. అయితే నా ఫ్రెండ్స్ ఎవరూ కూడా మా అమ్మ చెప్పినట్లు వంటలు నేర్చుకోవడం, బుద్ధిగా ఉండడం చేసేవారు కాదు. వారు కూడా పెళ్లి చేసుకుంటారు కదా అనిపించేది.

స్కూల్ డేస్ లో బాయ్ ఫ్రెండ్స్

స్కూల్ డేస్ లో బాయ్ ఫ్రెండ్స్

నా ఫ్రెండ్స్ చాలా తప్పులు చేసేవారు. స్కూల్ డేస్ లోనే నా ఫ్రెండ్స్ లో చాలా మందికి బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్లు. వాళ్లతో అన్ని రకాల ఎంజాయ్ లు చేసేవారు. నా క్లోజ్ ఫ్రెండ్ ఎప్పుడూ తన బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ రొమాన్స్ చేసేది.

కాస్త పొద్దున్నే రమ్మంది

కాస్త పొద్దున్నే రమ్మంది

ఒక రోజు నా క్లోజ్ ఫ్రెండ్ సరళ.. తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ఒక ప్లాన్ వేసుకున్నారు. స్కూల్ కు అందరి కంటే ముందుగానే ఉదయాన్నే వచ్చేశారు. నా ఫ్రెండ్ నన్ను కూడా ఆ రోజు స్కూల్ కు కాస్త పొద్దున్నే రమ్మంది.

 బాయ్ ఫ్రెండ్ ఏడున్నరకు వచ్చాడు

బాయ్ ఫ్రెండ్ ఏడున్నరకు వచ్చాడు

మా స్కూల్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ నా ఫ్రెండ్ ఏడు గంటలకు వచ్చి స్కూల్ దగ్గర వెయిట్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ ఏడున్నరకు స్కూల్ కు వచ్చాడు. అసలు అతను వస్తున్న విషయం కూడా నాకు తెలియదు.

క్లాస్ రూమ్ లో ముద్దులు

క్లాస్ రూమ్ లో ముద్దులు

అతను రాగానే నన్ను మా క్లాస్ బయట నిలబడి ఎవరైనా వస్తే తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమంది సరళ. వాలిద్దరూ క్లాస్ రూమ్ లో ముద్దులు పెట్టుకుంటూ గడిపారు. మా క్లాస్ రూమ్ పక్కనే అమ్మాయిల టాయ్ లెట్స్ ఉంటాయి.

అమ్మాయిల టాయ్ లెట్స్ లో

అమ్మాయిల టాయ్ లెట్స్ లో

అమ్మాయిల టాయ్ లెట్స్ లోకి ఇద్దరూ వెళ్లి డోర్ వేసుకున్నారు. ఇద్దరూ లోపల ఏం చేసుకున్నారో తెలియదుగానీ బయట వారికి కాపలా కాస్తున్నా నాకు మాత్రం చాలా భయం వేసింది. ఆ సమయంలో ఎవరైనా టీచర్లు వస్తే ఎలా? ఏ ఒక్క స్టూడెంట్ వచ్చినా ముగ్గురం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాం అనిపించింది.

బాయ్ ఫ్రెండ్ తో అంతగా ఎంజాయ్ చేస్తున్నా..

బాయ్ ఫ్రెండ్ తో అంతగా ఎంజాయ్ చేస్తున్నా..

నాకు భయం వేసి వెంటనే డోర్ కొట్టాను. టీచర్స్ వస్తున్నారని చెప్పాను. వాళ్లు పరుగెత్తుకుంటూ బయటకు వచ్చారు. అలా స్కూల్ లోనే నా ఫ్రెండ్ సరళ తన బాయ్ ఫ్రెండ్ తో అంతగా ఎంజాయ్ చేస్తున్నా నాకు మాత్రం ఆ సమయంలో ఒక్క అబ్బాయి కూడా ప్రపోజ్ చెయ్యలేదు.

అమ్మాయిలు రొమాన్స్ చేయడం చూసేదాన్ని

అమ్మాయిలు రొమాన్స్ చేయడం చూసేదాన్ని

మా అమ్మనేమో పద్దతిగా ఉండాలి అని ఏదేదో చెబుతుంది. కానీ బయట అమ్మాయిలు అబ్బాయిలతో రొమాన్స్ చేయడం నేను రోజూ చూసేదాన్ని. నాకు అబ్బాయిలతో పరిచయాలు లేకపోవడంతో మొత్తానికి ఎవరితోనూ ఏ అనుభవం లేకుండానే నా చదువు పూర్తయ్యాక పెళ్లయిపోయింది.

నాకోసం ఏదైనా చేసే రకం

నాకోసం ఏదైనా చేసే రకం

నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నేనంటే ప్రాణం ఇస్తాడు. నాకోసం ఏదైనా చేసే రకం. అలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మా అమ్మ చెప్పిన మాటలు నాకు చదువుకునే సమయంలో కాస్త చేదుగా అనిపించేవి.

ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసి ఉంటే

ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసి ఉంటే

పెళ్లియ్యాక మాత్రం మా అమ్మ చెప్పిన మాటలు మొత్తం నిజమేనని అనిపిస్తున్నాయి. మా ఫ్రెండ్స్ మాదిరిగా నేను ఇష్టానుసారంగా తిరిగి ఉంటే.. ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసి ఉంటే ఇంత మంచి భర్త దొరికేవాడు కాదేమో.

అనుమానంతో రోజూ టార్చర్

అనుమానంతో రోజూ టార్చర్

నా స్కూల్ ఫ్రెండ్ గురించి చెప్పా కదా. బాత్రూమ్ లో బాయ్ ఫ్రెండ్ తో ఫుల్ ఎంజాయ్ చేసేది. తర్వాత అతను వాడుకున్నన్ని రోజులు వాడుకుని వదిలేశాడు. ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అతను సరళపై అనుమానంతో రోజూ టార్చర్ చేస్తున్నాడంట.

భర్త నమ్మడం లేదంట

భర్త నమ్మడం లేదంట

తను మారిపోయాయని సరళ ఎంత చెప్పినా భర్త నమ్మడం లేదంట. రోజూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంట. ఇలా నా ఫ్రెండ్స్ మొత్తం వాళ్ల భర్తలతో రోజూ ఏదో ఒక టార్చర్ భరిస్తూనే ఉన్నారు.

తలనొప్పి వచ్చినా తల్లడిల్లి పోతాడు

తలనొప్పి వచ్చినా తల్లడిల్లి పోతాడు

నా భర్త మాత్రం నాకు కాస్త తలనొప్పి వచ్చినా తల్లడిల్లి పోతాడు. నాకు ఒంట్లో బాగా లేకుంటే తనే వంట వండుతాడు. ఇద్దరి మధ్య రోజూ చాలా సరసాలు జరుగుతాయి. నాకు చీర కట్టుకోవడం సరిగ్గా రాదు.

చీర కట్టుకోవాలంటే..

చీర కట్టుకోవాలంటే..

ఎప్పుడైనా ఫంక్షన్ ఉన్నప్పుడు చీర కట్టుకోవాలంటే మా ఆయన హెల్ప్ చేస్తుంటాడు. ప్రతి పనిలో తను నాకు సాయం చేస్తూనే ఉంటాడు. మనం కరెక్ట్ గా ఉంటే నిజంగా మనం జీవితం బాగుంటుదనే మా అమ్మ మాటలు అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి.

నా భర్తకే అర్పిస్తా

నా భర్తకే అర్పిస్తా

వేరే అబ్బాయిలతో సంబంధాలు ఉంటే మన మనస్సే మన్నల్ని ఎప్పుడూ నిందిస్తూ ఉంటుంది. ప్రశాంతంగా ఉండలేం. అందుకే నా జీవితం మొత్తం నా భర్తకే అర్పించాలని నేను డిసైడ్ అయిపోయాను.

సుఖ పెట్టడం నా బాధ్యత

సుఖ పెట్టడం నా బాధ్యత

సాయంత్రం తను ఆఫీసు నుంచి రాగానే తన కోసం అన్ని సిద్ధం చేస్తాను. నా భర్తను నన్ను అంత సంతోషంగా చూసుకుంటున్నప్పుడు ఆయనను సుఖ పెట్టడం కూడా నా బాధ్యత. అందుకే ఆయన ఆ విషయంలో లోటు రానివ్వను.

గంటలు తరబడి అందులో

గంటలు తరబడి అందులో

ఒకవేళ నేను ఏ మాత్రం ఆయనకు సంతృప్తి ఇవ్వలేకపోయినా ఆయన వేరే అమ్మాయిలకు అలవాటు పడే అవకాశం ఉంది. అందుకే ఆ ఛాన్స్ ఆయనకు ఇవ్వకుండా జాగ్రత్తపడతాను. గంటలు తరబడి అందులో పాల్గొంటూ ఉంటాం.

తనివితీరా తన్మయం

తనివితీరా తన్మయం

రోజూ రాత్రి శృంగారంలో తేలిపోతాం. అందులో ఇద్దరం తనివితీరా ఇద్దరం తన్మయం చెందుతూ ఉంటాం. ఈ విషయంలో మేము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజం దృష్టిలో మేము చేసే పని తప్పు కాదు కాబట్టి.

అడ్డదారులు తొక్కి కక్కుర్తి పడి ఉంటే

అడ్డదారులు తొక్కి కక్కుర్తి పడి ఉంటే

నేను కూడా నా ఫ్రెండ్స్ మాదిరిగానే స్కూల్ లైఫ్ లోనే అడ్డదారులు తొక్కి కక్కుర్తి పడి ఉంటే నాకు ఇంత మంచి మొగుడు వచ్చేవాడు కాదేమో. మా అమ్మ చెప్పింది నిజమే. మనం పద్దతిగా ఉంటే మనకు అంతా మంచే జరుగుతుంది.

English summary

he is my best friend first and my husband later

he is my best friend first and my husband later
Story first published: Wednesday, February 14, 2018, 13:00 [IST]