పెళ్లికి ముందు ప‌రాయి వ్య‌క్తుల‌తో సంబంధం: తెలిశాక‌ భ‌ర్త ఏం అన్నాడంటే...

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

పెద్ద‌లు కుద‌ర్చిన పెళ్లి నిశ్చ‌య‌మైన‌ప్పుడు కాబోయే భ‌ర్త‌తో నా పాత సంబంధాల గురించి చెప్పాలా వ‌ద్దా అనే సంశ‌యం వెంటాడుతుండేది. పెళ్లి నాటికి నా వ‌య‌సు 25 దాటాయి. అప్పుడు బ్యాంకులో ప‌నిచేసేదాన్ని. పెళ్లి కుదిరి మూడు ముళ్లు వేయించుకునే లోపు ఒక‌రి గురించి మ‌రొక‌రికి తెలుసుకునే అవ‌కాశం చాలా త‌క్కువ‌గా దొరికింది.

నా స్నేహితులు, ఒక క‌జిన్ చెప్పిన‌న‌ట్టు నా గ‌త సంబంధాల గురించేవీ ఆయ‌న వ‌ద్ద ప్ర‌స్తావించ‌లేదు. పెళ్లికి ముందు నేను స్వ‌తంత్ర మ‌హిళ‌ను. ఏం చేసినా దానికి స‌మాధానం చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదనుకున్నాను.

ఆ అనుభ‌వం ఉన్న‌ట్టు అర్థ‌మైంది..

ఆ అనుభ‌వం ఉన్న‌ట్టు అర్థ‌మైంది..

ఆ మూడు ముళ్ల ముచ్చ‌ట తీరిపోయింది. తొలిరాత్రి గ‌డిచింది. శృంగారంలో అనుభ‌వం ఉంద‌న్న‌ సంగ‌తి నా భ‌ర్త‌కు అర్థ‌మైన‌ట్టుంది. అయినా అత‌డు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. నేను క‌న్య‌నా కాదా అన్న సంగ‌తి పక్క‌న పెడితే శృంగార దాంప‌త్య జీవితాన్ని మేము చాలా కాలంపాటు బాగా ఎంజాయ్ చేశాం.

మీ బాయ్ ఫ్రెండ్ నే చేసుకోక‌పోయావా అన్నాడు...

మీ బాయ్ ఫ్రెండ్ నే చేసుకోక‌పోయావా అన్నాడు...

రోజుల‌న్నీ ఒకేలా ఉండ‌వు క‌దా! మా ఇద్ద‌రి మ‌ధ్య ఒక రోజు బాగా గొడ‌వ జ‌రిగింది. వాదన తీవ్ర‌త‌ర‌మైన ఒకానొక సంద‌ర్భంలో మా వారు ఆవేశంలో ఒక మాట అన్నారు. అవునే! నాతో అంత సుఖం లేక‌పోతే వెళ్లి మీ బాయ్ ఫ్రెండ్స్‌లో ఎవ‌ర్నో ఒక‌ర్ని పెళ్లి చేసుకోవ‌చ్చు క‌దా! ఆ మాట అత‌డు ఆయాచితంగా అన్నా అది నా మ‌న‌సులో బాకులా గుచ్చుకుంది. నా నోటి వెంట మాట రాలేదు. ఆవేశంలో అత‌డు ఏమ‌న్నాడో క‌నీసం గ్ర‌హించ‌లేక‌పోయాడు. అది మొద‌టిసారి జ‌ర‌గ‌డం. అయితే చివ‌రిది మాత్రం కాదు.

అన్ ఫ్రెండ్ చేయ‌మ‌ని చెప్ప‌లేదు..

అన్ ఫ్రెండ్ చేయ‌మ‌ని చెప్ప‌లేదు..

అనుమానంతో మొద‌లై మెల్ల‌గా నేను చేసే ప్ర‌తి చ‌ర్య అత‌డికి న‌చ్చేది కాదు. మ‌గ స్నేహితుల‌తో సామాజిక మాధ్య‌మాల్లో చాట్ చేసినా, వారు నా ఫొటోల‌ను లైక్ లేదా కామెంట్ చేసినా నా భ‌ర్త స‌హించ‌క‌పోయేవాడు. అంతా గ‌మ‌నిస్తున్నా ఎప్పుడూ న‌న్ను వారిని అన్ ఫ్రెండ్ చేయ‌మ‌ని చెప్ప‌లేదు. ఒక రోజు స‌డెన్‌గా నేనింకా నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో ట‌చ్ లో ఉన్నానా అని అడిగాడు. నేను స‌మాధానం చెప్పేలోపు ప్లీజ్ ఎవ‌రైనా ఉంటే వారిని అన్‌ప్రెండ్ చేసేయ‌మ‌ని చెప్పి వెళ్లిపోయాడు.

వాళ్ల‌తో మాట్లాడితే స‌హించ‌లేక‌పోయాడు..

వాళ్ల‌తో మాట్లాడితే స‌హించ‌లేక‌పోయాడు..

నా గ‌త చ‌రిత్ర గురించి నా భ‌ర్త అభ‌ద్ర‌తాభావంతో ఉన్నాడ‌న్న సంగ‌తి అర్థ‌మైపోయింది. దీని గురించి చర్చించాల‌ని నిశ్చ‌యించుకున్నాను. మొద‌ట్లో దీనిపై మాట్లాడేందుకు స‌సేమిరా అన్నాడు. ఆ త‌ర్వాత అత‌డే ఓపెన్ అయ్యాడు. మొదట్లో నేను లైట్ తీసుకునేవాడిని. కానీ నువ్వు నీ మ‌గ స్నేహితుల‌తో చాటింగ్ చేయ‌డం వారితో మాట్లాడటాన్ని అస్స‌లు స‌హించ‌లేక‌పోయాను అని అన్నాడు. మొద‌ట్లో ఇది ఇద్ద‌రికీ స‌మ‌స్య‌లా ఉండేది. కానీ దీన్ని అధిగ‌మించాల‌నుకున్నాం.

గ‌త‌మంతా చెప్పాను...

గ‌త‌మంతా చెప్పాను...

అబ‌ద్ధం కంటే స‌గం నిజం చాలా ప్ర‌మాద‌క‌రం. నా గ‌త సంబంధాల గురించి అన్నీ భ‌ర్త‌కు చెప్పుకున్నాను. ఒక‌రి ప‌ట్ల ఒక‌రికి న‌మ్మకం రావాలంటే ఇద్ద‌రి మ‌ధ్య సందేహాలు ఉండ‌కూడ‌దు అన్న‌ది నా న‌మ్మ‌కం. ఇద్ద‌రి మ‌ధ్య అభ‌ద్ర‌తాభావం ఉంటే న‌మ్మ‌కం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది. దాన్ని తుడిచిపెట్టాలి. అందుకే నా గ‌తం గురించి మొత్తం విడ‌మ‌రిచి చెప్పాను. గ‌తంలో నేను చేసిన‌వాటిని ఇప్పుడు కొన‌సాగించ‌డం లేద‌న్న స్ప‌ష్టం చేశాను.

దూరం త‌గ్గింది..

దూరం త‌గ్గింది..

మా ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌ల‌తో ఎన్నో స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌చ్చినా కౌన్సిల‌ర్‌ను క‌ల‌వాల‌ని నిశ్చ‌యించుకున్నాను. కొన్ని సెష‌న్ల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ద‌గ్గ‌రిత‌నం పెరిగింది. అపార్ఘాలు త‌గ్గాయి. ఇద్ద‌రి మ‌ధ్య న‌మ్మ‌కం పెరిగింది. రాను రాను ఇద్ద‌రి మ‌ధ్య దూరం త‌గ్గింది.

సంతృప్తి మిగిలింది...

సంతృప్తి మిగిలింది...

ఇప్పుడు మేమిద్ద‌రం ఒక పండంటి పాపాయికి త‌ల్లిదండ్రులం. వెన‌క్కి తిరిగి చూసుకుంటే మా స‌మ‌స్య‌ల‌ను చ‌క్క‌గా ప‌రిష్క‌రించుకున్నామ‌న్న సంతృప్తి మిగిలింది. ఇద్ద‌రి మ‌ధ్య న‌మ్మకం మా దాంప‌త్య జీవితానికి పునాదిలా నిలిచింద‌ని చెప్పాలి. ఏ చిన్న సందేహ‌మున్నా స‌రే ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకునేందుకు అస్స‌లు సంకోచించం. గ‌తంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ప్ర‌భావం వ‌ర్త‌మానంపై ప‌డ‌కుండా జాగ్ర‌త్త తీసుకున్నాం. అదే మా సంతోష‌క‌ర దాంప‌త్య జీవితాన్ని కాపాడుతుంది.

English summary

I didn’t tell my husband about my past sex life before marriage.

When my marriage was fixed with a man (now my husband) chosen by my parents, the only thought that troubled me was should I tell him about my past relationships? I was in my late twenties and was working in a bank when my marriage was arranged and we hardly got time to know each other well before tying the knot.