For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హరి నువ్వుంటే పిచ్చి ప్రేమ ఉంది.. నాతో ఒక్కరాత్రి అయినా ప్రశాంతంగా పడుకున్నావా? - My Story #94

నీ కోణంలో నీకు కష్టాలుంటాయ్.. వాటిని భార్యగా నేను అర్థం చేసుకుంటాను. కానీ ఒక భార్యగా నన్ను కూడా నువ్వు పట్టించుకోవాలి కదా. ఒక్కరోజు రాత్రి అయినా నాతో ప్రశాంతంగా పడుకున్నావా హరి?

By Bharath
|

అబ్బాయిగా పుట్టడం అదృష్టమో కాదో నాకు తెలియదు కానీ అమ్మాయిగా పుట్టడం మాత్రం అదృష్టంగానే నేను భావిస్తాను. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలో మాతృత్వానికి మించినది ఇంకేది లేదు అని నా అభిప్రాయం. అందుకే ప్రతి జన్మలోనూ అమ్మాయిగా పుట్టి అమ్మ కావాలనుకుని నేను కోరుకుంటున్నాను. నా పేరు హరిత. నాది విజయనగరం.

గారాబంగా పెంచారు

గారాబంగా పెంచారు

నేను మా అమ్మనాన్నలకు ఒక్కదాన్నే కూతుర్ని. చిన్నప్పటి నుంచి నన్ను గారాబంగా పెంచారు. మంచి అబ్బాయికి పెళ్లి చేయాలని అనుకున్నారు. నేను కూడా అప్పుడు నన్ను చేసుకోబోయే వ్యక్తిపైన చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నాను.

ఆ ప్రేమలో సగం చూపించిన చాలు

ఆ ప్రేమలో సగం చూపించిన చాలు

చివరకు నన్ను ఒక సాఫ్ట్ వేర్ కు ఇచ్చారు. పెళ్లి అయిన తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో అని నాకు ఎప్పుడూ అనిపించేది. మా అమ్మనాన్నల అంత బాగా చూసుకోకపోయినా వారు చూపించే ప్రేమలో సగం చూపించిన చాలు అని నాకు అనిపించేది.

హరికి ఇచ్చి పెళ్లి చేశారు

హరికి ఇచ్చి పెళ్లి చేశారు

మా అమ్మనాన్నలు కూడా నన్ను బాగా చూసుకునే వ్యక్తి కోసం చాలా రకాలుగా వెతికి చివరకు సాఫ్ట్ వేర్ గా పని చేసే హరికి ఇచ్చి పెళ్లి చేశారు. హరి మా ఎంగేజ్ మెంట్ సమయంలో నాకు ఏవేవో కబుర్లు చెప్పాడు. నన్ను చాలా బాగా చూసుకుంటానని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు.

చీరలు, బంగారం కొనివ్వడం కాదు

చీరలు, బంగారం కొనివ్వడం కాదు

కానీ పెళ్లి అయిన తర్వాత తెలిసింది.. హరి నాపై చూపే ప్రేమ ఇదేనా అని. నా భర్త హరితో పాటు అలాంటి భర్తలందరికీ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. భార్యపై ప్రేమ అంటే చీరలు, బంగారం కొనివ్వడం కాదు. క్రెడిట్ కార్డ్ ఇచ్చి షాపింగ్ చేసుకో అని చెప్పడం అంతకంటే కాదు.

మూరెడు మల్లెపూలు

మూరెడు మల్లెపూలు

ఉదయం నుంచి నువ్వు ఆఫీసులో బిజీగా ఉంటావని నాకు తెలుసు హరి. కానీ ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఒక మూరెడు మల్లెపూలు తీసుకొస్తే నీ సొమ్ము ఏమన్నా పోతుందా? నేనంటే ప్రేమ అనే చెబుతావు. కానీ ఆ ప్రేమను నీ గుండెల్లో దాచుకుంటే సరిపోదు కదా హరి.

అన్నీ రెడీ చేస్తాను

అన్నీ రెడీ చేస్తాను

ఆఫీసులో నేను చాలా బిజీ అని నువ్వు అంటావు.. అలా అని నేను రోజంతా ఇంట్లో ఖాళీగా కూర్చొను కదా. ఉదయం నీకన్నా ముందే లేచి బ్రేక్ ఫాస్ట్ రెడీ చేస్తాను.. స్నానానికి నీళ్లు పెడతాను. మా ఆయన ఈ రోజు ఈ డ్రెస్ లో వెళితే బాగుంటుందని డ్రెస్ ఐరన్ చేసి.. రెడీ చేస్తాను.

నేను పడే ఆరాటం తెలియదు

నేను పడే ఆరాటం తెలియదు

నీ నిద్రకు భంగం కలగకుండా.. ఆఫీసుకు నువ్వు లేట్ గా వెళ్లకుండా చూడడానికి రోజూ నేను పడే ఆరాటం నీకు తెలియదు హరి. రోజుకొక్ బ్రేక్ ఫాస్ట్ నీకు చేసిపెడతాను.

నిన్ను నవ్వుల పాలు చేస్తారని

నిన్ను నవ్వుల పాలు చేస్తారని

ఆఫీసులో అందరితో కలిసి నువ్వు లంచ్ చేస్తావు కాబట్టి నువ్వు తీసుకెళ్లే లంచ్ బాక్స్ లోని ఐటెమ్స్ ను నేను రెడీ చెయ్యడానికి రోజూ ఎంత కష్టపడతానో తెలుసా? ఎందుకంటే రోజూ నువ్వు ఒకే పప్పు, కర్రీ తీసుకెళ్తే.. ఏంటి రోజూ మీ ఇంట్లో ఇదే కర్రీ వండుతారా? అని నిన్ను నవ్వుల పాలు చేస్తారని నాకు తెలుసు.

నేనే చేసే ప్రయత్నాలు నీకు తెలియవు

నేనే చేసే ప్రయత్నాలు నీకు తెలియవు

నా భర్త పది మందిలో ప్రతి విషయంలో తలెత్తుకుని తిరగాలని నేను అనుకుంటా.. ఏంటి వంట వండిపెట్టి ఇంత బిల్డప్ ఇస్తున్నావా? అని అనుకోవొచ్చు. కానీ ఆ వంటలో వేరియేషన్స్ చూపించడానికి.. రోజూ నీ నాలుకకు ఒకే టేస్ట్ తగలకుండా చూడాలని నేనే చేసే ప్రయత్నాలు నీకు తెలియవు హరి.

చాలా సిల్లీగా అనిపించొచ్చు

చాలా సిల్లీగా అనిపించొచ్చు

మధ్యాహ్నమంతా వంటల ప్రోగ్రామ్స్ చూసి వాటిని ట్రై చేసి ఫస్ట్ నేను తిని... అవి బాగుంటేనే నీకు పెట్టే నా మనస్సు నీకు తెలియదు హరి. ఇవన్నీ నీకు చాలా సిల్లీగా అనిపించొచ్చు. నీకే కాదు ప్రతి భర్తకు... ఆ.. అదేముందిలే అనిపించొచ్చు. కానీ రోజూ ఒక భార్యగా పడే కష్టం నాకు తెలుసు హరి.

క్షణం తీరిక ఉండదు

క్షణం తీరిక ఉండదు

నిన్ను ప్రతి రాత్రి సంతోషంగా ఉంచాలని నేను అనుకుంటాను. నేను కూడా నీ నుంచి అదే కోరుకుంటాను. కాసింత ప్రేమ నువ్వు చూపితే చాలు అని కోరుకుంటారు. నీకు సోమవారం నుంచి శుక్రవారం ఒక్క క్షణం తీరిక ఉండదు. శనివారం, ఆదివారం సెలవు.

ఏవేవో ఊసులు చెబుతావనుకుంటా

ఏవేవో ఊసులు చెబుతావనుకుంటా

ఆ రెండు రోజులు కూడా ఆఫీస్ పెండింగ్ వర్క్ అని, టార్గెట్స్ ఉన్నాయని నన్ను అస్సలు పట్టించుకోవు. రోజూ సాయంత్రం నువ్వు రాగానే నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుంటావని, నాతో ఏవేవో ఊసులు చెబుతావని ఎంతగా ఎదురు చూస్తానో నీకు తెలుసా హరి.

డబ్బు మొత్తాన్ని వెంట వేసుకుని పోతామా

డబ్బు మొత్తాన్ని వెంట వేసుకుని పోతామా

ఆఫీస్ లో ఎవడో గొట్టంగాడు ఏదో అన్నాడని ఆ కోపం మొత్తం నాపై చూపుతావు. అంత టార్చర్ చేసే ఆఫీస్ లో జాబ్ ఎందుకు చెయ్యాలి హరి. కాస్త తక్కువ డబ్బు వచ్చినా ప్రశాంతంగా ఉండే పని చేసుకోవొచ్చు కదా అని అంటే వినవు. ఏం పోయేటప్పుడు డబ్బు మొత్తాన్ని వెంట వేసుకుని పోతామా?

బార్ కెళ్లి ఇంటికి వస్తావు

బార్ కెళ్లి ఇంటికి వస్తావు

ఆఫీసులో గొడవలు అని నన్ను పట్టించుకోకుండా పోతే మనకు పిల్లలు ఎలా పుడతారు హరి. పెళ్లి అయిన రెండు మూడు రోజులు తప్పా మన మధ్య అది అంత ప్రేమగా ఏనాడైనా జరిగిందా. ప్రతి రోజూ బాగా అలసిపోయి వస్తావు.. ఒక్కోసారి ఈ రోజు మూడ్ బాగాలేదని బార్ కెళ్లి ఇంటికి వస్తావు.

ప్రశాంతంగా పడుకున్నావా హరి

ప్రశాంతంగా పడుకున్నావా హరి

నీ కోణంలో నీకు కష్టాలుంటాయ్.. వాటిని భార్యగా నేను అర్థం చేసుకుంటాను. కానీ ఒక భార్యగా నన్ను కూడా నువ్వు పట్టించుకోవాలి కదా. ఒక్కరోజు రాత్రి అయినా నాతో ప్రశాంతంగా పడుకున్నావా హరి? ఆఫీసులో ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వరని అంటావు. ఇలాంటి బతుకు మనకు ఎందుకు హరి.

డబ్బుతోనే ముడిపడి ఉండవు

డబ్బుతోనే ముడిపడి ఉండవు

అన్నీ డబ్బుతోనే ముడి పడి ఉండవు. కొన్ని విషయాలు ప్రేమతో ముడిపడి ఉంటాయి. వాటి కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తే చాలు. ప్రతి సంసారంలో ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి.

ఏ భర్త పట్టించుకోడు

ఏ భర్త పట్టించుకోడు

మొదట ఏ భర్త వాటిని పట్టించుకోడు. అవే చివరకు సంసారాన్ని నాశనం చేస్తాయి. ప్రతి భర్త భార్య భర్తను కనీసం అప్పుడప్పుడు మెచ్చుకున్నా చాలు ఆ సంసారం చాలా బాగుంటుంది. తను కోరుకునే చిన్నచిన్న కోరికలు తీరిస్తే చాలు ఇద్దరూ కలకాలం కలిసి ఉంటారు.

టన్నుల కొద్దీ ప్రేమ చాలు

టన్నుల కొద్దీ ప్రేమ చాలు

నా హరి కూడా నన్ను అర్థం చేసుకుని మారాలని కోరుకుంటున్నాను. హరి నీ నుంచి కేజీల కొద్దీ బంగారాన్ని.. కోట్ల కొద్దీ కరెన్సీనీ కోరుకోవడం లేదు.. నీ నుంచి టన్నుల కొద్దీ ప్రేమను కోరుకుంటున్నాను.

English summary

i simply want you to understand the importance of showing love and compassion

In different facets of life, we encounter certain important people who stay with us forever. At our birth, it is our parents. When we marry, it is our spouse. Being a parent, it is our kids. In my entire life, you would be one of the most important people. It goes without saying, in this patriarchal society, what are my duties as a wife, as a daughter in law, as a mother and as a woman.
Desktop Bottom Promotion