ఒక్కసారి టచ్ చేస్తే చాలు అనుకున్నాడు.. అన్నీ సమర్పించి మైమరిపించాను - My Story #59

Written By:
Subscribe to Boldsky

నాకు చిన్నతనంలోనే మా వాళ్లు పెళ్లి చేశారు. మా క్లాస్ లో నాకే మొదట పెళ్లయ్యింది. నా పదో తరగతి పూర్తికాగానే నాకు వివాహం అయ్యింది. నాకు టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చాయి. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. ఇప్పటికీ నా బ్యాచ్ మేట్స్ లో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు చదువుతూనే ఉన్నారు. కొందరు జాబ్ చేస్తున్నారు.

ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు

ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు

నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు. అయితే నా క్లాస్ మేట్స్ మొత్తానికి నేను బాగా తెలుసు. పెళ్లయ్యాక పండుగలకు వెళ్లినప్పుడు నా క్లాస్ మేట్స్ నన్ను పలకరించేవారు. నా భర్త పెళ్లయినప్పుడు ఏదో ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడు. కానీ ఆస్తి బాగా ఉందని అతకిచ్చి చేశారు మా వాళ్లు.

అస్సలు పట్టించుకునేవాడు కాదు

అస్సలు పట్టించుకునేవాడు కాదు

కొన్నాళ్లకు జాబ్ కూడా మానేశాడు. పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. నాకు చిన్న వయస్సులో పెళ్లయ్యింది కాబట్టి ఏ విషయాలు అంత పెద్దగా తెలిసేవి కావు. మా అత్త నన్ను రోజూ వేధించేది. చిన్నచిన్న విషయాలకు కూడా చాలా దారుణంగా మాట్లాడేది. నా సమస్యలను నా భర్తతో చెబితే అస్సలు పట్టించుకునేవాడు కాదు.

ఆడపిల్ల పుట్టిందని

ఆడపిల్ల పుట్టిందని

ఒక్కోసారి ఎందుకు ఈ జీవితం అనిపించేది. పెళ్లయిన ఏడాదికే నేను తల్లినయ్యాను. నాకు మొదట కూతురు పుట్టింది. దాంతో మా అత్తగారింట్లో ఇంకా వేధింపులు ఎక్కువయ్యాయి. నాకు ఆడపిల్ల పుట్టిందని నన్ను చాలా హీనంగా చూసేవారు. నన్ను, నా కూతుర్ని అస్సలు పట్టించుకునేవారు కాదు. నా తోటి వారంతా ఇంటర్ చదువుతుంటే నేనేమో ఇలా రోజు ఇంట్లో నరకం అనుభవించాల్సి వచ్చేది.

అప్పటి నుంచి కష్టాలు తగ్గాయి

అప్పటి నుంచి కష్టాలు తగ్గాయి

నేను పడే కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం అయ్యేది కాదు. మా అమ్మనాన్నలకు మా మెట్టినింటి వారిని ఎదురించే ధైర్యం లేదు. వారు ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. నా రాత ఇలా ఉందని అలాగే భరిస్తూ ఉండేదాన్ని. తర్వాత నాకు బాబు పుట్టాడు. వాణ్ని మాత్రం మా అత్తగారింట్లో చాలా బాగా చూసుకుంటారు. నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి కాస్త కష్టాలు తగ్గాయి.

నా భర్త నైట్ అస్సలు పట్టించుకోడు

నా భర్త నైట్ అస్సలు పట్టించుకోడు

నా పిల్లలు ఇప్పుడు స్కూల్ కు వెళ్తున్నారు. అయినా నాకు నా జీవితంపై అంతగా సంతృప్తి లేదు. ఏదో వెలితిగా ఉంది. నా భర్త రోజంతా ఎక్కడెక్కడో తిరిగొస్తాడు. నైట్ కాగానే ఒక నైన్టీ వేసి పడుకుంటాడు. నన్ను అస్సలు పట్టించుకోడు. అతను ఏజ్ లో నాకన్నా చాలా పెద్దవాడు. కానీ నేను చాలా చిన్నమ్మయిని.

నా ఫ్రెండ్స్ ప్రేమలో మునిగితేలుతున్నారు

నా ఫ్రెండ్స్ ప్రేమలో మునిగితేలుతున్నారు

నాతో పాటు చదివిన వాళ్లకు ఇంకా పెళ్లి కాలేదు. వాళ్లంతా కాలేజీల్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్ తో ప్రేమలో మునిగితేలేవారు కూడా చాలామంది ఉన్నారు. నేను ఊరికి వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ల స్టోరీస్ చెబుతుంటారు. నాకప్పుడు లైఫ్ అంటే వీళ్లది అని అనిపిస్తూ ఉంటుంది. నా లైఫ్ కూడా అలా ఉండి ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది.

ఫ్రెండ్స్ అక్కడికి తీసుకెళ్లారు

ఫ్రెండ్స్ అక్కడికి తీసుకెళ్లారు

నేను చిన్నప్పటి నుంచి ఎవరినీ ప్రేమించలేదు. స్కూల్ లో నన్ను అబ్బాయిలు ప్రేమించేవారేమే కానీ నాతో ఎవ్వరూ చెప్పలేదు. మా ఫ్రెండ్స్ ఒకసారి గెట్ టు గెదర్ నిర్వహించారు. అప్పుడు నేను పండుగకు ఊరికి వెళ్లాను. నా క్లాస్ మేట్స్ చాలామంది మా ఇంటికి వచ్చి నన్ను ఆ కార్యక్రమానికి రమ్మని పిలిచారు. నేను రాను అని చెప్పినా వినకుండా తీసుకెళ్లాను.

అతనితో బాగా మాట్లాడాను

అతనితో బాగా మాట్లాడాను

నేను ఒక్కదాన్నే నా పిల్లలతో గెట్ టు గెదర్ లో పాల్గొన్నా. నాతో అందరూ చాలా బాగా మాట్లాడారు. అబ్బాయిలు కూడా చాలా బాగా పలకరించారు. నా క్లాస్ మేట్స్ లో ఒకబ్బాయి నాతో చాలా సేపు మాట్లాడాడు. అతని పేరు రాజేశ్. అతను నా కష్టాలు మొత్తం అడిగి తెలుసుకున్నాడు. నా బాధలన్నీ అతనికి చెప్పాను.

అప్పుడు అతను క్లోజ్ కాదు

అప్పుడు అతను క్లోజ్ కాదు

అతను నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. అతను ఇంటర్ పూర్తికాగానే కానిస్టేబుల్ జాబ్ సాధించాడు. అతను మా ఊరికి పక్కనే డ్యూటీ చేస్తుంటాడు. ఊరి నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తుంటాడు. అతని జీవితంలోని ప్రతి విషయాన్ని నాకు చెప్పాడు. మేమిద్దరం స్కూల్ లో చదువుకునేటప్పుడు అంత క్లోజ్ కాదు.

నా కోసమే అలా చేశాడట

నా కోసమే అలా చేశాడట

అతనికి నేనంటే చాలా ఇష్టమని గెట్ టు గెదర్ రోజు నాకు తెలిసింది. అతను నన్ను స్కూల్ డేస్ నుంచే చాలా ఇష్టపడేవాడంట. నాతో కలిసి మాట్లాడాలని చాలా పరితపించేవాడంట. అసలు గెట్ టు గెదర్ ఇప్పుడే నిర్వహించడానికి కారణం కూడా నేను పండుగకు సంక్రాంతి పండుగకు రావడమేనట. నేను ఊరికి వచ్చినప్పుడే ఈ కార్యక్రమం నిర్వహించేలా ఫ్రెండ్స్ తో ముందుగానే ప్లాన్ చేసుకున్నాడట. ఇలా ప్రతి విషయం నాతో చెప్పాడు.

ఇంతగా ఇష్టపడే వాళ్లు ఉన్నారా?

ఇంతగా ఇష్టపడే వాళ్లు ఉన్నారా?

అతను నాపై చూపిన ప్రేమకు నేను పడిపోయాను. నేనంటే ఇంతగా ఇష్టపడే వాళ్లు కూడా ఉన్నారా అని అప్పుడు అనుకున్నాను. నేను సంక్రాంతికి వచ్చి చాలా రోజులు మా పుట్టింటిలోనే ఉన్నాను. నేను ఊర్లో ఉన్నన్ని రోజులు ఏదో వంకతో తను మా ఇంటికి వచ్చేవాడు. నాతో మాట్లాడేవాడు. నా బాధలు తెలుసుకునేవాడు. వాటిని విని చలించిపోయేవాడు. నాకోసం ఏదైనా సాయం చెయ్యాలని అతని మనస్సులో ఉంది. నువ్వు చెబితే నీకోసం ఏదైనా చేస్తాను అనేవాడు.

జీవితంలో ఒక్కసారైనా నిన్ను టచ్ చేయాలని

జీవితంలో ఒక్కసారైనా నిన్ను టచ్ చేయాలని

నాకు పెళ్లికాకుంటే ఎలా అయినా ఒప్పించి పెళ్లి చేసుకునేవాడంట. కానీ నాకు పెళ్లి అయిపోయింది. ఒక రోజు మా అమ్మనాన్నలు ఇంట్లో లేనప్పుడు వచ్చాడు. నా పిల్లలు ఇంటి బయట ఆడుకుంటున్నారు. నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం నీతోనే గడుపుదాము అనుకున్నా.. కానీ విధి మనల్ని విడదీసింది అన్నాడు. కనీసం జీవితంలో ఒక్కసారైనా నిన్ను టచ్ చేస్తే ఛాన్స్ వస్తే చాలు అనుకుంటున్నాను అన్నాడు.

సమర్పించుకోవాలనుకున్నాను

సమర్పించుకోవాలనుకున్నాను

నాకు కూడా అతనంటే చాలా గౌరవం ఉంది. నాకు పెళ్లయింది కాబట్టి అతన్ని ప్రేమించడం తప్పు అని నా మనస్సు చెబుతుంది. కానీ అతను నాపై చూపిన ప్రేమకు నేను అతనికి ఏది ఇచ్చినా తక్కువే అనిపించింది. పెళ్లయిన కూడా నాపై అతను చూపిన ప్రేమకు నేను పడిపోయాను. అతనికి మనస్ఫూర్తిగా నన్ను నేను సమర్పించుకోవాలనుకున్నాను.

నా భర్తతో కూడా అనుభవించలేదు

నా భర్తతో కూడా అనుభవించలేదు

అతని కలను నిజం చేద్దాం అనుకున్నాను. నన్ను ఏమన్నా చేసుకో అని అతని ఎదుట నిలబడ్డాను. డోర్ క్లోజ్ చేసి తను నన్ను తనివి తీరా ముద్దాడాడు. నన్ను తన ఒళ్లోకి తీసుకుని తల నిమిరాడు. అరగంట సేపు ఇద్దరం ప్రపంచాన్ని మరిచిపోయాం. నా భర్తతో ఎప్పుడు కూడా ఇంతటి సంతోషాన్ని అనుభవించలేదు.

మైమరిపించాడు.. కానీ మరిచిపో అన్నాను

మైమరిపించాడు.. కానీ మరిచిపో అన్నాను

నిజంగా నన్ను మైమరిపించాడు. తన ప్రేమకు నేను బానిసనయ్యాను. నువ్వు ఒకే అంటే నిన్ను పెళ్లి చేసుకుంటాం. నీ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటా అన్నాడు. కానీ నేను అంత ధైర్యం చెయ్యలేనని చెప్పాను. నీ మీద నాకు ఎంతో ప్రేమ ఉంది కానీ సమాజం మన ప్రేమను అంగీకరించదు. కాబట్టి ఇంతటితో నన్ను మరిచిపో. జీవితంలో ఒక్కసారైనా నన్ను అనుభవించాలనకున్నావ్.. అనుభవించావు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పాను.

English summary

i was lonely and just when i thought that i had to live like this for the rest of my life

i was lonely and just when i thought that i had to live like this for the rest of my life
Story first published: Thursday, January 25, 2018, 9:30 [IST]
Subscribe Newsletter