ఈ భార్యలు ప్రేమను కోరుకుంటున్నారా? శృంగారం కావాలనుకుంటున్నారా?

Written By:
Subscribe to Boldsky

ప్రేమ అనేది మనసులకి సంబంధించిన విషయం. వివాహం అలా కాదు. భర్త, అత్తమామలు, కొత్త బంధువులు, కొత్త వాతావరణం...ఇలా అన్నీ ఉంటాయి. ప్రేమించుకునే సమయంలో అబ్బాయిలోని గొప్పతనం, మంచితనం మాత్రమే అమ్మాయికి తెలుస్తాయి.

మంచీచెడూలుంటాయి

మంచీచెడూలుంటాయి

కానీ మనిషన్నాక మంచీ, చెడూ రెండూ ఉంటాయి. పెళ్లి తర్వాతగానీ అబ్బాయి దినచర్య, అలవాట్లు, భావోద్వేగాలు మీకు తెలియవు. కేవలం చిన్న చిన్న కారణాలతో ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతున్న సందర్భాలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం.

చాలా జాగ్రత్తలు అవసరం

చాలా జాగ్రత్తలు అవసరం

ప్రేమపెళ్లికి ముందు, తర్వాత అమ్మాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నింటిని అర్థం చేసుకోవాలి. ఇంకొన్నిటికి సర్దుకుపోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మీ జీవితంపట్ల మీకు అంకితభావం ఉండాలి. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే చాలా సమస్యల నుంచి బయటపడినవారవుతారు.

కష్టాలపై కూడా అవగాహన

కష్టాలపై కూడా అవగాహన

మీరు పెళ్లిచేసుకోబోయే వ్యక్తి పేదవాడయితే పెళ్లి తర్వాత అతనితో కలిసున్నప్పుడు వచ్చే కష్టాలపై అవగాహన పెంచుకోవాలి. కారుని విడిచి బస్సులో వెళితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడడంలో తప్పులేదు.

స్వభావం మారదు

స్వభావం మారదు

పెళ్లయ్యాక భర్త స్వభావాన్ని మార్చుకోవచ్చు అనిఅనుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు. స్వభావరీత్యా భర్తని భార్య, భార్యను భర్త మార్చడం మాటల వరకే తప్ప నిజజీవితంలో అయ్యేపని కాదు.

చిన్నచిన్నవి మార్చొచ్చు

చిన్నచిన్నవి మార్చొచ్చు

ఏవో చిన్న చిన్న అలవాట్లు, ఆలోచనలు మార్చగలరేమో కాని మీరు కోరుకున్నట్లు ఎదుటివారు మారిపోరు. ఇలాంటి అపోహలవల్ల కూడా చాలా ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతుంటాయి. కేవలం భర్తను మార్చాలనుకునే పనిలో చాలా మంది మహిళలు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.

ప్రమాణం

ప్రమాణం

పెళ్లి సమయంలో నాతో ఏడడుగులు నడిచావు. మనమిద్దరం స్నేహితులమయ్యాం. ఇదే స్నేహాన్ని, ప్రేమను జీవితాంతం కలిసి పొందుదాం. మన మధ్య ఎన్నటికీ వియోగం రాకూడదు. సదా అనుకూల దాంపత్యం సాగిద్దాం. నిండు మనసుతో ఉభయులం ఒక్కటై నడుచుకుందాం అని వధువుతో వరుడుతో ప్రమాణం కూడా చేస్తాడు.

పెళ్లికి ముందు

పెళ్లికి ముందు

పెళ్లికి ముందు అబ్బాయిని అమ్మాయి గాఢంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆమెను ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎంత పటిష్టమైందో తేలిపోతుంది. కొందరిలో అది పెనవేసుకుని రంగుల హరివిల్లులను పూయిస్తే మరికొందరిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది.

ప్రేమ శారీరకమైన ఆకర్షణకేనా

ప్రేమ శారీరకమైన ఆకర్షణకేనా

ప్రేమ శారీరకమైన ఆకర్షణకేనా...? ఆ కోరికలు తీరిపోతే, కోరికలతోపాటు ప్రేమ కూడా కరిగిపోతుందా. చిన్నచిన్న విషయాల్లో చిన్నపిల్లలు తరహాలో చాలామంది భార్యభర్తలు గొడవలు పడుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వారు వైవాహిక జీవితంపై ప్రభావం చూపడమే కాకుండా లైంగిక జీవనంపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి.

నీవే నా ప్రాణం

నీవే నా ప్రాణం

నాకు జీవితంలో నీకన్నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు.. నా కష్టసుఖాలు అన్నీ నీతోనే చెప్పుకోవాలి కదా అనే మాటల ద్వారా మీ పార్టనర్ మీపై మరింత ప్రేమ పెంచుకుంటారు. దీని ద్వారా సెక్స్‌వల్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుందట మరి.

భర్తల హత్యలు

భర్తల హత్యలు

ఈ మధ్య చిన్నచిన్న కారణాలతో భార్యలు భర్తల్ని దారుణంగా హత్య చేశారు. మొగుడిపై మోజు పోయాక.. ప్రియుడి ఆ సుఖం పొందేందుకు భర్తలనే కడతేర్చిన కసాయి మహిళలు మనం చూశాం. అసలు భార్య వేరే ఎవడితోనూ ప్రేమగా వ్యవహరించేలా పరిస్థితులను భర్త తీసుకొచ్చుకోకూడదు. తర్వాత వాళిద్దరూ కలిసి నిన్ను చంపే వరకు పరిస్థితి తెచ్చుకోకు.

భార్యలకు అర్థం కావడం లేదా?

భార్యలకు అర్థం కావడం లేదా?

వరుసగా భర్తలను చంపి కటకటాలపాలైనా భార్యలకు అర్థం కావడం లేదా? అలాంటి జీవితాన్ని సమాజం అంగీకరించదు. మీరు కోరుకుంటున్నది నిస్వార్థం లేని ప్రేమనా లేదంటే సెక్స్ నా? తోడును దూరం చేసుకున్న జీవితం సారహీనమైన క్షేత్రంతో సమానం.

అర్థం చేసుకుని బతకాలి

అర్థం చేసుకుని బతకాలి

జీవిత భాగస్వామిని అర్థం చేసుకొంటూ, అభిప్రాయాల్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే దాంపత్య జీవనంలో ముఖ్యమైంది. ఇక్కడ కావాల్సింది ఆధిక్య ధోరణి కాదు, అనుకూల వైఖరి. వివేకం అంటే అదే. అప్పుడే దాంపత్య జీవితం చల్లగా ఉంటుంది.

English summary

love or sex what do you really want

love or sex what do you really want