నా భర్త తేడా.. అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే ఆ సుఖం అనుభవించేదాన్ని - My Story #27

Written By:
Subscribe to Boldsky

మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అందరు అమ్మాయిల మాదిరిగానే నేను కూడా చేసుకోబోయే అతని గురించి చాలా కలలు కన్నాను. కానీ నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు. నా వైవాహిక బంధంలో అంత సంతోషంగా లేదు. నా పెళ్లి గురించి ఎంతో ఆలోచించిన మా నాన్న చివరకు ఇలాంటోడికి ఇచ్చి కట్టబెట్టారు.

చాలా మంచి కుటుంబం

చాలా మంచి కుటుంబం

మా నాన్న రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. మా అమ్మ ఎంఫార్మసీ చేసింది. నేను కూడా ఎంఫార్మసీ చేశాను. నా పేరు ప్రీతిరెడ్డి. నాది కడప. మా అక్కను మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేయాలని మా నాన్న భావించాడు. ఆమె కోసం కూడా చాలా రకాల సంబంధాలు వెతికాడు. చివరకు ఒక మంచి సంబంధ చూసి పెళ్లి చేశాడు.

అక్క విషయంలో అలా జరిగిందనీ..

అక్క విషయంలో అలా జరిగిందనీ..

బావకు అప్పులు ఎక్కువ కావడంతో మా అక్కను అప్పుడప్పుడు వేధించేవాడు. ఆమె మా నాన్నకు ఫోన్ చేసేది. మా నాన్న డబ్బు పంపిస్తే మా బావ మా అక్కను ఏమి అనేవాడు కాదు. ఇలా ప్రతి నెలా జరుగుతూ ఉండేది. అక్క విషయంలో అలా చేసినందుకు నన్ను మాత్రం మా నాన్న మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని భావించాడు.

చాలా ఆలోచించారు

చాలా ఆలోచించారు

మా అమ్మనాన్న నా పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా రకాలుగా ఆలోచించారు. ప్రభుత్వం ఉద్యోగం ఉండాలి. ఆస్తి ఉండాలి. సమాజంలో మంచి పేరు ఉండాలి. ఇలా కొన్ని వందల రకాలుగా మా పెద్దలు నా పెళ్లి గురించి ఆలోచించారు. నాకు చాలా సంబంధాలు వచ్చాయి. కానీ వాళ్లు చాలా వాటిని రిజెక్ట్ చేశారు.

మాట్రిమోని

మాట్రిమోని

మాట్రిమోనిలో నా ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దాని ద్వారా నాకు చాలా సంబంధాలు వచ్చాయి. కానీ కొందరు మాకు నచ్చకపోవడం, ఇంకొందరికి మేము నచ్చకపోవడం వల్ల సంబంధాలన్నీ వెనక్కిపోయాయి.

ఒకబ్బాయి బాగా నచ్చాడు

ఒకబ్బాయి బాగా నచ్చాడు

ఒక అబ్బాయి మాత్రం నాకు బాగా నచ్చాడు. మా ఇంట్లో వాళ్లకు కూడా బాగా నచ్చాడు. అతనితో నా పెళ్లి ఫిక్స్ చేద్దామనుకున్నారు మా వాళ్లు. అతను మన తెలుగు రాష్ట్రాల మాజీ సీఎం బంధువు.

అతనితో రోజూ చాటింగ్

అతనితో రోజూ చాటింగ్

ఎలాగో పెళ్లి చేసుకుంటానని అతనితో రోజూ చాటింగ్ చేసేదాన్ని. అయితే చివరకు జాతకాలు కలవడం లేదని వాళ్ల ఇంట్లో వాళ్లు ఆ పెళ్లిని రిజెక్ట్ చేశారు. కొన్ని రోజులు ఆ అబ్బాయి, నేను చాలా బాధపడ్డాం. తర్వాత కొన్ని రోజులు మాట్రిమోని ప్రొఫైల్ నేను చూడలేదు.

ఫేస్ బుక్ లో మెసేజ్

ఫేస్ బుక్ లో మెసేజ్

చాలా రోజుల తర్వాత నేను ఫేస్ బుక్ ఓపెన్ చేశాను. అందులో నాకు మెసేజ్ వచ్చింది. నేను మాట్రిమోనిలో మీ ప్రొఫైల్ చూశాను. మీరంటే నాకిష్టం అని మెసేజ్. అతను ఫోన్ నంబర్ కూడా పంపాడు. అతని పేరు శరత్ రెడ్డి. తర్వాత నేను ఒక్కసారి ఫోన్ చేద్దామని చేశాను. అతను నా ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అయితే మా నాన్న రావడంతోనేను మాట్లాడలేకపోయాను.

వాట్సాప్ చాట్

వాట్సాప్ చాట్

తర్వాత వాట్సాప్ లో మెసేజ్ పంపాను. చుట్టూ మా వాళ్లు ఉన్నారు. తర్వాత మాట్లాడుదాం. ఫోన్ చేయమని చెప్పాను. ఇక వాట్సాప్ లో చాట్ మొదలుపెట్టాం. మా ఇద్దరి పరిచయాల దగ్గర మొదలైన మా చాట్ అదే రోజు రాత్రి మేము ఇద్దరం కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే దాకా వచ్చింది.

అతని ప్రతి మాట నచ్చింది

అతని ప్రతి మాట నచ్చింది

అతని ప్రతి మాట నాకు నచ్చింది. అతని మాటలో నిజాయితీ ఉంది. అతన్ని చూడకున్నా కూడా కచ్చితంగా పెళ్లంటే చేసుకుంటే వీన్నే చేసుకోవాలనిపించింది. సరే... నువ్వు నాకు నచ్చావ్.. నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్ని రోజులు పెళ్లి సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్లినందుకు బాధపడ్డాను కానీ ఇలాంటి మంచి సంబంధం నాకు రాసి పెట్టి ఉందనుకోలేదు అని అన్నాను. రేపు మా డ్యాడీకి ఫోన్ చెయ్.. అన్నీ వివరాలు మాట్లాడు అని చెప్పాను.

మా డ్యాడీకి ఫోన్ చేశాడు

మా డ్యాడీకి ఫోన్ చేశాడు

అతను మరుసటి రోజు మా డ్యాడీకి ఫోన్ చేశాడు. అంకుల్ నేను శరత్ ని. బెంగళూరులో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తాను. నాకు నలభైవేలు జీతం వస్తుందని చెప్పాడు. అతను ప్రతి విషయం నిజాయితీగా చెప్పాడు. కానీ మా డ్యాడీకి అతను ఎందుకో నచ్చలేదు. అంతకన్నా వేస్ట్ సంబంధాల గురించి నాతో చెప్పాడు కానీ ఇతని గురించి నాతో ప్రస్తావించలేదు.

వేస్ట్ కాల్ అన్నాడు

వేస్ట్ కాల్ అన్నాడు

ఒకరోజు నేను పక్కన ఉన్నప్పుడే అతని నుంచి ఫోన్ వచ్చింది. మా డ్యాడీ మాత్రం అది అంత ఇంపార్టెంట్ కాల్ కాదులే అని అన్నాడు. నాకు అప్పుడే అర్థం అయ్యింది. అతనంటే మా డ్యాడీకి ఇష్టంలేదనుకున్నాను. కానీ నేను మాత్రం అతనితో రోజూ చాటింగ్ చేసేదాన్ని. ఫోన్ లో మాట్లాడేదాన్ని. నాకు అతను చాలా బాగా నచ్చాడు. అతని నిజాయితీ నచ్చింది.

పెళ్లి చేసుకుంటే బాగుండనిపించింది

పెళ్లి చేసుకుంటే బాగుండనిపించింది

అతన్ని పెళ్లి చేసుకుంటే కచ్చితంగా ఆనందంగా ఉంటాననే భరోసా నాకు ఏర్పడింది. కానీ మా నాన్నకు ఈ విషయం తెలియదు. నేను చెప్పాలని ప్రయత్నించాను కానీ మా నాన్నకు అతను నచ్చలేదు కాబట్టి చెప్పలేదు. మేమిద్దరం ఇంట్లో ఒప్పించి లేదంటే లేచిపోయిగానీ పెళ్లి చేసుకుందామనుకున్నాం.అందుకోసం పక్కా ప్లాన్ కూడా వేసుకున్నాం.

సంబంధం ఫిక్స్ చేశారు

సంబంధం ఫిక్స్ చేశారు

కానీ మా డ్యాడీ అంతలో ఒక సంబంధం తెచ్చాడు. చివరకు ఆ సంబధాన్ని ఒకే చేశారు. అతనిది కర్నూలు పక్కన ఒక చిన్న పల్లెటూరు. ముంబైలో జాబ్ చేస్తూ ఉంటాడు. అతనితో పెళ్లి కూడా ఒకేరోజులో ఫిక్స్ చేశారు. ఆ పరిస్థితుల్లో నేను ఏమి అనకుండా ఉండిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేదు.

అతన్ని వదులుకున్నా

అతన్ని వదులుకున్నా

మా డ్యాడీ కోసం శరత్ ని వదులుకోవాల్సి వచ్చింది. మెల్లగా శరత్ తో మాట్లాడడం మానేశాను. అతన్ని నా నుంచి దూరం చేశాను. ఈ విషయంలో అతను పడ్డ బాధపడ్డ నాకు తెలుసు. కానీ పరిస్థితుల వల్ల అతన్ని దూరం చేసుకున్నాను.

పెళ్లి అయ్యింది కానీ.. నన్ను టచ్ చేయట్లేదు

పెళ్లి అయ్యింది కానీ.. నన్ను టచ్ చేయట్లేదు

ముంబైలో ఉండే అబ్బాయితో నా పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు మా వాళ్లు. మా పెళ్లి అయిన నాటి నుంచి అతను నన్ను ఇంత వరకు అస్సలు టచ్ చేయలేదు. ఫస్ట్ నైట్ రోజే నాకు డౌట్ వచ్చింది. కానీ ఆడపిల్లను కదా అలా సిగ్గు విడిచి చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. ఇప్పటికీ మా పెళ్లి అయి చాలా రోజలవుతుంది. కానీ అతను నన్ను మాత్రం ముట్టుకోలేదు.

మా నాన్న ఇలాంటి వాడికిచ్చాడు

మా నాన్న ఇలాంటి వాడికిచ్చాడు

మా నాన్న నా పెళ్లి కోసం చాలా రకాలుగా ఆలోచించి చివరకు ఇలాంటి వాడికి కట్టబెట్టాడు. ఇప్పుడు నా జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. శరత్ మంచి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న అతనికిచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేది కాదు.

శారీరక సంబంధం లేదు

శారీరక సంబంధం లేదు

వివాహం చేసుకున్న దగ్గర నుంచి నా భర్తతో నాకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. అసలు ఆ పని అంటేనే ఆసక్తి చూపడు. నిద్రపోయేటప్పుడు నాకు అతనికి మధ్య దిండ్లు పెడతాడు. ఇంత వరకు నాకు పెళ్లి అయినా ఆ సుఖం మాత్రం లేదు. డబ్బుంది. ఆస్తి ఉంది. మా ఆయన పెద్ద కంపెనీలో జాబ్ ఉంది. అన్నీ ఉన్నా.. ఐదోతనం తక్కువైనట్లు నా జీవితం ఇలా తగలడింది.

అతను తేడా

అతను తేడా

అతని గురించి బయట చెప్పి నా సంసారాన్ని అల్లరిపాలు చేసుకోలేక.. అలా అని ప్రశాంతంగా ఉండలేక నిత్యం నరకం అనుభవిస్తున్నాను. అతనిలో ఆ సామర్థ్యం లేదని నాకు అర్థమైంది. అతను తేడాగాడు.

ప్రతి తండ్రికి నేను చెప్పేది ఒక్కటే. మీ కూతుర్లకి డబ్బు, ఆస్తి ఉన్నోడిని చూసి పెళ్లి చేస్తే మాత్రమే సరిపోదు. అతను మీ కూతుర్ని అన్ని విధాలుగా బాగా చూసుకుంటాడో లేదో అని కూడా ఆలోచించాలి.

English summary

my husband does not want to have sex with me

my husband does not want to have sex with me