For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శోభనం రోజు కన్నెపొర చిట్లిపోలేదంటే పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఉన్నట్లేనా?

శోభనం రోజున ఎంతో ఉత్సాహంగా అందులో పాల్గొనే జంటల్లో కొన్ని జంటలు శోభనం రోజును విడాకుల రోజుగా మార్చుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి.

By Bharath
|

ప్రశ్న : నా వయస్సు 26 యేళ్లు. నాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. మా ఆయనకు నాకు ఎంగేజ్ మెంట్ అయినప్పటి నుంచి ప్రతి విషయం చెప్పేవాడు. రోజూ ఇద్దరం గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లం. మాకు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు మేమిద్దరం శారీరకంగా కలిశాం.

యోని నుంచి రక్తస్రావం కాలేదు

యోని నుంచి రక్తస్రావం కాలేదు

నేను, మా ఆయన శారీరకంగా కలిసినప్పుడు నా యోని నుంచి రక్తస్రావం కాలేదు. నా కన్నెపొర చిట్లిపోలేదు. దీంతో మా ఆయన నాపై డౌట్ పడుతున్నాడు. నన్ను అనుమానిస్తున్నాడు. నిజంగా నాకు పెళ్లికాకముందు ఎవరితోనూ శారీరక సంబంధాలు లేవు.

కన్యనని ఎలా నిరూపించాలి?

కన్యనని ఎలా నిరూపించాలి?

నేను నిజంగా కన్యనే అని ఎలా నిరూపించాలి. నేను కన్యనే అయినా శోభనం రోజు రాత్రి ఎందుకు నా కన్నెపొర చిట్లిపోలేదు. దీనికి కారణాలు ఏమిటో నాకు తెలియడం లేదు. దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయగలరు.

 లేనిపోని సందేహాలు

లేనిపోని సందేహాలు

సమాధానం : చాలా మంది భర్తలకు తమ భార్యల కన్నెత్వంపై లేనిపోని సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా శోభనం రోజు రాత్రి అంగ ప్రవేశం జరిగిన తర్వాత యోనిలోని రక్తం వచ్చినట్టయితే తన భార్య కన్నె అని భావిస్తారు.

ఇతరులతో సెక్స్ సంబంధం

ఇతరులతో సెక్స్ సంబంధం

అలా బ్లీడింగ్ కాకుంటే మాత్రం ఖచ్చితంగా తన భార్యకు పెళ్లికి ముందే ఇతరులతో సెక్స్ సంబంధం ఉండివుంటుందని భావిస్తుంటారు.

అలా చేస్తే కన్నెపొర పోతుంది

అలా చేస్తే కన్నెపొర పోతుంది

అయితే, శోభనం రోజున కన్నెపొర చీలిపోవాలన్న నియమేమీ లేదు. కానీ, పెళ్లికి ముందు ఆ యువతికి సైకిల్ తొక్కే అలవాటు ఉన్నా.. క్రీడల్లో ఎక్కువగా పాల్గొంటున్నా కన్నెపొర పోతుంది. అందువల్ల మొదటి రోజున రక్తం రావొచ్చు. రాకపోవచ్చు.

అలాంటప్పుడు ఎలా పోతుంది?

అలాంటప్పుడు ఎలా పోతుంది?

అయితే, చాలా మంది యువతులకు సైకిల్ తొక్కే అలవాటు ఉండదు. అదేవిధంగా శోభనం రోజున బ్లీడింగ్ రాదు. అలాంటప్పుడు కన్నెపొర ఎలా పోతుందన్న సందేహం ఉంటుంది.

అనుమానించడం తగదు

అనుమానించడం తగదు

మొదటి కలయికలో రక్తస్రావం కానంత మాత్రాన, సైకిల్ తొక్కే అలవాటు లేనంత మాత్రాన కట్టుకున్న భార్యకు పెళ్లికి పూర్వమే సెక్స్ సంబంధాలు ఉన్నాయని అనుమానించడం భావ్యం కాదని వైద్య నిపుణులు సూచన చేస్తున్నారు.

కృత్రిమ కన్నెపొర

కృత్రిమ కన్నెపొర

ఒకవేళ కన్నెపొర ఖచ్చితంగా కావాల్సిందే అనుకుంటే గంటపాటు సర్జరీ చేసి కృత్రిమ కన్నెపొరను నిర్మించవచ్చు. ఐతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

చాలా అరుదుగా

చాలా అరుదుగా

ఇదివరకటి రోజుల్లో మహిళలు కేవలం ఇంటి పనికే పరిమితమయ్యేవారు. ఇప్పటి మహిళలు సైక్లింగ్, జాగింగ్, గేమ్స్ వంటి వాటిలో చురుగ్గా పాల్గొంటున్నారు కనుక చాలా అరుదుగా అమ్మాయిల్లో కన్నెపొర ఉండే అవకాశం ఉంది.

తెలిసీ తెలియని జ్ఞానం వల్ల

తెలిసీ తెలియని జ్ఞానం వల్ల

ప్రతి ఒక్క యువతీ యువకుడు తమ వైవాహిక బంధం "మూడు పువ్వులు.. ఆరు కాయలు"గా సాగాలంటే ఒకరిపై ఒకరు పరస్పర నమ్మకం ముఖ్యమంటున్నారు. అందువల్ల మొదటి రోజు కలయికలోనే ప్రతి స్త్రీకి కన్నెపొర పోయి రక్తస్రావం అవ్వాలన్న నియమేమీ లేదు. ఎవరో కొంతమంది యువకులు తెలిసీ తెలియని జ్ఞానం వల్ల మాట్లాడే మాటలను ప్రామాణికంగా తీసుకుంటే సంసారం ఎక్కువ కాలం సాగదు.

అపోహలే

అపోహలే

శోభనం రోజున ఎంతో ఉత్సాహంగా అందులో పాల్గొనే జంటల్లో కొన్ని జంటలు శోభనం రోజును విడాకుల రోజుగా మార్చుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి. తన భార్యకు కన్నె పొర లేదనీ, సెక్స్ చేస్తే రక్తం రాలేదనీ, అందువల్ల ఆమెకు పెళ్లికి ముందే సెక్స్ సంబంధం ఉందని నమ్మేవారు ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. అవన్నీ అపోహలే.

English summary

my husband doubts me because I did not bleed on my first night

my husband doubts me because I did not bleed on my first night
Story first published: Monday, February 26, 2018, 14:42 [IST]
Desktop Bottom Promotion