నా భార్యతో కాకుండా ఆమెతో నాకు అన్నీ రకాల సంబంధాలున్నాయి.. కానీ మాది పవిత్రబంధమే - My Story #29

Written By:
Subscribe to Boldsky

అవి నా కాలేజీ రోజులు. మొదటిసారి ఆమెను చూసింది అక్కడే. తను నా క్లాస్ మేట్. నేను చూసినప్పుడే అనుకున్నాను చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని. తర్వాత ఆమెను కొన్ని రోజులు వన్ సైడ్ లవ్ చేశా. ఇక ఎక్కువ రోజులు నా ప్రేమను నాలోనే ఉంచుకోలేక తనకు చెప్పాను. ఆమె నా ప్రేమను అంగీకరించింది.

డ్యూయెట్లు పాడుకున్నాం

డ్యూయెట్లు పాడుకున్నాం

ఇద్దరం కలిసి చాలా డ్యూయెట్లు పాడుకున్నాం. అయితే వాళ్ల ఇంట్లో వాళ్లు ఆమెకు సంబంధం తీసుకొచ్చారు. అతన్ని వాళ్ల ఇంట్లో వాళ్ల అందరికీ నచ్చాడు. కానీ ఆమెకు పెళ్లి సంబంధం కుదిరిన విషయంగానీ, తర్వాత పెళ్లి అయిన విషయంగానీ నాకు అస్సలు తెలియదు. నాకు తెలిసేలోపు ఆమె పెళ్లి అయిపోయింది.

అప్పటికప్పుడు పెళ్లి

అప్పటికప్పుడు పెళ్లి

తర్వాత తనని కలిస్తే మన గురించి మా ఇంట్లో తెలిసింది. అందుకే మా వాళ్లు అప్పటికప్పుడు ఒక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశారంది. తాను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల అలా చేసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.

చనిపోతామని భయపించారు

చనిపోతామని భయపించారు

పెళ్లి చేసుకోకపోతే తామంతా చనిపోతామని ఇంట్లో వాళ్లంతా భయపించారని చెప్పింది. అందువల్లే తాను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఏడ్చింది. అయితే తను నన్ను కలిసే సమయానికి తనకు ఇంకా ఫస్ట్ నైట్ కూడా పూర్తి కాలేదు. పెళ్లి అయి కొద్ది రోజులైనా ఏదో మంచి రోజులు లేవని శోభనాన్ని వాయిదా వేశారంట.

స్వర్గం చూశాం

స్వర్గం చూశాం

ఆ రోజు నాపై తనకున్న ప్రేమను నా ఒళ్లో పడుకుని చెప్పింది. అప్రయత్నంగానే నేను తనపై చెయ్యి వేశాను. తాను నా నుదిటిపై ముద్దుపెట్టింది. తర్వాత నేను తనని ముద్దుల్లో ముంచెత్తాను.

ఆ తర్వాత ఇద్దరమూ అందులో స్వర్గాన్ని చూశాం.

తుదిశ్వాస వరకు

తుదిశ్వాస వరకు

మాది వ్యామోహంతో కూడిన ప్రేమకాదు. ఇద్దరినీ ఒకరినొకరం వదిలి ఉండలేనంత అనుబంధం మాది. కానీ కాలం మా ఇద్దరినీ విడదీసింది. అయితే నా తుదిశ్వాస వరకు నేను తనతోనే ఉండాలనుకున్నాను. తనను విడిచి ఉండే ప్రసక్తే లేదనుకున్నాను.

మా బంధంలో ఎప్పుడూ అలా జరగలేదు

మా బంధంలో ఎప్పుడూ అలా జరగలేదు

తర్వాత నాకు మా ఇంట్లో ఒక అమ్మాయిని చూశారు. ఆమెతో నాకు పెళ్లి అయ్యింది. నాకు పెళ్లయినగానీ నా మనస్సు మాత్రం నా ప్రేయసిపైనే ఉండేది. ఇప్పటి కొన్ని ఏళ్లపాటు నేను నా ప్రేయసిని రెగ్యులర్ గా కలుస్తూ ఉంటాను. మా బంధంలో ఇప్పటి వరకు ఏ రోజు తగాదాలు రాలేదు.

స్వార్థం లేని ప్రేమ

స్వార్థం లేని ప్రేమ

మా ఇద్దరిదీ స్వార్థం లేని ప్రేమ. కానీ మా విషయం ఆమె భర్తకు గానీ, నా భార్యకు గానీ ఎవరికీ తెలియదు. మేము కలుసుకునే ప్రాంతం, మేము మాట్లాడుకునే సమయం, మేము సంభాషించే మాటలు మాకు తప్పా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియవు. అందువల్లే ఇప్పటి వరకు మేమిద్దరం ఎప్పుడూ బయటపడలేదు.

అక్రమం సంబంధం కాదు

అక్రమం సంబంధం కాదు

మా మధ్య ఉన్నది అక్రమ సంబంధం అని నేను అనుకోను. మాది పవిత్రబంధంగానే నేను భావిస్తాను. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తను తట్టుకోలేదు. తనకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉండలేను. మా ఇద్దరి మధ్య కేవలం అలాంటి రిలేషన్ మాత్రమే లేదు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ.

లేదంటే అలా ఉండేవాళ్లం

లేదంటే అలా ఉండేవాళ్లం

వాళ్ల ఇంట్లో వాళ్లు ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు లేదంటే మేమిద్దరం చిలుకా గోరింకల్లా కలకాలం కాపురం చేస్తూ హ్యాపీగా ఉండేవాళ్లం. కానీ విధి రాతకు అలా బలి కావాల్సి వచ్చింది. జీవితాతం మా బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికీ కొన్ని ఏళ్ల తరబడి మా అనుబంధం సాగుతోంది.

నా భార్యకు అస్సలు తెలియదు

నా భార్యకు అస్సలు తెలియదు

నేను ఇన్ని రోజులుగా నా ప్రేయసితో ఆ బంధం కలిగి ఉన్నా కూడా కూడా నా భార్య అస్సలు తెలియదు. కొన్ని ఏళ్ల తరబడి నేను నా ప్రేయసితో సంబంధాన్ని కొనసాగిస్తున్నాను.

ఎప్పటికీ తెలియకూడదు

ఎప్పటికీ తెలియకూడదు

మా బంధం గురించి ఎప్పటికీ నా భార్యకుగానీ, నా ప్రేయసి భర్తకుగానీ తెలియకూడదని నేను భావిస్తున్నాను. ఇలాగే ఎప్పటికీ మా బంధం ఉండాలి. మేము ఎక్కువగా మాట్లాడుకోవడానికే కలుస్తుంటాం. మా మధ్యలో అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండవు. ఎప్పుడో ఒకసారి అందులో పాల్గొంటాం. ఎక్కువగా మా పాతరోజులను గుర్తుకు తెచ్చుకుని ఆనందిస్తుంటాం. అందుకే మాది పవిత్రబంధం.

English summary

Mystory My Wife Didn’t Know I Was a Woman Until Over a Decade Into Our Relationship

Mystory My Wife Didn’t Know I Was a Woman Until Over a Decade Into Our Relationship
Story first published: Thursday, January 4, 2018, 10:00 [IST]