అలాంటి అమ్మాయిని చేసుకుంటే లైఫ్ సెట్ అయినట్లే

Written By:
Subscribe to Boldsky

ఎలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చాలా మంది తర్జనభర్జనపడుతుంటారు. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు అంతా చెక్ చేసుకుంటారు. జాతకాలు చేయించుకుంటారు. అన్నీ చేస్తారు కానీ ఇప్పుడున్న జెనరేషన్ అబ్బాయిలు అమ్మాయిల్లో ఇంకా చాలా క్వాలీటీలు చెక్ చేసుకుని పెళ్లి చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చంట. ఇప్పటికే ఏదైనా ఉద్యోగపరంగా స్థిరపడిన అమ్మాయిని మీరు చేసుకుంటే మీకు చాలా లాభాలుంటాయి. మరి అవి ఏమిటో చూడండి.

జాబ్ చేసే అమ్మాయి

జాబ్ చేసే అమ్మాయి

ఇంతకు ముందు భార్య గ్రాడ్యుయేట్ అయ్యుండాలని అబ్బాయిలు కోరుకునేవారు. ఇప్పుడు మాత్రం చదువుతో చక్కని ఉద్యోగం చేస్తున్న భార్య తోడుండాలని కోరుకుంటున్నారు చాలామంది అబ్బాయిలు. దీంతో జీవితంలో త్వరగా సెటిలైపోవచ్చని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. అందుకే అలాంటి అమ్మాయిల కోసం వెదుకుతున్నారు. కానీ జాబ్ చేస్తున్న యువతులు దొరకడమే చాలా కష్టంగా మారింది.

పెళ్లిళ్లు లేటవుతున్నాయి

పెళ్లిళ్లు లేటవుతున్నాయి

అబ్బాయిలు చాలామంది ఉన్నత విద్యనభ్యసించాలి... మంచి ఉద్యోగం సంపాదించాలి... ఆర్థికంగా నిలదొక్కుకోవాలి... ఆ తరువాత తమకు తగ్గట్లుగా ఉద్యోగం చేసే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ప్రయత్నాల్లో అనేకమందికి మూడు పదుల వయస్సు దాటిపోతోంది. జీవిత లక్ష్యం ముందు పెరుగుతున్న వయస్సును ఎవరూ పెద్దగా లెక్క చేయడం లేదు. ఏళ్లలోపు వారు 9 శాతం మంది ఉన్నారు.

మీకు కాస్త అండగా

మీకు కాస్త అండగా

గవర్నమెంట్ జాజ్ లేదంటే ప్రైవేట్ జాబ్ చేసే అమ్మాయి మీ కుటుంబానికి కాస్త అండగా ఉంటుంది. మీరు ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను మీకు చేతనైనంతా చేయూతనిస్తుంది. అంతేకాదు నెలనెలా మీ జీతానికి ఆమె జీతం కూడా తోడు అవ్వడం వల్ల మీరు ఆర్థికంగా పుంజుకుంటారు.ఒక్కోసారి మీరు సంపాదించే డబ్బు కుటుంబ ఖర్చులకు సరిపోకపోవొచ్చు. అలాంటి సందర్భంలో ఆమె మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది.

అన్ని విషయాలు తెలిసి ఉంటాయి

అన్ని విషయాలు తెలిసి ఉంటాయి

మీరు మంచి పొజిషన్ లో జాబ్ చేసే అమ్మాయిని చేసుకుంటే ఆమెకు ప్రతి విషయం తెలిసి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోదు. ఆఫీసులో వర్క్ కల్చర్ గురించి తెలియని భార్యలు మా ఆయన రోజూ ఆఫీస్ టీక్ టాక్ న రెడీ అయి వెళ్తాడు.. అక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తాడో అని అనుకుంటారు. అందువల్ల మంచి పొజిషన్ లో జాబ్ చేసే అమ్మాయిని చేసుకుంటే మీరు ఆఫీసులో పడే ఇబ్బందులను ఆమె అర్థం చేసుకోగలదు.

నిన్ను అర్థం చేసుకోగలదు

నిన్ను అర్థం చేసుకోగలదు

ఆమెకు ప్రతి విషయంపై అవగాహన ఉంటుది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనవంతు సాయం నీకు అందిస్తుంది. నీకు ధైర్యం చెబుతుంది. నీకు ప్రతి విషయంలో తోడుగా నిలుస్తుంది. వీలైతే నీ వర్క్ బర్డన్ ను నువ్వు ఒక్కడివే మోయకుండా ఇంటి దగ్గర వీలైనంత వరకు తను సాయం చేస్తుంది.

ఆఫీసు రాజకీయాలు తెలుసు

ఆఫీసు రాజకీయాలు తెలుసు

తను కూడా ఇక ఆఫీసులోనే వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆఫీసు రాజకీయాలపై తనకు బాగా అవగాహన ఉండి ఉంటుంది. మిమ్మల్ని ఆఫీసులో టార్చర్ చేసే వారు చాలామందే ఉంటారు. అలాంటి వారి గురించి ఇంటికొచ్చి మీరు చెబితే ఆమె వింటుంది. మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. మీరు మానసికంగా మరింత బలహీనపడకుండా జాగ్రత్తలు చెబుతుంది.

సలహాలు ఇస్తుంది

సలహాలు ఇస్తుంది

ఆఫీసులో ఉండే దుర్మార్గులను ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై నీకు సలహాలు ఇస్తుంది. ఆఫీసులో ఆడవారి రూపంలో కూడా మీకు శత్రువులు ఉండొచ్చు. వారితో మీరు వేగలేక ఇబ్బందులుపడుతుంటే మీ భార్యకు మీకు ఆ సమయంలో కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుంది.

నీకు తగ్గట్టే వ్యవహరిస్తుంది

నీకు తగ్గట్టే వ్యవహరిస్తుంది

ఆమె నీకు తగ్గట్టే వ్యవహరిస్తుంది. మీరు చాలా ఫ్యాషనబుల్ పర్సన్ అయితే ఆమె కూడా మీలాగా వ్యవహరించగలదు. మీతో ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆమెకు తెలిసి ఉంటుంది. మీతో పాటు బయటకు ఫంక్షన్స్ క వెళ్లినప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి. మీతో పాటు పార్టీలకు వెళ్లినప్పుడు ఎలా బిహేవ్ చేయాలనే విషయాలన్నీ ఆమెకు తెలిసి ఉంటాయి.

మీ పిల్లలు బాగా చదువుకోగలుగుతారు

మీ పిల్లలు బాగా చదువుకోగలుగుతారు

మీ బాగా చదువుకుని ఉంటారు కాబట్టి మీ పిల్లలు ఎలాంటి చదువు అందించాలనే విషయం ఆమెకు బాగా తెలిసి ఉంటుంది. నువ్వు పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టేందుకు ఖాళీ సమయం దొరకదు. అందువల్ల మీ భార్య మీ పిల్లల చదువు విషయంలో కేర్ తీసుకోగలదు.

ఆమె ఇచ్చే సూచనలు మీకు ఉపయోగపడతాయి

ఆమె ఇచ్చే సూచనలు మీకు ఉపయోగపడతాయి

ఆమె కూడా జాబ్ చేస్తుంది కాబట్టి వృత్తిపరంగా ఎలా ఎదగాలనే విషయాలు ఆమెకు కూడా బాగా తెలిసి ఉంటాయి. అలాంటి సూచనలు మొత్తం కూడా మీకు ఆమె ఇస్తుంది. మీరు మీ ప్రొఫెషన్ పరంగా ఎలా ఎదగాలి అని ఆమె మీకు సూచిస్తుంది.

మంచి మంచి నిర్ణయాలు

మంచి మంచి నిర్ణయాలు

మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆమె చాలా హెల్ప్ చేస్తుంది. వర్క్ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా మీరు మరింత మెరుగుపడేందుకు ఆమె సూచనలు ఇవ్వగలదు. మీరు ఇళ్లు, కారు ఇలాంటి వాటిని తీసుకోవాల వద్దా అని బాగా ఆలోచిస్తున్న సమయంలో ఆమె తనకు తోచిన సలహాలు ఇవ్వగలదు. ఏం చేస్తే బాగుంటుంది.. ఏం చెయ్యకుంటే మేలని విషయాలను వివరిస్తుంది.

సమాజంలో నీకు మంచి గుర్తింపుడేలా చేస్తుంది

సమాజంలో నీకు మంచి గుర్తింపుడేలా చేస్తుంది

ఒకవేళ మీ భార్య ఇంటికి మాత్రమే పరిమితం అయితే సమాజంలో నీకు ఎలాంటి విలువ ఉందనే విషయం ఆమెకు అంతగా తెలియదు. అయితే ఆమె జాబ్ చేస్తున్నట్లయితే నీ విలువ సమాజంలో మరింత పెరిగేందుకు ఆమె సాయపడుతుంది. నీవు పదిమందిలో మంచి గుర్తింపు పొందేలా ఆమె మీకు అన్ని రకాలు సలహాలు ఇస్తుంది. మీకు అండగా నిలుస్తుంది.

మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది

మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది

నీ భార్య బాగా చదువుకుని ఉంటుంది కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు బాగుండేలా ఆమె అన్ని రకాల జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటుంది. కేవలం చదువు విషయంలోనే కాకుండా పిల్లలు భవిష్యత్తులో ఎలా స్థిరపడితే బాగుంటుందనే విషయాలు కూడా ఆమెకు తెలిసి ఉంటాయి. అందువల్ల జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయండి.

English summary

reasons to marry a girl who is in good position at work

reasons to marry a girl who is in good position at work
Story first published: Thursday, January 18, 2018, 17:00 [IST]