మీరు పరిణితి చెందిన స్త్రీ తో ఉన్నారని తెలియజేసే లక్షణాలు ఇవే

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

సంబంధ బాంధవ్యాల విషయాల దగ్గరకు వచ్చేసరికి స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయమై పురుషులకు నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి.

పరిణితి చెందిన స్త్రీలు ఈ విషయం మొత్తాన్ని ఎంతో సమర్ధవంతంగా అర్ధం చేసుకోగలరు. ఈ వ్యవహారంలో మరీ లోతులకు వెళ్లి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోకుండా ఇలాంటి స్త్రీలు పరిణితితో వ్యవహరిస్తారు. ప్రతి ఒక్క విషయం పై అవగాహన కలిగి ఉంటారు.

15 SIGNS THAT TELL YOU ARE WITH A MATURED WOMAN

మీరు పరిణితి చెందిన స్త్రీ తోనే ఉన్నారు అని తెలియజెప్పే లక్షణాలు ఇవే :

పరిణితి చెందిన స్త్రీతో సంబంధ బాంధవ్యం ఏర్పడినట్లైతే మీరు ఎదగడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది. మీ జీవితానికి సంపూర్ణతత్వం ఏర్పడుతుంది. మీరు ఉంటున్న మహిళలు పరిణితితో వ్యవహరిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలియజెప్పే లక్షణాలు ఇవే. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. ప్రేమను అనుభూతి చెందేలా చేస్తుంది :

1. ప్రేమను అనుభూతి చెందేలా చేస్తుంది :

మీరు ఎలాంటి ప్రేమను అయితే కోరుకుంటున్నారో, అలాంటి ప్రేమను పరిణితి చెందిన మహిళలు మీకు ఎప్పుడూ అందిస్తారు. వారి దగ్గర అలాంటి ప్రేమ అందించడానికి కొరత ఉండదు. ఆమె చేయదలచిన ఒకే ఒక విషయం ఏమిటంటే, ఆమె ప్రేమను పూర్తిగా, సంపూర్ణంగా ఇవ్వగలదు.

2. అవసరమైనప్పుడు సహాయం అడగటానికి అస్సలు భయపడదు :

2. అవసరమైనప్పుడు సహాయం అడగటానికి అస్సలు భయపడదు :

స్వతంత్ర భావాలతో దృఢమైన మనస్తత్వాన్ని కలిగిన మహిళ అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఈమెకు కూడా సహాయం అవసరం అవుతుంది. సహాయం గనుక అవసరం అయితే అది అడగటానికి ఎప్పడూగాని సంకోచించదు. ఏ విషయంలో అయినా వాటి పరిధులు ఏమిటి అనే విషయం ఈమెకు బాగా తెలుసు. ఏదైనా విషయంలో సరిగ్గా చేయలేకపోతే అటువంటి సందర్భంలో సహాయం కోరుతుంది. ఎందుకంటే, ఆమె ఎవరినైతే ప్రేమిస్తుందో వారిని సహాయం అడగవచ్చని భావిస్తుంది, అది ఆమెకు తెలుసు.

ఈమె చేసే పని ఎంతో పరిణితితో కూడుకున్నది అని నిరూపణ అవుతుంది. మిమ్మల్ని సహాయం అడగటానికి ఎప్పుడుగాని తటపటాయించదు, తప్పని భవించదు.

3. ఎప్పుడూ నమ్మదగిన వ్యక్తిగా ఉంటుంది :

3. ఎప్పుడూ నమ్మదగిన వ్యక్తిగా ఉంటుంది :

పరిణితి చెందిన స్త్రీలు ఎప్పుడు మాట్లాడినా కూడా మనస్సులో నుండి స్వచ్ఛమైన, నిజమైన, నిజాయితీ గల మాటలనే మాట్లాడుతారు. ఇదే వారి యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. నమ్మకంగా ఉంటే, నిజాయితీతో ఉంటే, ఎలా ఉంటుంది అనే విషయం వారికీ బాగా తెలుసు. తాను ఎప్పుడు గానీ అబద్దాలు చెప్పకూడదని భావిస్తుంది. ప్రతి విషయంలో ప్రతిసారి వీలైనంతవరకు నమ్మకంగానే వ్యవహరిస్తారు. ఎప్పటికి నమ్మకాన్ని అలానే కొనసాగించాలని అనుకుంటారు.

4. ఆమె ముఖం పై ఎప్పడూ చిరునవ్వు ఉంటుంది :

4. ఆమె ముఖం పై ఎప్పడూ చిరునవ్వు ఉంటుంది :

మిమ్మల్ని నవ్వించడానికి ఎప్పడూ తాపత్రయ పడుతూ ఉంటుంది. మీ కళ్ళు ఎప్పుడైతే ఆమెను చేస్తాయో, ఆ క్షణం మీకు నవ్వు రాకుండా ఆగదు. ప్రతి విషయం ఖచ్చితత్వంతో ఉంది అనే భావనను మీకు ఆమె కలిగిస్తుంది. ఇద్దరి మధ్య ఎటువంటి అడ్డంకులు లేవు అనే విషయం మీకు అర్ధం అయ్యేలా చేస్తుంది. ఇలా ప్రతి విషయం లో ఆమె ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఆమె యొక్క నిజాన్ని, నిజాయితీని మీరు నమ్మాలి, స్వీకరించాలని తాపత్రయ పడుతుంది. ఈ సమయంలోనే మీకు వారి పరిణితి చెందిన లక్షణం తెలుస్తుంది.

5 సంబంధ బాంధవ్యాల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంది :

5 సంబంధ బాంధవ్యాల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంది :

పరిణితి చెందిన స్త్రీలు సంబంధ బాంధవ్యాల విషయంలో చాలా ఖచ్చితత్వంతో ఉంటారు, బాధ్యతగా వ్యవహరిస్తారు. అది వారిలో ఉండే ఉత్తమ లక్షణం. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు అది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అనే విషయం వారికి బాగా తెలుసు. అలానే జరిగేలా ఆమె కూడా కృషిచేస్తుంది. అలా చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యవంతంగా ఉండేలా జాగ్రత్తపడుతుంది. మీరు ఎంతైతే సంబంధ బాంధవ్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారో, అంతే ప్రాముఖ్యతను ఆమె కూడా ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.

6. భావాలను ఎప్పుడు గాని ఆమె దాచుకోదు :

6. భావాలను ఎప్పుడు గాని ఆమె దాచుకోదు :

పరిణితి చెందిన స్త్రీలు ఎప్పుడు గాని తమ భావాలను దాచుకోవడానికి అస్సలు ప్రయత్నించరు. వీరు చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తారు. వారి భావాల గురించి బాహాటంగానే చెప్పేస్తారు. వారికి అలా వ్యక్తీకరించడమే వచ్చు. తన భావాలను వ్యక్తం చేసేటప్పుడు ఎప్పుడైనా తప్పుచేసే అవకాశం ఉంది అనే విషయం ఆమెకు కూడా తెలుసు, కానీ అలా చేయడాన్ని ఆమె ఎప్పుడు గాని తప్పుగా భావించదు. ఎందుకంటే, ఆమె అది తన సొంత భావనగా భావిస్తుంది. ఏది దాచుకోవాలని ప్రయత్నించదు.

తన భావాలను ఎప్పుడుగాని రహస్యంగా ఉంచుకోవాలని భావించదు. ఎందుకంటే, అలా గనుక చేస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని ఆమెకు కూడా తెలుసు. కాబట్టి, ఆమె మీ దగ్గర ప్రతి విషయాన్ని దాచకుండా బాహాటంగానే వ్యక్తీకరిస్తుంది.

7. ఆమె జీవితాంతం మీపై నమ్మకం ఉంచుతుంది :

7. ఆమె జీవితాంతం మీపై నమ్మకం ఉంచుతుంది :

ఆమె నిర్ణయాలన్నీ మీతో పాటు, మీ చుట్టూనే ఉంటాయి. అందుచేతనే ఆమె మీ పై పూర్తి నమ్మకాన్ని ఉంచుతుంది. ఆమె మిమ్మల్ని అంతలా ఎందుకు నమ్ముతుందంటే, మీరు కూడా అదే విధంగా నమ్మకం ఉంచుతారని ఆమె భావిస్తుంది.

మీరు ఏమి చేస్తున్నారు అనే విషయాన్ని పెద్దగా ఎప్పుడూ పట్టించుకోదు. ఎందుకంటే ఎప్పటికి మీరు తనవారు అని భావిస్తుంది. మీరు ఏ స్వతంత్రాన్ని అయితే కోరుకునే వారో దానిని మీకు ఇస్తుంది.

ఆమె దృష్టిలో సంబంధ బాంధవ్యం అనేది చాలా ముఖ్యమైనది. మీరు కూడా అదే విధంగా ఆలోచించాలని ఆమె భావిస్తుంది.

8. మీ కుటుంబ సభ్యులకు ఆమె గౌరవాన్ని ఇస్తుంది :

8. మీ కుటుంబ సభ్యులకు ఆమె గౌరవాన్ని ఇస్తుంది :

మీ కుటుంబాన్నే ఆమె కుటుంబంగా భావిస్తుంది. ఆ విధంగా ఆమె మీ కుటుంబ సభ్యులని, మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది. ఆమె తన కుటుంభసభ్యులతో ఎలా అయితే వ్యవహరిస్తుందో, అచ్చం మీ కుటుంబ సభ్యులతో కూడా అలానే ఉంటుంది. ఏ విషయంలో కూడా తప్పు జరగకూడదు అని భావిస్తుంది. అర్ధవంతమైన నిజమైన సంబంధ బాంధవ్యాలను నెరపాలని అనుకుంటుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్థలు లేదా ఆలోచన ధోరణిలో వ్యత్యాసాలు ఉండి ఉండవచ్చు. కానీ, ఎప్పుడు గాని విపరీతమైన గౌరవాన్ని ఇవ్వడం మాత్రం మరచిపోదు.

9. ఆమె ఎంతగానో అర్ధం చేసుకుంటుంది :

9. ఆమె ఎంతగానో అర్ధం చేసుకుంటుంది :

మీరు గడిపిన జీవితం చాలా విభిన్నమైనది అనే విషయం ఆమె అర్ధం చేసుకుంటుంది. దానిని ఆమె స్వీకరిస్తుంది. మీ మధ్య ఏమైనా మనస్పర్థలు ఉంటే, ఈ అర్ధం చేసుకొనే ప్రక్రియ ద్వారా అవన్నీ సమసిపోయి మీ బంధం మరింత బలపడుతుంది. అలా నిరంతరంగా మీ సంబంధ బాంధవ్యం కొనసాగుతూ ఉంటుంది.

10. ఆమె మాట్లాడే మాటలకు తగ్గట్లుగానే ఆమె పనులు కూడా ఎంతో విలువైనవి అనే విషయాన్ని రుజువు చేస్తుంది :

10. ఆమె మాట్లాడే మాటలకు తగ్గట్లుగానే ఆమె పనులు కూడా ఎంతో విలువైనవి అనే విషయాన్ని రుజువు చేస్తుంది :

ఆమె ఎప్పుడూ తాను చెప్పిన మాటలకు కట్టుబడే ఉంటుంది. తాను చెప్పిన విధంగానే తన పనుల ద్వారా మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆ విషయంలో ఎప్పుడూ మిమ్మల్ని నిరుత్సాహ పరచదు.

తాను మాట్లాడిన మాటలకు, చేసే పనులకు మధ్య వ్యత్యాసం ఉంది అని చెప్పే అవకాశాన్ని ఎప్పుడు గాని మీకు ఇవ్వకూడదు అని భావిస్తుంది, అలానే వ్యవహరిస్తుంది.

11. భావోద్వేగ పరంగా ఆమె చాలా దృఢమైన వ్యక్తి :

11. భావోద్వేగ పరంగా ఆమె చాలా దృఢమైన వ్యక్తి :

తన గురించి తనకు బాగా తెలుసు అందుచేతనే మానసికంగా, శారీరకంగా, భావోద్వేగ పరంగా శక్తివంతంగా ఉంటుంది. భావోద్వేగాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఎప్పుడుగాని భావించదు. తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని, అవసరమైనప్పుడే వాడి, అవి ఎప్పుడుగాని బాధ కలిగించకూడదు అని భావిస్తుంది.

కొన్ని సందర్భాల్లో ఆమె భావోద్వేగాలు బయటపడతాయి. కానీ, అవి మీ ముందు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఆమె మనస్సుకి అత్యంత దగ్గర వ్యక్తులు మీరే కాబట్టి అలా వ్యవహరిస్తుంది.

12. ఆమె ఎప్పుడూ అర్ధవంతంగా వ్యవహరిస్తుంది, లోతైన చర్చలు జరుపుతుంది :

12. ఆమె ఎప్పుడూ అర్ధవంతంగా వ్యవహరిస్తుంది, లోతైన చర్చలు జరుపుతుంది :

ఆమె జరిపే చర్చలు సముద్రం కంటే లోతైనవిగా ఉంటాయి. తన మెదడులో ఉండే ఆలోచనలను, ఆలోచనా విధానాలను మీకు చెబుతూ ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ఆమె చేసే చర్చలు ఎంతో విలువైనవిగా,అర్ధవంతమైనవిగా ఉంటాయి. సమయాన్ని వృధా చేసినట్లు అస్సలు అనిపించదు. అదే సమయంలో మీలో ఎంతో సానుకూల దృక్పధం కనపడుతుంది.

13. మీతో ఒక జట్టులా పనిచేస్తుంది :

13. మీతో ఒక జట్టులా పనిచేస్తుంది :

ఏకాంతంగా ఏదైనా పని చేయడం కంటే కూడా మీతో కలిసి ఓ జట్టులా పనిచేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. ఆమె జట్టు స్ఫూర్తిని ఎంతగానో అర్ధం చేసుకుంటుంది. అది సంబంధబాంధవ్యాలకు ఎంత ముఖ్యమో ఆమెకు బాగా తెలుసు. ఈ లక్షణం వల్ల ఆమె మరింత ఆరాధనీయంగా మారుతుంది.

14. క్షమాపణను ఆమె నమ్ముతుంది :

14. క్షమాపణను ఆమె నమ్ముతుంది :

వీలైనంతవరకు ఆమె చాలా సరదాగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా తప్పుచేస్తే తనకు తానుగా అది గుర్తించి మీ దగ్గరకు వచ్చి క్షమాపణను కోరుతుంది. ఆమె విలువలకు, సంబంధ బాంధవ్యాలు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది.

సంబంధ బాంధవ్యాన్ని ఎప్పుడు గాని వదులుకోవాలని చూడదు. క్షమాపణ చెప్పే అవసరం ఉంది అని ఆమె గనుక భావిస్తే అలా చెప్పడానికి కూడా వెనుకాడదు.

15. ఆమెకు సొంత లక్ష్యాలు ఉన్నాయి :

15. ఆమెకు సొంత లక్ష్యాలు ఉన్నాయి :

తన జీవితం కేవలం మీ చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉండదు. ఆమె కంటూ కొన్నిప్రాముఖ్యతలు, లక్ష్యాలు ఉంటాయి. వాటిని కూడా ఆమె నెరవేర్చుకోవాలని భావిస్తుంది. వాటిని సాధించాలనే ప్రక్రియలో భాగంగా ఎంతగానో పని కూడా చేస్తుంది, కష్టపడుతుంది.

పైన చెప్పడిన విషయాలు మీ ప్రేమికురాలు లేదా భార్యలో గనుక ఉంటే వారు ఎంతో పరిణితి చెందిన వారు అని అర్ధం. వారు మీతో ఉన్నందుకు మీరు వారికి కృతజ్ఞతలు చెప్పాలి.

మీకు ఈ వ్యాసం నచ్చిందా ? ఇలాంటి వ్యాసాలను మరిన్ని తెలుసుకోవాలంటే, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విటర్, పిన్ ఇంట్రస్ట్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి.

English summary

15 SIGNS THAT TELL YOU ARE WITH A MATURED WOMAN

Matured women see the whole picture of what they see rather seeing it in segments. They have a perspective on everything. Settling with a matured woman helps you grow in yourself and gives you contentment in your life. Let's venture into the signs to know if you are with a matured woman or not. Read through the article.
Story first published: Monday, April 16, 2018, 18:30 [IST]