కామసూత్ర ప్రకారం ఆ వయస్సులో శృంగారాన్ని నేర్చుకుంటే జీవితాంతం సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయొచ్చు

Written By:
Subscribe to Boldsky

మహిళలు ఏ వయసులో కామశాస్త్రాన్ని నేర్చుకోవాలనే విషయం వాత్స్యాయనుడు వివరించారు. అలాగే ఎలాంటి గురువునుంచీ కామ శాస్త్రాన్ని నేర్చుకోవాలనేది కూడా తెలిపాడు. మనుషులు కచ్చితంగా కామ శాస్త్రం గురించి తెలుసుకోవాలా? అంటే అటువంటిదేమీ ఉండదు.

అయితే దేనినైనా శాస్త్రంగా అభ్యసిస్తే మరింత ఉపయోగం ఉంటుంది. కామశాస్తాన్ని అభ్యసించిన వారు మిగిలిన వారికంటే ఎక్కువగా సెక్స్ లో మంచి సుఖం పొందుతారు.

స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి

స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలి

ఏ శాస్త్రాన్నైనా గురువు వద్ద నుంచే నేర్చుకుంటేనే రాణింపు ఎక్కువగా ఉంటుంది. కామశాస్త్రం కూడా అంతే. కామశాస్త్రాన్ని కూడా గురువు వద్ద నుంచీ నేర్చుకోవాలని వాత్స్యాయనుడు చెప్పాడు. అయితే స్త్రీలు ఏ వయసులో ఈ శాస్త్రాన్ని నేర్చుకోవాలనేది కూడా ప్రత్యేకంగా వాత్స్యాయనుడు వివరించారు.

పూర్వకాలంలో పరిస్థితి వేరు

పూర్వకాలంలో పరిస్థితి వేరు

అలాగే ఎటువంటి గురువునుంచీ కామ శాస్త్రాన్ని నేర్చుకోవాలి? అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం కామశాస్త్రాన్ని అభ్యసించడం అంటే ఎవరికీ నచ్చదు. నేర్చుకునేందుకు కూడా ముందుకురారు. కానీ పూర్వకాలంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు.

కామశాస్త్రాన్ని అభ్యసించేవారు

కామశాస్త్రాన్ని అభ్యసించేవారు

స్త్రీలు, పురుషులు కామశాస్త్రాన్ని అభ్యసించేవారు. స్త్రీలలో ఎక్కువమంది వేశ్యలే కామశాస్త్రాన్ని ఆ కాలంలో అభ్యసించేవారు. అందుకే వేశ్యలు విటుల్ని ఆకర్షించడానికి మెళుకువలను కూడా వివరించాడు.

ప్రత్యేకంగా గురువులుండే వారు కాదు

ప్రత్యేకంగా గురువులుండే వారు కాదు

వాత్స్యాయనుడు అలా చెయ్యడానికి వంద కారణాలుండి ఉండొచ్చు. ఆనాటి పరిస్థితుల వల్లే ఆయన ఆ విధంగా రాసి ఉండొచ్చు. నిజానికి ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా యువతులకు కామ సూత్త్రాలునేర్పేందుకు ప్రత్యేకంగా గురువులుండే వారు కాదు.

16-18 సంవత్సరాల వయసులో నేర్చుకోవాలి

16-18 సంవత్సరాల వయసులో నేర్చుకోవాలి

వివాహం కావాల్సిన యువతి, కామసూత్రాలను తెలుసుకోవాలనుకునే యువతి వివాహానికి ముందు తన పుట్టింట్లోనే వాటి గురించి తెలుసుకోవాలని వాత్స్యాయనుడు సూచించాడు. అంటే నేటి పరిస్థితులలో ఇంచుమించు 16-18 సంవత్సరాల వయసులో ఈ విద్యను అభ్యసించాలన్న మాట.

సమ వయస్కులైన యువతుల ద్వారా నేర్చుకోవాలి

సమ వయస్కులైన యువతుల ద్వారా నేర్చుకోవాలి

కామసూత్రాలను నేర్చుకునే యువతులకు సన్నిహితంగా ఉండే సమ వయస్కులైన యువతులు ఆయా సూత్రాలు నేర్పాలంటాడు వాత్స్యాయనుడు. పెళ్లయిన యువతులు భర్త అంగీకారంతో కామశాస్త్రాన్ని అభ్యసించాలి. పూర్వ యువతులు 64 కళలలో ప్రవేశం కలిగి ఉంటే మంచిదనే అభిప్రాయం ఉండేది.

లలిత కళల్లో ప్రవేశం

లలిత కళల్లో ప్రవేశం

వాత్స్యాయనుడు కూడా ఈ విషయాలను కామసూత్రలో వివరించారు. వివాహానికి ముందే ప్రతి యువతి లలిత కళల్లో ప్రవేశం పొంది ఉండాలని వాత్స్యాయనుడు పేర్కొన్నాడు.

కాస్త సంపాదించాక కామసూత్రాలను

కాస్త సంపాదించాక కామసూత్రాలను

ఇక యువకుడైతే బ్రహ్మచర్యం అవలంబిస్తూ కాస్త సంపాదించాక కామసూత్రాలను నేర్చుకోవాలి. కామసూత్రాలతోపాటు సంగీతాది విద్యలలో ప్రవేశం ఉండడం మంచిది .వాత్స్యాయనుడు చెప్పిన సూత్రాలు ఆనాటి కాలాన్ని అనుసరించి చెప్పినవన్న సంగతి మర్చిపోరాదు.

పడక గది బాగుండాలి

పడక గది బాగుండాలి

అలాగే శృంగారాన్నిప్రేరేపించడంలో పడక గది అలంకరించిన తీరు, పడక గదిలోని వాతావరణం కీలక పాత్ర వహిస్తాయని వాత్స్యాయనుడు చెబుతాడు. నేటి మానసిక శాస్త్రవేత్తలూ ఇదే విషయాన్ని సమర్థించారు.

నగిషీలున్న మంచం

నగిషీలున్న మంచం

పడక గది అలంకరించుకోవలసిన తీరు గురించి వాత్స్యాయనుడు చాలా రకాలుగా చెప్పాడు, దాని వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం కూడా ఉంది. పడక గదిలో మేలైన, నగిషీలున్న మంచం ఉండాలి. దాని మీద మెత్తని తలగడలు, పరుపులు ఉంచాలి.

పడకను సౌకర్యంగా అమర్చుకోవాలి

పడకను సౌకర్యంగా అమర్చుకోవాలి

తలగడలను తల వైపు, పాదాల వైపు కూడా అమర్చుకోవాలి. పరుపుపై శుభ్రమైన తెల్లని వస్త్రాన్ని వేయాలి. ప్రతి రెండుమూడు రోజులకొకసారి ఈ వస్త్రాన్ని మార్చుతుండాలి అని వాత్స్యాయనుడు కామసూత్రలో చెప్పాడు. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. పడకను సౌకర్యంగా అమర్చుకోవాలి.

సుగంధద్రవ్యాల పరిమళాలు

సుగంధద్రవ్యాల పరిమళాలు

గదిలోకి అడుగుపెట్టడానే అత్తరు, సుగంధద్రవ్యాల పరిమళాలు మత్తెక్కించాలి. లవంగాలు,యాలకుల వంటివి పడకగదిలో అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పాడు వాత్స్యాయనుడు.

అరోమా థెరపీ

అరోమా థెరపీ

అరోమా థెరపీ అంటే ఈ కాలం వారికి బాగానే తెలుసు. సువాసనలతో మనసుకు ఆహ్లాదం కలిగించి కొన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చునని ఈ వైద్య శాస్త్రం చెబుతోంది.

సువాసనలు ప్రాముఖ్యం చాలా ఎక్కువ

సువాసనలు ప్రాముఖ్యం చాలా ఎక్కువ

ఇక శృంగారానికి వచ్చే సరికి సువాసనలు, సుగంధ ద్రవ్యాల ప్రాముఖ్యాన్ని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అందుకే సెక్స్ ప్రారంభించే ముందు అలాంటి వాతావరణం ఉంటే సెక్స్ లో మంచి సంతోషాన్ని పొందగలుగుతారు.

రెండు నిమిషాల్లో పని ముగిస్తే వేస్ట్

రెండు నిమిషాల్లో పని ముగిస్తే వేస్ట్

అలాకాకుండా భయపడుతూ, టెన్షన్ పడుతూ రెండు నిమిషాల్లో సెక్స్ ను ముంగిచేస్తే దానికి అర్థం ఉండదు. సృష్టిలో సెక్స్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం. దాన్ని సంప్రదాయబద్ధగా కొనసాగిస్తే మీరు అందులో పొందే ఆనందం ఇంకెదులోనూ పొందలేరు.

English summary

this is the best age to have sex according to kamasutra

this is the best age to have sex according to kamasutra
Story first published: Monday, March 5, 2018, 10:12 [IST]