For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లలు పుట్టాక కూడా రతి క్రీడలో రెచ్చిపోవాలంటే ఇలా చేయండి...

|

చాలా మంది జంటలకు పెళ్లైన కొత్తలో ఉండే ఊపు... ఉత్సాహం పిల్లలు పుట్టాక తగ్గిపోతుంది. అప్పటిదాకా ఆలుమగలిద్దరూ ఆ కార్యాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు.

అయితే పిల్లలు పుట్టాక మాత్రం రతిక్రీడ గురించి పెద్దగా పట్టించుకోరు. అసలు ఆ ఊసు ఎత్తితేనే తప్పు అనేంతలా ఫీలవుతుంటారు. ముఖ్యంగా పిల్లలు దగ్గరున్నప్పుడు ఆ విషయాల గురించి అస్సలు మాట్లాడరు.

దీంతో భార్యభర్తల మధ్య సంబంధంలో సాన్నిహిత్యం తగ్గిపోతుంది. మరికొందరు పిల్లలు స్కూల్ కెళ్లాక లేదా బయట ఆడుకుంటున్న సమయంలో లేదా వారు పడుకున్న తర్వాత కలయికలో పాల్గొంటారు. అయితే ఇంతకుముందులా ఎప్పుడు మూడొస్తే అప్పుడు ఆ కార్యంలో పాల్గొనడం కుదరదు. ఒకరినొకరు రతిక్రీడకు టైం కేటాయించుకోకలేకపోతారు.

మనసులో ఏవేవో కోరికలు రగులుతున్నా.. తనువుల దాహం మాత్రం తీర్చుకోలేకపోతారు. దీంతో దంపతులిద్దరి మధ్య గ్యాప్ పెరిగి.. కొందరు పక్కచూపులు చూసే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్బాల్లోనే ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఏర్పడతాయని, భార్య డెలివరీ అయిన సమయంలోనే ఇలాంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మీ భాగస్వామితో ఈ గ్యాప్ ను దూరం చేసుకునే చక్కని ఛాన్స్ కేవలం మీకు మాత్రమే ఉంది. అదెలాగో మీరే చూడండి...

ఆ టైంలో అక్కడ మూడ్ రావాలంటే... ఇలా ట్రై చేయండి...

ఇలా ట్రై చేయండి..

ఇలా ట్రై చేయండి..

మీరు, మీ భాగస్వామి ఎక్కడికైనా డేట్ నైట్స్ వెళ్లడానికి ముందే ప్లాన్ చేసుకోండి. ప్లాన్ ప్రకారం, డేట్ అండ్ టైమ్, ప్లేస్ ను సెట్ చేసుకోండి. ముఖ్యంగా మీరిద్దరూ కలిసి ఏకాంతంగా పడకగదిలో ఓ హాట్ మూవీని చూడండి. మీ పిల్లలు పడుకున్నప్పుడు లేదా నాన్నమ్మ దగ్గరో, అమ్మమ్మ దగ్గరో ఉన్నప్పుడు వేరే విషయాలకు కాకుండా ఇద్దరూ ఒకరితో ఒకరు గడిపేందుకు సమయాన్ని కేటాయించుకోండి.

దూరాన్ని తగ్గిస్తుంది..

దూరాన్ని తగ్గిస్తుంది..

మీ ఇద్దరి మధ్య పిల్లలు పుట్టిన తర్వాత ప్రతిరోజూ తలెత్తుతున్న వాదనలు, గొడవలు, ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర సమస్యలు ఏవైనా ఉంటే.. వాటి గురించి చర్చించుకోవడానికి వారంలో ఓ రోజు సెట్ చేసుకోండి. ఆరోజే అన్నింటి గురించి చర్చించుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య వాదనలు తగ్గుతాయి. గొడవలు కూడా జరిగే అవకాశం ఉండదు. అంతేకాదు మీ ఇద్దరి మధ్య ఉండే అలకలు, కోపాలు ఎగిరిపోయి మీ ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతుంది.

గొడవలు రాకూడదంటే..

గొడవలు రాకూడదంటే..

పిల్లలు పుట్టాక దంపతుల మధ్య ఎక్కువగా వచ్చే ఇబ్బందులు ఏంటంటే.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం.. వారిని అంటి పెట్టుకోవడం.. వారి డైపర్లను మార్చడం, వారికి పాలు పట్టడం, ఇతర ఆలనా, పాలనా విషయాల్లో గొడవలు వస్తుంటాయి. తామే ఎక్కువగా చూసుకున్నామని.. మీరు తక్కువగా చూసుకున్నారని లెక్కలు వేసుకునే వారి మధ్య కచ్చితంగా గొడవలు వస్తాయి అయితే అలా కాకుండా ఇద్దరూ దీన్ని బాధ్యతగా తీసుకుంటే ఒకరికొకరు సాయం చేసుకునేలా మాట్లాడుకుంటే ఎలాంటి పోట్లాటలే ఉండవు.

ఈ సంకేతాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను ఇంకొకరితో...!

కాసేపు విశ్రాంతి..

కాసేపు విశ్రాంతి..

పిల్లల ఆలనా పాలనా చూడటం అంత ఈజీ కాదు. కాబట్టి మీరు పిల్లల్ని ఆడించి.. పాలిచ్చి అలసిపోయినప్పుడు, మీకు మీ భర్త నుండి ఎలాంటి హెల్ప్ కావాలో స్పష్టంగా చెప్పాలి. అప్పుడే వారు మీకు సహాయం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీరు ఏమి పట్టించుకోవడం లేదని, చీటికి మాటికి గొణుగుతూ ఉండటం.. నిందలు వేయడం, ఫిర్యాదులు చేయడం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు.

అన్యోన్యత పెరగాలంటే..

అన్యోన్యత పెరగాలంటే..

మీ ఇద్దరి మధ్య పిల్లలు పుట్టాక అన్యోన్యత పెరగాలంటే.. పిల్లలను చూసుకునే విషయంలో కంపెనీలో మాదిరిగా ఇంటి పనులను చేయడంలో షిఫ్టులను వేసుకోండి. ఒకరు ఒక పని చేస్తే మరొకరు ఇంకో పని చేయండి. ఇలా మీరు చేయాల్సిన పనుల్ని విభజించుకుంటే.. ఇద్దరూ కలిసి పని చేయడం వల్ల మీ పనులు సులభంగా పూర్తవ్వడమే కాదు.. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది.

పొగడ్తలు..

పొగడ్తలు..

ఈ లోకంలో ఎంతటి వారైనా పొగడ్తలకు పడిపోవాల్సిందే. ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకున్నారంటే, దాని వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది. మరోవైపు ఆలుమగలిద్దరూ తమ బంధాన్ని మరింత బలంగా మార్చుకునే ఏ పని చేసినా ఒకరినొకరు అభినందించుకోండి. ఇక రోజువారీ పనులు, పిల్లల ఆలనా పాలనా చూడటంలో ఎంత బిజిగా ఉన్నా.. ఎంత విసిగిపోయినా వీటిని మరచిపోవద్దు.

ఇద్దరి అలవాట్లు..

ఇద్దరి అలవాట్లు..

ఎవ్వరు ఎంత కాదన్నా.. పిల్లలు పుట్టాక ఆలుమగలిద్దరి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. మీ ఇద్దరికీ ఒకరికొకరి అభిరుచులకు తగ్గ సమయం దొరకదు. అలాంటప్పుడు మీరిద్దరూ వేర్వేరుగా కాకుండా మీ ఇద్దరికీ దగ్గరగా ఉండే అలవాట్లు, మీ ఇద్దరికీ ఇష్టమైన పనులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి.

చిలిపి పనులను గుర్తు చేసుకోండి..

చిలిపి పనులను గుర్తు చేసుకోండి..

పిల్లలు పుట్టాక మీరు మళ్లీ అలాంటి రొమాంటిక్ లైఫ్ ను కోరుకుంటుంటే... మీరిద్దరూ పెళ్లైన కొత్తలో ఎలా ఉండేవారో.. ఎలాంటి చిలిపి పనులు చేసేవారో అనే విషయాలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీ జ్ణాపకాలు మిమ్మల్ని బాగా రిఫ్రెష్ చేసి మీ ఇద్దరి మధ్య సాన్నహిత్యం పెరిగేలా చేస్తాయి. మీరిద్దరూ సాయంకాలం వేళ కూర్చుని కాఫీ తాగడమో.. లేదా ఏ ఇతర చిన్నపనైనా సరే మీ ఇద్దరూ స్వాంతన పొందడానికి అవకాశం లభిస్తుంది.

English summary

How to Reconnect With Your Partner After Having Kids

Here we are talking about the how to reconnect with your partner after having kids. Read on.